
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.
‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు.
అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.
ఇదీ చదవండి: