నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్‌ | JEE Advanced response sheet today | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్‌

May 22 2025 5:40 AM | Updated on May 22 2025 5:40 AM

JEE Advanced response sheet today

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్‌ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్‌డ్‌) రెస్పాన్స్‌ షీట్‌ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్‌­లోడ్‌ ఆప్షన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్‌ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. 

విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్‌ 2న ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్‌ 3 నుంచి ఎన్‌ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement