
గోల్కొండ(హైదరాబాద్): ఏమిరా మాతోనే పెట్టుకుంటావా... అంటూ ఓ రౌడీషిటర్ సోదరులు హేర్ కట్టింగ్ సెలూన్ యజమానిపై దాడి చేయడమే గాకుండా సెలూన్‌ను ధ్వంసం చేసిన సంఘటన సోమవారం రాత్రి గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన జాఫర్, సోహెబ్ సోమవారం రాత్రి గోల్కొండ మోతీమహల్ వద్ద గల హెయిర్ కట్టింగ్ వీరు సెలూన్ యజమాని సయ్యద్ నిజాముద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు.
ఏమిరా మాతోనే పెట్టుకుంటావా మేము ఎవరో తెలియదా అంటూ నిజాముద్దీన్‌ను బయటికి లాగి చితకబాదారు. అంతటితో ఆగకుండా సెలూన్‌ను ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సోదరుడైన రౌడీషిటర్ హంజాను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారు. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.