
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్‌బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది.
శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ వాదించారు. వాదనలకు ఏకీభవించి నాంపల్లి కోర్టు.. కేసు కొట్టివేసింది.