
హైదరాబాద్ : క్యాన్సర్ ఆస్పత్రికి నిత్యం వచ్చే క్యాన్సర్ బాధితులతో పాటు వారి సహాయకులను చూసి చలించిపోయిన కేబీఆర్ పార్కు వాకర్లు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి వారం అన్నదానం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శుక్రవారం కేబీఆర్ పార్కు వాకర్లు, స్నేహ హస్తం ఫౌండేషన్ ప్రతినిధులు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము నిత్యం కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వస్తుంటామని ఫుట్‌పాత్‌లపై క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చే పేషంట్లతో పాటు వారి సహాయకులు ఆకలి అలమటిస్తున్న తీరును చూసి చలించిపోయి స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదానం చేస్తున్నట్లు వారు తెలిపారు. 300 మందికి అన్నదానం చేస్తున్నామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహ్మద్ కతల్ హుస్సేన్, భరత్ భూషణ్, రామ్‌కుమార్, కిషోర్ కుమార్, జబ్బార్, ఫయాజ్, షౌకత్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.