
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిన వేదవల్లి..
ఆమె చికిత్సకు గతంలోనే సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.8 లక్షలు విడుదల
కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో మరో రూ.7 లక్షలు అందజేత
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు ఆ తల్లి దండ్రులు చివరి క్షణంవరకు పోరాడారు. ఆస్తు లన్నీ అమ్మి, అప్పులు చేసి కూడా రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా, పాప ప్రాణాలు దక్కలేదు. మరోవైపు స్తోమతకు మించి వైద్యా నికి ఖర్చు చేయటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి గతంలో పాప వైద్యానికి రూ.8 లక్షలు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడు ఆ పాప కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో రూ.7 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతుల పెద్ద కుమార్తె వేదవల్లి (5)కి 2022లో బ్లడ్ క్యాన్సర్ సోకింది. పాపను రక్షించుకునేందుకు రెండేళ్లపాటు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. 2024లో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం రావటంతో చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు మంజూరు చేశారు.
చికిత్స అందించినప్పటికీ గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఆ మేరకు రూ.7 లక్షల చెక్కు ను సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గురువా రం వేదవల్లి తండ్రి రఘుకు అందజేశారు.