
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు.
👉పాజిటీవ్ అంశాలు
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను
సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది
మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు
‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది
మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయింది
పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయి
రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది.
తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారు
అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు
పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.
👉నెగిటీవ్ అంశాలు :
ఉర్దూలో మాట్లాడకపోవడం.
వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు
ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.
పాత ఇన్‌ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.
పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్‌ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.
కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.
2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.
‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.
బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్‌ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
👉అందరూ ఆశించిన విషయం:
ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.
👉సూచన:
కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్‌ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.




