
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున ప్రభుత్వం క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది.
2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో పెట్టింది. వీటితో పాటు ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.