
కరీంనగర్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రామ్ నగర్ వరకూ తిరంగా ర్యాలీని బీజేపీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు.
‘యుద్దానికి విరామమే తప్ప ముగియలేదు. దేశానికి ఆపదొస్తే అంతు చూసేందుకు మన సైన్యం రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టినం. మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా ‘తిరంగా ర్యాలీ. మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగడం నా అదృష్టం. కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సాహసాలను కళ్లారా చూసే భాగ్యం కలిగింది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.