breaking news
tiranga rally
-
‘మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండటం నా అదృష్టం’
కరీంనగర్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రామ్ నగర్ వరకూ తిరంగా ర్యాలీని బీజేపీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు.‘యుద్దానికి విరామమే తప్ప ముగియలేదు. దేశానికి ఆపదొస్తే అంతు చూసేందుకు మన సైన్యం రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టినం. మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా ‘తిరంగా ర్యాలీ. మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగడం నా అదృష్టం. కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సాహసాలను కళ్లారా చూసే భాగ్యం కలిగింది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం(మే 17వతేదీ) సాయంత్రం సమయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి.దీనిలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగాం. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు. -
తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. -
విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్ చౌక్ దాకా ‘తిరంగా మార్చ్’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు. విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు – కె.కేశవరావు, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది. – సంజయ్‌సింగ్, ఆప్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం – టి.ఆర్.బాలు, డీఎంకే -
సందడిగా తిరంగ ర్యాలీ
పెనమలూరు : భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని జాతి ఐక్యతకు, ప్రగతికి అందరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సిద్ధార్థ్ శంకర్‌సింగ్ అన్నారు. తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా సోమవారం పోరంకి నుంచి మొవ్వ మండలం బట్లపెనుమర్రు వరకు బీజేపీ కారు ర్యాలీని ఆయన ప్రారంభించారు. పోరంకిలో బీజేపీ కార్యాలయం మాట్లాడుతూ ప్రపంచదేశాలతో ధీటుగా భారత దేశాన్ని ప్రధాని మోదీ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు, మంత్రులు కామినేనిశ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, నాయకులు కావూరిసాంబశివరావు, జమ్ములశ్యామ్కిషోర్, ఆర్.లక్ష్మీపతిరాజా, బాలాజీ, కుమారస్వామి, ,ఉపాధ్యక్షుడు చిరుమామిళ్లరాజా , కార్యకర్తలు పాల్గొన్నారు.