ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’ | Telangana Govt to provide Rs1 Lakh incentive for marriage between people with disabilities | Sakshi
Sakshi News home page

ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’

May 21 2025 6:00 AM | Updated on May 21 2025 6:00 AM

Telangana Govt to provide Rs1 Lakh incentive for marriage between people with disabilities

వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనల్లో మార్పులు 

ఇప్పటివరకు ఒక్కరు దివ్యాంగులైతేనే పథకం వర్తింపు 

ఇకపై ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకున్నా రూ.లక్ష సాయం 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీచేశారు.  

ఎక్కువ మందికి ప్రయోజనం 
సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.

దీంతో గతేడాది ఏప్రిల్‌ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య 
వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement