breaking news
People with disabilities
-
ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మందికి ప్రయోజనం సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. -
పింఛన్దారుల ఎదురుచూపు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కొలువుదీరింది. అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సామాజిక పింఛన్లలో వృద్ధాప్య, వితంతువులు తదితర కేటగిరీల వారికి నెలకు రూ.1000 చొప్పున పింఛన్ పంపిణీ చేస్తామని, అదేవిధంగా వికలాంగులకు రూ.1500 చొప్పున ఇస్తామని స్పష్టం చేసింది. తాజాగా ఆ పార్టీ అధికారంలోకి రావడంతో.. మాటకు కట్టుబడి పింఛన్ మొత్తం పెంపుదల చేసి అందజేస్తుందని లబ్ధిదారులు ఆశతో ఉనారు. లబ్ధిదారులు 2.63లక్షలు... జిల్లాలో సామాజిక పింఛన్లలో భాగంగా 2,63,145 మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ప్రతి నెల రూ.200 చొప్పున పంపిణీ చేస్తుండగా, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులకు మాత్రం నెలకు రూ.500 చొప్పున పింఛన్ చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రతినెల రూ. 6.52కోట్లు పింఛన్ల కింద పంపిణీ అవుతున్నాయి. కాగా, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించింది. వికలాంగులకు నెలకు రూ.1500 ఇస్తామని, అదేవిధంగా వృద్దాప్య, వితంతు కేటగిరీలకు రూ.1000 చొప్పున ఇస్తామని పేర్కొంది. చేనేత, కల్లుగీత కార్మికులను ఇందులో ప్రస్తావించనప్పటికీ.. గతంలో ఇతర కేటగిరీలకు సమానంగా ఇస్తున్న రూ.200ను రూ.1000కు పెంచే అవకాశం ఉంది. నెలవారీ భారం రూ.21.38 కోట్లు సామాజిక పింఛన్లకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టో అమలుకు ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి అధికారులు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అతి త్వరలో పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.కొత్త పింఛన్ విధానం అమల్లోకి వస్తే.. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.6.52 కోట్లు పంపిణీ చేస్తుండగా, తాజా పెంపుతో రూ.27.90 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాపై నెలకు రూ.21.38కోట్ల భారం పడనుంది.