
సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేశారంటూ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లకు సైతం నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. భూమి విషయంలో విచారణ చేసి పూర్తి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.