
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో లైన్లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ సిద్ధమయ్యాయని.. ఫేజ్-2పై ఎటువంటి సందిగ్ధత లేదని స్పష్టంర చేశారు.
మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పూర్తి స్థాయిలో సిద్ధం. ప్రస్తుతం డీపీఆర్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం వరకు గోప్యత ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.