
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును పొడిగించింది. ఈనెల 31వ తేదీతో కమిసన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దానిని జూలై 31వ తేదీ వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించింది. తొలుత ఈనెల(మే నెల)లోనే తుది రిపోర్ట్ ఇస్తామని కమిషన్ లీక్ ఇచ్చినప్పటికీ.. జూలై 31వ తేదీ వరకూ పొడిగించడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ నడుస్తోంది.