
ఏ గ్రామాలు ఏ జోన్‌లో ఉన్నాయో పంచాయతీ గోడల మీద రాయాలి
మండలస్థాయి నుంచి వాల్టా అథారిటీలను నియమించాలి
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాల స్థాయిని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌గా విభజించి ఆయా గ్రామాలు ఏ జోన్‌లలో ఉన్నాయో గ్రామ పంచాయతీ గోడల మీద రాయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు. నీరు, భూమి, చెట్ల చట్టం (వాల్టా) రాష్ట్ర ప్రాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంగళవారం తొలిసారి నిర్వహించిన ఈ ప్రాధికార కమిటీ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పా రు.
భూగర్భజలాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. వాల్టా చట్టంపై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. నీటిని అధికంగా వినియోగిస్తున్నార ని కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు పెడితే ఉపయో గం ఉండదని, కొత్తగా బోర్లు వేయవద్దని అధికారులు ఆంక్షలు పెట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొ న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి మూడు నెలలకోసారి విధిగా వాల్టా అథారిటీలు సమావేశమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
వాల్టా నిధిని ఏ ర్పాటు చేసి, తద్వారా పర్యావరణహితం ఈ నిధులను వినియోగిస్తామని మంత్రి చెప్పారు. నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలా లు పడిపోతున్నాయని సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు రాజశేఖర్, పాండురంగారెడ్డి, ఉమాదేవి, జలసాధనా సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను ఆమోదించారు.