
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు.
14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు.