
సాక్షి, హైదరాబాద్: కామెడీ పేరుతో తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగాట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇదేం వెర్రి కామెడీ!?. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? . కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025