
- రేవంత్ వ్యాఖ్యలపై మంత్రివర్గం అసంతృప్తి
- సీఎం వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు
- తెలంగాణ కేబినెట్ రెండుగా చీలిపోయింది
- బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు.

మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు.
రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.