
అప్రమత్తతే ముఖ్యం.. చదువుకున్న వారే సైబర్ బారిన పడుతున్నారు
హాస్టళ్లలో దొంగతనాలు ఎక్కువ
ప్రధాన కూడళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
మాదాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌నాయక్
మాదాపూర్: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మాదాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి.విజయ్‌నాయక్ తెలిపారు. సోషల్ మీడియా, ఫెడెక్స్ మోసాలు, రెంటల్, ఇన్‌వెస్ట్‌మెంట్, లోన్స్, బెట్టింగ్ యాప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినపుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. ఈ నేరాలపై ప్రధాన కూడళ్లలో, కళాశాలల్లో, జన సమ్మర్ధం ఉన్నచోట వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. మాదాపూర్ డిటెక్టివ్ టీంలో 10 మంది ఉన్నారు. సైబర్ క్రైంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవారు ఇద్దరున్నారు. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.
ఇదీ చదవండి: టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో
ప్రశ్న: మాదాపూర్ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి?
ఇన్‌స్పెక్టర్: సైబర్ నేరాలతో పాటు ఎక్కువగా హాస్టళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల రూంలలోకి చొరబడి ల్యాప్‌టాప్స్, ఫోన్స్, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్నారు. 24 గంటల పాటు సెక్యూరిటీని నియమించాలి. హాస్టల్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారు తప్పని సరిగా ఐడీ కార్డులను చూపాలనే నిబంధన ఉండాలి. అప్పుడే దొంగతనాలను అరికట్టవచ్చు.
ప్ర: ఫెడెక్స్ మోసం గురించి?
జ: గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఎయిర్‌పోర్టు నుంచి పార్సిల్ వచి్చందని అందులో డ్రగ్స్ ఉన్నాయని.. మీరు ఫలానా పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయపెడతారు. కొంత సమయం తరువాత మీరు డబ్బు చెల్లిస్తే కేసు కొట్టివేస్తామని చెప్పి వారివద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఫోన్‌లను స్విచ్చాఫ్ చేస్తారు. ఇలాంటి మోసాల బారిన విద్యావంతులేపడుతున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి.
ప్ర: ట్రాన్స్‌జెండర్స్, సోషల్‌మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి?
జ: ఖాళీ ప్రదేశాల వద్ద, ప్రధాన కూడళ్లలో ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. వారి వద్ద ఆగవద్దు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కి డయల్ చేయాలి. అమ్మాయి, అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు వారు విడిపోయిన తరువాత మారి్ఫంగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు.
ప్ర: బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఏమిటి..
జ: ప్రస్తుతం బెట్టింగ్‌కి అలవాటు పడ్డారంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. చిన్న చిన్న బెట్టింగ్‌లు కట్టినప్పుడు తిరిగి డబ్బును చెల్లించి ఆసక్తి కలిగిస్తారు. అలవాటు అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు పోతాయి. ఇలాంటి అలవాట్లతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. నష్టపోయాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు.
చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
మాదాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌నాయక్