
హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 పెంచింది.
కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది.