
పోలీసు విచారణకు బెల్లంకొండ హాజరు
బంజారాహిల్స్: రాంగ్‌రూట్‌లో రావడమే కాకుండా ఆపినందు కు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై జూబ్లీహి ల్స్ పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా గురువారం విచారణకు పిలిపించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఆ రా తీయడమే కాకుండా రాంగ్‌రూట్‌లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, మధ్యా హ్నం ఎక్కడి నుంచి వస్తున్నారంటూ ప్రశ్నించారు.అతడికి చెందిన బీవైడీ కారును సీజ్ చేశారు. 41ఏ నోటీసు ఇచ్చి తాము పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించారు. శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుమారు గంట పాటు ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు.

పోలీసు విచారణకు బెల్లంకొండ హాజరు