
తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక విద్యార్థుల సేవే లక్ష్యం
సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలో చదువుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులకు సహకారం అందించ డానికి వై–యాక్సిస్ ఫౌండేషన్ యూఎస్ రాయబార కార్యాలయంతో అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా విద్యార్థులకు విశ్వసనీయమైన, నిస్పాక్షికమైన మార్గదర్శకత్వాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ ప్రోవైడర్‌గా ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్‌తో యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబంధించిన ఎంఓయును కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలకు సేవలు అందించే ఏకైక ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ కేంద్రంగా హైదరాబాద్‌లో వై–యాక్సిస్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన సమాచారం కోసం ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ వన్–స్టాప్ సెంటర్ వై–యాక్సిస్ ఫౌండేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై–యాక్సిస్ ఫౌండేషన్ డైరెక్టర్ సబీనా జేవియర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: After Fifty యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు!