
సాక్షి,హైదరాబాద్: అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. సోమవారం అమీర్‌పూర్‌లో మహేశ్వరీ అనే యువతి కారు నేర్చుకుంటూ చిన్నారులపైకి ఎక్కించింది. ఈ దుర్ఘటనలో పదేళ్ల మణిధర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏకవాణి మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.