తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు | Traffic Restrictions In Hyderabad Tiranga Rally | Sakshi
Sakshi News home page

తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

May 16 2025 9:13 PM | Updated on May 16 2025 9:22 PM

Traffic Restrictions In Hyderabad Tiranga Rally

హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement