Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ | Tiranga rally at Tank Bund Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ

May 17 2025 8:05 PM | Updated on May 17 2025 8:18 PM

Tiranga rally at Tank Bund Hyderabad

హైదరాబాద్‌:  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం(మే 17వతేదీ) సాయంత్రం సమయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి.

దీనిలో భాగంగా  వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలి.  ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగాం.  ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. 

భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement