జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు! | GHMC steps up efforts to support of transgender community | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!

May 14 2025 8:21 PM | Updated on May 14 2025 9:17 PM

GHMC steps up efforts to support of transgender community

హైదరాబాద్:  జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బల్దియాలోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.  

ఇక స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి వివరాలను అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement