
సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025
చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.15గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం

మరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు.