స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్ | Police Files Chargesheet In Swapnalok Fire Incident | Sakshi
Sakshi News home page

స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్

May 17 2025 2:42 PM | Updated on May 17 2025 2:56 PM

Police Files Chargesheet In Swapnalok Fire Incident

సాక్షి, హైదరాబాద్‌: స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 13 మందిని నిందితులుగా తేల్చారు. ఈ ఘటనకు కారణమైన 13 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

క్యూనెట్‌కు చెందిన ఇద్దరితో పాటు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫైర్‌ సేఫ్టీని గాలికి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంపు చేసి పెట్టడం వల్లే ఆరుగురు ప్రాణాలు రక్షించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉంటే, ఆరుగురు ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement