
సాక్షి, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేదని వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫొటో పెట్టలేదని అనచరులు ఆవేదన తెలిపారు. కార్యకర్తల ఆందోళనను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, సరస్వతి పుష్కరాలు సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సరస్వతీదేవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొన్నారు.