
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.