
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్‌ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనుంది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.