
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది.
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..
- ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలు
- రెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలు
- నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు
- 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు
- 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు
- 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు
- 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు
- 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు
- 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం
