Hyderabad
-
రక్షణ ఆవిష్కరణల కేంద్రం ఐఐటీహెచ్
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’నేపథ్యంలో దేశ సైనిక, రక్షణ రంగం ప్రదర్శించిన సాంకేతిక పాటవంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కేంద్రంగా జరుగుతున్న రక్షణ రంగ పరిశోధనలు ఆసక్తికరంగా మారాయి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీహెచ్‌లో ఇప్పటికే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేసింది. ఐఐటీహెచ్‌లో జరుగుతున్న పరిశోధనలు ఏఐ, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, బయో మెడికల్ రిసెర్చ్ వంటి రంగాల్లో భారత సైనిక బలగాలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సాగుతున్నాయి. రక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లను కూడా ఐఐటీహెచ్ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ, నౌకదళాలు కూడా ఐఐటీహెచ్‌లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2030 నాటికి విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రక్షణరంగ ఉత్పత్తులను సగానికి తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు పనిచేస్తాయి. స్వదేశీ ఆవిష్కరణలు డీఆర్డీఓ సహకారంతో ఐఐటీహెచ్‌లో 2023 ఏప్రిల్ 16న ‘డీఆర్డీఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(డీఐఏ– సీఓఈ) ప్రారంభమైంది. రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. హైపర్సోనిక్ వాహనాలకు అవసరమైన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే మెటీరియల్స్ అభివృద్ధి చేయడంతోపాటు లార్జ్ ఏరియా అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (అధునాతన 3డీ ప్రింటింగ్) వంటి అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.రాకెట్ భాగాల తయారీకి దేశంలో అతిపెద్ద మెటల్ 3డీ ప్రింటర్‌ను ఉపయోగిస్తోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రాజెక్టులపై ఈ సీఓఈ దృష్టి సారిస్తోంది. మిస్సైల్ డిజైన్, ఆపరేషన్స్ కోసం కృత్రిమ మేధస్సు వినియోగం వంటి వాటిలో పరిశోధనలు సాగుతున్నాయి. సైనిక వైద్య సవాళ్లకు పరిష్కారం సైనికులు ఎదుర్కొంటున్న వైద్య సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపైనా ఐఐటీహెచ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్య పరిష్కారాలు, నవీన వైద్య పరికరాల అభివృద్ధి, శిక్షణ కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సరీ్వసెస్‌తో గత ఏడాది ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్‌లోని బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల నైపుణ్యాన్ని ఉపయోగించి సైనికుల ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. మరోవైపు నౌకా రంగంలో రక్షణ సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణల కోసం నావికాదళంతో ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏబీసీడీ (ఆర్మీ, బోర్డర్, సైబర్, డ్రోన్స్) ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్‌లను రక్షణ సాంకేతిక ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తూ నిధులు సమకూర్చేందుకు సహాయపడుతోంది. 3డీ ముద్రిత సైనిక బంకర్లు సైన్యం సహకారంతో ఐఐటీహెచ్‌కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ ‘సింప్లిఫోర్జ్ క్రియేషన్స్’లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ‘ప్రాజెక్టు ప్రబల్’పేరిట సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఆన్సైట్ 3డీ ప్రింటెడ్ బంకర్‌ను నిర్మించింది. కేవలం 14 గంటల వ్యవధిలోనే రోబోటిక్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించింది. ఎక్కువ ఎత్తులో, తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించిన కస్టమ్ కాంక్రీట్ మిశ్రమాన్ని బంకర్ నిర్మాణంలో ఉపయోగించారు. హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులు, శత్రుదాడుల నుంచి సైనికులను రక్షించడంలో ఈ బంకర్లు తోడ్పడతాయి. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తే సాధించే ఫలితాలకు ఈ బంకర్ ఒక మైలురాయి వంటిదని ఐఐటీహెచ్ వర్గాలు చెప్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో ఆవిష్కరణలు –బీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐటీహెచ్ ఐఐటీ హైదరాబాద్‌లో రక్షణ రంగానికి సంబంధించి అనేక సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక మీటరు నుంచి రెండున్నర మీటర్ల మీటర్ల ఎత్తుకలిగిన వస్తు సామగ్రిని ముద్రించే అధునాతన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఇక్కడ అభివృద్ధి చేశాం. 200 కిలోల పేలోడ్ లేదా ఇద్దరు వ్యక్తులను మోసుకెళ్లే డ్రోన్లను అభివృద్ధి చేశాం. సాంకేతికతల సంగమం, ఐఐటీహెచ్‌లోని వివిధ విభాగాల నడుమ భాగస్వామ్యాల ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు ఇక్కడ నుంచి వస్తాయి. -
గ్రూప్–2 తుది జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. మొత్తం 783 ఉద్యోగాలకు గాను 777 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తుది జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 29 నుంచి జూన్ 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరిశీలన కొనసాగుతుంది. పెండింగ్ ధ్రువపత్రాల సమర్పణకు జూన్ 11వ తేదీని కమిషన్ రిజర్వ్ చేసింది. సురవరం వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్ల వారీగా పరిశీలన షెడ్యూల్‌ను ఈనెల 26న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులు పూర్తిస్థాయి సరి్టఫికెట్లతో హాజరు కావాలని, ఏవైనా కారణాలతో పరిశీలనకు గైర్హాజరైతే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగాలకు అభ్యర్థులు తగ్గితే (షార్ట్‌ఫాల్) తదుపరి మెరిట్ నుంచి ఎంపిక చేసి పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు సమాంతరంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. 2022లో నోటిఫికేషన్ గ్రూప్–2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలు దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 1,368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. అయితే 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే నాలుగు పేపర్లు రాశారు. అయితే 777 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. -
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు. -
కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేశారంటూ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లకు సైతం నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. భూమి విషయంలో విచారణ చేసి పూర్తి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. -
కొత్త మెట్రో లైన్లు.. ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో లైన్లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ సిద్ధమయ్యాయని.. ఫేజ్-2పై ఎటువంటి సందిగ్ధత లేదని స్పష్టంర చేశారు.మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పూర్తి స్థాయిలో సిద్ధం. ప్రస్తుతం డీపీఆర్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం వరకు గోప్యత ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం గమనార్హం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇక, విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కోర్టు నుంచి తిరిగి వెళ్ళిపోయారు. -
చిన్నారి చికిత్స కోసం రూ.14 కోట్ల క్రౌడ్ ఫండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారి చికిత్స కోసం 8 వేల మంది దాతలు స్పందించారు. ఈ పాప చికిత్సలో ఉపయోగించే ‘జోల్జెన్స్మా’ఇంజెక్షన్ ఖరీదు రూ.14 కోట్లు కాగా...దాతల సాయంతో విజయవంతంగా చికిత్స పూర్తి చేశామని సికింద్రాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యుడు రమేశ్ కోనంకి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరానికి చెందిన వినీత్ చౌదరి దంపతులకు పది నెలల క్రితం చిన్నారి జన్మించింది. పుట్టిన తరువాత నాలుగు నెలలు గడిచినా కండరాల్లో సరైన కదలికలు లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వ హించిన అనంతరం చిన్నారికి ఎస్ఎంఏ అనే వ్యాధి సోకిందని నిర్ధారించారు. సకాలంలో చికిత్స అందకపోతే రెండేళ్లకు మించి చిన్నారి బతకడం కష్టమని గుర్తించారు. ఈ చికిత్సకు ఉపయోగించే జోల్జెన్స్మా ఒక డోసు ఇంజెక్షన్ ఖరీదు రూ.14 కోట్లు ఉంటుందని చెప్పారు. దీనికోసం క్రౌడ్ ఫండింగ్‌ను అనుసరించగా.. సుమారు 8 వేల మంది సాయం చేశారని డాక్టర్ రమేశ్ తెలిపారు. దీంతో సికింద్రాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి వారం రోజుల క్రితం విజయవంతంగా చికిత్స చేశామని, ఇప్పుడు పాప పూర్తిగా కోలుకుందని తెలిపారు. చిన్నారి తండ్రి వినీత్ చౌదరి మాట్లాడుతూ చికిత్సకు సాయం చేసిన ఎంతో మంది దాతలు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!
నగరం కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. విభిన్న రుచుల సంగమం. శతాబ్దాలుగా బిర్యానీ పరిమళాలతో పేరుగాంచిన మన నగరం, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. బిర్యానీ, హలీం వంటి క్లాసిక్ వంటకాలు ఎప్పటికీ చిరపరిచితమైనవే అయినా, ఇప్పుడు కొత్త తరహా ఫ్యూజన్ ఫుడ్, ఇంటర్నేషనల్ వంటకాలతో నగర వీధులు ఘుమఘుమలకు వేదికలుగా మారిపోయాయి. ఫుడ్ అంటే కేవలం తినేది కాదు.. ఇప్పుడు అది అనుభవించే జీవనశైలి భాగంగా మారింది. దీనికి ఫుడ్ బ్లాగింగ్ మరింత ప్రాచుర్యాన్ని కలి్పస్తోంది. విదేశీ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్‌టూర్‌లో భాగంగా నగరంలో సందడి చేస్తున్నారు. వారి వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్‌గా మారుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోలైఫ్స్టైల్ ఫుడ్‌కి కొత్త నిర్వచనం.. ఇప్పుడు ఫుడ్ తినడం కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఫ్రెండ్స్‌తో రాత్రివేళ స్ట్రీట్ టూర్‌కు వెళ్లడం, కొత్త స్టాల్ కనుగొనడం, అందులో ప్రత్యేకమైన ఐటెం రుచి చూసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇవన్నీ ఒక లైఫ్‌స్టైల్‌గా మారిపోయాయి. ‘నేడు ఏ స్ట్రీట్ ఐటెం ట్రై చేయాలి?’ అనే ప్రశ్న, ప్రతీ ఫుడ్ లవర్ డైలీ రొటీన్లో భాగం అయ్యింది. ఇప్పటి యువత కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. వీధుల్లో అందుబాటులో ఉన్న కొత్త రుచుల కోసం క్యూ కడుతున్నారు. చిన్న చిన్న బండ్లపై కనిపించే పైనాపిల్ డోసా, బబీ బాట్స్, ఫైర్ పానీపూరీ, ఐస్ మలై టిండి వంటి ప్రయోగాత్మక ఐటెమ్స్ ఇప్పుడు హాట్ ట్రెండ్స్. సికింద్రాబాద్ మటన్ కీమా దోసా, హిమాయత్‌నగర్ తిబ్బటన్ మోమోస్, గచ్చిబౌలి కొరియన్ స్ట్రీట్‌ఫుడ్ – ఇవన్నీ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాఫుడ్ బ్లాగింగ్ ట్రెండ్.. ఈ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఫుడ్ బ్లాగింగ్. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వేదికలపై హైదరాబాదీ యువత ఫుడ్ రీల్స్, రివ్యూలతో వైరల్ కంటెంట్ సృష్టిస్తున్నారు. బండి వద్ద కూర్చొని తినే ఒక చిన్న వీడియో లక్షల వ్యూస్‌ను తెచ్చిపెడుతోంది. ఫుడ్ బ్లాగర్ల ప్రసారం వల్ల చిన్న స్టాల్స్‌కు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడం విశేషం. ‘‘అవి కేవలం బండ్లు కావు, అవి డ్రీమ్ టేస్టీ హబ్స్‘గా మారుతున్నాయి. ఎక్కడికైనా కొత్తగా ఓ వెరైటీ వంటకం కనిపిస్తే క్యూ కడుతున్నారు. ఇలా బ్లాగర్ల దృష్టిలో పడితే చిన్న ఫుడ్ స్టాల్స్‌కు కూడా గుర్తింపు వస్తోంది.హైదరాబాదీ ఫుడ్ అదుర్స్.. ఈమధ్య యూఎస్ఏకి చెందిన క్రిష్ లూయిస్ ఫుడ్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి స్పైసీ ఫుడ్, స్వీట్లు, పరోటా, చికెన్–65, రోడ్‌సైడ్ మిర్చి తనకు ఎంతో నచ్చాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కొంతమంది విదేశీ ఫుడ్ వ్లాగర్లు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వీధి వంటకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పానీపూరీ బండ్ల దగ్గర నిలబడి, ‘ది బెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్!’ అంటూ ఇంగ్లిష్‌లో చెప్పే మాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యాయి. వీధి వంటల అద్భుత రుచితో ఇక్కడి ఆతిథ్యం, సరదా వాతావరణం వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో విదేశీయుల కళ్లలో కూడా నగరం ఒక ఫుడ్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఫుడ్ వ్లాగర్లు హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్‌ను మరింతగా ప్రచారం చేస్తున్నారు. ‘ఇంత అతంటిక్ ఫుడ్ వీధుల్లో దొరుకుతుందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఫుడ్ క్రియేటివిటీతో.. హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక కట్టడాల నగరమే కాదు. ఇది రుచుల పండుగలా మారింది. స్ట్రీట్‌ఫుడ్ ద్వారా స్థానికులు తమ క్రియేటివిటీని చూపిస్తూ, జీవనశైలిని కొత్త కోణంలో నిర్వచిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్లు, ఫుడ్ ప్రియులు, ప్రయాణికులు అందరూ కలిసి ఈ నగరాన్ని ఒక రుచుల ప్రయాణ కేంద్రంగా మార్చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్‌తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్‌తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు. -
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు. -
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా మరికొన్ని యూనిట్లకు జూన్ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే. అయితే.. రేషన్ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం.. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. -
నోటికాడి బువ్వ.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ/ మంచిర్యాల అగ్రికల్చర్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/ నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి చాలా వరకు తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిచిపోవటంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 10 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారికంగా చెబుతోంది. అందులో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగా, మిల్లులకు తరలించింది 54.33 ఎల్ఎంటీ మాత్రమే. అంటే ఇంకా సుమారు 6 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ములుగు, మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అక్కడక్కడ కోతలు ఆలస్యమైన నేపథ్యంలో మరో 5 ఎల్ఎంటీకి పైగా ధాన్యం రైతుల కల్లాల్లోనో, పొలాల్లోనో ఉంది. మొత్తంగా మరో 10 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 17 శాతానికి తేమ తగ్గేవరకు ఆరబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లేఖ రాసినట్లు సమాచారం. నీటిపాలైన ధాన్యం ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొత్తపేట, కట్టంగూర్, ఐటిపాముల, శాలిగౌరారం, గుడివాడ, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, నూతనకల్ మండలాల్లో, భూదాన్ పోచంపల్లి, గూడూరు ప్యాక్స్ కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టులో పిడుగుపాటకు రెండు ఆవులు మృతిచెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అర్వపల్లి కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో పిడుగుపడి 10 గొర్రెలు, చివ్వెంల మండలం గంటోనిగూడెంలో 14 గొర్రెలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 38 మేకలు మృతిచెందాయి. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం, ఆజంనగర్, రాంపూర్, కమలాపూర్, గొల్ల బుద్ధారం, పాంబాపూర్, భీమ్ ఘనపూర్ గ్రామాల్లో ధాన్యం తడిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామంలో ధాన్యం నీటిపాలైంది. ⇒ మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు వరకు, రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటలకు వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లటంతో. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంతో పాటు జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, నవాబుపేటలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దేవరకద్ర, మిడ్జిల్, వెల్దండ ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది. ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నుల మేర నష్టం జరిగినట్లు సమాచారం. ⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు కొనుగోలు కేంద్రంలో నిల్వధాన్యం తడిచిపోయింది. కరేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిచిపోయింది. ⇒ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచింది. పెంచికల్పేట్, కౌటాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. ⇒ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల, భైంసా రూరల్, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. ⇒ భారీ వర్షాలకు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం, ఎస్ఎస్ తాడ్వాయి మధ్య రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ⇒ నిజామాబాద్ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్ మండలం చిన్నాపూర్‌లో ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ముదక్పల్లి, నర్సింగ్‌పల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలంలో ఐదెకరాల బీర తోట ధ్వంసమైంది. పెర్కిట్, ఆర్మూర్, ఆలూర్ మండలంలో ఆరబోసిన వరిధాన్యం, సజ్జ పంట తడిశాయి. -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది: టీ–హబ్‌లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు. వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్‌ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు. ⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంటుంది. ⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్‌లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు. ⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్‌వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్డ్) రెస్పాన్స్ షీట్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది. -
ఉన్న బోధకులకే ‘కొత్త’ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎమర్జింగ్ కోర్సుల బోధనకు ఆధునిక మెళకువలు అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సూచించింది. ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీకే శిక్షణ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఇంజనీరింగ్‌లో కొన్నేళ్లుగా కోర్ గ్రూపులకన్నా, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీలకు డిమాండ్ ఎక్కువైంది. అయితే, ఈ కోర్సుల బోధనకు సరైన ఫ్యాకల్టీ ఉండటం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చిన కోర్సులు కావడంతో ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బోధించే వారితోనే కొత్త కోర్సులూ చెప్పిస్తున్నారు. ఇంకో మూడేళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోధకులకే శిక్షణ ఇచ్చి కొత్త కోర్సులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచించింది. శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో సగానికిపైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. సీఎస్ఈ కోర్ కాకుండా ఏఐ, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సీట్లు 15 వేల వరకు ఉన్నాయి. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక నిపుణుడైన బోధకుడు ఉండాలి. దీంతో ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. వాస్తవానికి కొత్త కోర్సులకు అదనంగా ఆరు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా బేసిక్ చాప్టర్లు సీఎస్ఈ కోర్సులో ఉన్నవే. అదనపు చాప్టర్లు కొత్తగా వస్తున్న ఏఐ, డేటా అనాలిసిస్, సైబర్ లాంగ్వేజ్ సిస్టమ్‌కు సంబంధించినవి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త కోర్సులతోపాటు, ఆధునిక సాంకేతికతపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సంస్థలతో ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి ఫ్యాకల్టీ అప్డేట్ అయ్యింది. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈతోపాటు ఎలక్ట్రానిక్స్ బోధిస్తున్న అధ్యాపకులను ఎన్ఐటీ, ఐఐటీల్లో కొంతకాలం శిక్షణకు పంపడం లేదా ఆన్లైన్ శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనూ శిక్షణ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు కంపెనీల శిక్షణతో వృత్తిపరమైన ఉన్నతి పొందుతున్నారు. నాలుగేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ ఉద్యోగులతో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. ఐటీ ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. ఈ రెండు రోజులు అధ్యాపకులకు క్లాసులు నిర్వహించవచ్చని తెలిపింది.దీంతోపాటు ఆన్లైన్లో నిర్వహించే ఏఐ కోర్సుల ద్వారా కూడా ఫ్యాకల్టీని అప్‌గ్రేడ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా శిక్షణ పొందిన ఫ్యాకల్టీకి ప్రతి సంవత్సరం ఏఐసీటీఈ నేతృత్వంలో పరీక్ష నిర్వహించే ఆలోచనపై కూడా కసరత్తు జరుగుతోంది. దీంతో అధ్యాపకుడు ఆయా రంగంలో నిష్ణాతుడన్న ధ్రువీకరణ జరుగుతుంది. ఫ్యాకల్టీ లేని కారణంగా సీట్ల పెంపు ఆపేకన్నా, ఉన్నవారిని మెరుగుపర్చుకోవడం సులభమన్న విధానాన్ని ఏఐసీటీఈ రాష్ట్రాల ముందు ఉంచింది. -
అయోమయం... గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్ల ఏర్పాటు టెండరు ప్రక్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనల రూపకల్పన, దరఖాస్తుదారుల ఆర్థిక అంశాల ఎంపిక తికమకగా ఉన్నాయి. టెండర్లో పాల్గొనే వారు తయారీదారులై ఉండాలా? లేక పంపిణీ దారుడైతే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 398 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 7న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఆర్వో ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టెండరు ప్రక్రియలో లోపాలున్నాయని, ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. టెండరు ప్రక్రియ ఇలా... రాష్ట్రంలో మూడు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు మూడు టెండర్లు పిలిచారు. అదేవిధంగా మన్ననూరు ప్రాజెక్టుకుతోపాటు హైదరాబాద్ కేంద్రంగా నిర్దేశించిన విద్యాసంస్థల కోసం మరో టెండరు పిలిచారు. మొత్తం నాలుగు టెండర్ల ద్వారా 398 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇందులో 244 ప్లాంట్లు 500 లీటర్/అవర్, మిగతా 154 ప్లాంట్లు వెయ్యి లీటర్/అవర్ సామర్థ్యం గలవి. వీటికి రూ.25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈనెల 7 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు బిడ్లు తెరిచి కాంట్రాక్టరును ఖరారు చేసేలా షెడ్యూల్లో ప్రకటించారు. అయితే బిడ్ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా కాంట్రాక్టరును ఖరారు చేయకపోవడం గమనార్హం. నిబంధనలపై అభ్యంతరాలివీ.. » టెండరు ప్రక్రియలో దరఖాస్తు గడువు కీలకం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం టెండరు ప్రక్రియలో మూడు వారాలపాటు అవకాశం కల్పించాలి. అత్యవసర సందర్భంలో గడువు పది రోజులు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వారం మాత్రమే ఇచ్చారు. » టెండర్లలో పాల్గొనే వాళ్లు ప్లాంటు తయారీదారులై ఉండాలా? లేక నమోదైన పంపిణీదారుడై ఉండాలా? లేక చిన్నపాటి సరఫరాదారుడై ఉన్నా సరిపోతుందా? అనేదానిపై స్పష్టత లేదు. » ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతోపాటు టెక్నికల్ డ్రాయింగ్, డిజైన్ తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ అలాంటిది లేదు. » సాధారణంగా మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ఆర్థిక నిబంధనలు ప్రస్తావించాలి. టెండరు నిబంధనల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్ అంశం లేకపోవడం గమనార్హం. » ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కాలపరిమితి, వారంటీ వివరాలపై స్పష్టత లేదు. » బిడ్డర్‌కు వార్షిక టర్నోవర్ రూ.10 కోట్లు లేదా సగటున రూ.7 కోట్ల ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ కాంట్రాక్టు పరిమితి రూ.13.99 కోట్ల విలువ ఉండటంతో నిర్దేశించిన టర్నోవర్‌తో ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు విలువకు కనీసం ఆరు రెట్లు అధికంగా టర్నోవర్ ఉండాలని నిబంధనలున్నాయి. -
రహదారులు రక్తసిక్తం
హయత్‌నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు. విషాదం మిగిల్చిన అతివేగం.. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్‌కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్‌లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్కల్యాణ్రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్‌కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్‌లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్‌సీటు పక్కన కూర్చున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు. వారసులను కోల్పోయిన కుటుంబాలు... పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్‌రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్‌తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
నంబాల ఎన్కౌంటర్.. 27 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది. -
TG: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున ప్రభుత్వం క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో పెట్టింది. వీటితో పాటు ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. -
RRR దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ రంగానికి సరికొత్త దిశా నిర్దేశం చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా సమగ్ర బిల్డింగ్ బైలాస్ (Building Bye Laws) రూపకల్పనకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పలు దేశ విదేశాలకు చెందిన మెట్రోపాలిటన్ నగరాల్లోని బిల్డింగ్ బైలాస్‌పై అధ్యయనం చేసి మహా నగర అవసరాలకు అనుగుణంగా బైలాస్‌ను (నియమ, నిబంధనలు) రూపకల్పన చేసేందుకు ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను స్వీకరించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.మహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్‌రోడ్డు (Regional Ring Road) వరకు మౌలిక, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ, పచ్చదనం పెంపు, నీటివనరుల సంరక్షణ తదితర అంశాలపై మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణాలకు శాస్త్రీయమైన బైలాస్‌ను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేపట్టింది. దీనివల్ల నిర్మాణ సంస్థలకు అనుమతులను అందజేయడంలో అనవసరమైన జాప్యాన్ని నివారించడమే కాకుండా అడ్డదిడ్డ నిర్మాణాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆకాశ హర్మ్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు..నగరంలో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. గత పదేళ్లుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. ప్రస్తుతం 57 నుంచి 65 అంతస్తుల హైరైజ్ భవనాలు నిర్మాణమవుతున్నాయి. అదేక్రమంలో విశాలమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు విస్తరిస్తున్నాయి. కానీ కచ్చితమైన నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఒక భవనానికి మరో భవనానికి ఒకేలా నిబంధనలు అమలు కావడం లేదు. మరోవైపు డీవియేషన్స్ సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్ఎండీఏ (HMDA) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి డీవియేషన్లను (ఉల్లంఘనలను) గుర్తించినపప్పటికీ వాటిని సవరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఈ ఉల్లంఘనల వల్ల అనుమతులను ఇవ్వడంలో కూడా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ బైలాస్ రూపకల్పనపై దృష్టి సారించారు. వివిధ నగరాలపై అధ్యయనం.. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బిల్డింగ్ బైలాస్ అమల్లో ఉన్నాయి. నివాస భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి భవనాలకు ప్రామాణికమైన నిబంధనలను పాటిస్తున్నారు. భవనాల నిర్మాణం, భద్రత, పర్యావరణ పరిరక్షణ,నగర అభివృద్ధి వంటి అంశాలను లక్ష్యాలుగా చేసుకొని ఈ నిబంధనలు రూపొందించారు.ఇందుకోసం ముంబయిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), ఢిల్లీలో ఫ్లోర్ రేషియో ఏరియా (ఎఫ్ఏఆర్) వంటి ప్రామాణికమైన పద్ధతులను అమలు చేస్తున్నారు. నిర్మాణ వైశాల్యం, ప్లాట్ వైశాల్యం ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: హైదరాబాద్‌లో ఇక పక్కాగా 'వరద' నివారణ ఒక్కో ప్రాంతంలో ఎఫ్ఎస్ఐ ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ ముంబైలో ఎఫ్ఎస్ఐ 1.33 శాతం ఉంటే, సబర్బన్ ప్రాంతాల్లో 2.7 శాతం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 5.32 శాతం చొప్పున ఉంది. ఢిల్లీలోనూ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎఫ్‌ఏఆర్‌ను నిర్ణయించారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లో నిర్దిష్టమైన ప్రమాణాలు రూపొందించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. భవనం చుట్టూ ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్), భవనం ఎత్తు, ఓపెన్ స్పేస్ ఏరియా వంటివి కూడా కచ్చితమైన ప్రమాణాలతో రూపొందించాలి. అలాగే.. జపాన్, అమెరికా, యూరప్ దేశాల్లోని బిల్డింగ్ బైలాస్పైనా అధ్యయనం చేసి ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాల కంటే మరింత మెరుగైన ప్రమాణాలను, నియమ నిబంధనలను రూపొందించేందుకు కసరత్తు జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.తుది దశలో మాస్టర్‌ప్లాన్.. రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేపట్టింది. ముసాయిదా ప్రణాళికలను త్వరలో ప్రకటించనున్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ముసాయిదా అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
నాగం జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.నాగం జనార్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్‌కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు. న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్ రోహతగి తెలిపారు. -
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈటల రాజేందర్ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్‌ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
Hyderabad: స్టార్ హోటల్లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు. ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరింగ్‌లో రెండు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. ఇవీ కోర్సులు ⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్‌పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. ⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. -
సామాజిక అంశాలపై స్ఫూర్తినిచ్చేలా..
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ సుందరి 2025’పోటీల్లో భాగంగా మంగళవారం ‘టీ హబ్’వేదికగా పోటీదారుల నడుమ ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’నిర్వహించారు. అమెరికా, కరీబియన్, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 60 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో వివిధ సామాజిక అంశాలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు. మెరుగైన ప్రపంచం కోసం జరగాల్సిన కృషిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.బాలల విద్య, పర్యావరణం, పక్షవాతం, ప్రకృతి, యువతులకు మద్దతు, చిన్న సముదాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, యుక్త వయసులో ఆందోళన, మానసిక ఆరోగ్యం, ధ్రువీకరణ శక్తి, భాషా సంరక్షణ, బాలలపై హింస, సౌరశక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ ఆధారిత హింస, బాలలపై లైంగిక వేధింపులు, ప్రత్యేక సముదాయాలకు విద్య, ఆర్థిక సంక్షోభాలు, ఆటిజం, మత్తు పదార్థాలు వంటి స్థానిక, అంతర్జాతీయ అంశాలు, సమస్యలపై పోటీదారులు ప్రసంగించారు. తాము ఎంచుకున్న అంశాలపై మాట్లాడుతూ సామాజిక మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. అందులో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. స్ఫూర్తిని రేకెత్తించేలా.. విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణం, సామాజిక అభివృద్ధి వంటి అంశాల్లో పోటీదారుల ఆలోచనలను, వారిలో మానవతా విలువలు తదితరాలను ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’లో మదింపు చేస్తారు. ఇది పోటీదారుల మధ్య ఒక పోటీ అనేకంటే వారిలోని ధైర్యం, కరుణ తదితరాలను ప్రదర్శించే ఒక కార్యక్రమం లేదా వేడుక లాంటిది. కాగా ఈ చాలెంజ్‌లో పోటీదారులు ప్రస్తావించిన అంశాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ‘తెలంగాణకు స్ఫూర్తి కేంద్రంగా పేర్కొనే టీ హబ్‌లో ఈ కార్యక్రమం జరగడం హర్షణీయం..’అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లే అన్నారు. బుధవారం రెండోరోజు టీ హబ్‌లో జరిగే హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో యూరప్, ఆసియా, ఓషియానియా దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటారు. తప్పుకొన్న ఇంగ్లండ్ పోటీదారు మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లండ్ ప్రతినిధి మిల్లా మాగీ అర్థంతరంగా తప్పుకున్నారు. ఆరంభంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్లిన సమయంలో తీవ్ర ఎండవేడిమి వల్ల వడదెబ్బకు గురైనట్టు తెలిసింది. రెండు రోజులుగా చికిత్స చేయించుకున్న ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని చెబుతున్నారు. ఆమె స్వదేశానికి పయనమవుతున్నట్టు సమాచారం. కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్ సందర్శన బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించిన వైద్య సేవలను అందజేస్తున్న కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులు కిమ్స్‌ను సందర్శించడం సంతోషకరమని, బ్రెస్ట్ కేన్సర్ వైద్యసేవల్లో ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రఘురామ్ వందశాతం విజయాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే, నందిని గుప్తా (మిస్ ఇండియా 2025)తో పాటు ఇతర పోటీదారులు, రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025– ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులు పాల్గొని డాక్టర్ రఘురామ్ సేవలను కొనియాడారు. -
ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మందికి ప్రయోజనం సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎవరి పనితీరు ఏంటో నివేదికల్లో ఉంది
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీ ఆలోచనలేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన నాగర్‌కర్నూల్, మెదక్, మల్కాజ్గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతీ ఎమ్మెల్యేతో 10–15 నిమిషాలపాటు మాట్లాడిన రేవంత్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖాముఖి భేటీలో భాగంగా వారి పనితీరు గురించి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరి పనితీరు ఏంటో తన దగ్గర ఉన్న నివేదికలు చెబుతున్నాయని, ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని, పనితీరు మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిదని, లేదంటే తాను కూడా ఏమీ చేయలేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, ఆ నివేదికల ఆధారంగానే పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చే బాధ్యత తనపై ఉందని, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నల్లమల డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేస్తానని చెప్పారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, రెండోసారి, మూడోసారి గెలిచేలా ప్రజలను ఆకట్టుకోవడంలోనే ఎమ్మెల్యేల పనితీరు తెలుస్తుందని, రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ అయిన వారిలో వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ అమెరికా పర్యటనలో ఉండటంతో భేటీలో పాల్గొనలేదు. -
సన్నాలకు బోనస్ ఎప్పుడు?
ఈ రైతు పేరు సుంకరి నరేష్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. 5 ఎకరాలకు పైగా పొలంలో సన్న వడ్లు సాగు చేశాడు. 140 క్వింటాళ్ల వరకు (350 బస్తాలు) దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని కుద్వాన్పూర్ సొసైటీకి విక్రయించి నెల రోజులు దాటింది. పంట డబ్బులైతే వచ్చాయి. కానీ బోనస్ డబ్బులు మాత్రం ఇంతవరకు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం బోనస్ ఇస్తే తనకు రూ.70 వేల వరకు వస్తాయని, తదుపరి పంట పెట్టుబడికి పనికొస్తాయని చెబుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులు సర్కారు నుంచి రావలసిన బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గతంలో ఏ యాసంగి సీజన్లోనూ లేనివిధంగా 18.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించారు. పౌరసరఫరాల సంస్థ చరిత్రలోనే ఇది రికార్డు కాగా, ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉండటంతో 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. అయితే రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 55.97 ఎల్ఎంటీ ధాన్యం విలువ రూ.12,974.10 కోట్లు కాగా, పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో రూ.9,632.66 కోట్లు జమ చేసింది. అయితే ఆర్థిక శాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే బోనస్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం. బోనస్ ప్రకటనతో సన్న ధాన్యం సాగు తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించరు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఈసారి పెద్దయెత్తున సన్నాలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో ఏకంగా 7.15 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. అలాగే నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సీజన్లో రూపాయి ఇవ్వలే! యాసంగి సీజన్లో ఇప్పటివరకు 18.47 ఎల్ఎంటీల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున 2,87,262 మంది రైతులకు రూ.923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బోనస్ కింద రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, బోనస్ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులు సకాలంలో బోనస్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతుండగా, ఇప్పటివరకు బోనస్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత వానాకాలంలో రూ.1,200 కోట్లు చెల్లింపు గత వానకాలం సీజన్ నుంచే ప్రభుత్వం బోనస్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం పండించిన సుమారు 4.50 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా చెల్లించింది. ఆ సీజన్లో ధాన్యం కొనుగోళ్లతో పాటుగానే విడతల వారీగా బోనస్‌ను జమచేస్తూ వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యే నాటికి పూర్తిస్థాయిలో బోనస్‌ను చెల్లించింది. 180 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మా నేను 8 ఎకరాలల్లో సన్న రకం వరి సాగు చేశా. 180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అలాగే రెండుసార్లు కాంటా పెడితే మొదటిసారి అమ్మిన ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. రెండోసారి కాంటా పెట్టిన ధాన్యానికి ఇంకా రాలేదు. – గడ్డం పాలెం లింగారెడ్డి, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా బోనస్ ఊసే లేదు.. వడ్లు కాంటా పెట్టి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ చెల్లించలేదు. బోనస్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం వల్లే వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఇంటిల్లిపాదీ 15 రోజులు కష్టపడి వడ్లను ఆరబెట్టి కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు బోనస్ ఊసే లేదు. – గుజ్జ రామకృష్ణ , తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా -
ఇంగ్లిష్ రాకనే గుమస్తాలయ్యాం
సాక్షి, హైదరాబాద్: ‘విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్ ను కూడా బోధించాలి’అని ప్రముఖ సినీ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలుగు వన్’యూట్యూబ్ చానల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అన్న ఆలోచనతో తెలుగు వన్ను స్థాపించిన రవిశంకర్‌కు అభినందనలు. ఈ చానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. నేను తెలుగువాణ్ణి అంటూ తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. మనం తెలుగువాళ్లమే. మన మాతృభాష తెలుగు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఉద్యోగాలు కావాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ కావాలి.. ఇంగ్లిష్ రావాలి. అమ్మ భాష మాతృ భాష తెలుగు అయితే, నడిపించే నాన్న భాష ఇంగ్లిష్. మేము పేదవాళ్లం. అందరికీ న్యూటన్ లాగానో, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగానో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. అందరూ చదువుకోవాలి. మా ఊర్లో బీఏ చదివిన మొదటి వ్యక్తిని నేను. ఆ రోజుల్లో నాలాంటి పేదవాళ్లందరికీ ఇంగ్లిష్ రాక ఫెయిల్ అయ్యాం. ప్రాథమికస్థాయి నుంచి మాకు ఎప్పుడూ ఇంగ్లిష్ లేదు. మేం బీఏ, ఎంఏ, ఎంకామ్.. ఇలా అన్నీ పాస్ అయ్యాం. ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు వెళితే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ లో ప్రశ్న పత్రాలు ఉండటం వల్ల మాకు అర్థం కాక ఫెయిల్ అయ్యాం. దీంతో గుమస్తాలు అయ్యాం.. ప్యూన్లు అయ్యాం.. అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వ¿ౌమాధికారాన్ని కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసులం అయ్యాం. కానీ ఇంగ్లిష్ మీడియం వచ్చిన వారు ఏమయ్యారు? కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్లర్లు అయ్యారు.. చాలా సంతోషంగా ఉంది. కానీ, విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్‌గారు చెప్పారో.. తెలుగు, ఇంగ్లిష్ అనే భేదం వల్ల ఇంగ్లిష్ వచ్చినవాళ్లు చాలా గొప్పవాళ్లు అయిపోయారు. తెలుగు వచి్చనవారు అథఃపాతాళానికి వెళ్లారు. అది కాకుండా ఉండాలంటే.. విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లిష్ ని కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను’అని నారాయణమూర్తి తెలిపారు. -
బీటెక్‌లో ప్రమోషన్‌కు 20 క్రెడిట్స్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత ప్రమోషన్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కనీసం 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ చేయనున్నారు. సాంకేతిక విద్య అధికారులతో కూడిన కమిటీ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని కేబినేట్ ఉప కమిటీ ఆమోదించినట్టు, 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుందని విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని రోజుల క్రితం అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏకీకృత విధానం అమలుపై ఇందులో ఏకాభిప్రాయం కుదిరింది. ఇంజనీరింగ్‌లో ఒక ఏడాది తర్వాత మరో ఏడాదికి వెళ్లేందుకు (ప్రమోట్ అయ్యేందుకు) ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధానం ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది సభ్యులు సైతం ఈ అంశం సభ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఏకీకృత విధానం అమలుపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూహెచ్లో అనుసరిస్తున్న విధానాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని వర్సిటీల ఉప కులపతులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉస్మానియా, మహాత్మాగాం«దీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల పరిధుల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ఒక్కో చోట ఒక్కో విధానం ఉస్మానియా, మహాత్మాగాంధీ వర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి ఫస్టియర్‌లో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. ఆ తదుపరి సంవత్సరాల్లో ప్రమోట్ కావాలన్నా ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున ఏడాదికి 40 క్రెడిట్స్, నాలుగేళ్ళకు కలిపి మొత్తం 160 క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో వర్సిటీకి ఒక్కో విభిన్నమైన సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, 3 ల్యాబ్‌లు ఉంటాయి. ఒక సబ్జెక్టు పాసయితే దానికి సంబంధించిన క్రెడిట్స్ విద్యార్థి ఖాతాలో పడతాయి. అయితే ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో ఆ యూనివర్సిటీలను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. జేఎన్టీయూహెచ్ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోట్ కావడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ ప్రస్తుతం కనీసం 20 క్రెడిట్స్ ఉంటే తర్వాతసంవత్సరానికి ప్రమోట్ చేసే విధానంతెచ్చే యోచనలో ఉన్నారు. అంటే ఏటా ఆ ఏడాదికి సంబంధించిన సగం క్రెడిట్స్ విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటే క్రెడిట్స్ విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. తొలి ఏడాది ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థికి రెండో సంవత్సరంలో సబ్జెక్టుపై కాస్త అవగాహన ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 40% క్రెడిట్స్ సాధించాలి. ఇక ఆఖరి ఏడాదిలో పూర్తి క్రెడిట్స్ పొంది ఉండాలనే విధానం ఖరారు చేసినట్టు సమాచారం. నాలుగు వర్సిటీల అధికారులు ఇప్పటికే ఈ విధానంపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విద్యాశాఖ అంగీకారం పొందాక దీన్ని అమల్లోకి తెస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అప్పు..రెండింతలు!
ఆర్థిక లావాదేవీల విషయంలో భారతీయ కుటుంబాల్లో ఇటీవలి కాలంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పు తీసుకోవడానికి ఎవరూ వెనుకంజ వేయడం లేదు. దీంతో జీడీపీలో అప్పులు శాతం 2011–12తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు రెట్టింపునకు చేరింది. అలాగే కుటుంబాలు తమ వద్ద నగదు నిల్వలు అట్టిపెట్టుకోవడం తగ్గించి పెట్టుబడులవైపు దృష్టి సారిస్తున్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు నాలుగు రెట్లు దూసుకెళ్లాయని కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక చెబుతోంది. కుటుంబ అప్పుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వాటా 98.8 శాతానికి ఎగసింది. షేర్లలో పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో 2019 నుంచి ఈ అయిదేళ్ల కాలంలో బ్యాంకుల రుణాలు 284 శాతం పెరిగాయి. గృహాల్లో నగదు నిల్వలు 58 శాతానికి పైగా తగ్గాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో (ఎన్బీఎఫ్సీ) డిపాజిట్లు 57 శాతం అధికం అయ్యాయి. దేశంలో మ్యూచువల్ ఫండ్లతో సహా షేర్ మార్కెట్లో పెట్టుబడులు 191 శాతం ఎగశాయి. ఐపీఓల ద్వారా మొత్తం నిధుల సమీకరణ 2024 ఏప్రిల్–డిసెంబర్ మధ్య రూ.11.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2023–24లో అందుకున్న మొత్తంతో పోలిస్తే 5 శాతం ఎక్కువ. డిజిటల్ లావాదేవీల రయ్ రయ్ దేశంలో ప్రజల ఆర్థిక కార్యకలాపాల్లో మార్పులకు ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీల పెరుగుదల. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం 2023–24లో రిటైల్ చెల్లింపుల్లో డిజిటల్ పేమెంట్స్ వాటా 80 శాతంగా నమోదైంది. మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్య 13,100 కోట్లకుపైమాటే. కానీ ఈ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ.200 లక్షల కోట్లను దాటింది. వినియోగంలో సౌలభ్యం, విస్తరిస్తున్న నెట్‌వర్క్‌తో కోట్లాది మందికి రియల్–టైమ్ చెల్లింపుల వేదికగా యూపీఐ మారింది. బంగారంలా దాచుకుని.. సురక్షిత పొదుపు సాధనంగా బంగారం అవతరించింది. భారతీయ కుటుంబాలు పుత్తడి, బంగారు ఆభరణాలు, వెండి కొనుగోలుకు 2019–20లో రూ.43 వేల కోట్లు వెచి్చంచాయి. 2023–24 నాటికి ఇది 51 శాతం దూసుకెళ్లి రూ.65 వేల కోట్లకు చేరింది. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.8.89 లక్షల కోట్ల నుంచి 57 శాతం అధికమై రూ.13.91 లక్షల కోట్లను తాకాయి. స్థిరాస్తులకు 71 శాతం అధికంగా రూ.38.44 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయితే బ్యాంకుల నుంచి అందుకున్న రుణాలు రూ.4.83 లక్షల కోట్ల నుంచి భారీగా పెరిగి రూ.18.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
గుట్టలతో గాలివాటానికి అవాంతరం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయంతోపాటే పనులు ప్రారంభిద్దామనుకున్న కొత్తగూడెం విమానాశ్రయ కసరత్తుకు అవాంతరం ఎదురైంది. విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావించి గుర్తించిన స్థలం పనికిరాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తేల్చిచెప్పింది. దీంతో కొత్తగూడెం విమానాశ్రయానికి మరో స్థలం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దీని నిర్మాణ కసరత్తులో జాప్యం తప్పేలా కనిపించటం లేదు. ముచ్చటగా మూడో స్థలం కోసం.. రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల్లో కొత్తగూడెం కూడా ఒకటి. ఇందులో వరంగల్ శివారులోని మామునూరు పాత ఎయిర్‌స్ట్రిప్ ఉన్న స్థలంలో భారీ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దాని తర్వాత రెండో విమానాశ్రయంగా కొత్తగూడెంను ముందుకు తెచ్చారు. ప్రతిపాదించిన సమయంలో తొలుత పాల్వంచ సమీపంలోని గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని గుర్తించారు. అది అనుకూలంగా లేదని ఏఏఐ తేల్చటంతో గతేడాది చివరలో కొత్తగూడెం మండలంలోని రామవరం, సుజాతనగర్ మండలం పరిధిలో సుజాతనగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామాల సరిహద్దులో 950 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పదేళ్ల వాతావరణ నివేదికలు, విండ్రోజ్ డయాగ్రామ్ తదితర నివేదికలను స్థానిక అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి నివేదించారు. వీటితోపాటు ఆ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన ఏఏఐ అధికారులు.. ఆ భూమి కూడా యోగ్యంగా లేదని తేల్చి ఉసూరుమనిపించారు. ప్రతిపాదిత స్థలంలో 2800 మీటర్ల రన్‌వేను నిర్మించాల్సి ఉంది. ఇది తూర్పు–పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ రన్‌వేను 10/28 పద్ధతిలో ల్యాండింగ్, టేకాఫ్ రెండింటికీ ఉపయోగపడేలా నిర్మించాలని నిర్ణయించారు. కానీ, రన్‌వేకు ఉద్దేశించిన ప్రాంతానికి కొంత చేరువగా ఎత్తయిన గుట్టలున్నాయి. అవి గాలి వాటాన్ని అడ్డుకోవటం ద్వారా విమానాల టేకాఫ్, ల్యాండింగ్లపై ప్రభావాన్ని చూపుతాయని అథారిటీ తేల్చింది. తొలుత చిన్న విమానాలకు సరిపడే ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని భావించినా, వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో ఎయిర్‌బస్ విమానం దిగగలిగే రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించాలని నిర్ణయించారు. కానీ, కొత్తగూడెం ప్రాంతం యావత్తు గుట్టలతో నిండి ఉన్నందున అంత పెద్ద విమానాశ్రయానికి అనువైన స్థలం లభించే విషయంలో ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. -
గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాల స్థాయిని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌గా విభజించి ఆయా గ్రామాలు ఏ జోన్లలో ఉన్నాయో గ్రామ పంచాయతీ గోడల మీద రాయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు. నీరు, భూమి, చెట్ల చట్టం (వాల్టా) రాష్ట్ర ప్రాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంగళవారం తొలిసారి నిర్వహించిన ఈ ప్రాధికార కమిటీ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పా రు. భూగర్భజలాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. వాల్టా చట్టంపై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. నీటిని అధికంగా వినియోగిస్తున్నార ని కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు పెడితే ఉపయో గం ఉండదని, కొత్తగా బోర్లు వేయవద్దని అధికారులు ఆంక్షలు పెట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొ న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి మూడు నెలలకోసారి విధిగా వాల్టా అథారిటీలు సమావేశమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వాల్టా నిధిని ఏ ర్పాటు చేసి, తద్వారా పర్యావరణహితం ఈ నిధులను వినియోగిస్తామని మంత్రి చెప్పారు. నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలా లు పడిపోతున్నాయని సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు రాజశేఖర్, పాండురంగారెడ్డి, ఉమాదేవి, జలసాధనా సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను ఆమోదించారు. -
అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమా దం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 18న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ విభాగం డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో కూడిన కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి లో ప్రజలకు ఇవ్వాల్సిన సూచనలతో ప్రతిపాదనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం దాని ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు చేపడతారని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలన చార్మినార్: అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని మంగళవారం క్లూస్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా భవనంలో ప్రవేశించిన అధికారుల బృందం.. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భవనంలోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసింది. భవనంలో దాదాపు 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాలి, వెలుతురు సక్రమంగా లేకుండా ఏసీలు పనిచేస్తుండడంతో అవి అధిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఏసీ కంప్రెషర్ ఏదైనా పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఫ్లోరింగ్ ధ్వంసం.. గోడలన్నీ బీటలు బయటకు వెళ్లేందుకు సొరంగం లాంటి ఇరుకు మెట్ల దారి ఉండడం వల్లే బాధితులు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారని అధికారులు నిర్ధారించారు. తీవ్రమైన మంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. గదుల గోడలన్నీ బీటలు వారాయి. షాబాద్ ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసం అయింది. భవనం మొత్తం పనికిరాని విధంగా తయారయ్యింది. రాబోయే రోజుల్లో నివాసానికి పనికి రాదని ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు 125 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. కాగా భవనం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మృతులకు సంబంధించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచి్చంది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది. ఇప్పటికే పలువురి విచారణ పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమరి్పంచేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల మేరకు ఈ ముగ్గురి వాదనలు సైతం వినాలని జస్టిస్ ఘోష్ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను ప్రశ్నించి మరింత సమాచారం జోడిస్తే సమగ్ర నివేదిక ఇచ్చినట్లు అవుతుందని భావించిన కమిషన్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సెక్షన్ 311ను అనుసరించి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు ఇంజనీర్లు, నిర్మాణదారులు, అప్పట్లో నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించిన సంగతి విదితమే. 2019లో బరాజ్‌ల నిర్మాణం పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బరాజ్‌ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించగా 2019 మేలో పూర్తయ్యాయి. అయితే 2023 సెపె్టంబర్లో మేడిగడ్డ బరాజ్‌లోని ఒక బ్లాక్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచి్చంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫాలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా.. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో, వారిని విచారించి వాదనలు రికార్డు చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. నోటీసుల ప్రకారం వారంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకవేళ వారు కోరితే వర్చువల్‌గా కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీపీసీ ఘోష్ కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నోటీసులు, తదుపరి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగగా.. కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరవుతారా? లేదా సమయం కోరతారా అన్న అంశంలో స్పష్టత రాలేదు. -
కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు.వీరికి కిమ్స్ గ్రూప్ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, “మా ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులందరికీ సాదర స్వాగతం. డాక్టర్ రఘు రామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృ ప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యూకే నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది, అక్కడ ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. దేశానికి ఆయన చేసిన అందమైన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయి” అని ఆకాంక్షించారు.మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, “డాక్టర్ రఘు రామ్ హైదరాబాద్‌లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటి చూపించారు. త్వరగా గుర్తించడం ద్వారా 18 ఏళ్లు దాటిన అనేక మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు గణనీయమైన కృషిని ఆయన చేశారు. భారతదేశం, బ్రిటన్ల మధ్య సజీవ వంతెనగా అనేక మార్గాల్లో ఆయన నిలిచారు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అపారమైన సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన.. ఇలా దేశంలో చాలామందికి అసవరమైన రొమ్ము క్యానన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, “కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలియా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి గుండెలకు హత్తుకునేలా చెప్పారు.గత 18 ఏళ్లుగా నేను చేస్తున్న కృషి అందులో ఉంది. మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణమే నాకు స్ఫూర్తినిచ్చింది. నా సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వం అంతా నాకు ఇంతకాలం కావాల్సిన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చు. నా మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మెరుగుపచాలన్న నా లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ మాట్లాడుతూ, “డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం నా అదృష్టం. నాకు అందిన అసాధారణ నాణ్యత గల చికిత్స, సానుభూతితో కూడిన సంరక్షణ, చికిత్స కొనసాగినన్నాళ్లు ఆయన నాకు చేసిన కౌన్సెలింగ్ వల్లనే నేను క్యాన్సర్ విజేతగా నిలిచాను. నా ఈ పయనంలో డాక్టర్ రఘురామ్ నాకు స్ఫూర్తినిచ్చి, సానుకూలంగా ఉండేలా చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. క్యాన్సర్ రోగుల్లో ఒక ఆశను పాదుకొల్పి, త్వరగా గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన నెలకొల్పి, దాదాపు రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసిస్తున్నాను”అని చెప్పారు. -
Ananya Nagalla : అలరించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్‌ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్‌ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!గ్లోబల్ డిజైన్స్.. వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్స్‌ను రూపొందిస్తున్నాం. – దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు -
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Kaleshwaram commission) విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. -
Hyderabad: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. -
తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. -
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు.14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు. -
విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహా్మన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ అమెజాన్‌లో ఆర్డర్ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్ గురించి ఆరా.. సికింద్రాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్.. బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్ గ్రూప్ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. -
Telangana Police: తెలంగాణలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. -
గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీలో గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. భవన భద్రత , విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలపై హెచ్ఆర్సీ స్పందించింది. ఘటనలో 17 మంది దుర్మరణం కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
దారుణం, ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన యువతి.. పోలీసుల అదుపులో నిందితురాలు
సాక్షి,హైదరాబాద్: అమీన్పూర్లో దారుణం జరిగింది. సోమవారం అమీర్‌పూర్‌లో మహేశ్వరీ అనే యువతి కారు నేర్చుకుంటూ చిన్నారులపైకి ఎక్కించింది. ఈ దుర్ఘటనలో పదేళ్ల మణిధర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏకవాణి మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గుల్జార్‌హౌస్ ప్రమాదం.. అడుగడుగునా నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్/చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ‘మోదీ పెరల్స్, శ్రీకృష్ణ పెరల్స్’సహా మొత్తం తొమ్మిది దుకాణాలు, నివాస గృహాలతో కూడిన ఈ భవనంలో అడుగడుగునా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు లేకపోవటం వల్లనే నిప్పంటుకున్న విషయాన్ని అందులోనివారు సకాలంలో గుర్తించలేకపోయారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి నివాస గృహాలతో కూడిన మార్కెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో వాటి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. నిబంధనల ప్రకారం ఇలాంటి వాణిజ్య, నివాస సముదాయాల్లో ఉండాల్సిన వ్యవస్థలు, అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిన భవనం వద్ద ఉన్న పరిస్థితి ఇదీ..అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ వన్‌గా, రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ టూ విధానంలో విడివిడిగా నిర్మితమైంది. మొత్తం భవన విస్తీర్ణంలో 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ఖాళీ స్థలం మాట అటుంచితే కనీసం రాకపోకలు సాగించడానికి అవసరమైన స్థాయిలో దారి, మెట్లు కూడా లేవు. భవనం చుట్టూ అగ్నిమాపక శకటాలు స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ముందు వైపు ఉన్న ప్రధాన రహదారి తప్ప మరెక్కడికీ ఫైర్ ఇంజిన్ కాదు కదా.. ద్విచక్ర వాహనం కూడా పోలేని విధంగా ఉంది.ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపలి వైపు కూడా మెట్లు ఉండాలి. ఈ భవనానికి ప్రధానంగా ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉంది. మరొకటి ఉన్నప్పటికీ అది కేవలం ఒక అడుగు వెడల్పుతో ఉంది. ఇవి తప్ప మరో మార్గం లేదు. మంటలార్పేందుకు భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. ఈ భవనంలో కనీసం ఇసుక బక్కెట్లు కూడా లేవు. భవనంలో విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఇక్కడ ఈ రెండూ కనిపించట్లేదు.ఇక్కడ అనుమతులు ఉండవు హైదరాబాద్‌లోని పాతబస్తీలో భవన నిర్మాణాల్లో చాలావరకు భద్రతా చర్యలు పాటించరనే అపవాదు ఉంది. 10–20 గజాల్లో అగ్గిపెట్టె లాంటి గృహ నిర్మాణాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ అనుమతులు అసలే ఉండవు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనాలు పెళ్లేందుకు దారులు కూడా సక్రమంగా ఉండవు. దీంతో శకటాలను ప్రధాన రోడ్లపైనే దూరంగా నిలిపి సందుల్లోకి పైపులతో నీటిని తరలించాల్సి వస్తోంది. 10–20 గజాల్లో ఐదారు అంతస్తుల వరకు భవనాలను నిర్మించటంతోపాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లను సైతం నిర్మించి వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు.గుల్జార్ హౌస్, పటేల్ మార్కెట్, ఘాన్సీ బజార్, కోకర్ వాడి, మీరాలం మండి, పురానీ హవేలి, కోట్లాఅలీజా, రైన్ బజార్, డబీర్ పురా, తలాబ్ కట్ట, భవానీనగర్, గంగానగర్, యశ్రబ్ నగర్, నర్కీపూర్బాగ్, సుల్తాన్ షాహి, అల్ జుబేర్ కాలనీ, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, కోకాకి తట్టి, దూద్ బౌలి, పురానాపూల్ (Puranapool) తదితర ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల వరకే అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుంటోంది. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.భవనం పటిష్టతను పరీక్షించాలన్న ఎంపీ అసద్సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కార ణాలు, ఇతర వివరాలు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిని అడిగి తెలుసు కున్నారు. ఆ భవనం నివాస యోగ్యమా, కాదా? అంటూ ప్రశ్నించారు. భవనం పటిష్టతను పరీక్షించాలని సూచించారు. ఆ కుటుంబీకులు ఎవరైనా మళ్లీ అదే భవనంలో ఉండటానికి ప్రయత్నిస్తే, జరగరానిది జరిగితే భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని నాగిరెడ్డి చెప్పారు. చదవండి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే.. ఇలా చేస్తే సేఫ్.. -
మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును పొడిగించింది. ఈనెల 31వ తేదీతో కమిసన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దానిని జూలై 31వ తేదీ వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించింది. తొలుత ఈనెల(మే నెల)లోనే తుది రిపోర్ట్ ఇస్తామని కమిషన్ లీక్ ఇచ్చినప్పటికీ.. జూలై 31వ తేదీ వరకూ పొడిగించడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ నడుస్తోంది. -
‘అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి’
సాక్షి,హైదరాబాద్: అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి హితువు పలికారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దురదృష్టకరం.హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం.నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని’ అన్నారు. -
సైబర్ మోసాలు : చదువుకున్నవారే ఎక్కువగా..!
హాస్టళ్లలో దొంగతనాలు ఎక్కువ ప్రధాన కూడళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలుమాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ మాదాపూర్: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి.విజయ్‌నాయక్ తెలిపారు. సోషల్ మీడియా, ఫెడెక్స్ మోసాలు, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యాప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినపుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. ఈ నేరాలపై ప్రధాన కూడళ్లలో, కళాశాలల్లో, జన సమ్మర్ధం ఉన్నచోట వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. మాదాపూర్ డిటెక్టివ్ టీంలో 10 మంది ఉన్నారు. సైబర్ క్రైంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవారు ఇద్దరున్నారు. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.ఇదీ చదవండి: టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో ప్రశ్న: మాదాపూర్ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇన్స్పెక్టర్: సైబర్ నేరాలతో పాటు ఎక్కువగా హాస్టళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల రూంలలోకి చొరబడి ల్యాప్టాప్స్, ఫోన్స్, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్నారు. 24 గంటల పాటు సెక్యూరిటీని నియమించాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారు తప్పని సరిగా ఐడీ కార్డులను చూపాలనే నిబంధన ఉండాలి. అప్పుడే దొంగతనాలను అరికట్టవచ్చు. ప్ర: ఫెడెక్స్ మోసం గురించి? జ: గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఎయిర్‌పోర్టు నుంచి పార్సిల్ వచి్చందని అందులో డ్రగ్స్ ఉన్నాయని.. మీరు ఫలానా పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయపెడతారు. కొంత సమయం తరువాత మీరు డబ్బు చెల్లిస్తే కేసు కొట్టివేస్తామని చెప్పి వారివద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఫోన్లను స్విచ్చాఫ్ చేస్తారు. ఇలాంటి మోసాల బారిన విద్యావంతులేపడుతున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్ర: ట్రాన్స్‌జెండర్స్, సోషల్‌మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? జ: ఖాళీ ప్రదేశాల వద్ద, ప్రధాన కూడళ్లలో ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. వారి వద్ద ఆగవద్దు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కి డయల్ చేయాలి. అమ్మాయి, అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు వారు విడిపోయిన తరువాత మారి్ఫంగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ప్ర: బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఏమిటి..జ: ప్రస్తుతం బెట్టింగ్‌కి అలవాటు పడ్డారంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. చిన్న చిన్న బెట్టింగ్‌లు కట్టినప్పుడు తిరిగి డబ్బును చెల్లించి ఆసక్తి కలిగిస్తారు. అలవాటు అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు పోతాయి. ఇలాంటి అలవాట్లతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. నష్టపోయాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్ మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ -
పాతబస్తీ ప్రమాదంపై విస్తుపోయే విషయాలు.. అక్రమ కనెక్షన్ కారణమా?
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్ కనెక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్ మీటర్‌పై లోడ్ పడింది. ఆ కరెంట్ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్‌స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్‌లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట. చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి. లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు. వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి. -
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. -
పాతబస్తీలో అంతులేని విషాదం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు.. ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక.. ఎటు వెళ్లాలో అర్థంకాక.. అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు.విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి.. ‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు. రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది! సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్‌సుఖ్‌నగర్‌లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్ట్‌లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది. మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చార్మినార్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలు... వాస్తవాలు... 1. నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగ్నిమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు. అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగ్నిమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగ్నిమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.పేరులోనే ఫైర్! సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం. పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది. శిక్షలు తక్కువే.. ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు.ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.ఏళ్లుగా నిరీక్షణ.. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగ్నిమాపక శాఖ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్నిమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు. -
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్‌లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. -
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సాక్షి, హైదరాబాద్/చార్మీనార్/దూద్‌బౌలి: అది హైదరాబాద్ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. అంతా బంధువులే... రాజస్తాన్‌కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ, దేవనాథ్ మోడీ, సునీల్ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్ హౌస్‌లోని చార్మీనార్ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్ మోడీ అత్తాపూర్, దేవనాథ్ మోడీ హిమాయత్ నగర్లో ఉంటున్నారు.గుల్జార్ హౌస్‌లోని దుకాణాల (జీ ప్లస్ వన్) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్‌లో ఉండే సునీల్ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్‌కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్ హౌస్‌లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు. మీటర్ వద్ద మొదలైన మంటలు ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్‌పుర నుంచి మొదటి ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు. భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్‌తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్ కేస్) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్ (చెక్క) పార్టీషన్‌తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. అపస్మారక స్థితిలో..సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ.. సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్ పైకి వెళ్లే స్టెయిర్ కేస్‌కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రహ్లాద్ కుటుంబం అంతా మృత్యువాత ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్ మోడీ మరో సోదరుడైన బంకట్ మోడీ టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్ మోడీతో పాటు రాజేందర్ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్‌లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. కిషన్‌రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్ జుల్పికర్ అలీ, అహ్మద్ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖపై కిషన్‌రెడ్డి ఫైర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్ వచి్చందని, మొఘల్‌పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్ కేస్ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మృతులు వీరే: ప్రహ్లాద్ మోడీ (70), మున్ని (70), రాజేందర్ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాంచ్ (4), ఇరాజ్ (2), అరుషి (3), రిషబ్ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఇద్దూ (4). మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్‌హౌస్ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది. – మీర్ జాహెద్, గుల్జార్ హౌస్ వద్ద గాజుల వ్యాపారి -
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది. -
తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్‌ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్‌లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మందు బాబులకు బిగ్‌షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 పెంచింది.కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది. -
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు? -
పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.15గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారంమరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. -
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్ (67)అభిషేక్ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్ (17)శీతల్ జైన్ (37)ఇరాజ్ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్‌అన్య మోదీపంకజ్ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్‌ప్రథమ్ అగర్వాల్‌ప్రాంశు అగర్వాల్. -
తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కారణంగా నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్ భగ్నమైంది. ఈ క్రమంలో ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) ఇద్దరూ కలిసి.. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పోలీసులు.. ఒక ఇంటిలో తనిఖీలు నిర్వహించగా పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు. -
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది. -
పాక్, తుర్కియేపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తుర్కియే దేశానికి విజ్ఞప్తి చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాక్ కంటే భారత్‌లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్‌లోనూ గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవొద్దని వ్యాఖ్యానించారు.తుర్కియే, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తుర్కియే అభివృద్ధికి భారత్ తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు. పాక్ వైపు మొగ్గుచూపుతున్న తుర్కియే తమ విధానాన్ని పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపైనా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ‘నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిని పాకిస్తానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నాలాంటి వారు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే వారికి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది’ అని అన్నారు.మానవాళికి ముప్పు పాక్..పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఒవైసీ కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్తానీ మిలిటరీ భారత్‌లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్నీ ఆయన విమర్శించారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ, చైర్పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు. -
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. -
కోటి మంది స్త్రీలను కోటీశ్వరుల్ని చేస్తాం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ఆడబిడ్డల సొంతమని, రూపాయి కూడా ఎగవేయకుండా వడ్డీతో సహా అప్పులు చెల్లిస్తున్నారని కితాబునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రాష్ట్రంలో స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లో సభ్యుల సంఖ్య కోటికి పెరగాల్సిన అవసరముందని, పట్టణ ప్రాంత మహిళలను వాటిలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘వి హబ్’(విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ హబ్) చేపట్టిన ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’, ‘గ్రాస్‌రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను శనివారం రేవంత్‌రెడ్డి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ‘ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం. ఇప్పటికే వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను మహిళలకు అప్పగించాం. సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వేయి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అప్పగించేందుకు సిద్దంగా ఉన్నాం’అని సీఎం ప్రకటించారు.‘మహిళా శక్తిని కాంగ్రెస్ ఎన్నడూ తక్కువగా అంచనా వేయలేదు. మహిళా శక్తికి చేయూత ఇచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలి్పంచాం, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం, విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టడం, పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ తదితరాల వ్యాపారాలు అప్పగించాం. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సాహిస్తూ, శిల్పారామంలో ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్‌ను కేటాయించాం’అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ ‘వి హబ్ గత ఏడేళ్లుగా మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మిషన్ మహిళా శక్తి –2025’విధానానికి అనుగుణంగా ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’ను వి హబ్ తెచి్చంది. దీనిద్వారా మహిళలు ఉద్యోగ కల్పన, సంపద సృష్టి, కొత్త తరం పారిశ్రామికవేత్తలకు ప్రేరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వి హబ్ ద్వారా త్వరలో జిల్లాల్లో ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘స్కిల్ డెవలప్మెంట్, మినీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లు ఏర్పాటవుతాయి.పెద్దపల్లి, పరకాల, నల్లగొండ, వికారాబాద్‌లో త్వరలో ఈ సెంటర్లు ప్రారంభమవుతాయి. వీటిలో మహిళలకు స్థానికంగా నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి సదుపాయాలు, మార్కెట్‌తో అనుసంధానం వంటి అనేక వసతులు సమకూరుతాయి’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ శర్మ, వి హబ్ సీఈఓ సీత పల్లచొల్లా, అసోసియేట్ డైరక్టర్ ఊహ సజ్జా తదితరులు పాల్గొన్నారు. 17 అవగాహన ఒప్పందాలు విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం సందర్భంగా వి హబ్ 17 కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (హైదరాబాద్), ట్రిపుల్ ఐటీ బాసర, గీతమ్ యూనివర్సిటీ, గోదావరి, పెద్దపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, తారా డిగ్రీ కాలేజీ (సంగారెడ్డి), మథర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రి హబ్, హెచ్‌పీ ఇండియా సేల్స్, హైసియా, ఐకోనియా, టీఆర్డీ స్డూడియోస్, 1ఎం1ఎంబీ, నిర్మాణ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల జాబితాలో ఉన్నాయి. ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, వరల్డ్ బ్యాంక్ సహకారంతో నడుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని 140 మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలు వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ‘గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ద్వారా గ్రామీణ యువతలో సృజనాత్మకత, సార్టప్ దృక్పథాన్ని పెంపొందిస్తారు. 6 వేలమందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
కొలువుదీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే, ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ.. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమై న అంశాలు పెండింగ్‌లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్–1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైనా నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. తుది తీర్పు తర్వాతే ముందుకు... గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్–1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించటంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపేసింది. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్–2, ఆ తర్వాత గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది.ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్–1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుంది. తుది తీర్పు వచి్చన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికారవర్గాలు అంటున్నాయి. కోర్టు కేసులతో.. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్‌లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది.అయితే, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కిందిస్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావిస్తోంది. ⇒ గతేడాది డిసెంబర్లో గ్రూప్–4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్లంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువస్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ⇒ ఈ నేపథ్యంలో గ్రూప్–1 తుది జాబితాను వేగంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ⇒ గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి లేదు. -
Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం(మే 17వతేదీ) సాయంత్రం సమయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి.దీనిలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగాం. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్‌బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది.శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ వాదించారు. వాదనలకు ఏకీభవించి నాంపల్లి కోర్టు.. కేసు కొట్టివేసింది. -
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 13 మందిని నిందితులుగా తేల్చారు. ఈ ఘటనకు కారణమైన 13 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.క్యూనెట్కు చెందిన ఇద్దరితో పాటు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంపు చేసి పెట్టడం వల్లే ఆరుగురు ప్రాణాలు రక్షించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉంటే, ఆరుగురు ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు అన్నారు. -
వై-యాక్సిస్ యూఎస్ ఎంబసీతో ఎంఓయూ
సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలో చదువుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులకు సహకారం అందించ డానికి వై–యాక్సిస్ ఫౌండేషన్ యూఎస్ రాయబార కార్యాలయంతో అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా విద్యార్థులకు విశ్వసనీయమైన, నిస్పాక్షికమైన మార్గదర్శకత్వాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్ యూఎస్ఏ ప్రోవైడర్‌గా ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్తో యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబంధించిన ఎంఓయును కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలకు సేవలు అందించే ఏకైక ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రంగా హైదరాబాద్‌లో వై–యాక్సిస్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన సమాచారం కోసం ఎడ్యుకేషన్ యూఎస్ఏ వన్–స్టాప్ సెంటర్ వై–యాక్సిస్ ఫౌండేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై–యాక్సిస్ ఫౌండేషన్ డైరెక్టర్ సబీనా జేవియర్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: After Fifty యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు! -
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్‌ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్‌పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్‌లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసులు నెంబర్ వన్.. సీఎం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి ట్విట్టర్ వేదికగా.. వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష.మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది.ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్ కు, ఆయన బృందానికినా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం… నేను కంటున్న కలలను సాకారం చేయడానికి…కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు… నేను మద్దతుగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ… pic.twitter.com/CLKSzX75jc— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025 -
చలించిన కేబీఆర్ పార్కు వాకర్లు... ప్రతి వారం అన్నదానం
హైదరాబాద్ : క్యాన్సర్ ఆస్పత్రికి నిత్యం వచ్చే క్యాన్సర్ బాధితులతో పాటు వారి సహాయకులను చూసి చలించిపోయిన కేబీఆర్ పార్కు వాకర్లు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి వారం అన్నదానం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శుక్రవారం కేబీఆర్ పార్కు వాకర్లు, స్నేహ హస్తం ఫౌండేషన్ ప్రతినిధులు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము నిత్యం కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వస్తుంటామని ఫుట్‌పాత్‌లపై క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చే పేషంట్లతో పాటు వారి సహాయకులు ఆకలి అలమటిస్తున్న తీరును చూసి చలించిపోయి స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదానం చేస్తున్నట్లు వారు తెలిపారు. 300 మందికి అన్నదానం చేస్తున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహ్మద్ కతల్ హుస్సేన్, భరత్ భూషణ్, రామ్‌కుమార్, కిషోర్ కుమార్, జబ్బార్, ఫయాజ్, షౌకత్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
గొంతు.. చెవులు కోసి.. ఒంటికి నిప్పంటించి
మేడ్చల్: మేడ్చల్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి (50) మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లిలో అద్దె గదిలో నివాసం ఉంటూ కిష్టాపూర్‌లోని ఓ మద్యం దుకాణంలో రోజువారీ కూలీగా పని చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఉంటున్న గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చెవులు, గొంతు కోసి.. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ఒంటిపై దుస్తులు వేసి కాల్చివేసినట్టు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ... మహిళ హత్య కేసు ఛేదించడానికి లోకల్, ఎస్వోటీ పోలీసులతో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళ ఒంటి మీదున్న నగలు, డబ్బుల కోసం నమ్మించి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారా?, గతంలో తనతో సహజీవనం చేసిన వ్యక్తి ఈ పని చేశాడా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నామన్నారు. కాగా.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు మేడ్చల్ పరిధిలో మహిళ దారుణ హత్య సగభాగం వరకు కాలిన మృతదేహం -
సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు టెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద ప్రధాన మార్గాల్లోని రహదారుల నిర్వహణకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఐదేళ్ల క్రితం ఈ పనుల్ని పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చిన గడువు గత డిసెంబర్– జనవరిల్లోనే ముగిసిపోయింది. కానీ.. ఇప్పటివరకు మళ్లీ టెండర్లు పిలవలేదు. గతంలో మాదిరిగానే మళ్లీ పెద్ద ఏజెన్సీలకిచ్చే యోచనలో ఉన్న ఇంజినీరింగ్ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలతో స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయానికి పంపి వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో.. తాత్కాలికంగా కొంత కాలం వరకై నా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఈ పనులు చేసేందుకు తాజాగా టెండర్లు పిలుస్తున్నారు. వాస్తవానికి మే నెల ముగిసేలోగానే రీ కార్పెటింగ్, మరమ్మతులు తదితరమైనవి పూర్తి చేయాల్సి ఉండగా, స్పష్టత లేకపోవడంతో పనులు చేయలేదు. తాజాగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో.. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పెరిగే వర్షాలకు రోడ్లు దెబ్బతింటాయి. ఇప్పటికే వివిధ సంస్థల అవసరాల కోసం తవ్వకాలకు అనుమతులివ్వడంతో, అనుమతులున్న వాటితోపాటు లేని ప్రాంతాల్లోనూ అడ్డదిడ్డంగా రోడ్లను తవ్వి వదిలేశారు. వాటిని తిరిగి పూడ్చాల్సి ఉంది. వర్షాలకు గోతులు పడితే ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని గ్రహించి.. జూన్ వరకు పనుల కోసమంటూ తాజాగా సికింద్రాబాద్ జోన్లో టెండర్లు పిలిచారు. లేన్ మార్కింగ్‌లు, క్యాచ్పిట్స్ మరమ్మతులు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లకు రంగులతో సహా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు రూ.1.03 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. పెద్ద ఏజెన్సీలకిచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు తాత్కాలికంగా ఈ టెండర్లు పిలిచారు. మిగతా జోన్లలోనూ పిలవనున్నట్లు తెలుస్తోంది. లేన్‌మార్కింగ్‌లు, క్యాచ్ పిట్స్ పనులు సహా.. తాత్కాలికంగా జూన్ వరకు మాత్రమే.. ప్రభుత్వ నిర్ణయమేంటో? ఒక ప్రతిపాదన మేరకు గతంలో ఉన్న మార్గాల్లోనే అంతే దూరం పనులుండగా, మరో ప్రతిపాదనలో అదనంగా కొన్ని రోడ్లను చేర్చడంతో పాటు ఈసారి అదనంగా పూడికతీత పనులు కూడా చేర్చారు. గతంలో ఎప్పటికప్పుడు రోడ్ల రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత, స్వీపింగ్, గ్రీనరీ, ఫుట్‌పాత్‌లు, లేన్మార్కింగ్ల పనులుండేవి. పాత మార్గాల్లోని రోడ్లకే అయితే.. 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2,491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1,142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3,825 కోట్లు. గతం కంటే 398 కి.మీ. మేర పనులు, రూ.1,334 వ్యయం అదనం. వీటిలో ప్రభుత్వం దేనికి అనుమతిస్తుందో, లేక ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. -
అక్రమార్కుల ఆగడాలకు చెక్!
3.5 ఎకరాల సర్కారు స్థలంపై కబ్జాదారుల కన్ను బంజారాహిల్స్: మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు చేయని కుయుక్తులు లేవు. పట్టు వదలని విక్రమార్కుల్లా భూమిపై పట్టు నిలుపుకోవాలని అటు పోలీసుల్ని, ఇటు రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎంతో విలువైన మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. కబ్జాదారు పార్థసారథి, ఆయన కొడుకు విజయ భార్గవన్ ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఇక్కడి చెట్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం 12 సీసీ కెమెరాలను రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం–10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఎదురుగా తట్టిఖానా వాటర్ రిజర్వాయర్‌ను ఆనుకొని సర్వే నెం. 403/పిలో ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత మంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేసేందుకు ఎనిమిదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పాటు రౌడీలను సైతం దింపి ఈ స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ స్థలాన్ని కబ్జా చేసిన పార్థసారథి, ఆయన కొడుకు విజయ్ భార్గవ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంలో షేక్‌పేట రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదయ్యాయి. మూడుసార్లు ఈ స్థలంలోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలు కూల్చివేసి అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. అయినాసరే కబ్జాదారులు ఈ స్థలంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాన్ని తమ అధీనంలోకి తీసుకొని లోపల ఒక గదిని నిర్మించి రౌడీలను పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు.. కబ్జా జరిగిన స్థలం లోపల ఉన్న అయిదుగురు రౌడీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. చెట్లపై సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వీటిని తొలగించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు: షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డిఅధికారుల కళ్లుగప్పి.. ఠాణాలో క్రిమినల్ కేసులు నమోదైనా.. రౌడీలను తరి మేసినా.. అక్రమ నిర్మాణా లు కూల్చివేసినా.. సదరు కబ్జాదారులు మాత్రం ఈ స్థలంలో తిష్ట వేశారు. ఎలా గైనా భూమిని కబ్జా చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కబ్జాదారుల ఆగడాలకు షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి చెక్ పెట్టినా.. అధికారుల కళ్లు గప్పి సెలవురోజుల్లో కబ్జాదారులు స్థలంలోకి చొచ్చుకొస్తున్నారు. అయిదెకరాల ఈ ప్రభుత్వ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని.. ఇందులో ఎకరన్నర స్థలం తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ కోసం కేటా యించినట్లు.. మిగతా మూడున్నర ఎకరాల భూమి పక్కాగా ప్రభుత్వానిదేనని తహసీల్దార్ అనితారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని.. అందుకోసమే లోపల హెచ్చరిక బోర్డులతో పాటు బ్లూషీట్లపై ఇది ప్రభుత్వ భూమి అని రాసినట్లు ఆమె తెలిపారు. కబ్జాదారులు మరోసారి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
మ్యాన్‌హోళ్లలో బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల తీరు మారడం లేదు. సీవరేజీ పైపులైన్లో వ్యర్థాలే కాదు.. కరగని ఘన పదార్థాలు, మురుగు ప్రవాహానికి అడ్డుపడే బ్లాంకెట్లు, బెడ్షీట్లను సైతం వదిలేస్తున్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో కట్టడికి 180 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మ్యాన్‌హోల్ టు మ్యాన్‌హోల్ డీ– సిల్టింగ్ చేసినా.. సీవరేజీ వ్యర్థాలపై అవగాహన కల్పించినా మార్పు రావడంలేదు. ఇటీవల మలక్‌పేట నల్లగొండ చౌరస్తా వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లో పై ఫిర్యాదుల వస్తుండంతో జలమండలి అధికారులు శుక్రవారం డీ– సిల్టింగ్ పనులు నిర్వహించారు. జెట్టింగ్ యంత్రాలను ఉపయోగించి మ్యాన్‌హోళ్ల నుంచి సిల్ట్‌ను బయటికి తీయగా.. అందులోంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలు బయటపడ్డాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలోని మ్యాన్‌హోళ్లు ఓవర్‌ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. ఇకనుంచి ఎవరైనా మ్యాన్‌హోళ్లలో చెత్త, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు. వాణిజ్య భవనాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి వాణిజ్య భవన సముదాయాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి అని జలమండలి సూచించింది. రెస్టారెంట్లు, హాస్టల్స్, హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, ఆఫీసులు తదితర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు.. తమ సీవరేజీ పైపులైన్‌ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్ వర్క్‌కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఘన, కరగని వ్యర్థ పదార్థాలు మురుగు ప్రవాహనికి అడ్డుపడుతున్నాయి. ప్రధానంగా సిల్ట్ చాంబర్లు లేకపోవడంతో సీవరేజీ పైపులైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవర్ ఫ్లో అవుతున్నాయి. మరోవైపు నివాస సముదాయాల నుంచి సీవరేజీ పైపులైన్లో బ్లాంకెట్లు, బెడ్షీట్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు, ఘన పదార్థాలు లాంటి వ్యర్థాలు వదలడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. నల్లగొండ చౌరస్తా వద్ద డీ– సిల్టింగ్లో వెలికితీత అవగాహన కల్పించినా.. మారని తీరు బయటపడుతున్న ఘన పదార్థాలు.. వ్యర్థాలు -
బర్షత్ ఖాన్ ‘బకాయి’ రూ.25 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా సాగిన లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసుపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అహ్మదాబాద్ యూనిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్ వ్యాపారి బర్షత్ ఖాన్ ఎగవేసిన కస్టమ్స్ సుంకం రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తక్షణం రూ.7 కోట్లు చెల్లించాలంటూ ఆదేశించగా... రూ.కోటి కట్టిన బర్షత్ మరో రూ.50 లక్షలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్ కోర్టులో గురువారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ డీఆర్ఐ అధికారులు చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోపక్క ఈ లగ్జరీ కార్లను ఖరీదు చేసిన వారిలో ఇద్దరు హైదరాబాదీలను అహ్మదాబాద్ డీఆర్ఐ యూనిట్ గుర్తించింది. వీరి నుంచి వివరాలు సేకరించేందుకు శుక్రవారం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. విజయ్‌నగర్ కాలనీలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన బర్షత్ అహ్మద్ ఖాన్ గచ్చిబౌలిలోని డైమండ్ హిల్స్‌లో 2008 నుంచి ఎస్కే కార్ లాంజ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడి సోదరుడికి రెండు వర్క్‌షాప్స్ ఉండటంతో బర్షత్ సైతం ఈ రంగంలోకి వచ్చాడు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు బడా బిల్డర్లు, కాంట్రాక్టులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న బర్షత్ పదేళ్లలోనే గణనీయమైన స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం క్లైవ్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఏకే కార్ లాంజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఏకే కార్ లాంజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతడి కార్ లాంజ్ నుంచి ఖరీదైన లగ్జరీ కార్లను ఖరీదు చేసే వారిలోనూ వీళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బర్షత్ కస్టమర్లలో అత్యధికులు పన్ను ఎగ్గొట్టడానికి చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేసినట్లు డీఆర్ఐ అనుమానిస్తోంది. గడిచిన కొన్నేళ్లల్లో అమెరికా, జపాన్‌లోని హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నేవిగేటర్ తదితర కంపెనీలకు చెందిన 30 కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఈ వాహనాలను హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లో బడా వ్యాపారులు, రియల్టర్లకు విక్రయించారని అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు పది కార్లు హైదరాబాదీలకే అమ్మినట్లు డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించిన డీఆర్ఐ మిగిలిన వారి కోసం ఆరా తీస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లర్ లెక్కలు తేలుస్తున్న అహ్మదాబాద్ డీఆర్ఐ తక్షణం రూ.ఏడు కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు రూ.కోటి చెల్లించి బెయిల్‌కు దరఖాస్తు హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నగరానికి చెందిన ఇద్దరు కార్ల కొనుగోలుదారుల గుర్తింపు -
రోడ్డు ఆక్రమించి..షెడ్డు నిర్మించి..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్, షేక్‌పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.78 నవ నిర్మాణ్‌నగర్ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సర్వే నెం.403లో ఒక్కొక్కరికి 50 గజాల చొప్పున ఈ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. 1999 ప్రాంతంలో చంద్రబాబు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ స్థలంలోనే ఈ క్వార్టర్లు నిర్మించి ఇందులో ఆరుగురికి పట్టాలు కూడా ఇచ్చారు. మరో ఆరు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంట్లో దోభీ, తోటమాలి తదితరులు ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఉంటున్నారు. ప్లాట్ నెంబర్.1లో ఎలాంటి పట్టా లేకుండా సీహెచ్.మూర్తి అనే దోభీ కొంత కాలంగా అక్రమంగా నివసిస్తుండటమే కాకుండా..క్వార్టర్స్ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మించాడు. దీంతో స్థానికులు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై కొంత కాలంగా పట్టాలు ఉండి అధికారికంగా ఉంటున్న వారికి, పట్టాలు లేకుండా ఖాళీ ప్లాట్లలో ఉంటున్న వారికి మధ్య రోడ్డు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ సీవరేజి పైప్‌లైన్, మంచినీటి పైప్‌లైన్ మంజూరు కావడంతో పాటు జీహెచ్ఎంసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే దోభీ మూర్తి ఆక్రమించిన స్థలంలో షెడ్డు నిర్మాణం వీటికి అడ్డుగా ఉంది. సదరు షెడ్డును తొలగిస్తే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అనితారెడ్డి క్వార్టర్లను పరిశీలించారు. వారి వద్ద ఉన్న పట్టాలు, ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఆరా తీశారు. రోడ్డు ఆక్రమించి షెడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని ఆమె హెచ్చరించారు. మరో వైపు పట్టాలు లేకుండానే కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వం నిర్మించిన ఈ క్వార్టర్లలో తిష్టవేసి వీటిని శాశ్వతంగా కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి అక్రమార్కులను ఖాళీ చేయించి క్వార్టర్స్ అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో సిబ్బందికి క్వార్టర్లు వాటిలో తిష్టవేసిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల పరిశీలన అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశం -
పవర్‌ఫుల్‌గా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని, భవిష్యత్‌లో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం శుక్రవారం తన నివాసంలో ఇంధన శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ప్రజా రవాణా (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.9.8 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వినియోగం పెరగలేదని, అయినా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అది 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను⇒ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా అమల్లోకి తెచి్చన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని.. మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌లకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.హెచ్ఎండీఏతో సమన్వయం..ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా వీటిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పొడవునా సోలార్ విద్యుత్ లైటింగ్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
సారీ.. నో లారీ!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల కొనుగోలు రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్ఎంటీలధాన్యం వచ్చిందని, 51.39 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకు ఆలస్యం? కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్‌తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? ⇒ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు ⇒ గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.అయితే మొత్తంగా సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా : 70.13 ఎల్ఎంటీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం : 51.39 ఎల్ఎంటీ ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు) : 34.02 ఎల్ఎంటీ సన్న రకం (2,25,215 రైతులు) : 17.37 ఎల్ఎంటీ కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.11,913.05 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం : రూ.8,511.42 కోట్లు సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ : రూ.868.61 కోట్లు వర్షం వస్తే ఎట్లా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్‌లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసినా.. లారీలు లేక..మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి. 20 రోజులైనా కాంటా కాలేదు.. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. – కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్పీరియం.. హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు. -
28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్(బహిరంగ విచారణ) నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 60.78 శాతం పూర్తయ్యాయి.రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయాలంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. బ్యాక్ వాటర్ ప్రభావంపై నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు. -
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించి చూపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంటే, ఆ పనిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు మాత్రం కీచులాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి చివరకు ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా మారింది. ఈ పోటీల నిర్వహణలో ప్రధాన భూమిక పర్యాటక శాఖదే. అందులో అంతర్భాగమైన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ఈడీ స్థాయి అధికారిని పోటీలు కొనసాగుతుండగానే మాతృ సంస్థకు పంపటం వెనుక అధికారుల మధ్య వివాదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. స్పాన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్.. పోటీల నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం–మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా చెరిసగం భరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్వహణ ఖర్చుల అంచనా రూ.57 కోట్లని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.25 కోట్లను మించి స్పాన్సర్షిప్ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయని సమాచారం. పోటీలు ప్రారంభం కాకముందే స్పాన్సర్‌గా ఉండేందుకు ఓ పెద్ద బ్యాంకు ముందుకొచి్చ, ప్రభుత్వం ఆశించిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఒక్క బ్యాంకుకే మొత్తం స్పాన్సర్షిప్ ఇవ్వలేమని, మరికొన్ని సంస్థలతో కలిపి ఇస్తామని ఓ ఉన్నతాధికారి ఆ బ్యాంకు ప్రతినిధులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత కొన్ని సంస్థలు ముందుకొచి్చనా.. వాటితో ఓ ఉన్నతాధికారి సరిగా వ్యవహరించకపోవటంతో అవి కూడా వెనుదిరిగాయని చెబుతున్నారు. సదరు సంస్థలతో అధికారులు సరిగా డీల్ చేసి ఉంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన మొత్తానికి మించి ఆదాయం సమకూరి ఉండేదని అంటున్నారు. మరోవైపు ఒకరిద్దరు అధికారులు ఈ స్పాన్సర్షిప్ వ్యవహారాన్ని సొంత లబి్ధకి వాడే ప్రయత్నం చేశారని, దానిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వెరసి కీలక స్పాన్సర్షిప్స్ వ్యవహారంలో యంత్రాంగం వైఫల్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల మధ్య కీచులాటలు.. ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లను ప్రారంభంలో అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు అప్పగించింది. ఆ సమయంలో సీఎంతో జరిగిన ఓ సమావేశంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైనట్లు తెలిసింది. ఈ పోటీల్లోని కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అనుమతించాలని ఆ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదించారు. అప్పుడే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయేశ్‌రంజన్‌కు దీనిపై సమాచారం లేదు.చివరకు కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇంతటి కీలక నిర్ణయం తనకు తెలియకుండా తీసుకోవటమేంటని ప్రకాశ్‌రెడ్డిని జయేశ్‌రంజన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటన ఆ ఇద్దరు అధికారుల మధ్య కొంత అగాధానికి కారణమైందని పర్యాటక శాఖలో ప్రచారం జరుగుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, ఈడీ విజయ్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే విజయ్‌ని ఉన్నఫలంగా మాతృసంస్థకు పంపారని అంటున్నారు. కాళ్లు కడిగించారనే అపవాదు.. ఇటీవల వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆలయాల్లోకి వెళ్లేముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘట్టం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అక్కడ సాధారణ భక్తులు కాళ్లు కడుక్కున్నట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటే సరిపోయేది. కానీ, పోటీదారులను కుర్చిల్లో కూర్చోబెట్టి కాళ్ల కింద కొత్త పళ్లాలు ఉంచి, చెంబులతో నీళ్లు పోసి సిబ్బందితో కాళ్లు కడిగించారు. కొందరు సిబ్బంది టవల్‌తో కాళ్లను తుడిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసలు ఇలా పళ్లాల్లో కాళ్లుంచి కడిగించే ఆలోచన ఎవరు చేశారంటూ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. -
‘హరీష్ పై కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్‌గా హరీష్ రావు పైన కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్‌రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
‘హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అత్యధికంగా 17, 162 మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు.2025- 26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోంది.హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు..హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
హరీష్‌రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
కాళేశ్వరం కమిషన్ నిర్ణయం.. వారిని బహిరంగ విచారణకు పిలవొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్‌ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనుంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. -
వేదవల్లి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు ఆ తల్లి దండ్రులు చివరి క్షణంవరకు పోరాడారు. ఆస్తు లన్నీ అమ్మి, అప్పులు చేసి కూడా రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా, పాప ప్రాణాలు దక్కలేదు. మరోవైపు స్తోమతకు మించి వైద్యా నికి ఖర్చు చేయటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి గతంలో పాప వైద్యానికి రూ.8 లక్షలు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడు ఆ పాప కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో రూ.7 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన రఘు, మంజుల దంపతుల పెద్ద కుమార్తె వేదవల్లి (5)కి 2022లో బ్లడ్ క్యాన్సర్ సోకింది. పాపను రక్షించుకునేందుకు రెండేళ్లపాటు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. 2024లో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం రావటంతో చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు మంజూరు చేశారు. చికిత్స అందించినప్పటికీ గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఆ మేరకు రూ.7 లక్షల చెక్కు ను సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గురువా రం వేదవల్లి తండ్రి రఘుకు అందజేశారు. -
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్‌నగర్ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్‌లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్‌కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరోసారి మహా రియల్!
సాక్షి సిటీబ్యూరో: కొత్త లేఅవుట్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలోనే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సొంత స్థలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతుల నుంచి కూడా భూములను సేకరించి భారీ లే అవుట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనడంతో కొత్త లే అవుట్ల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేశారు. ప్రస్తుతం కొంతవరకు సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అధికారులు కొత్త లేఅవుట్ల అభివృద్ఙిపై దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా భూములను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు ముందుకు రావడంతో లే అవుట్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. గతంలో కోకాపేట్, బుద్వేల్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో అనూహ్యమైన స్పందన రావడంతో.. మరోసారి అదే స్థాయిలో స్పందన లభించకపోయినప్పటికీ హెచ్ఎండీఏ స్వయంగా వెంచర్లను అభివృద్ధి చేసి విక్రయిస్తే రియల్ రంగంలో కొంత మార్పు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సుమారు 500 ఎకరాల్లో.. నగర శివార్లలోని కుర్మల్‌గూడ, ప్రతాపసింగారం, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నర్వ, కొర్రెముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్‌నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాల భూములలో రోడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు. మిగతా చోట్ల కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, బోగారంలో 125, ప్రతాపసింగారంలో సుమారు 151, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు గుర్తింంచారు. తిమ్మాపూర్‌లో 156 ఎకరాలు, కుత్బుల్లాపూర్‌లో 130, కొర్రెములలో 138 ఎకరాలు చొప్పున సేకరించనున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూములు అందుబాటులో ఉన్నట్లు అంచనా. రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. మొదట కనీసం 500 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. గతంలో హెచ్ఎండీఏ వెంచర్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడంతోనే రైతులు తమ భూములను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు ఆసక్తితో ఉన్నట్లు అధికారులు చెప్పారు. కొనుగోలుదారులు సైతం హెచ్ఎండీఏపై నమ్మకంతో ముందుకు వస్తున్నారు. ప్రతాపసింగారంలో పనులు.. సుమారు 150 మంది రైతుల నుంచి ప్రతాపసింగారంలో ఇప్పటికే 133 ఎకరాల భూమి సేకరించారు. మరిన్ని భూముల సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నవాటితో పాటు కొత్తగా సేకరించనున్న వాటితో కలిపి సుమారు రూ.120 కోట్లతో భారీ వెంచర్‌ను అభివృద్ధి చేయనున్నారు. రైతులకు ఎకరాకు 1,741 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభించనుంది. మూడేళ్ల క్రితమే ఈ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం, మార్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున, ఔటర్‌రింగ్‌రోడ్డుకు చేరువలో ఉండడంతో ప్రతాపసింగారం లే అవుట్‌కు అనూహ్యమైన స్పందన లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నయా వెంచర్ల ఏర్పాటులో హెచ్ఎండీఏ ఔటర్ సమీప గ్రామాల్లో లే అవుట్లకు సన్నాహాలు కుత్బుల్లాపూర్, కొర్రెముల, కుర్మల్‌గూడ, ప్రతాపసింగారంలలో.. -
అఫ్జల్‌గంజ్‌లో అగ్నికీలలు
మూడంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు ● పసిపాప సహా ఏడుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది ● షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు అఫ్జల్‌గంజ్: అఫ్జల్‌గంజ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల నివాస భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని ఏడాది చిన్నారి సహా మరో ఏడుగురిని నిచ్చెన ద్వారా కిటికీల నుంచి బయటికి తీసుకువచ్చి రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన మహారాజ్‌గంజ్‌లోని మూడంతస్తుల భవనంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనంలో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో అప్పటికే ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన కిశోర్ లాల్వాని, రాజు లాల్వాని, లక్ష్మీ లాల్వాని, జ్యోతిరామ్, ప్రియ, యాష్, సమర్థ్లతో పాటు ఏడాది వయసున్న చిన్నారిని ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొదటి అంతస్తు నుంచి రెండు మూడు అంతస్తులకు వేగంగా మంటలు వ్యాపించడంతో మొదట నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సాయంత్రం వరకూ శ్రమించారు. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లు వాడినట్లు అంచనా. కాగా.. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాంను నిర్వహిస్తుండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు పలువురు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. ఆస్తినష్టం ఎంత వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ప్రమాద ఘటనపై ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు పరిశీలించారు. -
ఉస్మాన్‌సాగర్‌కు తప్పిన మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాలకు తాగునీరు అందించే ఉస్మాన్‌సాగర్‌కు (గండిపేట చెరువు) మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చే మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. వరద సమయంలో ఆ నీరు గండిపేటకు చేరేలా ఉండే రెండు గేట్లు శిథిలం కావడం, దీనిపై మీడియాలో వచ్చిన కథనాలతో హైడ్రా ఈ చర్య తీసుకుంది. శిథిలమైన గేట్లను పరిశీలించడానికి గతంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అక్కడ పరిస్థితులు చూసిన ఆయన తక్షణం మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. దీంతో శిథిలమైన రెండు గేట్ల స్థానంలో కొత్తవి అమర్చారు. బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ నాలా ఒకప్పుడు కేవలం వరద కాలువగా ఉండేది. శంకర్‌పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు వర్షపు నీటిని తీసుకెళ్లిన చరిత్ర ఈ నాలాకు ఉంది. ప్రస్తుతం నాలాకు ఎగువన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు, రిసార్టుల నుంచి బయటకు వస్తున్న మురుగు నీరు దీని ద్వారానే ప్రవహిస్తోంది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే ప్రయోజనాలుంటాయని, హుస్సేన్‌సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువెళ్లే ఏకై క నాలా ఇదేనని స్థానికులు చెబుతున్నారు. దీంతో నాలా పునరుద్ధరణపైనా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. బుల్కాపూర్ నాలాకు ‘హైడ్రా‘ గేట్లు దీని పునరుద్ధరణపై అధికారుల దృష్టి -
దక్షిణాసియాలోనే తొలి నగరంగా రికార్డు..
మూసీ నది దక్షిణ ఒడ్డున సరికొత్త ఆధునిక ఎస్బీఆర్ సాంకేతికతతో నిర్మించిన నాగోలు ఎస్టీపీ దేశంలోనే అతి పెద్దది. ఇప్పటి వరకు ఎస్టీపీలకు యూఏఎస్‌బీ, ఎంబీబీఆర్, ఈఏబీఎన్ఆర్ టెక్నాల జీ వినియోగించగా.. సరికొత్త ఎస్బీఆర్ టెక్నాలజీతో సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 320 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఎస్టీపీని 15 ఎకరాల్లో నిర్మించారు. ఇటీవల వాటర్ డైజెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ యునెస్కో భాగస్వామ్యంతో 2024 –2025 సంవత్సరానికి గాను ప్రభుత్వ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీగా నాగోలు ఎంపిక చేసి జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు ప్రదానం చేసింది. పర్యావరణ అనుకూలత, సమర్థ మురుగు నీటి శుద్ధి, నీటి పునర్వినియోగం, ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తున్నందుకు ఉత్తమ ఎస్టీపీగా ఎంపిక చేసింది. మురుగు నీటి పరిస్థితి ఇలా.. ● హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజువారీగా 1,950 మిలియన్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. జలమండలి ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 322 ఎమ్మెల్డీ సామర్థ్యం గ ల ఐదు ఎస్టీపీలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ దశలో ఉండగా.. సుమారు 113.5 ఎమ్మెల్డీ సామర్థ్యంగల మూడు ఎస్టీపీల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే దాదాపు 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయవచ్చు. మిగిలిన 72 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయాల్సి అవసరం ఉంటుంది. ● గత ప్రభుత్వం వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంతో సుమారు రూ.3,866.21 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధం కాగా.. స్థలాల సేకరణ, ఇతరత్రా కారణాలతో వాటి సంఖ్యను ఇరవై ఎస్టీపీలకు కుదించినా సామర్థ్యం తగ్గకుండా పనులు పూర్తి చేసింది. అందులో ఇప్పటికే 12 ఎస్టీపీలు మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, మరో ఎనిమిది ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హ్యామ్ మోడ్‌లో అమృత్ ఎస్టీపీలు కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్‌లో నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నాయి. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్‌లో.. మిగిలిన 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే 972 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలును, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్ధ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్లపాటు నిర్వహణకు చేపట్టనుంది. మూసీపై ఎస్టీపీల ప్రతిపాదన ● హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మూసీ నదిపై సుమారు 62 ఎస్టీపీల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన సమర్పించింది. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీ నదిలోకి చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కి.మీ మేర ప్రవహిస్తుండటంతో దానికిరువైపులా మురుగు కలుస్తోంది. రాబోయే పదేళ్లలో విస్తరించే హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎమ్మెల్డీల మురుగు నీరు ఉత్పన్నం కావచ్చని జలమండలి అంచనా వేసింది. దీంతో మూసీపై మురుగు నీటి శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించింది. ● ప్రస్తుతం మహానగరంలో 9,769 కిలో మీటర్లు మాత్రమే సీవరేజీ పైపులైన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 2.656 కి.మీ, ఓఆర్ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మురుగు శుద్ధి.. వంద శాతం ఇప్పటికే 37 ఎస్టీపీలు.. త్వరలో మరో 8 అందుబాటులోకి అమృత్ 2.0 కింద కొత్తగా 39 నిర్మాణాలు.. కేంద్రం వద్ద మరో 62 ఎస్టీపీలకు ప్రతిపాదనలు ముందస్తుగా పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే సీవరేజీపై ప్రణాళిక నాగోల్ ఎస్టీపీ పని తీరుతో జలమండలికి ‘వరల్డ్ వాటర్’ అవార్డు దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. సరికొత్త సాంకేతికతో మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది. తాజాగా అమృత్ 2.0 పథకం కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో ముందస్తు ప్రణాళికతో.. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. రాబోయే పదేళ్లలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని అంచనా వేసి.. శుద్ధి ప్రక్రియ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాం. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసే విధంగా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం అమృత్ ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. మూసీలో కలిసే మురుగు నీటిని సైతం శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించాం. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ అత్యాధునిక సాంకేతికతతో.. సరికొత్త సాంకేతిక ‘సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. తక్కువ విస్తరణ, తక్కువ విద్యుత్‌తో ఎక్కువ మురుగు నీటిని ఇవి శుద్ధి చేస్తాయి. నిర్మాణ వ్యయం తక్కువే. మ్యాన్‌పవర్ లేకుండా పూర్తిగా ఆటోమెటిక్‌గా మురుగు నీటి శుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. – సుదర్శన్, జలమండలి డైరెక్టర్ -
హైడ్రా టైం టేబుల్ సిద్ధం!
సోమవారం నుంచి శనివారం వరకు పని ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఓ టైమ్ టేబుల్ సిద్ధమైంది. వారంలో ఏ రోజు ఏ పని చేయాలి? అనేది కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, హైడ్రా సంస్థాగత నిర్మాణం, క్షేత్ర స్థాయి పరిశీలన.. ఇలా ప్రతి అంశానికీ సమప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వారం నుంనే ఈ విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. మరోపక్క హైడ్రా కోసం ఇటీవల కొనుగోలు చేసిన 122 వాహనాలను అధికారులు, సిబ్బందికి అందజేశారు. సోమవారం ప్రజావాణితో మొదలై.. రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఆరోజు ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు వస్తున్నారు. ప్రతి వారం కనీసం 50 నుంచి 60 మంది వస్తుండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పడుతోంది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ సహా వివిధ అంశాల గుర్తింపునకు హైడ్రా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో పాటు ప్రముఖ సంస్థల సహకారం తీసుకుంటోంది. ఆయా ఏజెన్సీల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ అంశాల పురోగతిని పర్యవేక్షించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్ర తి మంగళవారం రివ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. కీలక ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన.. ప్రజావాణితో పాటు ఇతర విధానాల్లో హైడ్రాకు అందిన ఫిర్యాదులను అధికారులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. దీనికోసం రెవెన్యూ, న్యాయశాఖ సహా వివిధ విభాగాల నుంచి అధికారులు డిప్యుటేషన్‌పై హైడ్రాలో పని చేస్తున్నారు. సున్నితమైన, కీలకాంశాలను స్వయంగా హైడ్రా కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ప్రతి బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోహెడ నుంచి పర్యటన మొదలు పెట్టిన రంగనాథ్ రాత్రి 7.30 గంటలకు మేడ్చల్ జిల్లా బౌరంపేటతో ముగించారు. గురువారం హైడ్రా పరిపాలన పరమైన అంశాలపై దృష్టి పెడుతున్న కమిషనర్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పురోగతి, తీసుకున్న/తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం హైడ్రా ఆధ్వర్యంలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. వీటిని నిపుణులతో పాటు మాజీ, ప్రస్తుత అధికారులను ఆహ్వానిస్తున్నారు. ఈ శనివారం నగరంలోని నాలాలపై చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో పని చేసేలా కమిషనర్ ఆదేశాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏవీ రంగనాథ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి వాహనాల కేటాయింపు ద్విచక్ర వాహనంతో పాటు హెల్మెట్ సైతం.. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బలగాలతో పాటు హైడ్రాలో పని చేసే అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది కోసం హైడ్రా 122 వాహనాలు ఖరీదు చేసింది. వీటిలో 21 ట్రక్కుల్ని కేవలం ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఉపకరణాలను వాహనంలో అందుబాటులో ఉంచారు. ఉన్నతాధికారులు, అధికారుల కోసం నాలుగు ఇన్నోవా క్రిస్టాలు, 55 స్కార్పియోలు ఖరీదు చేశారు. డీఆర్ఎఫ్తో పాటు అసెట్ ప్రొటెక్షన్ విభాగానికి చెందిన సిబ్బంది తరలింపు కోసం ఐదు మినీ బస్సుల్ని ఖరీదు చేశారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి 37 ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈ వాహనాలను అధికారులు, సిబ్బందికి కేటాయింపు పూర్తి చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనంతో పాటు కచ్చితంగా హెల్మెట్ కూడా పంపిణీ చేశారు. వాహనం నడిపే సమయంలో కచ్చితంగా దాన్ని ధరించాలని స్పష్టం చేస్తున్నారు. -
ముగ్గురు కుమార్తెలతో సహా చెరువులో దూకిన తల్లి
మేడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ముగ్గు కుమార్తెలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన నాగరాజు, సుజాత (32) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు నారపల్లి, మహాలక్ష్మిపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.సుజాత చెరుకు రసం బండి నడుపుతుండగా, నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు అక్షిత(13), ఉదయశ్రీ(11) వర్షిణి(6) ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో బుధవారం పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఇద్దరికి సర్దిచెప్పారు. అయితే అదేరోజు రాత్రి మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన సుజాత గురువారం ముగ్గురు పిల్లలతో సహా నారపల్లి చెరువులోకి దూకి అత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు చెరువులోకి దూకి వారిని బయటికి తీశారు. అయితే అప్పటికే సుజాత, చిన్న కుమార్తె వర్షిణి మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న అక్షిత, ఉదయశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● తల్లి, చిన్న కుమార్తె మృతి ● ఇద్దరు పిల్లలను కాపాడిన స్థానికులు -
ముఠా ఆటకట్టు
వీసా, పాస్‌పోర్టుల ట్యాంపరింగ్శంషాబాద్: వీసా, పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా విజిటింగ్ వీసాలపై అమాయకులను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపుతున్న ఓ ముఠాలోని ఇద్దరు సభ్యులను ఆర్జీఐఏ ఔట్‌పోస్టు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణమ్మ కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆమె పాస్‌పోర్టు, వీసాలను పరిశీలించిన అధికారులు ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరికొందరికి ఇదే తరహాలో పశ్చిగోదావరి జిల్లాకు చెందిన ఏజెంట్లు కువైట్‌లో ఉద్యోగానికి పంపేందుకు తప్పుడు వీసాలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన సత్యనారాయణ, చిలుకూరు బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన అంజి, కడప జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, గోపాల్ ముఠాగా ఏర్పడి గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నిరక్షరాస్యులు, అమాయకులను టార్గెట్ చేసుకుని కువైట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వర్కింగ్ వీసా కోసం నిబంధనల ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేంట్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉండగా వీరు దానిని తీసుకోకుండా వర్కిగ్ వీసా రద్దయినట్లు నకిలీ స్టాంపులతో క్యాన్సిల్డ్ ముద్రలు వేస్తున్నారు. అనంతరం బాధితులకు విజిటింగ్ వీసాలు అందజేసి ముందుగా మస్కట్‌కు పంపి అక్కడి నుంచి వారిని కువైట్‌కు పంపుతున్నారు. ఈ క్రమంలో పాస్‌పోర్టు, వీసాలను ట్యాంపరింగ్ చేయడంతో పాటు పీఓఈ సర్టిఫికేట్ లేకుండా విదేశాలకు పంపుతున్నారు. విజిటింగ్ వీసాలపై వెళుతున్న అమాయకులు పలు ప్రాంతాల్లో పట్టుబడుతూ మోసపోతున్నారు. నిందితుల ఆచూకీపై సమాచారం అందడంతో గురువారం నాంపల్లిలోని ఓ హోటల్‌పై దాడి చేసి చిలుకూరి బాలాజీ, సుంకర శివకుమార్లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.వీరి నుంచి ట్యాంపరింగ్ చేసిన 14 వీసాలు, 14 పాస్‌పోర్టులు, 16 విమాన టికెట్లు, 2 నకిలీ స్టాంపులు, ఏడు సెల్ఫోన్లు, 1 ల్యాప్‌టాప్ స్వాఽధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఆర్జీఐఏ ఔట్ పోస్టు సీఐ బాలరాజు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్, ఎస్ఐ సిద్దేశ్వర్ తదితరులను ఏసీపీ అభినందించడంతో పాటు రివార్డులను అందజేశారు. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి నలుగురి ముఠా సభ్యుల్లో ఇద్దరి అరెస్ట్ ఉద్యోగాల పేరుతో విజిటింగ్ వీసాలపై విదేశాలకు పంపుతున్న వైనం -
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
నాంపల్లి: పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంబడించి దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం రెడ్‌హిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ హఫీజ్ బాబానగర్‌కు చెందిన యాన్ ఖురేషీ (22) తన బావ మరిది హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్ల వయస్సులోనే హత్యకు పాల్పడిన అతను జువైనల్ హోమ్‌కు వెళ్లాడు. కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసుపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఉదయం కేసు విచారణకు హాజరైన యాన్ ఖురేషీ బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్‌తో దాడి చేశారు. కిందపడ్డ అతడిపై దాడి చేసి కత్తులతో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా కడుపులో కసితీరా పొడిచారు. దీనిపై సమాచారం అందడంతో నాంపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడ్‌హిల్స్‌లో ఘటన -
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
నాంపల్లి: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి నుంచి 15 నకిలీ సర్టిఫికెట్లు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన షాబాజ్ ఖాన్, ముర్తుజా నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్మాయిల్, శాలివాహన నగర్‌కు చెందిన కడారి రమేష్ నకిలీ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందును చిదిమేశాడు గోల్కొండ: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 11 రోజుల పసికందును తన మరో నాలుగేళ్ల కుమార్తె ఎదుటే దారుణంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన జగత్ నగరానికి వలస వచ్చి అపార్ట్మెంట్ల వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం అతడి మొదటి భార్య చనిపోవడంతో తమ దేశానికే చెందిన గౌరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. షేక్‌పేట్ గుల్షన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న జగత్ కుటుంబంతో కలిసి అక్కడే వాచ్మెన్ రూంలో నివాసం ఉంటున్నాడు. వారికి ఓ కుమార్తె (4) ఉంది. 11 రోజుల క్రితం అతడి భార్య గౌరీ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన జగత్ తరచూ తాగివచ్చి రాత్రి వేళల్లో భార్యతో గొడవపడేవాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి గదిలోనుంచి పసికందును తీసుకుని అపార్ట్మెంట్ గేటు బయటికి తెచ్చాడు. దీనిని గుర్తించిన అతడి పెద్ద కూతురు (4) తండ్రి వెంటే వచ్చింది. అనంతరం జగత్ పసికందును గేటు పక్కన రోడ్డుపై పడుకోబెట్టి గొంతు కోశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని టవల్లో చుట్టుకుని ఏమీ జరగనట్లు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే భార్య నిద్రలో ఉండడంతో పసికందు మృతదేహాన్ని గదిలోని మూలన దాచాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన అతడి భార్య గౌరి చిన్నారి కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసులకు చెప్పింది. దీంతో వారు సీసీ కెమెరాలు పరిశీలించగా జగత్ చిన్నారిని హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు నిందితుడు జగత్ కోసం గాలింపు చేపట్టారు. అతను మెహిదీపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని సెవన్ టూమ్స్– టోలిచౌకీ రోడ్డులోని డస్ట్ బిన్లో పడేసినట్లు చెప్పాడు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. టోలిచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● 11 రోజుల కుమార్తెను గొంతు కోసి చంపిన తండ్రి ● మరో కుమార్తె ఎదుటే ఘాతుకం ● పోలీసుల అదుపులో నిందితుడు -
పోలీసు విచారణకు బెల్లంకొండ హాజరు
బంజారాహిల్స్: రాంగ్రూట్లో రావడమే కాకుండా ఆపినందు కు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై జూబ్లీహి ల్స్ పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా గురువారం విచారణకు పిలిపించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఆ రా తీయడమే కాకుండా రాంగ్రూట్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, మధ్యా హ్నం ఎక్కడి నుంచి వస్తున్నారంటూ ప్రశ్నించారు.అతడికి చెందిన బీవైడీ కారును సీజ్ చేశారు. 41ఏ నోటీసు ఇచ్చి తాము పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించారు. శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుమారు గంట పాటు ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. -
‘కంచ’ను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు సిద్ధాంత దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు మరో నివేదికను అందజేసింది. ‘400 ఎకరాలపై ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాన్ని పరిశీలించగా.. 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది.ఇందులో కూడా 7.08 శాతం దట్టమైన అడవి (70 లేదా అంతకంటే ఎక్కువ శాతం చెట్లు), 31.89 శాతం మధ్యస్థ అడవి (70శాతం కంటే తక్కువ 40 శాతం కంటే ఎక్కువ చెట్లు), 17.17 శాతం బహిరంగ అడవి (10–40 శాతం చెట్లు) ఉన్నాయి. ఇదంతా చెట్ల నరికివేతకు ముందు. ఈ గణాంకాలు తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. 1.44 శాతం దట్టమైన అడవి, 7.99 శాతం మధ్యస్థ అడవి, 9.5 శాతం బహిరంగ అడవి.. అని సర్కార్ పేర్కొంది. చెట్ల నరికివేత తర్వాత.. ఈ గణాంకాలు 0.002 శాతం దట్టమైన, 0.61శాతం మధ్యస్థ, 7.92 శాతం బహిరంగ అడవిగా ఉన్నాయని పేర్కొంది.ఆకుపచ్చ జీవవైవిధ్యానికి ప్రాముఖ్యత‘2,300 ఎకరాల భూమిలో గొప్ప జీవవైవిధ్యం దాగిఉంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ భూమిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా లేదా డీమ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించి, అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎలాగూ వర్షాకాలం వస్తోంది కనుక స్థానికంగా ఎదిగే చెట్లు, పొద జాతులను దట్టంగా నాటాలి. నేలతోపాటు తేమ పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్నియమించాలి.అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, భూ యాజమాన్య విభాగాల సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసి ప్రభుత్వ, సంస్థాగత భూములను గుర్తించాలి. తడి భూములు (సంరక్షణ–నిర్వహణ) నియమాలు–2017 ప్రకారం.. ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను తడి భూములుగా రక్షించేందుకు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్ల మూసివేతకు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ భూముల సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలి’ అని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది. -
ఏమీ లేకున్నా... ఇచ్చెయ్ గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం (జేఎన్టీయూహెచ్) అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు కాలేజీల తనిఖీ నివేదికలపై వర్సిటీ అధికారులు గురువారం సమీక్షించారు. అనేక కాలేజీల్లో సరిపడా బోధకులు లేరని, మౌలిక వసతులు లేవని తనిఖీ బృందాలు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు వీటిని పెద్దగా పరిగణనలోనికి తీసుకోకుండా, లోపా లను సరిచేసుకునేందుకుమరో అవకాశం ఇవ్వాలని మాత్రమే నిర్ణయించినట్టు సమాచారం.కాలేజీలు ప్రారంభించే నాటికి ఫ్యాకల్టీని నియమించుకోవాలని, లేబోరేటరీలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేటు కాలేజీలకు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తు న్నాయి. ఫ్యాకల్టీ లేకుండా గుర్తింపు ఇవ్వడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు ఇచ్చాక కాలేజీలు స్పందించకపోతే చేసేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఒత్తిడా? డీలానా? ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కాలేజీల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆగ్రహం వ్యక్తంచేసింది. తనిఖీల్లో ఈ అంశాలను ప్రధానంగా చూడాలని సూచించింది. వాస్తవానికి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేనప్పుడు సెక్షన్లు తగ్గించడమో, గుర్తింపు నిలిపివేయడమో చేయాలి. కానీ, వీటి ఏర్పాటుకు కాలేజీలకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించా రు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ డీల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రైవేటు కాలేజీకి చెందిన వ్యక్తితో యూనివర్సిటీ కీలక అధికారి అంటకాగడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం వల్లే అందరికీ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వస్తోందని ఆయన సమర్థిచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోర్సులకు అధ్యాపకులెక్కడ? ఇంజనీరింగ్ కాలేజీలను జేఎన్టీయూహెచ్ బృందాలు కొన్ని నెలల క్రితమే తనిఖీ చేశాయి. 140 కాలేజీల్లో వాస్తవ పరిస్థితితో నివేదిక ఇచ్చాయి. 50 కాలేజీల్లో డేటాసైన్స్ బోధించేందుకు మాస్టర్ డిగ్రీ చేసిన నిపుణులు లేరని తేల్చారు. కొన్ని కాలేజీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారిని బోధకులుగా చూపించే ప్రయత్నం చేశాయి. వారి పాన్‌కార్డులను పరిశీలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తు న్నట్టు తేలింది. ఆల్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐఎంఎల్ కోర్సుల్లో సీట్లు పొందిన కాలేజీల్లోనూ నిపుణుల కొరత కనిపిస్తోంది.గుర్తింపులేని సంస్థల నుంచి డిప్లొమా కోర్సులు చేసిన వారిని బోధకులుగా చూపించినట్టు తేలింది. రెండుమూడు సెక్షన్లకు ఒకే అధ్యాపకుడు ఉన్న కాలేజీల సంఖ్య 24 ఉందని గుర్తించారు. డిజిటల్ లేబొరేటరీలు పేరుకు మాత్రమే ఉంటున్నాయి. అందులో లాంగ్ లెర్నింగ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామింగ్ ఫైల్స్ కూడా కన్పించడం లేదని తనిఖీ బృందాలు వర్సిటీకి నివేదించినట్టు తెలిసింది. డేటాసైన్స్‌ను విశ్లేషించేందుకు లేబోరేటరీలో అవసరమైన ప్రోగ్రామింగ్ లేదని గుర్తించారు. -
హైదరాబాద్‌లో ఇక పక్కాగా 'వరద' నివారణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో వానొస్తే రోడ్లు, కాలనీలు అని తేడా లేకుండా వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. నగరంలో వరదనీటి కాలువల (నాలాల) సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునికీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద మొదటి దశలో రూ.985 కోట్ల పనుల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసుల వంటి అవాంతరాలతో మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో దశ కింద కూడా కొన్ని పనులు చేపట్టారు. నిధుల కోసం.. ఈ పనులు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ), తదితర పనుల కోసం చేసిన రుణాలకే ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీకి వరదనివారణ ప్రాజెక్టులకు రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనులకు మన కరెన్సీలో రూ.5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులందనున్నాయి. ఏయే పనుల కోసం.. వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల (నాలాల) ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాలపరిమిది దాదాపు ఎనిమిదేళ్లు. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది పట్టనున్నట్లు సమాచారం. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టరు ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్ల వరకు పట్టనున్నట్లు తెలుస్తోంది. జైకా నుంచి అందే రుణం (రూ.5135.15 కోట్లు)తో హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్‌యూఏ) వరకు 450 కి.మీ.ల మేర వరదకాలువల ఆధునీకరణ, కొత్తవాటి నిర్మాణం, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం తదితరమైనవి చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్యూఏగా వ్యవహరిస్తున్నారు. 2036 విజన్‌తో.. హెచ్‌యూఏ (HUA) పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా, 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందనే అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ సొరంగాలుగా.. వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల (నాలాలు) నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలనే యోచనలో అధికారులున్నారు. జపాన్ (Japan) రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇటీవల జపాన్‌లో పర్యటించి రావడం తెలిసిందే. ఎన్ని కాలువలు ఉన్నా.. నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, మూడు పెద్ద చెరువులు (హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్) ఉన్నప్పటికీ 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో, మున్ముందు సదరు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టారు. చదవండి: అనుమతులు లేక స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు..జపాన్‌లో అలా.. జపాన్‌లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశముంటుందా అనే దిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జి–కేన్స్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగమార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్ధ్యం ఉంది. ఐదు ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లున్నాయి. -
సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్‌కు నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే
సాక్షి, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేదని వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫొటో పెట్టలేదని అనచరులు ఆవేదన తెలిపారు. కార్యకర్తల ఆందోళనను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.కాగా, సరస్వతి పుష్కరాలు సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సరస్వతీదేవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొన్నారు. -
గామా నైఫ్.. మెదడు చికిత్సల్లో సరికొత్త విప్లవం
మెదడులో వచ్చే సమస్యలు.. ప్రధానంగా క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందులో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పంపుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతాదులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత కచ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు. చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. మెదడులో వచ్చే కణితులు (క్యాన్సర్, ఇతరాలు), రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, పిట్యుటరీ కణితులు, విపరీతమైన నొప్పి తదితరాలకు ఇది బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స. దుష్ప్రభావాలు చాలా తక్కువ, విజయాల రేటు ఎక్కువ.రోగులకు ప్రయోజనాలివీ.. మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. మెదడులో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలను పాడుచేయకుండా సమస్యను మాత్రమే కచ్చితంగా తొలగిస్తుంది. చాలావరకు ఒకే సెషన్లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్లచ్చు. ఇప్పటివరకు గామా నైఫ్ చికిత్సలు ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా రోగులు పొందారు. మన దేశంలో ఇప్పటివరకు 8వేల ప్రొసీజర్లు చేశారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90% విజయాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు. దీనికి సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24-48 గంటల్లోనే 90% రోగులు తమ పనులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ కణితులు, రక్తనాళాల్లో సమస్యలు.. లాంటి 20 రకాల సమస్యలకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. కిమ్స్ ఆస్పత్రిలో పెట్టినది ఒకే సెషన్లో పలు కణితులను కూడా నయం చేస్తుంది. దాంతో చికిత్స సమయం తగ్గుతుంది. న్యూరాల్జియా సమస్యకు దీంతో చికిత్స చేస్తే 48 గంటల్లోనే నొప్పి బాగా తగ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్రమే కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి. సంప్రదాయ మెదడు శస్త్రచికిత్సల కంటే ఇందులో దుష్ప్రభావాలు దాదాపు లేనట్లే. -
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం -
యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు.. తగిన సౌకర్యాలు లేక తిప్పలు
యాదాద్రి భువనగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండకు వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు కొరవడిన రవాణా సౌకర్యంతో పాటు, భద్రతా సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో దైవ దర్శనం కోసం భక్తులు యాదాద్రికి పోటెత్తుతున్నారు. దర్శన సమయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో భక్తుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి తోడు భక్తుల రద్దీకి తగ్గట్లు రవాణ సౌకర్యం లేదని, దైవదర్శనంలో భక్తులు వాగ్వాదినికి దిగుతున్నా పోలీసు సిబ్బంది పట్టించుకోవడం లేదు.దీనికి తోడు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడంలో అధికారుల విఫలమవుతున్నట్లు సమాచారం.బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోవాలా దోపిడీ ఎక్కువైందని, తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!
సాక్షి, బంజారాహిల్స్: రాంగ్రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ జర్నలిస్ట్‌కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్రూట్లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు. (చదవండి: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో)దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కామెడీ పేరుతో వేషాలా.. చట్టప్రకారం శిక్ష తప్పదు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కామెడీ పేరుతో తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగాట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇదేం వెర్రి కామెడీ!?. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? . కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదేం వెర్రి కామెడీ!?సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025 -
తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ..
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. -
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
Ration Card: రేషన్ కార్డులు ఎక్కడ .. జారీ ఎప్పుడు..!
వరంగల్‌కు చెందిన ఆంజనేయులు ఉపాధి కోసం రెండు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి బోడుప్పల్లో స్థిర పడ్డారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని ఆధారంగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులేదని అధికారులు గుర్తించి క్షేత్ర స్థాయి విచారణ కూడా పూర్తి చేశారు. రేషన్ కార్డు కోసం ఎంపికై జాబితాలో సైతం పేరు చేర్చారు. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు . ఇలాంటి ఉదంతాలు సిటీలో అనేకం. అయితే ప్రభుత్వం గత రెండు నెలలుగా మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన దరఖాస్తులతో ఎంపికైన కుటుంబాలు కూడా మళ్లీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలా? వద్దా ? అనేది తెలియక వారు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంపికైన కుటుంబాలకు స్పష్టత లేకుండా పోయింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వేతో రేషన్ కార్డుల కోసం ఎంపికైనా ఇప్పటికీ మంజూరు అందని ద్రాక్షగా తయారైంది. మరో వైపు తాజాగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఇప్పటికే ఆఫ్‌లైన్ దరఖాస్తుల ద్వారా ఎంపికైన కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే డబులింగ్ అయి అసలుకే ఎసరు వస్తుందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. సంబంధిత పౌరసరఫరాల అధికారులు కూడా స్పష్టత ఇవ్వక పోవడంతో పేద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారు.సర్వేలో 83 వేల కుటుంబాలు సరిగ్గా ఐదు నెలల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలు అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబి్ధదారుల జాబితాను ప్రకటించిన తర్వాతనే కార్డులు మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవంగా గతేడాది జరిగిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కేవలం గ్యారంటీ పథకాల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, రేషన్ కార్డు దరఖాస్తులను పక్కకు పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన కుటుంబాలపై విచారణ జరపడంతో మిగతా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో వాటిపై కూడా విచారణ జరిపిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సర్వే జాబితాపై ఎలాంటి కదలిక లేకుండా పోయింది.ఆన్లైన్ ద్వారా 2.60 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా అన్లైన్లో ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలకు జారీ కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన అర్హత గల కుటుంబాల జాబితా కూడా జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు అందక పోవడం, మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులపై కనీసం విచారణ ప్రారంభం కాకపోవడం వెరసి కొత్త రేషన్‌కార్డుల జారీపై సందిగ్ధత నెలకొంది. -
HYD: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోందివివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్ గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అనంతరం, మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ డీఎఫ్ఓ వెంకన్న సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రమాదం జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. సెకండ్ ఫ్లోర్ లో ముగ్గురు బిల్డింగ్ పైన ఐదుగురు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చాము. మంటలు అదుపులోకి వచ్చిన ఇంకా స్మోక్ భారీగా వస్తుంది. బేగంబజార్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఇంట్లోనే గోదాం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు.బట్టలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో స్మోక్ ఎక్కువగా వస్తుంది. మరో గంటల్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం. మనుషులు వెళ్లలేని చోటికి లేటెస్ట్ గా వచ్చిన రోబోను పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని అన్నారు. -
ఏపీలో దంచికొట్టిన వాన.. HYDలో మరో రెండు గంటలు అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించి తెలిసిందే.. తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రోజంతా ఎండ మండిపోతున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచికొడుతోంది.. ఈ క్రమంలో గురువారం ( మే 15 ) కూడా వర్షాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. #HyderabadRains Update : 8:10AMMODERATE-HEAVY Rains Expected In Many Parts Of The Hyderabad City In Next 2-3 Hours Already Rains Happening SouthWest Hyderabad Soon It Will Cover Central And East HyderabadPlan Your Work Accordingly pic.twitter.com/hnKXH19aDo— Hyderabad Weather (@JawadWeatherman) May 15, 2025గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.. అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్ నగర్, కోఠి, యూసఫ్ గూడా, కూకట్పల్లి, అల్వాల్, సుచిత్ర, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. ఉదయం 9 గంటల సమయానికి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. #15MAY 8AMScattered -Intense Rains Continues... in South &West #Hyderabad ⛈️Rain to Continue in Various Parts of the City during the Next 1Hr...PLAN ACCORDINGLY!!#Hyderabadrains pic.twitter.com/9fGOmFBtxL— Hyderabad Rains (@Hyderabadrains) May 15, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోను ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.@balaji25_t In Vikarabad District 🌧️🌧️ pic.twitter.com/d0ICc9N8Sb— M Sai Kumar Reddy (@saidarling888) May 15, 2025 HyderabadRains ALERT 3 ⚠️⛈️ The POWERFUL STORMS which formed in North, West HYD is now further spreading into East, Core HYD also now. It's going to be ON AND OFF strong rains, thunderstorms in MOST PARTS OF THE CITY till 9AM. Plan your morning travel accordingly— Telangana Weatherman (@balaji25_t) May 15, 2025 -
సండే ఫండే.. ఇక సందడే..
మెట్రో నగరాల్లో వీకెండ్స్ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్ జోష్‌తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్ కార్నివాల్ కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్ జోష్‌కు మిస్ వరల్డ్ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్ మే 18న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.నాటి వీకెండ్.. సూపర్ హిట్.. నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్ బండ్ రోడ్ ఒక ఓపెన్ ఎంటర్టైన్ మెంట్ ప్లేస్‌గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.ప్రమోషన్ యాక్టివిటీస్.. ఆరీ్మకి చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్ ట్రక్స్ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్ షోలు, ఫైర్ స్పోర్ట్స్ ఉండేవి. పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్ యాక్టివిటీస్‌కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫౌంటెన్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.రీఛార్జ్.. రీస్టార్ట్.. సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్ వరల్డ్ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్ వరల్డ్ డైలీ షెడ్యూల్లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం. -
సాంస్కృతిక సమ్మేళనం.. అందాల సోయగం..
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌కి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ వ్రస్తాలతో అందాల తారలు హొయలు పోయారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు పోటీదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా తమ తమ దేశాల వస్త్రధారణతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది అధునాత సాంస్కృతిక సమ్మేళనంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి అధునాతన జీవనశైలి, ముఖ్యంగా ఆహారం తమకు ఎంతగానో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల కోసం నిత్యనూతనంగా సన్నద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. -
మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వన్యప్రాణుల రక్షణకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచి్చ»ౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం భూ, అటవీ జంతువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక అందజేసింది. ప్రభుత్వం తరఫున ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు వివరాలు, ఫొటోలతో సహా అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు. ‘100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు, తక్షణం అమలు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని రాష్ట్ర వన్యప్రాణి ఉన్నతాధికారులను ఆదేశించాం. ఏప్రిల్ 17, 21, మే 3, 8న రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, వన్యప్రాణుల నిర్వహణ నిపుణులతో కంచ గచి్చబౌలి భూములను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ భూములు 2,374 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులో 400 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ రాళ్లు, చెట్లు, గడ్డితో కూడిన భూములు. అధికారుల తనిఖీల సమయంలో కొన్ని పక్షులు, మచ్చల జింకలు కనిపించాయి. ఈ ప్రాంతంలో చాలా వీధి కుక్కలు తిరుగుతున్నాయని, వాటి కారణంగా వన్యప్రాణులకు ముప్పు కలిగే అవకాశం ఉందని గ్రహించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ చేసిన అభ్యర్థన మేరకు ఏప్రిల్ 4 నుంచి 30 మధ్య 26 వీధి కుక్కలను పట్టుకోవడానికి బృందాలను నియమించి చర్యలు తీసుకున్నాం’అని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు అమర్చాం ‘భూముల్లో వన్యప్రాణులపై నిఘా, రక్షణ కోసం 24 గంటలూ 3 షిఫ్టుల్లో ఐదుగురితో మూడు బృందాలను నియమించాం. నరికిన, ఎండిన చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉండటం, వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండటంతో నివారణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. వారికి ప్రత్యేక అగి్నమాపక యంత్రాలు అందజేశాం. ఏ ప్రాంతంలోనైనా వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, సంగ్రహణకు 20 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశాం. జింకల నీటి అవసరాలకు 12 కృత్రిమ నీటి వనరులను నెలకొల్పాం. భద్రత పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అమర్చాం. అడవి జంతువుల భద్రత కోసం వర్సిటీ, టీజీఐఐసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. తక్షణ పశువైద్య సంరక్షణ, చికి త్స కోసం తెలంగాణ అటవీ శాఖతో కలిపి యాంటీ పోచింగ్ పేరిట స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడంతోపాటు ఇకపై చెట్లను ఎవరూ నరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’అని నివేదికలో వివరించారు. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
ఇది తినండి.. ఇలా ఉండండి!
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్‌వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్ఐదారేళ్ల శ్రమ..ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్‌వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. టాప్ ఆస్పత్రితో ఒప్పందం..ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్‌వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో వెల్కం డిన్నర్లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.»ప్రస్తుతం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.» మిస్‌వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు -
గడువులోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి కృష్ణా పరీవాహకంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా నిర్ణీత గడువులతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగిరం చేయాలన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని భూసేకరణ ప్రత్యేకాధికారిని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎంపికైన 244 మందితోపాటు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైన 199 మందికి బుధవారం సాయంత్రం జలసౌధలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు. అనంతరం మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. సీఎస్ కె.రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్సమీక్షలో పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి పనులకు కార్యాచరణ ప్రణాళికసూదిని జైపాల్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలన్నారు. వీటికి సంబంధించి పెండింగ్ పనులు, అవసరమైన నిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.కృష్ణాలో జలాల్లో నీటి వాటాల కోసం..కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలన్నారు. సుమారు 70 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉండగా, ఏపీలో కేవలం 30 శాతమే ఉందని గుర్తు చేశారు. ఈ ప్రాతిపదికన కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలన్నారు. గోదావరి పరీవాహకం నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ 90 టీఎంసీలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల వాటాను పెంచాలని కోరుతూ వాదనలు వినిపించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా పరీ వాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నీటి వాటాల కేటాయింపుల కోసం సమర్థంగా వాద నలు వినిపించాలని ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టే టప్పుడు నీటి కేటాయింపులు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ట్రిబ్యు నల్ నుంచి నీటి కేటాయింపులు పొందాలని సూచించారు. -
నేటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నదికి గురువారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 10.45 గంటలకు బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నట్లు పండితులు పేర్కొన్నారు. అయితే రాత్రి సమయం కావడంతో గురువారం ఉదయం 5.44 గంటలకు అంతర్వాహిని సరస్వతీ నదికి విశేష పూజలతో పండితులు పుష్క రుడికి ఆహ్వానం పలుకుతారని కాళేశ్వరం దేవస్థానం వేదపండితులు వివరించారు. కాళేశ్వరాలయంనుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. మెదక్ జిల్లా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కరాల పవిత్రతను కాపాడాలిసరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. -
కట్టిన మూడేళ్లకే కూలింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు. ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది ‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మూడుచోట్లా కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు ‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. హెలీకాప్టర్‌లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్‌లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఎవరి పని వారు చేయాలి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంజనీర్ ఇన్ చీఫ్ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్ చెప్పారు. ‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది ‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు. -
జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బల్దియాలోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి వివరాలను అధికారులు తెలిపారు. -
‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’
హైదరాబాద్: నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?, మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశాం. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ. అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారుగతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు.తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు
హైదరాబాద్: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ జరుగనున్నాయి.పుష్కరాల వేళ.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి.పుష్కరాలకు నెల ముందు నుంచి నీటి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లు ఉండటం విశేషం. -
TSRTC city bus : అత్యంత రద్దీగా బస్సులు...అసలు కారణాలివీ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్‌సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్‌సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్‌ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు! మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు!
మణికొండ: జీవిత చమరాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు..కూతురైన కరుణించకపోతుందా అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది. వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. ఈ ఘటన నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల కొమరయ్య, లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగిలో 150 గజాల్లో ఇంటిని నిర్మించుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు చేశారు. అయితే ఇంటిని కుమారులు, కూతురు కలిసి ఇటీవల రూ.60 లక్షలకు అమ్మేసి ముగ్గురు రూ. 20 లక్షల చొప్పున పంచుకున్నారు. తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు. కుమారులు, కూతురు స్థానికంగానే ఉన్నా వారికి అన్నం పెట్టడం లేదు. దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టు పక్కల వారి ఇళ్లకు వెళ్లి అడుక్కు తింటున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు.. స్థానిక మాజీ కౌన్సిలర్ ఉషారాణి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు వచ్చే రూ. 2వేల పింఛన్ రూ.5 వేలు అవుతుందని, సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్త చెప్పాడు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, తమను ఆదుకోవాలని కోరారు. -
ఏమిరా మాతోనే పెట్టుకుంటావా...
గోల్కొండ(హైదరాబాద్): ఏమిరా మాతోనే పెట్టుకుంటావా... అంటూ ఓ రౌడీషిటర్ సోదరులు హేర్ కట్టింగ్ సెలూన్ యజమానిపై దాడి చేయడమే గాకుండా సెలూన్‌ను ధ్వంసం చేసిన సంఘటన సోమవారం రాత్రి గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన జాఫర్, సోహెబ్ సోమవారం రాత్రి గోల్కొండ మోతీమహల్ వద్ద గల హెయిర్ కట్టింగ్ వీరు సెలూన్ యజమాని సయ్యద్ నిజాముద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు.ఏమిరా మాతోనే పెట్టుకుంటావా మేము ఎవరో తెలియదా అంటూ నిజాముద్దీన్‌ను బయటికి లాగి చితకబాదారు. అంతటితో ఆగకుండా సెలూన్‌ను ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సోదరుడైన రౌడీషిటర్ హంజాను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారు. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ప్రయాణికులు 100 శాతం బస్సులు 60 శాతమే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్‌సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్‌సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్‌ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది.కొత్త సర్వీసులేవీ.. నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల విని యోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు, తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్ర యాణ సదుపాయం అందుబాటులోకి వచి్చన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయాణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు.2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు,సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సులవైపు మళ్లారు.మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి.దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి,రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి.దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్‌సీటర్ ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది.కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 2800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలు, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీల కింద నగదును అందిస్తోంది. వసతిగృహ సంక్షేమాధికారికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నిధిని విడుదల చేస్తోంది. ఆ నిధి నుంచి విద్యార్థులకు చెల్లిస్తున్నారు. ఇకపై కాస్మెటిక్ చార్జీలను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరవనుంది. బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.ఈ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు మాధిరి పనిచేస్తుంది. ఈ కార్డుల వినియోగం వల్ల విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పైన చైతన్యం కలిగించినట్లవుతుంది. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.విద్యార్థులకు అవసరమైన సబ్బులు, షాంపూలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ కేంద్రాల ద్వారా కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేసేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, బెడ్షిట్లు, కార్పెట్, బ్యాగులు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.