పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్‌ డీజీ | Hyderabad Mir Chowk Fire Accident Latest Updates | Sakshi
Sakshi News home page

Hyderabad: పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్‌ డీజీ

May 18 2025 9:10 AM | Updated on May 18 2025 8:05 PM

fire accident at mirchowk hyderabad

Meer Chowk Fire Accident Live Updates:

సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్‌ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.   

👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
  • ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
  • అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం
     

👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం

  • పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది

  • బాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.

  • అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం

👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్

  • గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గే
  • ఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎం
  • ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎం
  • మంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం
     

👉మృతులకు ప్రధాని మోదీ సంతాపం

  • పాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

  • మృతులకు ప్రధాని మోదీ సంతాపం

  • పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా

  • మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియా

 

👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి 

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్న

  • సరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం 

  • నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను 

  • మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం 

  • అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న

    👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు

  • ఉదయం 6.16నిమిషాలకు  ఫైర్ కాల్ వచ్చింది

  • సమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు

  • ఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి

  • ప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగింది

  • భవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్‌,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి

  • అగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారు

  • షార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయి

  • ప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాం

  • ఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు

  • 17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోంది

  • ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌

  • స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారు

  • ఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవు

  • ఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోంది

  • ఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియా

  • గ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయి

  • ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు 

  • షార్ట్స్ సర్క్యూటే కారణం 

  • ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారు

  • దీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదు

  • ప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌

  • నాటి నిబంధనల ప్రకారం నిర్మించారు

  • ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగింది

  • అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్‌మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

  • ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం

  • ప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు

  • బయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుంది

  • ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది

  • 6.16కి ప్రమాదంపై సమాచారం అందింది

  • ప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారు

  • వారిలో నలుగురు రెండవ ఫ్లోర్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారు

  • మంటల్ని ఎప్పుడో ఆర్పేశాం

  • ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు

  • ఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు

  • 👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం

  • అగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.

  • మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.

  • మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది 

  • చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాం

  • అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.

  • అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..

  • దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 

👉కేటీఆర్‌ దిగ్భ్రాంతి

  • ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..

  • అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..

  • బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..

  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

  • మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..

  • సహాయక చర్యలకు  BRS బృందం అందుబాటులో ఉంటుంది.

👉సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

  • అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి. 

  • సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 

  • బాధితులకు అండగా ఉంటామని హామీ. 

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. 

  • ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి 

  • ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం 

  • వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌

  • ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది

  • 6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది

  • ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు

👉కిషన్‌రెడ్డి పరామర్శ

  • అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.

  • ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేది

  • సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదు

  • బాధాకరమైన విషయం ఇది

  • కేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

  • ఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగింది

  • ఫైర్‌ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.

  • ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. 

  • ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు.

 

గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం..17మంది మృతి
చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 6.గంట‌ల‌కు షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. 

అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. 

మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. 

మృతుల వివరాలు
రాజేంద్రకుమార్‌ (67),అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు.  ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement