breaking news
Family
-
చెస్ కడుపున చిత్రకళ పుట్టింది
రెండు రాష్ట్రాలలో ఎమ్సెట్ అడ్మిషన్ల గాలి వీస్తోంది. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా బీటెక్ వైపు తల్లిదండ్రులు దారి మళ్లిస్తున్నారు. మనం ఏదనుకున్నామో అది కాకుండా వాళ్లు ఏదనుకున్నారో అది చేయనిచ్చే వీలు లేదు అనేక కారణాల రీత్యా తల్లిదండ్రులకు కూడా. కాని గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏం చేస్తున్నాడో చూడండి. తన కుమారుడు అఖిల్‌ని చెస్ ప్లేయర్‌ని చేయలేదు. చిత్రలేఖనంలో అభిరుచి ఉన్న ఆ అబ్బాయి చేత బొమ్మలేయిస్తున్నాడు. అఖిల్ అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు‘నీకు ఏది ఇష్టమో దాని కోసం కృషి చేసే ధైర్యం నీలో ఉండాలి అని చెప్తుంటారు నాన్నగారు’ అంటాడు అఖిల్ ఆనంద్. 15 ఏళ్ల అఖిల్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ విజేతగా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు. ఇటీవలే ‘మార్ఫొజెనెసిస్’ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ చేశాడు. ఇదే కాదు ఇంతకు ముందు చాలా ముఖ్య నగరాల్లో అఖిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరిగాయి.క్రికెటర్ల పిల్లలు క్రికెటర్లు, ఇంజినీర్ల పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వాలని, అవుతారని అనుకోవడం సాధారణం. అలాగే గ్రాండ్ మాస్టర్ కొడుకు చెస్‌లో ప్రవేశిస్తాడని అనుకోవడం కూడా మామూలే. అయితే ఇక్కడ అసాధారణంగా పిల్లవాడి ఆసక్తికే విలువ ఇచ్చాడు విశ్వనాథన్ ఆనంద్. ‘నాకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బొమ్మలంటే ఆసక్తి అని గ్రహించి పెయింటింగ్‌లోనే కృషి చేయమని ప్రోత్సహించారు నాన్న. అంతేకాదు అందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించారు’ అంటున్నాడు అఖిల్.చిత్రకారిణి డయానా సతీష్ దగ్గర శిక్షణ పొందిన అఖిల్ అంతటితో ఆగలేదు. భారతీయ చిత్రకళకు సంబంధించిన మెళకువలు గ్రామీణ కళాకారుల దగ్గర ఉంటాయని బెంగాల్‌కు చెందిన గ్రామీణ చిత్రకారుల కేంద్రం ‘హస్త’లో శిక్షణ తీసుకున్నాడు. అందుకే అఖిల్ బొమ్మల్లో గాఢమైన రంగులు, స్థానికత ఛాయ కనిపిస్తాయి.‘నాకు గణితం ఇష్టం. నా బొమ్మల్లో గణితం అంశ ఉంటుంది. అలాగే మైథాలజీ... మత చిహ్నాలు కనిపిస్తాయి. మీరు గ్రామీణుల చిత్రకళ గమనించండి... సిందూర రంగు, అపరంజి రంగు ఎన్ని వన్నెలు ΄ోతాయో. జనం గొప్పతనం అది. అందుకే నాకు మన రాజ్యాంగ ప్రవేశిక ఇష్టం.‘వుయ్ ద పీపుల్’ అంటుంది అది. ప్రజల పట్ల మన రాజ్యాంగం వివక్ష చూపదు. అందరూ సమానమే. నా చిత్రకళ కూడా అలాంటి స్ఫూర్తితోనే ఉంటుంది’ అంటాడు అఖిల్.తండ్రిని విపరీతంగా అంటి పెట్టుకుని తిరిగే అఖిల్ తండ్రిని అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటూ ఉంటాడు.‘నాన్న నాతో సినిమాలకు వస్తారు. నాతో స్టార్‌వార్స్ సిరీస్ చూస్తారు. నేనెప్పుడైనా బొమ్మను పాడు చేసి అప్సెట్ అయితే నన్ను వాకింగ్‌కు తీసుకెళ్లి తాను చెస్ ఆడేటప్పుడు ఎలాంటి తప్పులు చేశారో వాటి నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పి ఉత్సాహం నింపుతారు. నాన్నకు, నాకు సంగీతం ఇష్టం. ఇద్దరం చాలా కచ్చేరీలకు కూడా వెళుతుంటాం. అయితే ఆయనకంటే నాకు ఎక్కువ పాప్ సాంగ్స్ తెలుసు. నాకు ఏది ఇష్టమో అది చేస్తే ఆయనకు ఇష్టం’ అన్నాడు అఖిల్.తన ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయంలో అఖిల్ సందర్శకులతో ఇంటరాక్ట్ అవుతాడు. ‘వాళ్లు నాతో మాట్లాడి చాలా సందేహాలు అడుగుతారు. నేను సమాధానాలు చె΄్తాను. వాటితో వాళ్లు సంతృప్తి చెంది నా బొమ్మను కొంటే చాలా సంతోషిస్తాను’ అంటున్నాడు అఖిల్. అఖిల్ వేస్తున్న అడుగులలో తల్లి అరుణ ఎప్పుడూ తోడుగా ఉంటోంది.విశ్వనాథన్ ఆనంద్, అరుణలకు అఖిల్ ఒక్కడే సంతానం. బొమ్మలు వేయడం కాకుండా ప్రయాణాలను ఎక్కువ ఇష్టపడే అఖిల్ ప్రపంచాన్ని చుట్టేస్తూ దేశాలు తిరుగుతూ దేశమంటే మట్టి కాదు మనుషులని తెలుసుకుంటూ ఉంటాడు. -
ఈ జలపాతాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు!
చుట్టూ పచ్చని కొండలు.. గిరులపై నుంచి జాలువారే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వీటిని తిలకించేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న సందర్శకులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. డుడుమ జలపాతం 558 అడుగుల పైనుంచి మంచుతెరల మధ్య జాలు వారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. అల్లూరి జిల్లా మంచంగిపుట్టు మండలంలోని కుమడ పంచాయతీలో జడిగూడ జలపాతం కనువిందు చేస్తోంది. ముంచంగిపుట్టు– పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం ఎత్తయిన గిరులపై నుంచి జాలువారుతూ పాలనురగను తలపిస్తోంది. బరడ పంచాయతీ పరిధిలో హంశబంద, జర్జుల పంచాయితీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బూసిపుట్టు పంచాయతీ, సంతవీధి, దోనిపుట్టు గ్రామాల దగ్గర నెమలి జలపాతాలు ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని రంగినిగూడ జలపాతం ఉరకలు వేస్తూ కనువిందు చేస్తోంది. వీటి అందాలను తిలకించేందుకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు.వసతుల్లేక నరకంజలపాతాల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు రహదారి, కాటేజీల సౌకర్యం లేక, తినేందుకు ఆహారం దొరక్క నరకం చూస్తున్నారు.తారాబు జలపాతానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి బూసిపుట్టు మీదుగా గుంజువాడ చేరుకోవాలి. అక్కడి నుంచి జలపాతం వద్దకు రెండు కిలోమీటర్ల పొడవునా బురదలోంచి వెళ్లాలి. జలపాతం దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు కర్రలు ఏర్పాటుచేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడికి చేరుకుంటున్నారు. బూసిపుట్టు నుంచి పిట్టలబుర్ర వరకు రోడ్డు మంజూరైంది. పనులు మొదలుపెట్టి వదిలేశారు. జడిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి కుమడ చేరుకోవాలి. అక్కడ నుంచి భల్లుగుడ మీదుగా కిలోమీటరు మేర కాలినడకన వెళ్లాలి. తుప్పల మయంగా ఉండటంతో సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ స్థానికులు కొంతమేర రహదారి మార్గాన్ని రాళ్లతో మెరుగుపరిచారు. రంగినిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి లక్ష్మీపురం మీదుగా రంగినిగూడ వెళ్లాలి. అక్కడి నుంచి అరకిలోమీటరు దూరంలో ఉన్న జలపాతం వద్దకు వెళ్లేందుకు రహదారి లేదు. నెమలి జలపాతాలకు ముంచంగిపుట్టు నుంచి సరియాపల్లి మీదుగా వెళ్లాలి. అడవిమార్గంలో మూడు కిలోమీటర్ల మేర నడిచి కొండలపై నుంచి వెళ్లాలి. ఇబ్బందులు తప్పడం లేదు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డుడుమ, తారాబు జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ల సంఖ్య గత కొద్ది నెలలుగా పెరిగాయి. పర్యాటకులు ఉండేందుకు కాటేజీలు, జలపాతాలకు వెళ్లేందుకు రహదారులు లేవు. దీనివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటిని అందుబాటులోకి తెస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. – బాయన నాథ్, పర్యాటకుడు, విశాఖపట్నంకనీస వసతులు కరువు ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చాలా జలపాతాలు ఉన్నాయి. ప్రతి రోజు వీటిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. తారాబు,డుడుమ జలపాతాల వద్ద సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే కనీస వసతులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు సౌకర్యాలు కల్పిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – గంపరాయి అనిల్, ఫొటోగ్రాఫర్, ముంచంగిపుట్టుచదవండి: వానాకాలంలోనూ నీటి కోసం విలవిల -
అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..
అరటి తొక్కలను పడేయకండి.. పండే కాదు..తొక్కల కూడా ఉపయోగమే అంటూ పలు బ్యూటీ చిట్కాలు గురించి విని ఉంటాం. అందులోనూ చాలామంది అరటి పండు తొక్కలను ముఖంపై, దంతాలపై తెగ రుద్దేస్తుంటారు. క్లీనింగ్ పర్పస్‌గా ఉపయోగపడుతుందని, ముఖం, దంతాలు నిగనిగలాడే తెల్లటి మెరుపుని సంతరించుకుంటాయిని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇందులో వాస్తవమెంతుందో ఓ ఇన్ఫ్లుయెన్సర్ సవివరంగా చెప్పడమే గాక నిపుణులు కూడా ఆమె మాటకే మద్దతిస్తూ పలు సూచనలు కూడా ఇచ్చారు. అమెరికాకు చెందిన బ్యూటీ అండ్ వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్ము బ్యూటీ వ్యవస్థాపకురాలు జరీఫా అహ్మద్ అరిజే ఇన్‌స్టాలో ఆరోగ్యకరమైన తెల్లటి దంతాల కోసం అరటి తొక్కలను చాలామంది వినియోగిస్తుంటారని చెప్పుకొచ్చింది. 50 మిలియన్ల మందకి పైగా ప్రజలను బోటాక్స్ బదులుగా అరటితొక్కను ముఖంపై రుద్దడం వంటివి చేస్తుంటారని అన్నారామె. వీటికి దంతాలను కూడా తెల్లగా మార్చే శక్తి ఉన్నందున అదుకోసం కూడా ఉపయోగిస్తారని చెప్పారు. ఇదేమి మ్యాజిక్ కాదని, ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వకుండా దంతాలను సున్నితంగా పాలిష్ చేసి, మంచి స్ట్రాంగ్‌గా మారుస్తాయని చెప్పుకొచ్చింది. దీన్ని ఎక్కువగా కరేబియన్, ఆఫ్రికన్, దక్షిణాసియన్లు నోటి ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారని తెలిపింది. రాత్రిపూట ఇదేమి దంతాలను శుభ్రపరచదు గానీ, స్ట్రాంగ్ ఉండేలా చేస్తుంది. ఈ అరటిపండులో సహజసిద్ధంగా ఇంత మంచి లక్షణం ఉండటం కారణం చేతనే చాలామంది బోటాక్స్ల జోలికిపోవడం లేదని చెబుతోంది.ఇది నిజమేనా..?దంతాలు అందంగా మారాలంటే దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా అరటి తొక్కలు దంతాలను తెల్లగా మారుస్తాయిని చెప్పడానికి ఎక్కడ శాస్త్రీయమైన ఆధారాలు లేవని అన్నారు. సదరు ఇన్ఫ్లుయెన్సర్ వాదనను సమర్థించేలా శాస్త్రీయ పరిశోధనలు కూడా ఏమి జరగలేవని తేల్చి చెప్పార. ఇలా అరటి తొక్కను రుద్దడంతోనే దంతాలు స్ట్రాంగ్ అవుతాయని చెప్పుందుకు కూడా సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు నిపుణులు. అరటి తొక్కల్లో పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ వంటివి ఉన్నప్పటికీ అవేమి ఇలా రుద్దగానే దంతంలోకి చొచ్చుకునిపోవని అన్నారు. అయితే ఈ పద్ధతిలో దంతాలపై ఉండే మరకలను తొలగే అవకాశం ఉందేమో గానీ, ఆ తర్వాత క్రమం తప్పకుండా బ్రెష్ చేయకపోతే మాత్రం సమస్య తప్పదని అన్నారు. ఎందుకంటే దీనిలో సహజ చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇలా రుద్దిన తర్వాత తప్పనిసరిగా బ్రష్చేయాల్సిందేనని అన్నారు. ఒకవేళ అలా వదిలేస్తే..దంతక్షయానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు అవి ఉపరితల మరకలను తొలిగించవచ్చేమో కానీ దంతాలపై ఉండే లోతైన మరకలను మాత్రం పూర్తిగా తొలగించేలేదని చెప్పుకొచ్చారు. చివరికి ఇది తెల్లబడటం అటుంచి ఆ తొక్కలో ఉండే వర్ణద్రవ్యం దంతాలపై ఉండే ఎనామిల్‌ని పసుపు రంగులోకి మార్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదేమి హైడ్రోజన్ పెరాక్స్డ్ మాదిరి మంచి బ్లీచింగ్ చికిత్సను అందించి దంతాలను తెల్లగా మార్చలేదన్నారు. వైద్యపరంగా ఆమోదించిన ఉత్పత్తులు, వైద్య నిపుణుల సలహాలతో దంతాలను తళతళలాడే మెరుపులో ఉండేలా చేసుకోవాలని అన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by zareefa ahmed-arije (@byzareefa) (చదవండి: ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..! వీడియో వైరల్) -
ఆషాఢ జాతర రికార్డు ఆదాయం రూ. 10.84కోట్లు
సోలాపూర్, మహారాష్ట్ర: ఈ ఏడాది ఆషాఢ ఏకాదశి జాతర సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని విష్ణువు అవతారమైన విఠోబా లేదా శ్రీ విఠల రుక్మిణి ఆలయానికి (Shri Vitthal Rukmini Mandire) కానుకలు, విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డుస్థాయిలో రూ. 10.84 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ కమిటీ సహాయ అధ్యక్షుడు గహినీనాథ్ ఔసేకర్ మహారాజ్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా లభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆషాఢ ఏకాదశి జాతరకు అత్యధికంగా 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. లడ్డూ ప్రసాదం, భక్త నివాసాలు, హుండీ ఆదాయం కానుకల రూపేణా వచ్చిన మొత్తం 10.84 కోట్ల ఆదాయాన్ని భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని మేనేజర్ మనోజ్ శృత్రి తెలిపారు. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది! -
ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!
గడ్చిరోలి: మహారాష్ట్ర నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ ఉపవిభాగంలో నక్సల్స్ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: US Woman 16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి -
లంబోర్ఘిని అయితే.. రియల్బాస్ డాగీ రాజా ఇక్కడ! వైరల్ వీడియో
కార్లు అన్నింటిలోనూ ఖరీదైన, లగ్జరీ కారు రారాజు లాంటిది లంబోర్ఘిని కారు. విశ్వాసంలో కింగ్..కుక్క. ఈ రెండు అనుకోకుండా ఎదురు పడితే.. అస్సలు ఊహకే అందడం లేదు కదా. అందుకే విచిత్రమైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే.. ముంబై వీధిలో లంబోర్గిని కారునుకొద్దిసేపు ఆటాడుకుంది ఓ స్ట్రీట్ డాగ్. కొట్టొచ్చినట్టు ఉన్న కారు కలర్ (డార్క్ ఆరెంజ్) చూసి అలా బిహేవ్ చేసిందో ఏమో తెలియదు కానీ ఈ వీడియో ఒకటి ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది.వీడియోలో విశేషాలుఆరెంజ్ కలర్లో లంబోర్గిని కారుకు అడ్డంగా నిలబడింది డాగ్. అటూ ఇటూ కొంచెం కూడా కదల్లేదు.. బెదర లేదు. దానితో మనకెందుకునే అనుకున్న డ్రైవర్ పక్కకు పోనిచ్చాడు. ఆహా.. అయినా వదల్లేదు.. వదల బొమ్మాళీ అంటూ కారును ఫాలో అయింది. మళ్లీ డ్రైవర్ తన కారును తిప్పినప్పుడు,ఇక మన శునక రాజు గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చివరికి లంబోర్గిని కుక్కను దాటి దూసుకుపోయింది. దాంతో దాన్ని శునకం కొంత దూరం వరకు వెంబడించడం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను "కాలేష్ బీ/వీ సర్ డోగేష్ అండ్ లంబోర్గిని" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు కూడా వచ్చాయి. "రోడ్డుకి నిజమైన బాస్" ‘‘మన బ్రో దెబ్బకు.. లంబోర్గిని పారిపోయింది’’ ఇలా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Kalesh b/w Sir Dogesh and Lamborghini pic.twitter.com/EbgnzoErvI— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025 -
ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..!
ఆ మూగజీవి స్కూల్‌కి ఎందుకొచ్చిందో గానీ..అక్కడున్న పిల్లల వద్ద అది కూడా ఓ పసిపాపాయిలా కూర్చొని ఉండటం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అదిచేసే పని చూస్తే..కళ్లర్పడమే మరిచి ఆ శునకాన్నే చూస్తుండిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అందమైన కుక్క పాఠశాల తరగతి గదిలో పిల్లల తోపాటుగా కూర్చొని ఉంటుంది. చాలా అమాయకంగా అందర్ని చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్‌లో పిల్లలంతా డ్రాయింగ్ వేయడంలో మునిగిపోతే..ఈ కుక్క కూడా వేయాలనుకుందో ఏమో గానీ ఒక కాలుపైకిత్తి తనకు సమీపంలో ఉన్న పిల్లవాడి చేతిని తాకుతుంది. నేనే రంగులు వేస్తా అన్నట్లుగా అతడి చేతిలో తన కాలుని పైకెత్తి పెడుతుంది. ఆ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. అయితే ఆ పిల్లవాడు చేతిని వదిలించుకని తన పనిలో తాను నిమగ్నమవుతుండగా మరోసారి అడుగుతున్నట్లుగా కాలుతో కదుపుతుంది. అయితే ఆ చిన్నారి కూడా నీ వల్ల కాదులే అన్నట్లుగా తన పని తాను చేసుకుంటున్న ఆ నిశిబ్ధ సంభాషణకు ఎలాంటి వారి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. పాపం అది మాత్రం ఎవ్వరైనా నాకు కొంచెం డ్రాయింగ్ వేసే పేపర్ ఇవ్వరూ..అన్నట్లుగా చూస్తున్న దాని చూపు భలే నవ్వుతెప్పిస్తోంది .నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మూడు మిలయన్లకు పైగా వ్యైస్ నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు యూనిఫాం ఏది.. ? వేసుకుని వచ్చి ఉంటే నీకు డ్రాయింగ్ వేసే పేపర్ ఇచ్చేవారు అంటూ ఆ క్యూట్ కుక్కని ఉద్దేశిస్తూ.. కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Helpbezubaans (@helpbezubaans) (చదవండి: ఎంఆర్ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..) -
కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్.. నల్ల కళ్లద్దాలు’’!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్‌కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్‌తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్‌లో అల్ట్రా-హిప్గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.తన ఫోటోలకు “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. -
ఎంఆర్ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..
ఆస్పత్రికి వెళ్లినప్పుడు తరుచుగా వింటుంటాం ఎంఆర్ఐ స్కానింగ్ గురించి. కొందరు రోగులకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి చేయించుకోవాల్సిందిగా వైద్యులు చెబుతుంటారు. కానీ అలాంటి స్కానింగ్ చేయించుకునేటప్పుడు బహు జాగ్రత్తగా వ్యహరించాలి. లేదంటే ఈ వ్యక్తిలా గాయలపాలవ్వాల్సి వస్తుంది.ఎంఆర్ఐ గదిలో స్కాన్ చేస్తుండగా ఒక వ్యక్తి మెటల్ చైన్ ధరించి గదిలోకి వచ్చాడు. అంతే అమాంతం ఎంఆర్ఐ మెషీన్ లోపలి శక్తిమంతమైన అయాస్కాంతం అతడిని గొలుసుతో సహా తన వైపుకి లాగేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన న్యూయార్క్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో అధికారులు స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. అదేంటి ఆస్పత్రిలో మెషీన్ ఆన్‌లో ఉండగా సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ గది తలుపు లాక్ చేసి ఉంటుందా కదా అనే ప్రశ్నలు సర్వత్రా మొదలయ్యాయి. అయినా రోగి పరీక్ష చేయించుకుంటుంటే ఈ వ్యక్తి అక్కడే తిరుగుతున్నాడా అంటూ పలుఅనుమానాలు వ్యక్తమయ్యాయి అందిరిలో. కాగా, ఇక అధికారులు కూడా ఈ సంఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇలాంటి స్కానింగ్ యంత్రాల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇలాంటి ప్రమాదాల బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎంఆర్ఐ యంత్రాల సమీపంలో లోహ వస్తువులు ఎందుకు ప్రమాదకరం..ఆ యంత్రాలు శరీరం లోపలి చిత్రాలను తీయడానికి అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తాయి. ఇది మెషిన్ని స్కాన్ చేయనప్పుడూ కూడా అయస్కాంతక్షేత్రం ఆన్‌లోనే ఉంటుందట. ఈ నేపథ్యంలోనే వైద్యులు ప్రజలకు ఆ మెషీన్ వద్దకు ఎలాంటి లోహ వస్తువులతో రాకూడదని సూచిస్తుంటారు. (చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్‌కు కూడా ఇదే సమస్య!) -
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్‌ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!ఫేస్ బుక్ పరిచయంస్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్‌కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్‌గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. -
కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్‌కు కూడా ఇదే సమస్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాళ్ల వాపుతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు అనంతరం ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇదేమీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితి కాదని, 70 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే సమస్య అని పేర్కొన్నారు వైద్యులు. వృద్ధుల్లో ఇది అత్యంత సర్వసాధారణమైన పరిస్థితి అని తేల్చి చెప్పారు. ఇలా తరుచుగా ట్రంప్‌కి కాళ్ల వాపు ఎందుకు వస్తుంది అనే దిశగా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. వృద్ధులను వేదించే ఈ అనారోగ్య సమస్య ఎందువల్ల వస్తుంది..అసలేంటి వ్యాధి తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!.దీర్ఘకాలిక సిరల లోపం అంటే..ఇది ఎందుకు వస్తుందంటే..కాళ్లల్లోని సిరలు దెబ్బతిన్నప్పుడూ రక్త ప్రవాహాన్ని సరిగా నిర్వహించలేనప్పుడు సంభవిస్తుంది. కాళ్లలోని రక్తం గుండెకు తిరిగి రావడానికి కష్టమవ్వడంతో కాళ్ల సిరల్లో రక్త పేరుకుపోయి వాపు లేదా మచ్చల రావడం వంటి సమస్యలు వస్తాయి. అక్కడ సిరలు అధిక పీడనానికి గురై దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సిరలు మూడు రకాలుగా ఉంటాయి.వాటిని లోతైన, ఉపరితల, డీప్ అనే సిరలుగా విభజిస్తారు. శరీరంలో లోతైన సిరలు కండరాల గుండా ప్రవహిస్తాయి. ఈ ఉపరిత సిరలు చర్మం ఉపరితలంతో కనెక్ట్ అవుతాయి. అంతకుమించి డీప్‌గా ఉండే సిరలు లోతైన, ఉపరితల సిరల రెండింటిని కనెక్ట్ చేస్తాయిప్రభావం ఎలా ఉంటుందంటే..దీర్ఘాకాలిక సిరల లోపం( Chronic Venous Insufficiency) కారణంగా కాళ్ల నుంచి రక్తం గుండెకు చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కాళ్ల సిరల్లో ఒత్తిడి ఏర్పడి అతి చిన్న రక్తనాళాలు, కేశనాళికలు పగిలిపోతాయి. ఆ ప్రాంతంలోని చర్మం ఎర్రటి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. కాస్త గుద్దిన లేదా గీతలు ఏర్పడ్డ సులభంగా చీరుకుపోయినట్లు అవుతుంది. అంతేగాద ఆ ప్రాంతంలో కణజాల వాపు, నష్టం ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం ఉపరితలంపై పుండ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్ల బారినపడతారు. ఈసమయంలో గనుక సకాలంలో వైద్యం తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. సంకేతాలు, లక్షణాలు..కాళ్లు నొప్పి, తొందరగా అనిపించడం,జలదరింపు లేదా సూదులు గుచ్చుతున్న అనుభూతికాళ్లలో తిమ్మిరి ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉండటంరంగు మారిన చర్మం లేదా ఎర్రటి రంగులోకి మారడంకాళ్లపై చర్మం పొరలుగా లేదా దురదగా ఉండటంతోలులా కనిపించే చర్మంపుండ్లువేరికోస్ సిరలుకాలికింద భాగంలో వాపు మచ్చ కణజాలం అభివృద్ధి చెంది కణజాలాలోని ద్రవాన్ని బంధిస్తుంది.ఇన్ఫెక్షన్కి రీజన్..వైద్యుల అభిప్రాయం ప్రకారం, కాళ్ళ సిరల్లోని కవాటాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు దీర్ఘకాలిక సిరలోపం సాధారణంగా ఏర్పడుతుంది. అలాగే కాళ్ళ సిరల్లో సరైన దిశలో రక్త ప్రవాహానికి సహాయపడే కవాటాలు ఉంటాయి. ఒకవేళ అవి కూడా దెబ్బతిన్నట్లయితే, రక్తం గుండె వైపు పైకి తిరిగి ప్రవహించడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలా వాల్లు కూడా పనిచేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు. కాళ్ళ సిరల్లో పుట్టుకతోనే వచ్చిన వైకల్యాలు.కాళ్ళ సిరల్లో మార్పులు వల్ల లోతైన సిరల త్రాంబోసిస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఎక్కువగా వృద్ధులే ఈ సమస్య బారినపడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
సారా అలీ ఖాన్ (Sara Ali Khan) సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సారా తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందింది. ఆతరువాత నటనా రంగంలోకి అడుగు పెట్టి బస్టర్ హిట్స్ తో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'కేదార్నాథ్' 'అత్రంగి రే', ఇంకా వెబ్‌సిరీస్‌లతో అదరగొట్టేసింది. సారా అలీ ఖాన్ కొత్త చిత్రం మెట్రో... ఇన్ దినోం మంచి పేరే తెచ్చుకుంది. అయితే సినిమాల్లోకి రావడానికి ముందు 96 కిలోల బరువు, PCOS సమస్యలతో బాధపడిన డైట్, వర్కౌట్స్‌తో 47 కిలోలకి తగ్గింది. ఈ జర్నీకి సంబంధించిన వివరాలు తాజాగా పంచుకుంది.సారా అలీ ఖాన్ కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా 91 కిలోల నుండి 46 కిలోలకు తన బరువును తగ్గించుకుంది. ముఖ్యంగానో-షుగర్ ,నో-మిల్క్ డైట్ ప్లస్ కార్డియోతో తాను 45 కిలోల బరువు తగ్గానని వెల్లడించింది. సినిమాలు, నటన పట్ల ప్రేమతో నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో సారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకు సహాయపడే కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంది. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS ఉన్న అమ్మాయిలు- హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే, అధిక బరువుతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో హార్మోన్ల కారణంగా బరువు తగ్గడం చాలా కష్టతరం అయినప్పటికీ సారాదృఢ సంకల్పం, అంకితభావంతో కృషి చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, కార్డియో, కఠిన వ్యాయామాల మిశ్రమంతో దాదాపు 45 కిలోల బరువు తగ్గింది. అలా 96 కిలోల నుండి 51 కిలోలకు చేరుకోవడం విశేషం.సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ జర్నీరణవీర్ అల్లాబాడియా అకా బీర్బైసెప్స్తో జరిగిన ఇంటర్వ్యూలో, సారా అలీ ఖాన్ తన బరువు తగ్గడం గురించి తెలిపింది. సినిమాలలో నటించాలంటే దర్శకుడు కరణ్ జోహార్ 'సగం' బరువు తగ్గించమని కోరాడని అదే తనకు ప్రేరణ అని తెలిపింది. అమెరికాలో బాగా జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన సారా షుగర్, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్ పూర్తిగా దూరం పెట్టేసింది. ఇంటి,హెల్తీ ఫుడ్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. చక్కెర, పాలు, కార్బోహైడ్రేట్లు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేలా నీళ్లు, ముఖ్యంగా జీలకర్ర, కొత్తిమీర నీళ్లు వంటివి తాగేది.వ్యాయామాల్ని కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేది. ఇందులో యోగా ,డ్యాన్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఆమె గంటకుపై ట్రైనింగ్ తీసుకునేది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాయామాన్ని ఒక పనిగా కాకుండా అదే రోజువారీ ప్రాధాన్యతగా మార్చుకుంది. ఇంత బరువు తగ్గినా ఇప్పటికీ తన బరువుతో సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. బాడీ పెరుగుతోంది. ముఖం పెద్దగా మారింది.. ఏమి తింటున్నానో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువుతో అదుపులో ఉంచుకోవడం ఉండటం తనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించి బరువు తగ్గడం కెరీర్ కోసం మాత్రమేకాదు, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం కూడా. PCOSను తగ్గించుకోవడం, తన ఆత్మవిశ్వాసానికి, జీవితంలో స్పష్టత రావడానికి బరువు తగ్గడం అనేది చాలా సాయపడిందని వెల్లడించింది. -
‘మాన్యువల్లీ క్లీనింగ్' తొలి స్టార్టప్..! సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్‌హోల్స్..
ఐఐటీ–మద్రాస్‌లో చేసిన కాలేజీ ప్రాజెక్ట్ దివ్యాన్షు కుమార్‌ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. మాన్యువల్ స్కావెంజర్స్‌కు ప్రత్యామ్నాయంగా సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రపరిచే రోబోట్స్‌ను రూపొందించాడు. ప్రభుత్వం మాన్యువల్లీ క్లీనింగ్‌ను నిషేధించినప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట ఇది కొనసాగుతూనే ఉంది. 1993 నుంచి 2020 వరకు దాదాపు 928 మంది ట్రాకర్లు మరణించారు. తమిళనాడు, గుజరాత్‌లలో అత్యధిక మరణాలు సంభవించాయి.బిహార్‌లోని గయకు చెందిన దివ్యాన్షు కుమార్ ‘సోలినస్ ఇంటిగ్రిటీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. మాన్యువల్లీ క్లీనింగ్‌కు ఈ స్టార్టప్ తయారుచేసే రోబోలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఐఐటీ–మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన దివ్యాన్షు ప్రొడక్ట్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు. ‘మాన్యువల్లీ క్లీనింగ్‌కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మన దేశంలో వచ్చిన తొలి స్టార్టప్ మాది. తొలి దశలో సీడ్ ఫండింగ్ మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటున్నాడు దివ్యాన్షు. సెప్టిక్ ట్యాంక్‌లు, డ్రైనేజి క్లీనింగ్, వాటర్ పైప్లైన్ల క్లీనింగ్...మొదలైన వాటిపై ఈ స్టార్టప్ పనిచేస్తోంది. క్లౌడ్–బేస్డ్ స్టోరేజీ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్‌కు సంబంధించి ‘స్వస్థ్ ఏఐ’ అనే సర్వీస్‌ను కూడా ‘సోలినస్’ నిర్వహిస్తోంది. (చదవండి: టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్) -
టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్
యూత్, టెక్నాలజీ అనేవి వేరు వేరు పదాలు కాదు. టెక్నాలజీని ‘జీ హుజూర్’ అనేలా చేసి సమాజహితానికి ఉపకరించే డివైజ్‌లను ఆవిష్కరిస్తున్నారు యువ ఇన్వెంటర్ వంద కోట్ల కంపెనీ వోనర్!పదహారు ఏళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ‘వావ్’ అనిపించింది ప్రాంజలి అవస్థీ. మూడు కోట్లతో ప్రాంరంభమైన ఈ కంపెనీ వంద కోట్ల టర్నోవర్‌కు చేరడం విశేషం. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంజలి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఫ్లోరిడా యూనివర్శిటీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ప్రాంజలికి ఏఐ గురించి వివరంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మొదట్లో ఒక ఏఐ కంపెనీలో పనిచేసిన ప్రాంజలి ఆ తరువాత ‘డెల్వ్. ఏఐ’ పేరుతో సొంత స్టార్టప్ మొదలు పెట్టి విజయం సాధించింది. అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా ‘డెల్వ్. ఏఐ’ సంక్లిష్ట డేటా ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల వనరులు, ఆదాయన్ని ఆదా చేస్తుంది.అథ్లెట్ టు టెక్నో ఎక్స్పర్ట్పదకొండు సంవత్సరాల వయసులో కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ మొదలుపెట్టింది పుహబి చక్రవర్తి. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. ఆటలో విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పోటీల సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్న పుహబి ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అనే ఏఐ మోడల్‌కు రూపకల్పన చేసింది. చిన్నప్పటి నుంచే పుహబికి కోడింగ్ అంటే ఇష్టం. తమ స్కూల్లో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమంలో పాల్గొన్న పుహబికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మంచి అవగాహన ఏర్పడింది. ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ కార్యక్రమంలో ఎఎన్ఎన్, సీఎన్ఎన్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంది. ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అప్లికేషన్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డైట్ అనే మూడు భాగాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్‌కు సీఎన్ఎన్, మెంటల్ హెల్త్‌కు ఏఎన్ఎన్, డైట్‌కు జనరల్ లూపింగ్ను వాడింది. ఆరోగ్యకరమైన శారీరక, మానసిక జీవనశైలి విషయంలో అథ్లెట్స్‌కు ‘అథ్లెటిక్స్ ఎక్స్’ బాగా ఉపయోగపడుతుంది.గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్పద్దెనిమిది సంవత్సరాల కావ్య కొప్పారపు ‘గ్లియోవిజన్’ అనే ఏఐ టూల్‌ను డెవలప్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ ఇమేజ్‌లను త్వరగా విశ్లేషించడానికి ఉపకరించే టూల్ ఇది. డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ సిస్టమ్‌ను కూడా డెవలప్ చేసింది. టెక్నాలజీకి సంబంధించి అమ్మాయిలను ప్రోత్సహించడానికి ‘గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్’ అనే సంస్థను ప్రారంభించింది. హెల్త్‌కేర్‌కు ఉపకరించే ఏఐ సాధనాలపై దృష్టి పెట్టిన కావ్య టైమ్స్ ‘25 మోస్ట్ ఇన్ష్లూయెన్సల్ టీన్స్’ జాబితాలో చోటు సాధించింది.యువ ఏఐ ఉద్యమం‘ఎన్కోడ్’ అనే సంస్థకు స్నేహ రెవనర్ ఫౌండర్, ప్రెసిడెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉపకరించే యూత్ ఆర్గనైజేషన్ ఇది. అమెరికాలోని ఈ ఆర్గనైజేషన్‌లో వెయ్యి మంది యువతీ,యువకులు ఉన్నారు. ఏఐ పాలసీ ఇనిషియేటివ్స్‌కు సంబంధించి ‘ఎన్కోడ్’ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. వర్క్‌షాప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. టైమ్స్ ‘మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ జాబితాలో స్నేహ చోటు సాధించింది.ఆ నలుగురు... వందలాది వన్య్రపాణులను రక్షిస్తున్నారురోడ్లపై జంతువులు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి కొలరాడో (యూఎస్)లోని ‘స్టెమ్ స్కూల్ హైల్యాండ్స్’కు చెందిన నలుగురు టీనేజ్ అమ్మాయిలు ప్రాజెక్ట్ డీర్’ అనే ఏఐ–పవర్డ్ వైల్డ్‌లైఫ్ డిటెక్షన్ డివైజ్‌ను డెవలప్ చేశారు. థర్మల్ ఇమేజింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి పనిచేసే డివైజ్ ఇది. చీకట్లో, దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడు కూడా రోడ్డుపై జంతువులను డిటెక్ట్ చేస్తుంది. ‘రోడ్డుపై జంతువుల ఉనికిని కనిపెట్టిన వెంటనే ప్రాజెక్ట్ డీర్ డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది’ అంటుంది నలుగురు ఇన్వెంటర్లలో ఒకరైన బ్రి స్కోవిల్లీ. ‘ప్రాజెక్ట్ డీర్ డివైజ్లాంటి ఆవిష్కరణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా కొత్త’ అంటుంది మరో స్టూడెంట్ సిద్దీ సింగ్. (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
శంకరుని మాటల మర్మం ఇదీ.. సర్వజ్ఞుల మాటలు
అల్లుణ్ణీ, కూతుర్నీ చూసివద్దామని వెళ్ళినప్పుడు, ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేయలేదని శంకరుడిపై కోపగించిన దక్షుడు, ప్రతీకారంగా శంకరుడిని అవమానించాలనే ఆలోచనతో ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి శంకరుడిని తప్ప సకల దేవతలనూ, మునిగణాలనూ పిలిచాడు. అది తెలుసుకున్న నారదుడువెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతితో, ‘అమ్మా, మీ తండ్రిగారికి ఏమైందో తెలి యడం లేదు. మీ ఇరువురనూ తప్ప మిగతా అందరినీ పిలిచి, అన్ని హంగు లతో యాగం చేస్తున్నాడు. వినడానికే నాకు బాగా అనిపించక, నీ చెవిన వేసి పోదామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను!’ అని చెప్పి, అగ్గి రాజేసి వెళ్ళిపోయాడు. తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పార్వతికి మనసులో కోరిక కలిగింది. అయితే, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎలాగ? కలత చెందిన మనస్సుతో, చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే, విషయం శంకరుడి చెవిలో వేసింది. సతి మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించిన శంకరుడు ఇలా సమాధానం చెప్పాడన్నాడు పోతన, తాను రచించిన ‘వీరభద్ర విజయం’ కావ్యం ప్రథమాశ్వాసంలో:మెచ్చని మామలిండ్లకును మేకొని శోభనవేళ బిల్వమిన్పొచ్చముగల్గుబో దగుట పోలదు నల్లుర కెజ్జగంబులంబొచ్చెము లేదు కన్యలకు బుట్టినయిండ్లకు బోవ లోకము న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీతలిదండ్రుల జూడ బైదలీ!‘ తనను ఇష్టపడని మామల ఇండ్లలో జరిగే శుభ కార్యాలకు, ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఏ లోకంలోని అల్లుళ్ళకైనా మర్యాద కాదు. అయితే, ఆహ్వానం లేనప్పటికీ కన్యలకు తమ పుట్టినిండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. లోకం మెచ్చుకుంటుంది కూడా! అందు వలన, మీ తల్లిదండ్రులను చూడటానికి నీవు వెళ్ళు!’ అలా పార్వతి పుట్టినింటికి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. పుట్టినింట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, శివుడిని మనసులో తలుచుకుని శివయోగవహ్నిని మేలుకొలిపి, ఆ ఘోరాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. కనుకనే, జరగబోయేది తెలిసిన శంకరుడు పార్వతిని ‘పోయిరమ్మని’ అనకుండా, కేవలం ‘పొమ్ము పబ్బమునకు’ అని మాత్రమే అన్నాడు. సర్వజ్ఞుల మాటలు భవిష్యత్తుకు దర్పణములుగా భాసిల్లుతాయి.– భట్టు వెంకటరావు -
‘నిథమ్’.. పాకశాస్త్ర రిథమ్..
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘నిథమ్’ ఔత్సాహిక వ్యాపార వేత్తలకు, పాకశాస్త్ర నిపుణులకు రిథమ్ అన్నట్లుగా గుర్తింపు పొందుతోంది.. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో భాగంగా 20 రోజుల పాటు శిక్షణ పొందిన 29 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. దీంతోపాటు వీరందరికీ ఫుడ్ ట్రక్కులను మంజూరు చేశారు.. నిథమ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 29 మందికి ట్రైనీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిషెల్లి జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో నిథమ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంకే గణేష్ సరి్టఫికెట్లు అందజేశారు. చెఫ్ తుల్జారామ్ ఆధ్వర్యంలో గురువారం పలు రకాల ఫిష్ వంటకాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పట్రా రి మిర్చీ, ప్రాన్స్ పలావ్, అపోలోఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి పలురకాల వంటకాలతో విందుచేశారు. చేపలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెర్ఫ్ నిథమ్ అధికారులు వీటిని రుచిచూసి శిక్షణార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చెఫ్ తుల్జారామ్ వంటకాల తయారీపై పలు సూచనలు చేశారు. ముగింపు సమావేశం నిర్వహించి శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు అందించారు. కార్యక్రమంలో నిథమ్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జే ఫ్రాన్సిస్, ఫిషరీస్ శాఖ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి మార్గంగా.. మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్్ఫ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించాం. ఫిష్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా మహిళలకు ఇది ఉపాధి మార్గంగా మారిందని, మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడమే లక్ష్యంగా, జీవనోపాధి పొందేలా, తద్వారా పలువురికి ఉపాధి కల్పించేలా మొబైల్ ఫిష్ ట్రక్ క్యాంటీన్లను నడిపేందుకు ప్రోత్సహిస్తున్నాం. వ్యాపార ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా శిక్షణ అందించాం. – డాక్టర్ సతీష్ సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
మానవత్వం.. అ 'మూల్యం'..!
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు.. ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది.. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు..బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాం«దీ, ఉస్మానియా, నిమ్స్‌తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు. క్యాబ్ చార్జీ పేరుతో..?? ‘భర్తకు అనారోగ్య కారణాలతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ నుంచి నగరంలోని పెద్దాస్పత్రికి వచ్చాం. వైద్యులు మూడు యూనిట్ల రక్తం కావాలని అడిగారు. దీంతో తెలిసిన వారి సహాయంతో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ వంటి యాప్స్‌లో వివరాలతో అభ్యర్థన పెట్టాం. గంట తరువాత ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. రక్తం ఇవ్వడానికి సిద్ధం. నాతోపాటు ఇద్దరు స్నేహితులు కూడా వస్తారు. క్యాబ్ ఖర్చులకు, రక్తదానానికి ముందు ఆహారానికి రూ.1,000 ఫోన్ పే చేయమన్నాడు. అవసరానికి రక్తం ఇవ్వడమే గొప్ప, డబ్బుదేముందిలే అని ఫోన్ పే చేశాం.. తర్వాత ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది’ అని బాధితురాలు రాజమణి వాపోతున్నారు. ఇది ఒక్క రాజమణి సమస్యే కాదు.. నగరంలో నిత్యం వందల సంఖ్యలో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.. కొందరు కేటుగాళ్లు ఇదే పనిలో ఉన్నారని, ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని, డబ్బుతూ పాటు అత్యవసర పరిస్థితుల్లో అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇలాంటి వారి వల్ల దాత ఇప్పుడో.. ఇంకాస్త సమయానికో వస్తాడనే ఆశతో ఎదురుచూస్తూ కూర్చుంటే రోగుల ప్రాణాలను కోల్పోక తప్పదని చెబుతున్నారు. సమాచారమే.. వారి డేటా.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్.. అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మనవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిందు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. (చదవండి: జస్ట్ 15 నిమిషాల జర్నీలో అద్భుత జీవిత పాఠం..! డబుల్ ఎంఏ, ఏడు భాషలు..) -
స్టార్టప్ స్టార్స్ రాధిక అంబానీ, అనన్య బిర్లా, దేవాన్సీ కేజ్రీవాల్, ఇంకా!
వ్యాపారం, ఆవిష్కరణలకు సంబంధించి అందరిలా ఆలోచిస్తే... పెద్దగా పోయేదేమీ ఉండదు...వచ్చేది కూడా అంతగా ఉండదు!‘ కాస్త కొత్తగా ఆలోచిద్దాం’ అనుకుంటే మాత్రం వచ్చేది తప్ప పోయేదేమీ ఉండదు.రెండో కోవకు చెందిన ఈ మహిళలు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లతో స్టార్లుగా మెరిసిపోయారు. వ్యాపార నైపుణ్య దీక్షాదక్షతలతో ‘సక్సెస్’కు సరిౖయెన నిర్వచనం అనిపించుకున్నారు. తాజాగా...హురున్ ఇండియా–2025 (అండర్ 30) జాబితాలో చోటు సాధించారు.అంత ‘స్క్రీన్’ లేదు! కథలు వినడం నుంచి ΄పొదుపు కథలకు సమాధానం చెప్పడం వరకు పిల్లలకు ‘స్క్రీన్’ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందేనా? ‘అవసరం లేదు’ అంటూ మార్కెట్లోకి వచ్చిన ‘స్కిల్మెటిక్స్’ పిల్లల ప్రపంచానికి చేరువయింది. ఈ విజయానికి చిరునామా... దేవాన్షీ (Devanshi Kejriwal). ఇన్నోవేటివ్ స్టార్టప్‌గా పేరు తెచ్చుకున్న ‘స్కిల్మెటిక్స్’కు దేవాన్షీ కేజ్రీవాల్ కో–ఫౌండర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్. ముంబైలో ప్రారంభమైన ‘స్కిల్మెటిక్స్’ ఎకో–ఫ్రెండ్లీ, స్క్రీన్–ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్‌తో మొదలైన ‘స్కిల్మెటిక్స్’ స్క్రీన్ అవసరం లేకుండానే పిల్లలకు నచ్చే, వారి ఆలోచనలకు పదును పెట్టే క్రియేటివ్ పజిల్స్‌ను డిజైన్ చేసింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది కంపెనీ.అనుభవాలే అద్భుత పాఠాలై... : చిన్న వయసులోనే ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసి ‘భేష్’ అనిపించుకుంది దేవిక గోలప్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది. హురున్ ఇండియా జాబితాలోని పిన్న వయస్కులలో 28 సంవత్సరాల దేవిక గోలప్ ఒకరు. డిజిటల్ పాథాలజీకి సంబంధించిన ‘వోప్ట్రాస్కాన్’ కంపెనీలో పనిచేస్తున్న దేవికకు వైద్యపరికరాల తయారీ రంగంలో అయిదు సంవత్సరాల అనుభవం ఉంది. ‘వోప్ట్రాస్కాన్’ కార్పోరెట్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాలలో కీలకపాత్ర పోషిస్తోంది. ‘వోప్ట్రాస్కాన్’కు ముందు ‘కెటాలిస్ట్ హెల్త్ వెంచర్’లో హెల్త్‌కేర్ ఇన్వెస్ట్మెంట్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. ‘బెకాన్ డిస్కిన్సన్’లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. అంతకుముందు ‘మెడ్రోనిక్’లో సీనియర్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. ఎన్నో కంపెనీలలో పని చేసిన దేవిక ఎన్నో అనుభవాలను పాఠాలుగా మార్చుకుంది..అమ్మ ఇచ్చిన ధైర్యమే... విజయానికి దారితనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ‘జీరో రిగ్రేట్స్’ అనే మాట వృషాలి ప్రసాదే నోట వినిపిస్తుంటుంది. ‘రిస్క్– టేకింగ్’ స్వభావం వృషాలిలో చిన్న వయసు నుంచే ఉంది. బిట్స్ గోవాలో చేరిన రోజుల్లో తన క్లాస్మేట్స్ శుభమ్ మిశ్రా, హరి వాలియత్తో కలిసి సృజనాత్మక ఆలోచనలు చేసేది. ‘కొత్తగా ఆలోచించడమే విజయానికి దగ్గరి దారి’ అంటున్న వృషాలి ఏఐ–పవర్డ్ ప్లాట్‌ఫామ్ ‘పిక్సిస్’ కు కో–ఫాండర్, సీటీవో. ఆటోమేట్ మార్కెటింగ్ డెసిషన్లతో వివిధ బ్రాండ్లకు ఉపయోగపడే ప్లాట్‌ఫామ్ ఇది. ‘నా విజయానికి ప్రధాన కారణం అమ్మ. నేను రిస్కీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడలేదు. నువ్వు బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తావు. సందేహించాల్సిన అవసరం లేదు అని ప్రొత్సహించేది’ అంటుంది వృషాలి ప్రసాదే.సుమధుర విజయగీతం: సింగర్, సాంగ్ రైటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనదైన శైలిలో దూసుకు΄ోతుంది ఘనమైన వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న అనన్యశ్రీ బిర్లా (Ananyashree Birla). కళారంగంలో చిన్న వయసు నుంచే ప్రతిభ చూపుతున్న అనన్య పదిహేడు సంవత్సరాల వయసులో ‘స్వతంత్ర మైక్రోఫిన్’తో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. గ్రామీణ మహిళలకు సూక్ష్మరుణాలు అందించే సంస్థ ఇది.‘అనన్య బిర్లా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలైన అనన్య శ్రీ బిర్లా తల్లితో కలిసి మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘మైపవర్’ స్థాపించిందిఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ టు ఎంటర్ప్రెన్యూర్ : ఒకప్పటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన రోమితా మజుందార్ డైరెక్ట్–టు–కస్టమర్ స్కిన్‌కేర్ బ్రాండ్ ‘ఫాక్స్‌టేల్’ తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు మొదలుపెట్టి విజయం సాధించింది. జార్ఖండ్‌లోని రాంచీలో పుట్టి పెరిగిన రోమిత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ చేసింది. ‘ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఊగిసలాడే ధోరణి వద్దు’ అంటుంది రోమిత మజుందార్.కుటుంబం నేర్పిన పాఠాలు : రకరకాల సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే రాధిక అంబానీ(Radhika Ambani) ‘ఎన్కోర్ హెల్త్‌కేర్’ సీయివో వీరెన్ మార్చెంట్ కూతురు. పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫామిలీ హెల్త్‌కేర్ బిజినెస్ ‘ఎన్కోర్ హెల్త్‌కేర్’ నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ‘ఇన్నోవేషన్’ ‘రిసెర్చ్’ ‘ఎన్కోర్ హెల్త్‌కేర్’ కు ప్రాణనాడిలాంటివి. కుటుంబం నమ్మిన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంతో పాటు, న్యూయార్క్ యూనివర్శిటీ చదువు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాధిక అంబానీకి బలమైన పునాదిని ఏర్పర్చింది. భరతనాట్యంలో రాధిక అంబానీ మంచి పేరు తెచ్చుకుంది. -
గురుబ్రహ్మ అమ్మ అవుతున్న వేళ...
రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి. రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు. అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి. అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని మాండీ జిల్లా థునాగ్ ప్రాంతమంతా కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్‌లోని ‘కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్‌లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క పొంచి ఉన్న వరద ముప్పు! ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్‌ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!! అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్‌కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్ వైరల్ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్ బరస్ట్ టైమ్‌లో ఫ్లాష్ఫ్లడ్స్లాగే!!‘ఆ స్టూడెంట్స్ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు. -
జస్ట్ 15 నిమిషాల జర్నీలో అద్భుత జీవిత పాఠం..! డబుల్ ఎంఏ, ఏడు భాషలు..
మనకే అన్ని తెలుసు. మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని తెగ పొంగిపోతుంటాం. కానీ కాసేపు సరదాగా బయటకు వెళ్లగానే ఆ కొద్ది నిమిషాల్లో మనకు పరిచయమై అపరిచివ్యక్తులు చాలా విషయాలను నేర్పిస్తారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురవ్వుతుంది. కానీ ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తి మాత్రం ఎదురయ్యి ఉండడు. ఈ యువకుడికి ఎదురైన అనుభవం వింటే..మనకు తెలియని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయని అంగీకరించకుండ ఉండలేరు. ఇంతకీ ఏం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ అభినవ్ మైలవరపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసుఉన్నారు. తన స్నేహితులతో కలిసి బెంగళూరులోని డీమార్ట్ షాప్‌కి వెళ్లి బాగా అలసిపోయి తిరిగి వచ్చి ఓ ఆటో ఎక్కి వస్తుండగా ఓ మంచి అనుభవం ఎదురైందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అప్పటిదాక ఉన్న మా అలసట మొత్తం ఉఫ్ మని ఎగిరిపోయూలా గొప్ప అనుభూతిని పంచాడు ఆ ఆటో డ్రైవర్ తనకెదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఆ రోజుఆటోలో వెళ్తూ సరదాగా ఆ డ్రైవర్‌తో మాటలు కలిపినట్లు తెలిపాడు. "అతడు కూడా సరదాగా మాట్లాడుతూ..వాళ్లకో సవాలు విసిరాడు. కంప్యూటర్ అనే పదం ఫుల్ ఫామ్ చెప్పమని అడిగాడు. ఒకవేళ దానికి సమాధానం చెబితే గనుక తాను తమ వద్ద నుంచి ఈ జర్నీకి అయ్యే డబ్బులు కూడా ఛార్జ్ చెయ్యనని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌కి తెలుసు తాము కచ్చితంగా సమాధానం ఇవ్వలేమని అంటున్నాడు అభినవ్. చివరికి ఆ డ్రైవరే కంప్యూటర్ అంటే: వాణిజ్యం, విద్య మరియు పరిశోధన కోసం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే సాధారణ యంత్రం ((COMPUTER)Commonly Operated Machine Purposely Used for Trade, Education and Research) అని చెబుతాడు. తాను 1976 ఆ టైంలో చదువుకున్నానని, అప్పడు అంతా కంప్యూటర్లు వస్తాయనేవారు..కానీ ఇప్పడంతా ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు ఆ డ్రైవర్. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పితామహుడు ఎవ్వరని ప్రశ్నించడమే గాక ఆ భాష చరిత్ర గురించి వివరిస్తూ..తన గురించి చెప్పుకొచ్చాడు. తాను డబల్ ఎంఏ చేశానని, ఒక ఇంగ్లీష్, మరొకటి పొలిటికల్ సైన్స్లోనని చేసినట్లు తెలిపాడు. సడెన్‌గా పెళ్లి ఫిక్స్ చేయడం, తర్వాత పిల్లలు, బాధ్యతలు వల్ల చదువు కొనసాగించలేకపోయానని అన్నాడు. తాను కూడా ఐఏఎస్‌కి ప్రిపరయ్యే వాడినని చెప్పుకొచ్చాడు. తాను పలు ఎంఎన్సీ కంపెనీల్లో అధిక వేతనానికి పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇచ్చే జీతానికి తగ్గట్టుగా అక్కడ కార్పొరేట్ అధికారులు మనల్ని ఎలా పనులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారో కూడా చెప్పాడు. అప్పటి దాక షాపింగ్‌తో అలసిన వాళ్లకి ఆ డ్రైవర్ మనోగతం జీవితంపై స్పష్టత వచ్చేలా కళ్లు తెరిపించి ఓ గొప్ప పాఠాన్ని వివరించినట్లుగా అనిపించింది. అంతేగాదు ఆ ఆటోలో ప్రయాణించిన 15 నిమిషాల జర్నీ జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతినిచ్చింది అని వీడియోలో చెప్పుకొచ్చాడు అభినవ్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Abhinav Mylavarapu (@abhinav.mylavarapu) (చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
భక్తి పారవశ్యం: చేతుల్లో పాములతో ఆలయానికి.. వీడియో చూస్తే గగుర్పాటే
భక్తి అనేది పలు రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, దాస్యం అను నవవిధ భక్తి మార్గాలు గురించి విన్నా. కానీ ఇలాంటి భక్తి మార్గాన్ని మాత్రం చూసుండరు. ఆ భక్తి చూస్తేనే షాక్‌కి గురిచేసేలా ఉంటుంది. అలాంటి భక్తి పారవశ్యాన్ని బీహార్‌లో చూడొచ్చు. ఆ భక్తుల అసమాన భక్తికి భయం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలుగుతాయి.బీహార్‌లోని సమస్తిపూర్లోని సింగియా ఘాట్ వందలాది మంది భక్తులతో సందడిగా ఉంది. వారంతా నాగ పంచమి ఉత్సవంలో పాల్గొనడానికి పెద్త ఎత్తున వచ్చారు. అక్కడ మతపరమైన ఆచారంలో భాగంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పాములను ఉట్టి చేతులతో నేరుగా పట్టుకుని వెళ్లే సాంప్రదాయం చూస్తే నోటమాట రాదు. అక్కడి ప్రజలంతా సింగియా బజార్‌లోని మా భగవతి ఆలయంలోకి ఆ పాములను తీసుకుని వెళ్తున్నారు. వారంతా ఆ పాములును కర్రలకు లేదా తలకు, చేతులకు చుట్టుకుని తీసుకువెళ్తుడటం విశేషం. అది చాలా సర్వసాధారణం అన్నట్లుగా ఆ పాములను చేత్తో పట్టుకుని స్థానిక సర్ప దేవత అయిన మాతా విషరి నామాన్ని జపిస్తూ మా భగవతి ఆలయానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత పూజలు చేసి వాటిని అటవీ ప్రదేశంలో వదిలేస్తారట. అక్కడ బిహార్ చుట్టుపక్కల గ్రామలైన ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, మిథిలా, ముజఫర్‌పూర్ జిల్లాతో సహా అంతటా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. విదేశీయలును ఆకర్షించే ప్రధాన ఉత్సవం కూడా ఇదే. అయితే అక్కడ స్థానికులు మాత్రం ఇదంతా సంప్రదాయమని చెబుతుండటం విశేషం. ఊరేగింపుగా పాములను తీసుకొచ్చి పవిత్ర తోటలు లేదా ఆవరణంలో వాటిని ఉంచి పూజలు చేస్తారట. వారంతా తమ కుటుంబ రక్షణ, ఆరోగ్యం కోసం నాగ దేవతను ఇలా ప్రార్థిస్తారట. కోరికలు తీరిన తర్వాత నాగపంచమి నాడు కృతజ్ఞతగా నైవేద్యాలు నివేదించి ఇలా పాములను చేత పట్టుకుని ఉత్సవం చేస్తారట. అయితే ఇంతవరకు ఈ ఉత్సవంలో అప్పశృతి చోటు చేసుకోలేదట. పైగా ఈ పండుగలో ఇంతవరకు ఎవ్వరికి పాము కాటు, లేదా గాయం అయిన దాఖాలాలు కూడా లేవట. ఆ విచిత్రమైన పండుగకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pradeep Yadav (@br_vlogger17) (చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
మిరాకిల్.. వెంటిలేటర్ తీయగానే, షేర్ సింగ్ బతికొచ్చాడు!
‘‘బాజా భజంత్రీలతో కళకళలాడాల్సిన ఇల్లు..వల్లకాటిలా మారిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే...తాళి కట్టిన చేతులతోనే.’’ ఇలాంటి వార్తలను చదివి, వినీ వినీ విసిగిపోయిన వారికి నిజంగా ఇది మిరాకిల్. బంధువులంతా బరువెక్కిన గుండెలతో, అశ్రునయనాలతో అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ చనిపోయిన మనిషి తిరిగి బతికి వచ్చాడు. హర్యానాలో అద్భుతం జరిగింది. దీంతో ఆ కుటుంబం తొలుత ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత్యక్రియల కోసం చేసిన ఏర్పాట్లన్నీ అంతులేని ఆనందంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కోట్ మజ్రిలో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. షేర్ సింగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం షేర్ సింగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సహ్యులు అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలకు కలప శ్మశానవాటికకు చేరుకుంది. దూరం నుండి వచ్చిన అతిథులు, ఇతరుల కోసం ఆహారం కూడా సిద్ధం చేశారు. అంత్యక్రియలకు సన్నాహాలు పూర్తయ్యాక, స్నానం చేయించే ముందు అతని వెంటిలేటర్ ట్యూబ్‌ను తొలగించారు. ఆ మరుక్షణంలో అతను కళ్ళు తెరిచి దగ్గు ప్రారంభించాడు. షేర్‌సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. విచిత్రంగా వెంటిలేటర్ పైపు తొలగించగానే, షేర్ సింగ్ ఆకస్మికంగా ఊపిరి పీల్చుకోవడం ఆనందాన్ని కలిగించిందని స్థానిక మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ తెలిపారు అందరూ ఆనందంగా భోజనాలు ముగించి అదృష్టవంతుడు షేర్ సింగ్ అంటూ మనుసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా తమ తమ ఇళ్లకు చేరారు.ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా -
పార్లమెంట్ ఫుడ్ మెనూ..! లిస్టు చూసేయండి!
పార్లమెంటు క్యాంటీన్లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసా..!. ఎప్పుడైనా దీని గురించి విన్నారా అంటే..చాలామందికి తెలియదనే చెప్పాలి. అధికారులు, శాసనసభ్యులు, మహామహారథులు ఉండే ఆ శాసనసభలో వారికి మంచి విలాసవంతమైన భోజనమే క్యాంటిన్లో ఉంటుదనేది వాస్తవమే. కానీ ఈసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది పార్లమెంట్. అక్కడ క్యాంటీన్ మెనూలో ఎలాంటి వంటకాలు చేర్చారంటే..మంచి రుచికరమైన థాలిస్, కూరలను అందిచిన పార్లమెంట్ క్యాంటీన్ ఇటీవలే దాని మెనూని సరికొత్త వంటకాలతో మార్పులు చేసింది. ఇదివరకటిలా నెయ్యి, నూనెతో కూడిన భారీ భోజనాలకు స్వస్తి చెప్పేసేలా ఓ ముందడుగు వేసింది. ఆ వంటకాల స్థానంలో.. సుదీర్ఘ గంటలు పనిచేసే శాసనసభ్యుల్లో ఉత్సాహం నింపేలా, జోవర్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీలు, శక్తిమంతమైన సలాడ్లు, కాల్చిన చేపలు సర్వ్ చేయనుంది. దీన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. మెనూలో రుచి, పోషకాహారాన్ని కోల్పోకుండా ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంతేగాదు ఇక్కడ అందించే ఫుడ్ పోషకాహార నిపుణుల మార్గదర్వకత్వంలో జాతీయ ఆరోగ్య ప్రచారానికి అనుగుణంగా ఉంటుందట. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి ఆరోగ్యప్రదాయకమైన వంటకాలతో సమతుల్య ఆహారానికే పెద్దపీట వేసేలా అందించనుంది. ఈ విభిన్న రుచులకు అనుగుణంగా ప్రతి వంటకం పక్కన కేలరీ ట్యాగ్‌ని కూడా ఇస్తారట. ఈ విధానం జాగ్రత్తగా తినడాన్ని ప్రోత్సహిస్తుందట.ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత అల్పాహార వంటకాల నుంచి 270 కిలో కేలరీలతో నిండిన సాంబార్‌తో రాగి ఇడ్లీ, 206 కిలో కేలరీలతో కూడిన జోవర్ ఉప్మా, మూంగ్ పప్పు చిల్, చనా చాట్, ఉడికించిన కూరగాయలు (157 కిలో కేలరీలు) ఉండగా, మాంసాహార ప్రియుల కోసం గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లను సర్వ్ చేయనుంది. ఎంపీలు (పార్లమెంటు సభ్యులు) ఇప్పుడు ఇక స్నాక్స్, పానీయాల కోసం..గార్డెన్లో పండిన తాజా పండ్ల సలాడ్లు(113 కిలో కేలరీలు), క్లియర్ సూప్, కాల్చిన టమోటా, తులిసి షోర్బాల వంటి జ్యూస్‌లు సిప్ చేయొచ్చు. అలాగే భోజనాన్ని చివరగా తీపి పదార్థం ముగించేలా మిక్స్ మిల్లెట్ ఖీర్ కూడా అందించనున్నారు. సుదీర్ఘ గంటలు పనిచేసే నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆరోగ్యదాయకంగా రూపొందించారు ఈ మెనూని. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం ప్రకటించి..చిరు ధాన్యాలకు భారీ ప్రచారం లభించింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంటులో మెనూలో ఈ సరికొత్త మార్పులు చేశారు. అలాగే శరీరం రోజువారీ అవసరాలను తీర్చడానికి పిండి పదార్థాలు, కేలరీలు, సోడియం తక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా మెనూని చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారు. పని చేసే అధికారులలో ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు వంటి ఆందోళనలకు చెక్ పెట్టేలా ఈ మెనూని అత్యంత ఆరోగ్యదాయకంగా రూపొందించడం విశేషం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
రూ. 8.6 లక్షల మెన్స్ బ్యాగు, షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) ఇటీవల అరుదైన, విచిత్రమైన, ఖరీదైన ఉత్పత్తులతో వార్తల్లో నిలుస్తోంది. పారిస్‌లో జరిగిన మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 షోలో ఈ సరి కొత్త బ్యాగ్‌ను లాంచ్ చేసింది. లైఫ్‌బాయ్ రింగ్‌లా వున్న ఈ బ్యాగు ధర చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అదీ పురుషుల బ్యాగ్ ఇంత ధర పలకడం నెట్టింట సంచలనంగా మారింది.ఈ బ్యాగ్ ధర సుమారు 10,000 డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో రూ. 8,60,000. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ లెదర్ కాన్వాస్‌తో దీన్ని తయారు చేసింది. చక్కటి స్టోరేజ్ స్పేస్‌తో బ్యాగ్‌లో మూడు వేర్వేరు జిప్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎడ్జస్టబుల్ లెదర్ స్ట్రాప్ కారణంగా భుజంపై లేదా క్రాస్-బాడీగగా వేసుకోవచ్చు. దీంతో లూయిస్ బ్రాండ్ అంతే మరి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాగ్ సృజనాత్మక డిజైన్, కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ లగ్జరీ బ్యాగు హాట్ కేకుల్లా సేల్ కావడం విశేషమేమరి. లూయీ విటోన్ గతంలో విమానం, డాల్ఫిన్, లాబ్‌స్టర్ ఆకారంలో బ్యాగ్‌లను తయారు చేసిన చరిత్ర ఉంది. ఇవన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా -
కాపాడిన దైవం : మనమే గొప్పఅని భ్రమపడితే!
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ’అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్దం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికిసాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?.. అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు. ఈప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’ శాపగ్రస్తుడా.. దుర్మార్గుడా..దూరంగా పారిపో..’అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరో పాచిక విసురుతూ..’జీలానీ ..నిన్నునీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ’కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు..నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది. దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు.– మదీహా -
మిగాలోపుని మరణం
పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను. మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ హద్దు దాటిపోతే, మన ΄ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు.తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకిపోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది. ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమై΄ోయింది ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేక΄ోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
'కెరీర్'.. వెరీ కేర్‌ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్‌ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్‌ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్‌లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్‌కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్‌కు బేసిక్‌గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్‌టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం, గేట్–ఎమ్‌టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్‌గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్‌షిప్‌తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి పార్లమెంటు, లోక్‌సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్‌పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్‌గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్‌పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్‌కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి. -
114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్‌గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్‌లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్లు పూర్తి చేశారు. అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్‌లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్‌గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు. అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా. తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్‌లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు. ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్‌కీ బాత్‌లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం. (చదవండి: హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి
‘మేరోరపి సారతరా భక్తిః.’ అంటే భక్తి మేరు పర్వతం కంటే కూడా మిక్కిలి శక్తి కలదీ, ఉన్నతమైనదీ అని అర్థం. సర్వము భగవద్విలసితంగా భావించి, ఆ భావనతో ఆత్మార్పణ చేసుకొనే పరిశుద్ధ స్థితి భక్తికి పరాకాష్ఠ. ఇదే నిజమైన భక్తి! గురుభక్తి కూడా ఇంతే! గురువునే దైవ భావంతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవితాన్ని కైంకర్యం చేసుకోవటం నిర్దుష్టమైన భక్తికి సరిహద్దు. భగవదనుభూతికి అనేక మార్గాలు న్నాయి. కానీ అందరికీ అందుబాటులో అనుసరణీయమైన మార్గం మాత్రం భక్తి మార్గమే. విభిన్న రుచులు గల మానవుల మనస్సుకు నచ్చిన విధంగా స్వీకరించదగిన విధానాలు భక్తిమార్గంలో ఉన్నాయి. అవే నవవిధ భక్తి మార్గాలు: ‘శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం అర్చనంవందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్’ అని శ్రవణ కీర్తనాదులు చెప్పబడినాయి. ఆ యా భక్తుల రుచులను అనుసరించి ఈ నవవిధాలు అనుసరింపబడతాయి. భక్తి అనేది శ్రవణంతో ప్రారంభమై బలపడుతూ, చివరిదైన ఆత్మనివేదనంతో పరిపూర్ణం అవుతుంది. అత్మనివేదనం గల భక్తులకూ భగవంతునికీ భేదమే కనబడదు. ఈ విషయంలో గోపికల భక్తి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదీ చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?‘ఓ అర్జునా! నా సేవ కోసమే గోపికలు తమ శరీరాన్ని రక్షించు కొంటున్నారు. అందువల్లనే నిగూఢమైన నా ప్రేమకు వారు పాత్రు లయ్యారు’ అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు. అలాగే దాన ధర్మాలు చేసినా... భక్తి భావంతో ప్రతిగ్రహీతను విష్ణువుగా భావించి దానమిస్తే దానికి విలువ ఉంటుంది. ఒక రోజు ఓ రాజసభలో ఉన్న సాధువుతో ‘నేను తల్చుకుంటే మిమ్మల్ని గొప్ప సంపన్నుణ్ణి చేయగలను’ అన్నాడు రాజు. సాధువు ఆ మాటకే మాత్రం పొంగిపోకుండా: ‘రాజా! దయవుంచి ఒక కాటా తెప్పించండి. అందులో ఒక వైపు నాకీయదలచిన సంపద ఉంచండి’ అని అన్నాడు. దానికి రాజు సరే అని వెంటనే ఆ యేర్పాటు చేశాడు. నగలు, నాణాలు, బంగారం, వజ్రాలు వంటి వెన్నో ఒక వైపు ఉంచాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ఒక చిన్న ఆకును తెచ్చి ఆ రెండవ తక్కెటలో వేశాడు. అంతే కాటాలో వేసిన రాజుగారి సంపదకంతా ఈ ఆకు సమానంగా తూగింది. కాస్త మొగ్గు కూడా ఉంది. రాజుకు గర్వ భంగం అయింది. నిజమైన భక్తునికి ప్రతి జీవిలోనూ అంతర్యామిగా భగవంతుడే కనబడతాడు. నిజమైన భక్తుల్లో చివరికి ఆత్మజ్ఞానం సుసంపన్నమైన వాళ్లు మోక్షా ర్హులవుతారు అని స్వామీజీ అనుక్షణం ప్రబోధిస్తుంటారు.జయ గురు దత్త!-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది వినోదం. విపరీతమైన పని ఒత్తిడికి దారి తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల లోకంలో విశ్రాంతి దానితో పాటే వినోదం కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందుకు అనుగుణంగానే అనేక రకాల వినోద మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. తమ ప్రజల్ని వినోదభరితంగా ఉంచడానికి అనేక దేశాల్లో ప్రభుత్వాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యంత వినోదభరిత దేశంగా ప్రజలు ఏ దేశాన్ని గుర్తిస్తున్నారు? అనే ఆలోచనతో ది యుఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఆధ్వర్యంలో ది వరల్డ్స్ మోస్ట్ ఫన్ కంట్రీస్ పేరిట తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. వినోదాన్ని పంచే వేడుకలు, ఈవెంట్లు, సాహసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు..వగైరాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దాని ప్రకారం వినోద భరిత జీవనాన్ని అందించే 40 దేశాల జాబితాను రూపొందించారు. ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. స్పెయిన్ అత్యుత్తమ వినోద భరిత దేశంగా నిలిచింది. సాహసాలు, సంస్కృతీ సంప్రదాయల పరంగా 4వ స్థానంలో నిలిచిన ఈ దేశం మొత్తంగా చూస్తే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా స్పెయిన్‌లో నిర్వహించే టమాటినా ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రపంచలోనే అతిపెద్ద టమాటా ఫెస్టివల్‌గా వందల కొద్దీ టన్నులను దీని కోసం వినియోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని వినోదాలు, అడ్వంచర్స్ కూడా స్పెయిన్‌ను ఈ అంశంలో అందలాలు ఎక్కించాయి.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, ఇటలీ, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఐర్లాండ్, సింగపూర్, టర్కీ, అమెరికా, కెనడా, కోస్టారికా, ఐస్‌ల్యాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, కొమెనిక్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, బెల్జియం, మొరాకో, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇండోనేషియా, యుఎఇ, చిలీ, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, పెరు, స్వీడన్, డెన్మార్క్‌లు ఉన్నాయి.ఈ జాబితాలో ఎక్కడా ఇండియాకు చోటు దక్కకపోవడం విశేషం. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం ఇంకా కొన్ని రకాల కట్టుబాట్లను సంకెళ్లను తెంచుకోకపోవడం అలాగే మన దేశంలో వినోదం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు లేకుండా మన పండుగలు, సంప్రదాయ జాతరలు వంటి వాటిలో అది మమేకమైపోవడం వంటి పలు కారణాలు ఉండవచ్చునని అంటున్నారు. అంతేగాక ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న ప్రజలు, ప్రాంతాలను బట్టి కూడా ఇది ఆధారపడి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు.(చదవండి: చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?) -
భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?
భారతీయులకు శుభవార్త. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. రూ. 7,500కే వీసా అందిస్తోంది. ఫ్రాన్స్, యుఎస్, యుకె, స్పెయిన్ కాదు, మరేంటి ఆ దేశం! ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదా. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.వీసా దరఖాస్తు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, కొన్నిసార్లు అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి కొంత ఖర్చుతో కూడుకున్నదే. వీసా ఫీజు ఎంత అనేది ఆయా దేశాలను బట్టి మారుతుంది.ప్రతి ఒక్కరూ ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పని చేసి మంచి డబ్బు సంపాదించాలని కలలు కంటారు. అయితే, ఖరీదైన వీసాల కారణంగా, ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు, రూ.7,500 కంటే తక్కువకే వీసాను అందించడమే కాకుండా, అక్కడ ఒక ఏడాది దాకా పని చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ దేశం పేరే జర్మనీ. రొమాంటిక్ రైన్ వ్యాలీ నుండి బవేరియాలోని అద్భుత కోటలు, గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది జర్మనీ. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు , అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయూ యేతర నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి, జర్మనీ ఫ్రీబెరుఫ్లర్ వీసా అని కూడా పిలిచే ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా( ఫ్రీలాన్సర్లుగా) పని చేయడానికి వీలు కల్పిస్తుంది. హైక్వాలిటీ లైఫ్ గడపాలనుకునే వారికి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, పర్యాటకులకు గొప్ప అవకాశం అంటూ ఊరిస్తోంది. ఎవరు అర్హులుభారతదేశంలోని జర్మన్ మిషన్ల ప్రకారం, జర్మన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 కింద ఈ క్రింది వర్గాల ఫ్రీలాన్స్ వీసాలు పొందే అర్హత వీరికి ఉంది.ఇండిపెండెంట్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలుకళాకారులు, ఉపాధ్యాయులు , విద్యావేత్తలున్యాయవాదులు, నోటరీలుపేటెంట్ ఏజెంట్లుసర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లుపశువైద్యులువాణిజ్య రసాయన శాస్త్రవేత్తలుఅకౌంటెంట్లు, పన్ను సలహాదారులుకన్సల్టింగ్ ఆర్థికవేత్తలు, స్వార్న్ అకౌంటెంట్లు, పన్ను ఏజెంట్లుదంతవైద్యులు, వైద్యేతర నిపుణులు, ఫిజియోథెరపిస్టులుజర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వ్యాఖ్యాతలుఅనువాదకులు, పైలట్లు , ఇతర సారూప్య వృత్తులు.ఫ్రీలాన్స్ వీసా అంటే ఏంటి? అర్హతలు, పైన పేర్కొన్న వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు ఫ్రీలాన్స్ వీసాను వినియోగించుకోవచ్చ. వీసా కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు , అర్హత రుజువుతో సహా కొన్ని అవసరాలను తీర్చాలి. వీసా కోసం చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా కూడా అవసరం.అదనంగా, దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరప్‌లోని వారి సంబంధిత వృత్తిపరమైన రంగంలో వ్యాపార పరిచయాల ఉన్నవారి వివరాలను, వారి ఫ్రీలాన్స్ జాబ్ వివరాలపై సమగ్ర సమాచార మివ్వాలి.ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలుఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (6 నెలల కంటే పాతవి కానివి), ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ వర్క్, అర్హత రుజువుతో సహా అనేక దృవీకరణ పత్రాలను సమర్పించాలి. జర్మనీలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా ఇతక సంస్థనుంచి డిగ్రీ చదివి ఉండాలి.. 75 యూరోలు లేదా రూ. 7,486 వీసా రుసుము, సుమారుగా. 45 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవీ విరమణ ప్రయోజనాల ధృవపత్రాలు అవసరం.జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా జర్మనీలోకి ప్రవేశించే ముందు స్వదేశం నుండి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌తో అపాయింట్మెంట్ తీసుకొని, అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా మంజూరైన తరువాత జర్మనీకి వెళ్లిన తరువాత రెండు వారాలలోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత, వారు ఫ్రీలాన్సర్‌గా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందినివాస అనుమతి ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుతుంది. ఆ తరువాత సంబంధిత నియమాలకు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి వీసా రెన్యూల్ అవుతుంది. జర్మనీలో వరుసగా ఐదేళ్ల నివాసం తరువాత వారి ఫ్రీలాన్సర్ భాషా ప్రావీణ్యం, ఆర్థిక పరిస్థితి అక్కడి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్‌ను పొందాలి.ఫ్రీలాన్స్ వీసా ప్రయోజనాలుఫ్రీలాన్స్ వీసా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాప్యత మరియు అధిక నాణ్యత గల జీవనంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రీలాన్స్ వీసాతో, వ్యక్తులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని తద్వారా జర్మన్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడవచ్చు. అన్నీ సవ్యంగా ఉండి, అక్కడి భాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాణాల కనుగుణంగా వుంటే ఫ్రీలాన్స్ వీసా శాశ్వత నివాసానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది, ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. -
సిరికాకొలనులో సీత..!
గుణశేఖర్ ‘రామాయణం’ గుర్తుందా? రాముడుగా జూ. ఎన్టీఆర్‌తోపాటు సీతగా.. స్మితామాధవ్ ప్రేక్షక మనసులను కట్టిపడేసింది! సినిమాల్లో కనిపించకపోయినా.. నాట్యంతో, గానంతో కళాభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది!ఇటీవల ‘సిరికాకొలను చిన్నది’ నృత్యరూపకంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాసి స్మిత గురించి మరిన్ని విషయాలు, విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘నిజానికి.. వేటూరి సుందర రామ్మూర్తి ‘సిరికాకొలను చిన్నది’ రేడియో డ్రామాను కె. విశ్వనాథ్‌గారు సినిమాగా తీయాలనుకున్నారట. ఎందుకనో కుదరలేదట. 2019 ఎండింగ్లో ఆయన ఆ స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చి నన్ను చేయమన్నారు. కోవిడ్ రావడంతో ఆ ప్రాజెక్ట్ లేట్ అయింది. నేను చేసిన ఆ నృత్యరూపకానికి చాలా ప్రశంసలు అందాయి. కె. విశ్వనాథ్‌గారు ఉండి ఉంటే చాలా మురిసిపోయేవారు. నా ప్రదర్శనకు వాళ్ల అబ్బాయి వాళ్లంతా వచ్చారు.. సంతోషమేసింది. విశ్వనాథ్గారున్నప్పుడు చేయలేకపోయాననే బాధ మాత్రం ఉంది. వారంటే నాకు చాలా అభిమానం, గౌరవం. వారి సినిమాల్లో నటించాలనే ఆసక్తి, ఆలోచన వచ్చేప్పటికే ఆయన సినిమాలు తగ్గించేసుకున్నారు. నా పెర్ఫార్మెన్సెస్ చాలా వాటికి వచ్చారు. కళ పట్ల నాకున్న కమిట్మెంట్ను మెచ్చుకునేవారు. నాకు ఊహ తెలిసేప్పటికల్లా భరతనాట్యం, కర్ణాటక సంగీతం క్లాసెస్‌లో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే మాది కళల నేపథ్యం ఉన్న కుటుంబం. మా అమ్మమ్మ, నానమ్మ పాడేవారు. అమ్మ (హేమ) పాడుతారు.. వీణా వాయిస్తారు. అన్నయ్య సిద్ధార్థ వీణ, వయొలిన్ నేర్చుకున్నాడు. అయితే మా ఇంట్లో ఆర్ట్‌ని ప్రొఫెషన్‌గా తీసుకుంది మాత్రం నేనే! భరతనాట్యంలో నా గురువు రాజేశ్వరీ సాయినాథ్, సంగీత గురువు లలితమ్మ.తాతగారి వల్లే సీత.. నా అరంగేట్రం గురించి పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి, నా గురించి వాకబు చేసి మా ఇంటికి వచ్చారు నిర్మాత, కవి ఎమ్మెస్ రెడ్డి. ‘మేము తీయబోయే ‘రామాయణం’ సినిమాలో మీ అమ్మాయిని సీతగా అనుకుంటున్నాం.. మీకు సమ్మతమేనా’ అని నాన్నగారిని అడిగారు. దాని మీద మా ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. మా తాతగారే చొరవ తీసుకుని ‘మంచి అవకాశం... పంపించండి’ అని తేల్చేశారు. అలా తాతగారి వల్లే ఆ సినిమాలో సీతగా నటించాను. రామాయణం తర్వాతా, హీరోయిన్‌గానూ చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఇటు డాన్స్ అండ్ మ్యూజిక్, చదువు, అటు సినిమాలు.. బ్యాలెన్స్ చేసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాల మీద దృష్టి పెట్టలేదు. నేను చదువులో కూడా క్వయిట్ గుడ్. లా (ఉస్మానియా యూనివర్సిటీ)లో గోల్డ్‌మెడలిస్ట్‌ని. కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం(మద్రాస్ యూనివర్సిటీ)లో మాస్టర్స్ చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. వీలున్నప్పుడల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను భరతనాట్యం అండ్ కర్ణాటిక్ మ్యూజిక్‌లో. బాలినీస్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. అనేక రకాల అంశాలలోమన దేశానికి, ఇండోనేషియాకు ఉన్న సంబంధం వల్ల నాకు ఆ దేశపు బాలినీస్ డాన్స్ అంటే ఆసక్తి పెరిగింది. అందుకే బాలీ (ఇండోనేషియా)వెళ్లి..కొన్నాళ్లుండి ఆ డాన్స్ నేర్చుకుని వచ్చాను.అండర్ ప్రివిలేజ్డ్కు ఫ్రీగా.. ఇరవై ఏళ్ల కిందటే అంటే కాలేజ్ డేస్‌లోనే ‘వర్ణా ఆర్ట్స్ అకాడమీ’ పేరుతో డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేశాను. దాదాపు వంద మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో అండర్ప్రివిలెజ్డ్ పిల్లలూ ఉన్నారు. వాళ్లందరికీ ఫ్రీగానే నేర్పిస్తాను. అయితే మిగతా పిల్లలెవరికీ వాళ్లు అండర్ ప్రివిలెజ్డ్ అని తెలియనివ్వం. అందరూ ఈక్వలే! ఎవరి ఆత్మవిశ్వాసమూ దెబ్బతినకూడదు కదా! అంతేకాదు మా ఆర్ట్స్కూల్కి అన్ని మతాలకు చెందిన పిల్లలూ వస్తుంటారు. అందరికీ అంతే శ్రద్ధతో నేర్పిస్తాం. చాలామంది దర్శకులూ వస్తుంటారు చైల్డ్ ఆర్టిస్ట్‌ల కోసం. 24 క్రాఫ్ట్స్‌తో కూడిన సినిమా అంటే నాకు ముందునుంచీ క్రేజే! ఇప్పుడు నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.స్త్రీల సమస్యలు కళ ద్వారా.. ‘సిరికాకొలను చిన్నది’ కంటే ముందు కూడా తమిళ్, సంస్కృత నృత్యరూపకాలు చాలా చేశాను. పర్సనల్‌గా ఫీలై.. నాకు నచ్చితే సబ్జెక్ట్, భాషా భేదాలు చూడను. ‘సిరికాకొలను చిన్నది’ కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో హార్డిల్స్ ఎదురయ్యాయి. ‘ఇంత కష్టపడ్డం అవసరమా?’అనడిగారు శ్రేయోభిలాషులు చాలామంది. అవసరమే! ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యాను ఆ ప్రాజెక్ట్‌తో. అలా నచ్చితే వెనక్కి తగ్గను. నేనెప్పుడూ ఓల్డ్ ఇన్ ద న్యూ.. న్యూ ఇన్ ద ఓల్డ్ని చూస్తాను. ఈ కోవలోనే మహిళలు, పిల్లలకు సంబంధించి అంశాలనూ నాకొచ్చిన కళద్వారా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేనేజ్మెంట్ స్కూల్స్ నా ్ర΄ోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్స్‌లోనూ వాళ్ల సమస్యలను రామాయణ, మహాభారతాల్లో ఉన్న స్టోరీస్‌కి అనుసంధానించి ప్రదర్శిస్తుంటాను. సమాజానికి కళలు అవసరం.. కళలకు సమాజం అవసరం. కళలు ఒత్తిడిని జయించేలా చేస్తాయి. అయితే దానికి పోటీని చేర్చకూడదు. పోటీ వల్ల సాంత్వన స్థానంలోస్ట్రెస్ చేరుతుంది. అందుకే ఒకటే చెబుతాను కళలు గురువులు నేర్పుతారు సంస్కారం మాత్రం పేరెంట్సే నేర్పాలి. పిల్లలను పిల్లలుగానే ఉండనివ్వాలి. వాళ్ల బాల్యాన్ని లాక్కోకూడదు’’ అని ముగించారు స్మితామాధవ్.తాతను అమెరికా పంపిన నానమ్మ.. మా నాన్న (పీబీ మాధవ్) వాళ్లు అయిదుగురు తోబుట్టువులు. వాళ్ల చిన్నప్పుడే ఏదో ఆరోగ్య సమస్యతో మా తాత (పీబీ కృష్ణస్వామి)గారు చూపుకోల్పోవడంతో ఆయన చేస్తున్న క్లర్క్ జాబ్ కూడా పోయింది. అప్పుడు మా నానమ్మ (సుగంధ కృష్ణస్వామి) తన నగలన్నీ అమ్మి.. తాతగారిని అమెరికా పంపించారు బ్రెయిలీలో టీచర్ ట్రైనింగ్ కోసం. ఆయన అమెరికా నుంచి వచ్చేసరికి నానమ్మ కూడా తన పిల్లలతో పాటు చదువుకొనసాగించి, ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని పోషించింది. తనూ ఎం.ఎ. ఎం.ఈడీ. చేసింది. తాతగారు ఇండియా వచ్చేసమయానికే కేంద్రప్రభుత్వం డెహ్రాడూన్‌లో బ్లైండ్ స్కూల్‌ను స్టార్ట్ చేసింది. దేశంలో అదే ఫస్ట్ బ్లైండ్ స్కూల్. దానికి తాతగారే ప్రిన్సిపల్. మా నానమ్మ దూరదృష్టికి నిదర్శనం అది. – సరస్వతి రమ(చదవండి: World Emoji Day: సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!) -
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం-విశిష్ఠత
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.– డా. పి. రాకేష్(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్లైన్ పాపులేషన్లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.‘వైవిధ్యమైన కెరీర్లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్ఫార్మల్ వర్క్ అండ్ ఇన్స్టేబిలిటీ.పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇన్ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీటెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.కొన్ని సంవత్సరాల క్రితం...‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా! (చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..) -
ఎండుకొబ్బరి ఎక్కువకాలం తాజాగా...
మరింత రుచికోసం కూరలు, స్వీట్లలో ఎండుకొబ్బరిని వినియోగిస్తుంటాం. దీనికోసం కొబ్బరిని ఇంట్లో నిల్వచేసుకుంటూ ఉంటాం. కానీ కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ...మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా గుడ్డతో తుడిచి, గంటసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపలా బయటా తుడవాలి. అలా తుడిచిన చిప్పలను ఎండలో ఆరబెట్టి, కవర్లో వేసి ఉంచాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే ఎక్కువ రోజులు చిప్పలు తాజాగా ఉంటాయి. (చదవండి: హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం
జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. చదవండి: అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చఎలా వెళ్లాలంటే..?తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి. చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్ ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం, ఆదికుంభేశ్వరన్ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్మిగు స్వామినాథన్ ఆలయం, సూర్యనాయర్ కోయిల్, పట్టీశ్వరం ఆలయం తదితరాలున్నాయి.– డి.వి.ఆర్. భాస్కర్ -
అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!
అవరోధాలు, అపజయాలు, ఆశాభంగాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎలాంటి వారినైనా మానసికంగా కుంగదీస్తాయి. ఎలాంటి సమస్యలూ లేకుండా జీవితం సాఫీగా సాగి΄ోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జాతకంలోని గ్రహాల బలాబలాల మేరకు కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని గోచార పరిస్థితుల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు బాధించకుండా ఉండాలంటే...రోజువారీ విధి నిర్వహణ కోసమే కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పనిమీదనే కావచ్చు... ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పండ్లు లేదా పూలు లేదా మిఠాయిలు వంటివి తీసుకురావడం మంచిది.చిన్న రాగినాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి, దానిని వీధిగుమ్మం దగ్గర తోరణానికి వేలాడదీయండి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది.ప్రతిరోజూ ఉదయాన్నే పక్షులకు తృణధాన్యాలను ఆహారంగా వేయండి. ఆర్థిక సమస్యలు శీఘ్రంగా తొలగి పోతాయి.గురువారం రోజున ఇష్టదైవానికి చెందిన గుడికి వెళ్లడం మాత్రమే కాదు, ఆ రోజున గురువులను, గురు సమానులను కలుసుకొని వారికి మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాదులను సమర్పించి, వారి ఆశీస్సులు తీసుకోండి. పూజ కోసం వినియోగించే అగరొత్తులు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కొనుగోలు చేయండి.– సాంఖ్యాయన -
విమాన ప్రయాణమంటే భయం..!
నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సేల్స్ హెడ్‌గా పని చేస్తున్నాను. నా జాబ్‌లో భాగంగా నేను తరచుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి రావడం కోసం ఎక్కువగా విమానంలో ప్రయాణం చేస్తాను. విమాన ప్రయాణం అంటే ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ΄ోయిన నెలలో అహమ్మదాబాద్‌లో విమానం కూలిపోయి చాలామంది చనిపోయారు కదా, ఆ సంఘటనకి సంబంధించిన వీడియోలు పదేపదే నేను టీవీలో, ఫోన్లో చూశాను. అప్పటి నుండి విమాన ప్రయాణం అంటే నాకు విపరీతంగా భయం వేస్తోంది. అసలు విమానం అనే పదం విన్నా, విపరీతమైన ఆందోళన, భయం వేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా లో ఏ రాష్ట్రంలో మీటింగ్ ఉన్నా ట్రైన్ లేదా బస్సులోనే వెళ్తున్నాను. ఒక్కొక్కసారి కారు డ్రైవర్‌ను తీసుకొని వెళ్తున్నాను. నా గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ నేను ఇలా భయపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక స్నేహితుడి సలహాతో హైదరాబాద్‌లో ఒకాయన హిప్నోనో థెరపీ చేస్తా అంటే వెళ్ళి కలిసాను. రెండు మూడు సెషన్స్‌కి వెళ్ళాను కానీ నాకు పెద్దగా ఉపయోగమనిపించలేదు. నాకు సైకియాట్రీ మందులు అంటే ఉన్న భయం వల్ల డాక్టర్ని కలవకూడదు అని ముందు అనుకున్నా, ఇంక నావల్ల కాక, ధైర్యం చేసి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను ఈ సమస్యనుండి ఎలాగైనా బయటపడవేయండి. రాజేష్, హైదరాబాద్ ముందుగా మీరు ధైర్యంగా మీ సమస్యను మాతో పంచుకున్నందుకు అభినందనలు. మనలో ఎవరైనా పెద్ద ప్రమాదాన్ని లేదా భూకంపాలు, వర దలు వంటి ప్రకృతి వైపరీత్యాలకి ప్రత్యక్షంగా గురైనపుడు లేదా అలాంటి తీవ్ర సంఘటనల గురించి పదే పదే వార్తల్లో, టీవీలో, ఫోన్లో చూసినప్పుడు మన మెదడు ఒక రకమైన షాక్‌కి లోనవుతుంది. దీనిని సైకాలజీ పరిభాషలో ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. ఇలాంటి పరిస్థితిలో మనసుకి విపరీతమైన ఆందోళన, భయం, పీడకలలు రావడం, నిద్ర పట్టక΄ోవడం, ప్రమాదం జరిగిన ప్రదేశం లేదా ఆ రకమైన వాహనాన్ని చూసినప్పుడు తీవ్రభయం కలగడం చూస్తుంటాం. ఇది మొదలుకొని కొన్నిసార్లు దీర్ఘకాలిక పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్‘ కి దారి తీయవచ్చు. మీరు ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను పదే పదే చూసిన కారణంగా మీ మెదడు ‘విమాన ప్రయాణం అంటే ప్రమాదం’ అనే సంకేతాన్ని ముద్రించుకుంది. దీన్ని ‘క్లాసికల్ కండిషనింగ్‘ అంటారు. ఈ పరిస్థితి వల్ల మీరు ‘ఏరో ఫోబియా’ అంటే విమాన ప్రయాణ భయం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది తీవ్రమైన సమస్యగా అనిపించినా, మంచి చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించే వీలుంది. చికిత్సలో భాగంగా గ్రాడ్యుయేటెడ్ ఎక్సో్పజర్ థెరపీ, ‘కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్‘ వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘వర్చువల్ రియాలిటీ‘ వంటి ఆధునిక వైద్య విధానాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. మిమ్మల్ని వివరంగా పరీక్షించిన తర్వాత మీ సమస్య తీవ్రతని బట్టి అవసరమైతే కొన్ని మందులు తాత్కాలికంగా వాడాల్సి రావచ్చు. అయితే ఈ చికిత్సలు అన్నీ కూడా నిపుణులైన సైకియాట్రిస్ట్, లైసెన్స్ పొందిన క్లీనికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. ఓపికగా, నమ్మకంగా చికిత్స కొనసాగిస్తే మీరు మళ్ళీ మునుపటిలా విమాన ప్రయాణాలు చేయగలరు. ఆల్ ది బెస్ట్ ! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..) -
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
72 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఇచ్చి భారీ జీతం పొందిన అండర్ గ్రాడ్యుయేట్‌గా వార్తల్లో నిలిపింది. సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో రోబొటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న రితుపర్ణ గతంలో చేసిన ప్లేస్మెంట్ ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో ఇంత భారీ అవకాశాన్ని పొందగలిగింది. ఈ కాలపు యువతకు స్ఫూర్తిని ఇవ్వదగ్గ రితుపర్ణ పరిచయం...రితుపర్ణ కథ అచ్చు సినిమా కథలాగే మలుపులతో ఉంటుంది. సామాన్యమైన అమ్మాయని అందరూ అంచనా వేస్తే అసామాన్యురాలిగా కనిపించి, నిరూపించి నివ్వెర పరిచింది. అర్హతలున్నాయా అని ప్రశ్నించిన చోటే ఆశ్చర్య పోయే అంగీకారం పొందింది. మరి ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.73.3 లక్షల ప్రీ–ప్లేస్మెంట్ ఆఫర్ పొందడం అంటే మాటలా? దేశంలో ఈ అవకాశాన్ని పొందిన అతి కొద్దిమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరు కె.ఎస్. రితుపర్ణ.డాక్టర్ కాబోయి...కర్నాటకలోని తీర్థహళ్లి తాలూకా కోడూరుకు చెందిన కె.ఎన్.సరేష్, గీత దంపతుల కుమార్తె రితుపర్ణ. ఆమె చెల్లెలు రిత్విక. రితుపర్ణ పీయూసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్ చదవాలని అనుకుంది. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్నది ఆమె కల. ఇందుకోసం 2002లో నీట్ రాసింది. అయితే ఆమెకు ప్రభుత్వ సీటు రాలేదు. ప్రైవేటులో చదివేంత స్థోమత లేదు. ఆ సమయంలో ఇంజినీరింగ్‌లో చేరమని ఆమె తండ్రి సలహా ఇచ్చారు. ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని సలహా ఇచ్చారు. అలా సీఈటీ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు సం పాదించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్‌లో చేరింది రితుపర్ణ. మొదట్లో బి.టెక్ పట్ల అంత ఆసక్తి చూపక పోయినా రాను రాను ఆసక్తి పెంచుకొని ఉన్నతి సాధించింది. రోబొటిక్స్ కోర్సు ఆసక్తికరంగా అనిపించి కొత్తగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె ఆవిష్కరణదేశానికి వెన్నెముకగా నిలిచే రైతు వ్యవసాయంలో ఇంకా శ్రమపడుతూ ఉన్నాడు. అతని శ్రమను తగ్గించే క్రమంలో ఏదైనా కొత్తగా కనుక్కుంటే బాగుంటుందని ఆమె భావించింది. ప్రధానంగా వక్కలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆమె గమనించింది. ఆ శ్రమను తగ్గించేందుకు తన బృందంతో కలిసి రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణ గోవా ఐనెక్స్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఇది ఆమె తొలి విజయం. తరువాత ఎన్ఐటీకే సూరత్కల్లోని పరిశోధనా బృందంలో రితుపర్ణ చేరింది. అక్కడ ఆమె ప్రాజెక్టులు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ను కలిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ అభివృద్ధికి కృషి చేసింది. అందరూ తన ప్రతిభను మెచ్చుకుంటున్నా రితుపర్ణ దృష్టి మాత్రం అంతర్జాతీయ గుర్తింపుపైనే ఉంది. ఇదీ చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!రోల్స్ రాయిస్ సందేహంతన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఇంటర్న్‌షిప్ కోరుతూ రోల్స్ రాయిస్‌ను సంప్రదించింది రితుపర్ణ. అయితే అక్కడి నుంచి ఆమెకు విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘మీరు మా సంస్థలో భాగం కావడానికి అర్హతలున్నాయా?‘ అని మొదలుపెట్టి, ‘ఒక నెలలో మేం చెప్పే పనుల్లో ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేరని‘ అని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో కంపెనీ తన అర్హతను ప్రశ్నిస్తోందని ఆమె అర్థం చేసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోరింది. కంపెనీ అంగీకరించి ఒక నెల గడువు తో కూడిన పనిని అప్పగించింది. దీక్ష, పట్టుదల, సంకల్పంతో నెల రోజుల గడువున్న ఆ పనిని ఆమె వారంలోనే పూర్తి చేసింది. ఆమె వేగం, కచ్చితత్వం, పట్టుదలకు రోల్స్ రాయిస్ యాజమాన్యం ఆశ్చర్య పోయింది. ఆమెపై నమ్మకంతో మరిన్ని పనులు అప్పగించారు. అలా ఎనిమిది నెలల పాటు ఒక పక్క కళాశాలకు వెళ్తూనే మరోవైపు వారిచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ ఆమెకు వారి జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో ప్రీ–ప్లేస్మెంట్ అవకాశాన్ని అందించింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ కంపెనీలో పనిచేస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చేది రితుపర్ణ. ఆమె పనితీరు గమనించి తన ప్రారంభ ప్యాకేజీని సంవత్సరానికి రూ.39.6 లక్షల నుండి రూ.72.3 లక్షలకు పెంచింది కంపెనీ. ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తర్వాత, రితుపర్ణ అధికారికంగా అమెరికాలోని టెక్సాస్ యూనిట్లో చేరనుంది. ‘ఈ విజయం మీకెలా ఉంది’ అని రితుపర్ణని అడిగితే, ‘ప్రముఖ సంస్థలు కేవలం పట్టణం, నగరంలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఇస్తాయని చాలామంది అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడం ఆనందంగా ఉందని’ పేర్కొంది. ప్రభుత్వ సీటు పొందిన స్థాయి నుండి రోల్స్ రాయిస్‌లో ఉద్యోగిగా ఎదగడం వరకూ ప్రోత్సహించిన తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. -
హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్‌లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్‌గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..) -
మైండ్ బ్లోయింగ్..ఒక్కసారిగా గ్లామ్ అవతార్‌లో నటి, అభిమానులు ఫిదా!
ప్రముఖ నటి విద్యాబాలన్ సడెన్‌గా తన లుక్‌ను మార్చేసింది. బాలీవుడ్లో విలక్షణ నటిగా, ఒక ఐకాన్‌గా పేరుతెచ్చుకున్న నటి యంగ్ , డైనమిక్‌లో అభిమానులనుఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది. తన స్టైలిష్ ఫోటోలను విద్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. విద్యాబాలన్ బాలీవుడ్ ఐకానిక్ నటిగా తనకంటూ పేరు సంపాదించుకున్నారు. సినిమా ప్రమోషన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మ్యాగజైన్ కవర్లైనా, విద్యాబాలన్ చేనేత వస్త్రాలు ఆమె స్పెషల్టీ. కానీ ఆమె తాజా లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది .విద్యాబాలన్ 'ఐటీ' కవర్ గర్ల్ ది పీకాక్ మ్యాగజైన్ జూలై -2025 ఎడిషన్ కవర్ షూట్ కోసం విద్యాబాలన్ తన అద్భుతమైన పరివర్తనతో అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యాబాలన్‌కు సంబంధించిన స్టైలిష్ ఫోటోలను 'ఎ ఫోర్స్ టు రెకౌన్ విత్' అనే శీర్షికతో మ్యాగజైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అద్భుతంగా ఉంది అని ఒకరు "కాంజీవరం చీర లుక్ నుండి - ఇప్పుడు ఇది! మైండ్ బ్లోయింగ్...మాటలు లేవు" అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇది ఏఐ ఫోటో కాదు అంటూ కొనియాడడం గమనార్హం.కాగా 2003 వ సంవత్సరం లో ‘బాలో టేకో’ అనే బెంగాలీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె ‘పరిణీత’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారడమేకాదు, ఫ్యాన్ ఫాలోయింగ్నుసంపాదించుకుంది, దర్శక నిర్మాతల చాయిస్‌గా మారిపోయింది. ఇటీవల భారీగా బరువు తగ్గి 46 ఏళ్ల వయసులో మరింత అందంగా మారిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by The Peacock Magazine (@thepeacockmagazine_) -
నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..
వరుస ఓటములు కొందరిని కుంగదీసి ఏమి చేయలేని స్థితికి చేరుస్తాయి. కొందరికి అవి మరింతగా బలంగా పుంజుకోవడానికి దోహదపడి..ఎవ్వరూ ఊహించనంత స్థాయికి చేరుస్తాయి. గెలవాలన్న దృఢ సంకల్పం, వెనక్కి తగ్గని పట్టుదల ఉన్నవారే ఫెయిల్ అనే పదానికి సరైన అర్థం ఇచ్చేలా గెలిచి చూపిస్తారు. అలాంటి ఘనతనే సాధించింది ఈ కర్ణాటక అమ్మాయి. అంతేగాదు చిన్న వయసులోనే యూకే ఆధారిత విమానాయన దిగ్గజం రోల్స్ రాయిస్‌లో భారీ వేతనంతో పనిచేసే అవకాశాన్ని అందుకుని శెభాష్ అనిపించుకుంది. కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకాలోని కోడూరుకి చెంఇన రీతూపర్ణ సెయింట్ ఆగ్నెస్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నీట్ ద్వారా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనుకుంది. అందులో విఫలమవ్వడంతో తీవ్రంగా నిరుత్సాహపడింది. డాక్టర్ కావాలన్నది ఆమె కల..కానీ అది చూస్తుండగానే ఆవిరైపోయింది. సరిగ్గా ఆ సమయంలో రీతూపర్ణ తండ్రి ఆమెను ఇంజనీరింగ్ వైపుకి వెళ్లమని సూచించారు. అలా ఆమె 2022లో మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (SCEM)లో సెట్ ద్వార్ అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. కాలేజ్ మొదటి రోజు నుంచే శ్రద్ధగా చదవడం మొదలు పెట్టింది. అలా ఆమె ఆటోమేషన్ పట్ల ఆకర్షితురాలై రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లింది. తన సీనియర్ విద్యార్థుల నుంచి ప్రేరణ పొంది..ప్రభావవంతమైన ప్రాజెక్టులను రూపొందించడం ప్రారంభించింది. రోబోలు నిర్మించడం..పతకాలు గెలుపొందడం..తన బృందంతో కలిసి రితుపర్ణ వక్క రైతుల కోసం రోబోటక్ స్ప్రేయర్ హార్వెస్టర్‌ని నిర్మించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఇనెక్స్లో జరిగిన పోటీలో ఈ రోబోలిక్ స్ప్రేయర్ బంగారం, వెండి పతకాలను గెలుచుకుంది. ఆ పరిజ్ఞానమే తనకు నిట్‌కే సూరత్కల్లో రోబోటిక్ సర్జరీపై పరిశోధన చేసేందుకు దోహదపడింది. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ములై ముహిలన్ ఎంపీతో నేరుగా సంభాషించి, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం మొబైల్ యాప్‌ని డెవలప్ చేయడంలో సహాయపడింది. మంచి గుర్తింపు కోసం..తన పరిజ్ఞానంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో రీతూపర్ణ ఇంటర్న్‌షిప్ కోసం రోల్స్ రాయిస్‌ను సంప్రదించింది. కంపెనీ ప్రారంభంలోనే ఆమె అవకాశాలను తోసిపుచ్చింది. అలా ఒక నెలలో కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేకపోయింది రీతూపర్ణ. దాంతో ఒక్క ఛాన్స్ అంటూ ఒక్క నెల గడువుతో పూర్తి చేసే మరో సవాలుని తీసుకోవాల్సి వచ్చింది. అయితే దానిని ఆమె కేవలం ఒక వారంలోనే పూర్తి చేసింది. రీతూ సామర్థ్యం చూసి ఇంప్రెస్ అయిన రోల్స్ రాయిస్ మరో అసైన్మెంట్ ఇచ్చింది. అలా ఎనిమిది నెలలు కష్టతరమైన ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలతో గడిచిపోయింది. చెప్పాలంటే తన ఆరవ సెమిస్టర్లో కాలేజ్‌కి డుమ్మా కొట్టి మరీ యూకే వర్క్షిప్ట్స్లో పనిచేసింది. అలా డిసెంబర్ 2024 నాటికి 39.6 లక్ష ప్రీ ప్లేసమెంట్ ఆఫర్ అందుకుంది. ఇక ఏప్రిల్ 2025 నాటికి తన పనితీరుతో రూ. 72.3 లక్షలకు వేతన ఆఫర్‌ని అందుకుంది. అమెరికాకు వెళ్లనుంది..రీతూపర్ణ తన ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తదనంతరమే రోల్స్ రాయిస్‌లో పూర్తి సమయం పనిచేసేందుకు యూఎస్ఏలోని టెక్సాస్‌కు వెళ్లనుంది. అక్కడ ఆమె జెట్ ఇంజిన్ తయారీ యూనిట్లో పనిచేయనుంది. ఆమె ఈ కంపెనీలోకి ప్రాబ్లం సొల్యూషన్ అనే ప్రతిష్టాత్మక డీసీ ఫెలోషిఫ్ ప్రోగామ్ ద్వారా ఎంపికైంది. ఆమె తోపాటు కన్నడ నుంచి సుమారు 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాగా ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లారెన్స్ జోసెఫ్ ఫెర్నాండెజ్ రీతూపర్ణ విజయాన్ని కళాశాలకు గర్వకారణమైన క్షణంగా అభివర్ణించడమే గాక ఔత్సాహిక యువ ఇంజనీర్లకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. చివరగా రీతూపర్ణ మాట్లాడుతూ.."ఇటీవల యువత చాలా పెద్ద కలలు కంటున్నారు గానీ 50% మాత్రమే ఔట్పుట్ ఇస్తున్నారు. కానీ విజయం సాధించాలంటే 200% ఔట్పుట్ ఇవ్వాలి. దృఢ సంకల్పంతో ఉంటూ మూలాల్ని మర్చిపోకూడదు. అప్పుడే గెలుపు తీరాన్ని అందుకోగలమని చెబుతోంది." రీతూపర్ణ.(చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!) -
ఆ అయిదు రోజుల నిషేధంపై విజయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు. ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..ఒంటరి వేదన నుంచి విముక్తిమహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది. ఆంక్షల నుంచి అవగాహనవైపుగానెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.. -
స్కాలర్షిప్ రాలేదా? కోరిన సమాచారం అందకపోతే అప్పీల్‌కు వెళ్లవచ్చు!
మా అమ్మాయికి రావలసిన స్కాలర్షిప్ రాకపోవటంతో నేను సదరు అధికారులకు గతంలో సమాచార హక్కు చట్టం కింద 'స్కాలర్షిప్ ఎందుకు రాలేదు, కారణాలు తెలపండి' అని అడిగాను. మొదట ఈ విషయం మా పరిధిలోకి రాదు అని ఒక శాఖ వారు సమాధానం ఇస్తూ సరైన శాఖకి నా దరఖాస్తును బదిలీ చేశారు. వారేమో "మీరు కోరిన సమాచారం సెక్షన్ 8 ప్రకారం అందించటం వీలు కాదు" అని తిరస్కరించారు. నాకు సమాచారం ఎలా వస్తుందో చెప్పగలరు. -జాగృతి, ఆదిలాబాద్ సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ శాఖలు/ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతున్న సంస్థలు, మొదలైన వారినుంచి ఎవరైనా సమాచారం పొందవచ్చు. అయితే అసలు "సమాచారం" అంటే ఏమిటి అని మనం తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. మీరు కోరుతున్న సమాచారం ఏదో ఒక రూపం కలిగి ఉండడం చాలా ముఖ్యం. అంటే సదరు సమాచారం పత్రాలు, మెమోలు, సలహాలు, ప్రకటనలు, నివేదికలు, అంకెల పట్టికలు, ఎలక్ట్రానిక్ సమాచారం వంటివి ఏదో ఒక రూపంలో నిక్షి ప్తమై భౌతికంగా ఉండాలి. అలా లేని పక్షంలో మీ దరఖాస్తును తిర స్కరించే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు: నాకు స్కాలర్షిప్ ఎందుకు మంజూరు అవలేదు అంటే మీరు కారణం అడుగుతు న్నట్లు - ఆది సమాచారం అయుండకపోవచ్చు లేదా అందుకు దగ్గర కారణం రికార్డులో ఉండి ఉండకపోవచ్చు. అదే సమాచారాన్ని మీరు "నా స్కాలర్షిప్ ప్రతిపాదనకు మంజూరుకు సంబంధించి ఫైలు ఏ స్థాయిలో ఉన్నది - తగిన పత్రాలు అందించగలరు." అని కోరినట్లయితే మీకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సెక్షన్ 8, 9 లోని మినహాయింపులు పరిశీలిస్తే,ముఖ్యంగా దేశభద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు, దేశ ఆర్ధికవ్యవస్థకు భంగం కలిగించే సమాచారాలు, గోప్యం వహించ వలసిన సమాచారాలు, ఏదైనా చట్టం ద్వారా గాని కోర్టుల ద్వారా గాని నిషే ధించబడిన సమాచారం, ఏదైనా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత మైన సమాచారం, వ్యక్తిగత స్వేచ్ఛకు అలాగే భద్రతకు భంగం కలిగి స్తుంది. అనిపించే సమాచారం వంటివి ఇవ్వవలసిన ఆవసరం లేదు. కొన్ని సందర్భాలలో ప్రజాప్రయోజనం ఉంటుంది అని సదరు అధి కారులు తలిస్తే మీకు సమాచారాన్ని ఇచ్చే అవకాశం/ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు "ఎందుకు చేశారు. ఆ పని చేయడానికి కారణం ఏమిటి" వంటి ప్రశ్నలు అడగకుండా ఆ అంశానికి సంబంధించిన పత్రాలను మాత్రమే అడిగినట్లయితే మీరు కోరిన సమాచారాన్ని తిరస్కరించే ఆస్కారం తగ్గిపో తుంది. మీరు కోరిన సమాచారం చాలా ఎక్కువ పేజీలలో ఉండి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ పనికి భంగం కలిగిస్తుంది అని వారు భావిస్తే మిమ్మల్ని ఒకరోజు ఆఫీసుకు వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించుకోవలసినదిగా సమాధానం ఇవ్వవచ్చు. అప్లికేషన్‌కు పదిరూపాయలు (తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగా), సమాచారం పొందడానికి అధికారి నిర్దేశించిన రుసుము చెల్లించి మీరు సమాచారం పొంద వచ్చు. మీ మొదటి దరఖాస్తుకు సమాచారం దక్కకపోతే మీరు అప్పీలకు వెళ్ళవచ్చు, అప్పీల్లో కూడా మీకు సమాచారం దక్కక పోతే మీరు రాష్ట్ర సమాచార కమిషన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మీరు కోరుతున్న సమాచారం ఎవరిని అడగాలో మీకు తెలియన ప్పుడు, సదరు అంశానికి సంబంధించిన మంత్రివర్యులకు కూడా మీరు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. వారు తగిన రీతిలో మీకు సమాచారాన్ని అందిస్తారు. చాలా సందర్భాలలో సమాచారం రాక పోవడానికి కారణం సరైన రీతిలో అదగకపోవడం అనేది కూడా గమనించాలి.- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు.సందేహాల కోసం sakkhilamjy3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
పరిస్థితులు ఎలా ఉన్నా.. వదులుకోకపోవడం అంటే ఇదే..!
టాలెంట్ ఉన్నోడు దునియానే ఏలతాడు అంటారు. అయితే ఒక్కోసారి ఆ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం రాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, వచ్చిపడే కష్టాలు ఆ నైపుణ్యం మొత్తాన్ని అణిచేస్తుంటుంది. అలా తమ కళ బయట ప్రపంచానికి చూపించలేక కనుమరుగైన వారెందరో ఉన్నారు కూడా. అలాంటి కథే ఈ సెక్యూరిటీ గార్డుది. పరిస్థితులు ఎంతలా తన టాలెంట్‌ని తొక్కేస్తున్నా..కళను వదులుకోకుండా..వీలుచిక్కినప్పుడల్లా సానపెట్టుకుంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంటపడ్డాడు. ప్రపంచానికి తన నైపుణ్యం తెలియజేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక సెక్యూరిటీ గార్డు స్టోరీ ఇది. అతడి కథ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అతను అసాధారణమైన చిత్రకారుడు. తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి తనకు నచ్చిన అభిరుచిని పక్కనపెట్టాల్సి వచ్చింది. ఒకప్పుడూ పూర్తి సమయం కళకే వెచ్చించిన వ్యక్తి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రియేటివిటీ కెరీర్‌ని వదులుకోవాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితులు దృష్ట్యా సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయక తప్పలేదు. అయితే పెన్సిల్ లేదా పెన్ను పట్టాడంటే..అతడి చేతి నుంచి అద్భుతమైన చిత్రం జాలు వారాల్సిందే. అయితే ఆ సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తూ కూడా తన పెయింటింగ్ హాబీని వదులుకోలేదు. వీలుచిక్కినప్పుడల్లా అద్భుతమైన చిత్రాలను గీస్తుంటాడు. పైగా పిల్లలకు మంచి మంచి మెళుకువలు నేర్పిస్తాడు కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో ఒక్కసారిగా అతడి కథ వెలుగులోకి వచ్చింది. అతడి టాలెంట్‌కి ఫిదా అయ్యి ఎందరో అతడికి సాయం అందించడానికి ముందుకు రావడమే కాదు..గ్యాలరీ ప్రదర్శన కోసం అతడితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నా కళను వదులుకోని వాడికి ఎన్నటికీ అన్యాయమైపోడు..ఏదో ఒక రోజు ప్రపంచానికి తెలిసేలా గెలుపు పిలుపు తడుతుంది అంటే ఇది కదూ..!. View this post on Instagram A post shared by Aradhana Chatterjee (@storiesbyaradhana) (చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!) -
మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!
గతంలో ఎన్నో గాంధీజీకి సంబంధించిన వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికి ఆ మహాత్ముడి ఔన్యత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. ఆ విశిష్ట వ్యక్తి ఎప్పటికీ అపురూపమే, ఆయనకు సంబంధించినది ఏదైనా..వెల కట్ట లేనంత గొప్పది అని చెప్పకనే చెబుతున్న ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరోకటి చోటుచేసుకుంది. గొప్ప గొప్ప కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఆయన చిత్రాలను ఎన్నో చూశాం. కానీ ఈ పెయింటింగ్ మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది. పైగా వేలంలో ఎంత పలికిందో వింటే విస్తుపోతారు.బ్రిటిష్ కళాకారిని క్లేర్ లైటన్ మహాత్మా గాంధీ ఆయిల్ పెయింటింగ్ రూపొందించారు. ఈ పెయింటింగ్ దాదాపు మూడు సార్లు రూ. 58 లక్షల నుంచి 81 లక్షలకు అమ్ముడైంది. పైగా ఇది ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆన్లైన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన పోర్ట్రెయిట్గా పేరుగాంచింది. 1989లో ఆమె మరణించేంత వరకు ఈ చిత్రపటం ఆమె పేయింటింగ్ కలెక్షన్లలోనే ఉంది. ఆ తర్వాత ఆమె కుటుంబం ద్వారా ఇది అమ్మకానికి వచ్చిందట. తొలిసారిగా 1974లో గ్యాలరీ ప్రదర్శనలో ఉంచినప్పుడు..ఒక అపరిచిత వ్యక్తి ఈ చిత్రపటంపై కత్తితో దాడి చేశారట. అతడు ఒక హిందూ మితవాద తీవ్రవాదిగా ఆ కళాకారిణి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ పెయింటింగ్ ప్రత్యేకత..గాంధీజిని ప్రత్యక్ష్యంగా చూస్తూ.. గీసిన ఆయిల్ పెయింటింగ్ ఇది. 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైనప్పుడు బ్రిటిష్-అమెరికన్ కళాకారిణి క్లేర్ లైటన్ రూపొందించారట. ఆమెకు గాంధీజిని ఒక రాజకీయ జర్నలిస్ట్ హెన్రీ నోయెల్ బ్రెయిల్స్‌ఫోర్డ్ పరిచయం చేశారట. దాంతో లైటన్ లండన్ కార్యాలయానికి వచ్చి అనేక రోజులు ఉదయాన్నే గాంధీజీని చూస్తూ చిత్రించేవారట. చెప్పాలంటే చాలా సందర్భాలలో గాంధీజీతో స్వయంగా కూర్చొని గీసే అరుదైన అవకాశ ఆ కళాకారిణి లైటన్కి లభించిందట. ఆ తర్వాత ఆ చిత్రాన్ని 1931 నవంబర్‌లో లండన్‌లోని సాక్విల్లే స్ట్రీట్‌లోని అల్బానీ గ్యాలరీస్‌లో ప్రదర్శించారట. ఆ ప్రదర్శనకు హాజరైన ఆమె స్నేహితురాలు జర్నలిస్ట్ వినిఫ్రెడ్ హోల్ట్‌బై ట్రేడ్ యూనియన్ ప్రచురణ 'ది స్కూల్మిస్ట్రెస్' పుస్తకంలో వివరించారు.ఆ పెయింటింగ్ వెనుక భాగంలో గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ లేఖ కూడా ఉంటుందట. ఆయన అచ్చం గాంధీ మూర్తిత్వాన్నే దింపేలా గీశారంటూ అభినందించడమే గాక, గాంధీజీ కూడా అందుకు ధన్యావాదాలు పేర్కొన్నట్లు తెలిపారు లేఖలో. గాంధీ చిత్రపటం రూపొందించడానికి ప్రతి ఉదయం మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఉందని లేఖలో రాసుకొచ్చారు. అలా ఎన్నో చిరస్మృతులకు నిలయమైన ఆ పెయింటింగ్ తమకు వారసత్వంగా వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరణాంతవరకు ఆమె అధీనంలోనే ఉండేదని తెలిపారు. అంతేగాదు మహాత్మాగాంధీ కూర్చొని ఉన్న ఏకైక ఆయిల్ పెయింటింగ్ కూడా ఇదేనట.ఇటీవల లండన్ బోన్హామ్స్ నిర్వహించిన వేలంలో ఆశ్చర్యకరంగా రూ.1.7 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. ఇది ఒకరకంగా సుదీర్ఘ ప్రాంతం ప్రజలతో గాంధీకి ఉన్న అత్యంత శక్తిమంతమైన సంబంధాన్ని తేటతెల్లం చేసింది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అపూర్వమైన ఘట్టమని వేలం నిర్వాహకులు పేర్కొనడం విశేషం.(చదవండి: తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..) -
తొలి డెవలప్మెంటల్ బయాలజిస్ట్
భారత స్వాతంత్య్ర సమరం జరుగుతున్న రోజుల్లో పూణెలోని పరశురామ్ బావ్ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల లీలా గణేష్ ముల్హెర్కర్ (Leela Ganesh Mulherkar) 16 నెలల్లో గొప్ప పరిశోధన చేశారు. ఎడిన్‌బరో పరిశోధకులు చార్లెస్ వెడ్డింగ్టన్ ఆధ్వర్యంలో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ ఎంబ్రియాలజీ’లో పిండం పరిణామం, అభివృద్ధి మధ్య ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేయడంతో ఆమె పేరు మారు మోగి పోయింది. పూనా విశ్వ విద్యాలయంలో ఈ డెవలప్మెంటల్ బయాలజీ కోర్సును ప్రవేశపెట్టడమే కాకుండా, ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ డెవలప్మెంటల్ బయాలజిస్ట్స్’ (Indian Society of Developmental Biologists (InSDB)) అనే సంస్థను కూడా ప్రారంభించారామె. ముంబైకి ఉత్తరాన ఉన్న ‘బోర్డీ’ గ్రామంలో 1915లో లీల జన్మించారు. 1954లో భారత ప్రభుత్వమిచ్చే విదేశీ చదువుల స్కాలర్షిప్ రావడంతో ఇంగ్లాండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యా లయంలో పీహెచ్డీ పూర్తిచేశారు. తిరిగివచ్చి పుణె విశ్వవిద్యా లయం జువాలజీ శాఖలో అధ్యాపకులుగా చేరారు. గర్భవతుల నిద్రలేమి, వికారం, మబ్బుగా ఉండటం వంటి లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా వాడే ‘తలిడోమైడ్’ ఔషధం ఎన్నో సమస్యలకు దారి తీసిన కాలమది. దీనికి సంబంధించి లీలా ముల్హెర్కర్ దృష్టి పెట్టి పరిశోధనలు కొనసాగించారు. తన ఇంటినే పరిశోధనాశాలగా మార్చుకొని సాగిన పరిశోధనా ధీర లీల. తన విద్యార్థులను పరిశోధకులుగా మలుస్తూ స్థానికంగా లభ్యమయ్యే హైడ్రాలు, కప్పలు, బల్లులు, నత్తలు వంటి వాటి పిండోత్పత్తి, దాని ఎదుగుదల,ఆ ప్రక్రియలో సంభవించే పరిణామాల గురించి అధ్యయనంచేపట్టారు. పరిశోధనలో మునిగిపోయి లీల తన 52వ ఏట 1967లో వసంతరావు గోలేను వివాహం చేసుకున్నారు.యూనివర్సిటీలో రెండు దశాబ్దాలు పనిచేసి 1977లో పదవీ విరమణ చెందినా మరో 15 ఏళ్లు అక్కడ పరిశోధనలు కొనసాగించారు. 65 ఏళ్ల వయసులో కూడా సున్ని తంగా ఉండే పలురకాల పిండాలను కోసి భాగాలను అధ్యయనం చేయడం ఆమెకుఎంతో సునాయాసంగా ఉండేది. కనుకనే 2005లో ఆమె మరణించేదాకా యూనివర్సిటీ క్యాంపస్‌లోనే చలాకీగా అందుబాటులో ఉండేవారు. ఆమె దగ్గర 18 మంది పరిశోధన పట్టాలు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. భారతీయ కళలు, కవిత్వం, నాటకాలు, ఫిలాసఫీ వంటి అంశాల పట్ల లీలా ముల్హెర్కర్కు చాలా మక్కువ. ఆమె నాటకానికి వెళితే తప్పనిసరిగా తొలి వరుసలోనే కూర్చునేవారు. బాలగంధర్వ ఆడిటోరియం ముందు వరుసలో వారికి రెండు సీట్లు ప్రత్యేకంగా కేటాయించబడేవి. వృక్ష శాస్త్రవేత్తలు, జంతుశాస్త్రవేత్తలు, వైద్యులు... ఈ మూడు విభాగాల జీవశాస్త్రజ్ఞులకు ఒక వేదికను కల్పిస్తూ 1977లో ’ఇండియన్ సొసైటీ ఆఫ్ డెవలప్మెంటల్ బయాలజిస్ట్స్’ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నేటికీ శాస్త్రజ్ఞులు ప్రతి రెండేళ్లకు ఒకచోట పెద్ద ఎత్తున సమావేశమవుతూ డెవలప్మెంటల్ బయాలజీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు.- డా.నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
ఆక్వాలో కొత్త అధ్యాయం : చందువా పార
తీర ప్రాంతంలోని ఆక్వా రైతులు ఉప్పునీటిలో పెంచదగిన జలపుష్పాల జాబితా చాలా తక్కువ. ఒకటి, రెండు రకాల ఉప్పునీటి రొయ్యలే అధికంగా సాగు చేస్తారు. వీటికి జబ్బులు సోకినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉప్పునీటిలో సాగు చేయటానికి పండుగప్ప తర్వాత అంతకన్నా ఖరీదైన Indian Pompano ఇండియన్ పాంపనొ (చందువా పార) చేప ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది వేగంగా పెరుగుతుంది. రుచిగా ఉంటుంది. సాగులో రొయ్యలు, పంచుగప్ప చేపతో పోల్చితే రైతులకు రిస్క్ చాలా తక్కువ. మరణాల శాతం తక్కువ. అయితే, దీని హేచరీ అందుబాటులో లేక΄ోవటం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరింది. విశాఖపట్నంలోని భారతీయ సముద్ర చేపల పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. సముద్రంలో పెరిగే చందువా జాతి చేపలను కోస్తాప్రాంతంలో ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి అవసరమైన కాప్టివ్ బ్రీడింగ్, సీడ్ ప్రొడక్షన్ వంటి సాంకేతికతలన్నీటినీ సిఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చెరువుల్లోనే కాదు సముద్రతీరంలోని తక్కువ లోతులో నీటిపై తేలాడే పంజరాలను ఏర్పాటు చేసి చందువా పార చేపలను సాగు చేసే మారికల్చర్ టెక్నాలజీని కూడా సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించింది. విశాఖ కార్యాలయంలో ఏర్పాటైన మారికల్చర్ ప్రయోగశాలలో చందువా పారతో పాటు బొంతలు (గ్రూపర్స్), అప్పాలు చేప (జాన్స్ స్నాపర్) వంటి జాతులపై కూడా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కోస్తా ప్రాంత ఆక్వా రైతులు వైరస్ తదితర జబ్బులు, తుపాన్లు, ఎగుమతి మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎగుమతి మార్కెట్ కోసం పెంచే రొయ్యలతోపాటు.. స్థానిక ప్రీమియం మార్కెట్ల కోసం పంట మార్పిడిగా పెంచే అధిక ధర గల చందువాపార వంటి చేపల సాగు సాంకేతికతలు అందుబాటులోకి రావటం ఆక్వా రైతులకు నిజంగా శుభవార్త. సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించిన ‘చందువా పార’ చేపల సాగు పద్ధతులను సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం....చందువాపార ఆక్వాకల్చర్ రంగంలో వచ్చే కొద్ది ఏళ్లలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఆర్థిక తోడ్పాటుతో బ్లూరెవెల్యూషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనేక కోస్తా ప్రాంత చెరువుల్లో చందువాపార చేపలను సీఎంఎఫ్ఆర్ఐ ప్రోత్సహించి సాగు చేయించింది. సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తలు శేఖర్ మేగరాజన్, రితేష్ రంజన్, బిజి జేవియర్, శుభదీప్ ఘోష్, పొన్నగంటి శివ, నరసింహులు సిద్ధు, ఆర్.పి. వెంకటేష్, ఇమెల్డా జోసెఫ్‌లు సంయుక్తంగా అందించిన వివరాల ప్రకారం చందువాపార సాగులో అనేక దశల్లో చేపట్టాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల విశేషాలు ఇలా ఉన్నాయి.చెరువును సిద్ధం చేయటం...చెరువు అంతటినీ 1.5 మీటర్ల లోతున సమతలంగా ఉండేలా రూపొందించాలి.పాత చెరువుల్లో ఈ చేపలను పెంచుతూ ఉంటే, చెరువు అడుగున పేరుకున్న వ్యర్థాలను తొలగించి, దుక్కి చెయ్యాలి. చందువాపార చేపల సాగుకు నీటి ఉదజని సూచిక (పిహెచ్) సగటున 7.5–8.5 మధ్యన ఉండాలి. మట్టి పిహెచ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చెరువును సిద్ధం చేసేటప్పుడు ఎంత సున్నం చల్లాలో ఆధారపడి ఉంటుంది.నీటి యాజమాన్యం...చెరువును సిద్ధం చేసిన తరువాత కాలువ నీటిని లేదా రిజర్వాయర్ నీటిని నేరుగా చెరువులోకి నింపవచ్చు. నీటిని నింపేముందు 100 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే ఫిల్టర్ బ్యాగ్‌లను విధిగా ఉపయోగించాలి. చెరువు నీటిలోకి అవాంఛనీయ చేపల పిల్లలు రాకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్లు అవసరం. 10 పిపిఎం క్లోరినేషన్ ద్వారా చెరువును శుద్ధి చెయ్యాలి. నాలుగురోజుల తర్వాత క్లోరినేషన్ నీటిలో యూరియా (2.5 పిపిఎం), ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్పి) (3పిపిఎం) వాడి చెరువు నీటి నాణ్యతను సరిచేయాలి. చెరువులో సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు వేసుకోవటం ద్వారా ప్లవకాల (ప్లాంక్టన్)ను వృద్ధి చెయ్యాలి. ప్లాంక్టన్ చెరువు నీటిలో పెరిగితేనే నీటి నాణ్యత సరిగ్గా ఉంటుంది. చందువా పార చేలు 5 నుంచి 40 పిపిటి వరకు ఉప్పు నీటిని తట్టుకోగలవు. అయితే, 15–35 పిపిటి మధ్యలో నీటి ఉప్పదనం ఉంటే మంచి అనుకూల వాతావరణం ఉంటుంది.చేపపిల్లల రవాణా...అత్యంత శ్రద్ధతో చేపపిల్లల రవాణా చెయ్యాలి. ఈ క్రమంలో ఒత్తిడి కలిగితే చేప పిల్లలకు సూక్ష్మ క్రిములు సోకడమే కాకుండా అవి చని΄ోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆక్సిజన్ సరఫరా ఉండేలా సెంటెక్స్ ట్యాంకుల్లో గానీ పాలిథిన్ బ్యాగుల్లో గానీ తీసుకెళ్లాలి. చేపపిల్లల సైజు, ప్రయాణ వ్యవధి, చేపపిల్లల సంఖ్య, రవాణా పద్ధతిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నర్సరీ పెంపకం : నర్సరీ పెంపకంలో ఒక మీటరుకి 200 నుండి 280 పిల్ల చేపలు తగినంత స్టాకింగ్ డెన్సిటీగా చెప్పవచ్చు. చేపలు కృత్రిమ మేతకు అలవాటుపడతాయి. అయితే మేతలో మంచి పోషక విలువలు ఉండాలి. మొదటి దశలో ప్రోటీన్ 45%, కొవ్వు శాతం 111% చొప్పున శరీర బరువులో 10%, రోజుకు 4 – 5 సార్లు మేత ఇవ్వాలి. 2–3 గ్రాములు పెరిగిన పిల్లచేపలను 30–40 గ్రాములు వచ్చే వరకు 60 నుంచి 75 రోజుల పాటు పెంచాలి. ఆ తర్వాత పెంపకపు చెరువు (గ్రో–అవుట్ చెరువు) ల్లోకి మార్చాలి. ఆక్సిజన్ స్థాయిలు 4 పిపిఎం కన్నా ఎక్కువ ఉండేలా నిర్వహిస్తే∙90–95% చేపలు పెరిగి పెద్దవుతాయి.ఎకరానికి 5 వేలు : నర్సరీలో పెంచిన చేప పిల్లలను ఎకరాకు 5000 చొప్పున పెద్ద చెరువుల్లోకి వదలాలి. ఎయిరేటర్లను చెరువు నాలుగు దిక్కులా అమర్చాలి. క్రమం తప్పకుండా ఎరువులు చల్లుతూ నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి. అధిక ప్రోటీన్‌తో కూడిన నీటిపై తేలాడే (40% ప్రోటీన్ – 10% కొవ్వు పదార్ధాలు) ఆహార గుళికలను చేప పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. మేత ఇస్తున్నప్పుడు గాలివాటానికి అనుగుణంగా, మేత వృథా కాకుండా పంజరపు లోపలి వలలో ఫీడ్ మెష్ ను (1 మీటర్లు లోతు) ఏర్పాటు చెయ్యాలి. తొందరగా జీర్ణం కావడం కోసం, ప్రతి 3 గంటలకొకసారి దాణా ఇవ్వాలి. ప్రతి పదిహేను రోజులకొకసారి చేపల బరువు తూచి, వాటి ఎదుగుదల ఆధారంగా దాణాను లెక్కవేసుకోవాలి. 10 నుంచి 20 గ్రాములు ఉన్న చేప పిల్లలని క్యూబిక్ మీటరుకు 1 నుంచి∙1.25 చొప్పున చెరువులో వదిలినప్పుడు.. 5–6 నెలల్లో 500–600 గ్రాములకు, 12 నెలల వ్యవధిలో కిలో బరువుకు పెరుగుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే, 100 గ్రాము సైజులో ఉన్నప్పుడు చెరువులో వేస్తే కేవలం 7 నెలల్లోనే కిలో సైజుకు పెరుగుతాయి. చెరువు అడుగు భాగంలో ఉండే చెత్తని, బురదని ఎప్పటికప్పుడు తీసివేసి, శుభ్రపరుస్తుంటే విష వాయువుల ప్రభావం తక్కువగా ఉండి నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.6 రాష్ట్రాల్లో మార్కెట్లు అనువైనవి : మార్కెట్ సైజుకు పెరిగిన చందువ పార చేపలను డ్రాగ్ నెట్ వల సహాయంతో అత్యంత సులువుగా పట్టుకుని వెలికితీయవచ్చు. బయటికి తీసిన చేపలను మొత్తాన్ని వెంటనే పరిశుభ్రమైన నీటిలో కడిగి, ఐస్ ముక్కల్లో పెట్టి, తాజాగా, నాణ్యత ΄ోకుండా చూడాలి. ప్లాస్టిక్ ట్రేలలో గానీ లేదా థర్మోకోల్ పెట్టెల్లో గాని పెట్టి, ఐస్ ముక్కలు చల్లి ప్యాక్ చేస్తారు. పెద్దమొత్తంలో సాగు చేయడమే కాకుండా, స్థానిక మార్కెట్లో గిరాకీని బట్టి బ్యాచ్ పధ్ధతిలో కూడా హార్వెస్ట్ చేయవచ్చు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లు చందువా పార చేపలను విక్రయించడానికి అత్యంత అనువైనవి. ఒక ఎకరాకు 5000 పిల్లలు వేస్తే కేజీకి రూ. 325 చొప్పున (ఇది పాత ధర) రైతుకు సుమారు రూ. 2.25 లక్షలు నికర లాభం వస్తుందని అంచనా.silver pompano fingerlingsచందువా పార చేపల విశేషాలు...శాస్త్రీయ నామం: ట్రాచినోటస్ మూకలీ. కుటుంబం: కారంగిడే (జాక్స్, పాంపానోస్). పరిమాణం: 10 గ్రాములు లేదా 2 అంగుళాల పిల్లలను చెరువుల్లో వేసుకుంటే 5–6 నెలల్లో అర కిలోకి పైగా సైజుకు పెరుగుతుంది. స్వరూపం: బాగా ఎదిగిన చేపలు బంగారు నారింజ రంగులో మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర. ఆవాసం: తీర్ర ప్రాంత సముద్ర జలాలు, నదీ ముఖ ద్వారాలలో కనిపిస్తాయి. ఆహారం: తిండిపోతు. మాంసాహారి. అయితే, పండుగప్ప చేపల మాదిరిగా తమ జాతి చిన్న చేపలను పెద్ద చేపలు తినవు.ఆక్వాకల్చర్‌కు అనుకూలతలు: మెరుగైన మాంసం నాణ్యత, అధిక మార్కెట్ డిమాండ్ కారణంగా సముద్ర జలాల్లోని పంజరాల్లో, కోస్తా ప్రాంత ఉప్పునీటి చెరువుల్లో సాగుకు.. ఈ రెండింటికీ అనువైనది. వ్యాధి నిరోధకత: చాలా రకాల వ్యాధులను తట్టుకోగల నిరోధక శక్తి ఉండటం దీనికి గల మరో ప్రత్యేకత. కేజ్ కల్చర్: తీరప్రాంత సముద్ర జలాల్లో కేజ్ కల్చర్ ద్వారా విజయవంతంగా సాగవుతోంది, వాణిజ్య స్థాయిలో పెంచటానికి అనువైనది. సంతానోత్పత్తి: చందువా పార చేపలు ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల్లో సంతానోత్పత్తి చేస్తాయి. విత్తనోత్పత్తి: సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు భారతీయ పాంపనో చేపల సంతానాభిద్ధి, లార్వా పెంపకం, నర్సరీ పెంపకం కోసం సాంకేతికతను అభివృద్ధి చేశారు. మార్కెట్ డిమాండ్: అధిక మార్కెట్ డిమాండ్ ఉంది. మంచి దేశీయ ధర పలుకుతోంది. రైతు నుంచి కిలో రూ. 35–450 వరకు పలుకుతోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆక్వాకల్చర్ చేపల జాతిగా గుర్తింపు వచ్చింది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు: చందువా పార చేపల్లో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి. అందువల్ల హెల్దీ ఫ్యాట్ వనరుగా నిపుణులు చెబుతున్నారు. చెరువలో నీటి నాణ్యత, రంగులను మెరుగ్గా ఉంచుకోవాలంటే ప్రతి 15 రోజులకోసారి ఎరువులు వేసుకోవాలి. కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి.30 గ్రాముల కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి. చెరువులో ఫీడింగ్ జోన్‌ను ఏర్పాటు చేసుకొని మేత వేస్తూ ఉంటే మేత వృథాని అరికట్టవచ్చు. నీటి నాణ్యత బాగుండాలంటే చెరువులోని నీటి పరిమాణంలో 25% నీటిని ప్రతి నెలా మార్చాలి. ఈ పని చేస్తే ప్రొబయోటిక్స్, వాటర్ కండిషనర్ మందులు వాడకుండా నివారించుకోవచ్చు.చెరువులో రోజుకు కనీసం 10 గంటల సేపు ఎకరానికి 2–3 పెడల్ వీల్ ఎయిరేటర్లను ఉపయోగించాలి. మంచి ఆదాయం రావాలంటే ఎకరానికి 5 వేల పిల్లలను వేసుకోవటం ఉత్తమం. -
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ!
ఏ పంట పండించినా రైతులకు నికరంగా ఎంత ఆదాయం వస్తోంది అన్నదాన్ని బట్టే ఆ పంట మేలైనదా కాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. రైతుకు నికరాదాయం పెరగాలంటే ఏ పంటలు పండించాలి? పొట్టపో΄సుకోవటానికి ఎంతోచ్చినా చాల్లే అని అందరూ పండించే సాధారణ పంటలు పండిస్తే లాభం లేదు. విదేశాలకు అవసరమైన పంటలేవో గ్రహించి పండించి, ఎగుమతి చెయ్యాలి. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్లు పండించి ఎగుమతి చేస్తున్నవి ఇవీ: 1. తెల్ల ఉల్లిపాయ ఒరుగులు 2. మునగ ఆకుల పొడి!తెల్ల ఉల్లిపాయల ఒరుగులు అనాదిగా ఎగుమతి అవుతున్న సరుకు కాదు. ఇటీవల కాలంలోనే దీనికి విదేశాల్లో గిరాకీ వచ్చింది. ఆ అవకాశాన్ని అందరికన్నా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది గుజరాత్ రైతులే. ఆ తర్వాత మహారాష్ట్ర. విదేశాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్ల ఉల్లిపాయల ఒరుగుల్ని వాడుతున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది. తెల్ల ఉల్లి పాయలకు ఎర్ర ఉల్లి పాయల కన్నా 30% అధిక ధర ఇచ్చి వ్యాపారులు కొంటున్నారు. అందుకే ఇవి పండిస్తున్నా అంటున్నారు గుజరాత్ భావ్‌నగర్ జిల్లా రైతు రాహుల్. తెల్ల ఉల్లి ఒరుగులు మన దేశంలో కిలోకి రూ. 130 ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2.5–3 డాలర్లు (రూ. 215–255) పలుకుతోంది. సరుకు నాణ్యత, దేశాన్ని బట్టి ధరల్లో మార్పుంటుంది. కొనే వారుంటే పండించే వారూ ఆసక్తి చూపుతారు. అలాగే తెల్ల ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతూ వెళ్తోంది. మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణంలో 40% తెల్ల ఉల్లిదే. గత ఏడాది గుజరాత్లో 81,011 హెక్టార్లు సాగైన ఉల్లి ఈ ఏడాది 93,500 హెక్టార్లకు పెరిగింది.ఇక రెండోది మునగ ఆకుల పొడి సంగతి. ప్రపంచంలో 80% మునగ సాగుతో భారత్ ముందుంది. మునగ సాగు, ఎగుమతిలో తమిళనాడు రైతులు అగ్రగామిగా ఉన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ రైతు పంకజ్ కుమార్. తోటి రైతులంతా వరి, గోధుమ పండిస్తుంటే ఆయన మాత్రం పదేళ్ల క్రితమే 1.5 ఎకరాల్లో మునగాకు పండించటం మొదలు పెట్టి, ఇప్పుడు పదెకరాలకు విస్తరించారు. జర్మనీ తదితర దేశాల్లో మునగాకు పొడికి గిరాకీ ఉంది. అందుకే మూడేళ్ల నుంచి అధిక సాంద్రతలో మునగాకును సాగు చేస్తున్నా అంటున్నారాయన. మునగ కొద్దిపాటి నీటి వసతితోనే వేగంగా పెరిగే పంట. అయితే, 6–10 ఏళ్ల తర్వాత పంట మార్పిడి చేయటం తప్పనిసరి అంటున్నారు సీనియర్ రైతులు. ఇంతకీ, ఇతర రాష్ట్రాల్లో రైతులు ముందున్నారా? అక్కడి ప్రభుత్వాలే రైతులచేత ముందడుగు వేయిస్తున్నాయా?? అని మనం ఆలోచించుకోవాలి. మనం ముందంజలో ఉండే పంటలు చాలా ఉన్నా.. ఈ రెండు పంటల విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి మనమూ నేర్చుకుంటే మేలు! -
పుట్టగొడుగులకు డిమాండ్, కిలో రూ. 1400
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్‌కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలుమష్రూమ్స్ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలంరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.మష్రూమ్స్లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి. పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు -
తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్‌లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులుబెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు. -
అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
భువనేశ్వర్: ఒడిశారాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ (Soumyashree) ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు. దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్ పట్నాయక్ ‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: బాలేశ్వర్‌లో ఫకీర్ మోహన్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. సాయంత్రం ప్యాలెస్ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు. రాయగడ: బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపారీ్టలైన బీజేడీ, కాంగ్రెస్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్ లొ మంగళవారం నాడు కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భగ్గుమన్న బీజేడీ శ్రేణులుజయపురం: బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. నేడు, రేపు బంద్ భువనేశ్వర్: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై నిరసనలతో రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికి పోతుంది. ప్రధానంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాలు బలిగొందని నిందిస్తున్నాయి. విషాదకర సంఘటనని రాజకీయం చేయొద్దని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, రాష్ట్ర కాంగ్రెస్ వరుసగా రెండు రోజులు బంద్‌కు పిలుపునిచ్చాయి. తొలుత బిజూ జనతా దళ్ బుధవారం బాలాసోర్ బంద్ నిర్వహిస్తుందని ప్రకటించింది. విద్యార్థిని మృతిపై ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిజూ జనతా దళ్ బాలసోర్‌లో ఆరు గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. బంద్ సమయంలో దుకాణాలు, మార్కెటు సముదాయాలు, మోటారు వాహనాల రవాణా, బస్సులు, రైళ్లు రాకపోకలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని అభ్యర్థించారు. రేపు రాష్ట్ర బంద్ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 17 గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, 8 ఇతర రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా ఒడిశా బంద్ నిర్వహిస్తున్నట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విలేకర్లకు వివరించారు. బాలాసోర్ సంఘటనకు నిరసనగా ఒడిశా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌తో భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎం సహా 8 ఇతర రాజకీయ పార్టీలు మంగళ వారం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒడిశా బంద్ ప్రకటన చేశాయి. ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన,ఉద్రిక్తతసౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
‘నా జీవన ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలకు గురయ్యాను.. అయినా వెనక్కి తగ్గలేదు.. వాటినే విజయవానికి మెట్లుగా మలచుకున్నా’ అని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సినీ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం వైఎఫ్‌ఎల్‌ఓ (యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ‘గోల్డెన్ లెన్స్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో ఎదురైన అనుభవాలను వారితో పంచుకుని స్ఫూర్తిని నింపారు. ‘20 సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో జీవించాను. నా తల్లిదండ్రులకు ఇల్లు కొనాలని అనుకున్నా. నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తూ జీవితాన్ని గడిపా. నా ప్రయాణం అంత సులభం కాదు. జీవితంలో అనేక ఛీత్కారాలను స్వాతగించా’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడాదికి 1500లకు పైగా సినిమాలు నిర్మితమవుతున్నా అందులో 10 శాతం కూడా మహిళా దర్శకులు లేకపోవడం బాధాకరమని, ఈ పరిస్థితి మారాలని, అందుకే ఉమెన్ ఇన్ ఫిలిం–ఇండియా చాప్టర్‌ని ప్రారంభించామని అన్నారు. ఇది మహిళలకు మద్దతు ఇచ్చే ప్లాట్‌ఫాం అని, వాళ్ల గొంతు వినబడాలని అన్నారు. హైదరాబాద్ అన్నా, బిర్యానీ అన్నా ఇష్టం.. తనకు హైదరాబాద్ అన్నా, ఇక్కడి బిర్యానీ అన్నా ఎంతో ఇష్టమని, అవకాశం లభిస్తే టాలీవుడ్ కళాకారులతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. ఆమె నిర్మించిన ప్రసిద్ధ చిత్రాలు ‘ది లంచ్ బాక్స్, మసాన్, పగ్గలైత్, ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పరర్ వంటి చిత్ర అనుభవాలను పంచుకున్నారు. వైఎఫ్‌ఎల్‌ఓ చైర్పర్సన్ పల్లవిజైన్ మాట్లాడుతూ గునీత్ అనేక మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ, వైఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు పాల్గొన్నారు. (చదవండి: హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్..!) -
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
కేరళలోని సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మోహినీయాట్టం, మోడ్రన్ ర్యాప్ ట్రాక్‌ను మిక్స్ చేసి సోషల్ మీడియా సెన్షెషన్గా మారింది శ్వేత వారియర్. ఎనిమిదిమంది డ్యాన్సర్లతో కలసి ఈ వినూత్న నృత్యం చేసింది. ‘రన్ ఇన్ అప్ ర్యాప్ చూసిన తరువాత కొత్తగా ఏదైనా చేయాలనిపించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసింది శ్వేత.ఈ డ్యాన్స్ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘రెఫ్రెషింగ్’ ‘ఇన్నోవేటివ్’ ‘పవర్ఫుల్’ అని స్పందించారు నెటిజనులు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్వేత వారియర్ కొత్త డ్యాన్స్ స్టైల్స్‌ను క్రియేట్ చేయడంలో పేరు తెచ్చుకుంది. మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది. భరత నాట్యం, అర్బన్ స్ట్రీట్ స్టైల్స్‌ను మిక్స్ చేసి సృష్టించిన ‘స్ట్రీట్ వో క్లాసికల్’ సూపర్‌హిట్ అయింది.రకరకాల ‘హైబ్రీడ్ డాన్స్ స్టైల్స్’తో డాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేత వారియర్. సోనీ టీవి ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’లో రన్నర్–అప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Swetha Warrier (@shweta_warrier) (చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
‘ట్రాన్స్’మిషన్ పుస్తకంలో పాఠమైంది!
కేరళ విద్యావ్యవస్థలో అభ్యుదయం వెల్లివిరుస్తుంటుంది. జెండర్ వివక్ష లేని సమాజం కోసం బాల్యం నుంచే పాఠాలు బోధిస్తుంటుంది. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలలో కుటుంబ ముఖచిత్రంలో అమ్మతోపాటు నాన్న కూడా ఇంటి పనులు చేయడాన్ని ప్రచురించింది. తాజాగా ఇప్పుడు ఓ ట్రాన్స్‌జెండర్ జీవితగాధను పాఠ్యాంశంగా తీసుకుంది. ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్ట్స్ బుక్‌లో ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా ఎస్ విజయగాధను చేర్చింది. అంతరించి పోవాలి!ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్త కరికులమ్‌లో నాటకరంగం, శిల్పకళ, సంగీతం, సినిమా, నాట్యరంగాలను చేర్చింది. ఆయా రంగాల్లో ప్రముఖుల గురించిన పాఠాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. ఈ క్రమంలో సినీ నటి నేఘా ఎస్ గురించిన పాఠానికి చోటు కల్పించింది ఎస్సీఈఆర్టీ. మలయాళ నటి నేఘా ఎస్... 2022లో నటించిన ‘అంతరం’ సినిమాకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్మ్ అవార్డు అందుకున్నారు. ఒక ట్రాన్స్ ఉమన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. పాఠ్యపుస్తకంలో తన జీవిత పాఠం గురించి తెలుసుకున్న నేఘా ఎస్ భావోద్వేగాలకు లోనయ్యారు. ‘టెక్ట్స్బుక్లో పాఠాన్ని చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి.సమాజం ఇన్నేళ్ల వరకు నన్ను నా పేరుతో గుర్తించనే లేదు. అలాంటిది 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో నా పేరు ఉండడం నన్ను కదిలించింది’ అన్నారామె. సమాజం వేరుగా చూసిన వారిని సమాజంలో భాగంగా చూపించడానికి ఆ రాష్ట్ర విద్యావ్యవస్థ చేసిన ప్రయత్నం గొప్పది. ఆమె సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తీయన్నపురం. కేరళలో నటిగా పురస్కారం అందుకునే వరకు తన సొంత రాష్ట్రం కూడా తనను గుర్తించలేదని, పురస్కారం సందర్భంగా మీడియా కవరేజ్ తర్వాత తనను తన రాష్ట్రం స్వాగతించిందని, అయినప్పటికీ తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం తనకు గుర్తింపు రాలేదన్నారామె.విద్యార్థుల్లో జెండర్ అవేర్నెస్ కోసం ఆమె అనేక ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకున్నారు. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో నెలకొని ఉన్న తక్కువ భావనను తొలగించడానికి ఈ పాఠం ఒక మంచి ప్రయత్నం. అయితే ప్రపంచంలో కరడుగట్టి ఉన్న అంతరం తొలగిపోవడానికి ఇది సరిపోదు. అంతరించిపోయే వరకు ఇంకా చాలా చేయాలంటూ ‘నా జీవిత పాఠం చదివిన విద్యార్థులు తమను తాము శక్తిమంతంగా తీర్చిదిద్దుకోగలగాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారామె. -
మనవడా... నువ్వు మారుతావు
సిటీ నుంచి ఇంటికొచ్చిన మనవడు నానమ్మ గొలుసు కాజేశాడు. ఆ సంగతి నానమ్మ కనిపెట్టింది. మనవడంటే ఎంత ప్రేమో ఆమెకు. ఇంట్లో ఉండగా బాగా చదువుకుని టాపర్‌గా ఉన్న మనవడు సిటీకి వెళ్లి ఇలా అయ్యాడా అని బాధ పడింది. తర్వాత ఆమె చేసిన పని మనవడిలో మార్పు తెస్తుందో లేదో గాని టీనేజ్‌లో ఉన్న పిల్లల గురించి పెద్దలందరినీ ఆలోచనల్లో పడేసింది. కేరళలో జరిగిన ఈ తాజా ఘటన వివరాలు....కేరళలోని అలెప్పి.ఆ నానమ్మ రోజూ నిద్రపోయే ముందు తన ఒకటిన్నర సవర్ల గొలుసు దిండుకింద పెట్టుకుంటుంది. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ధరిస్తుంది. కాని ఆ రోజు లేచి దిండు కింద చూస్తే గొలుసు లేదు. రెండు రోజుల క్రితం మనవడు వచ్చాడు. ఈ మధ్య వచ్చినప్పుడల్లా డబ్బు అడుగుతున్నాడు. ఈసారి గొలుసు తీసేశాడన్న మాట. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. మనవడిని ఈ చేతులతో పెంచింది. వాడు ఇంటర్ వరకూ నిన్న మొన్న ఇక్కడే చదివాడు. టాపర్. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని బెంగళూరు వెళ్లినప్పటి నుంచి ఏమైందో ఏమిటో ఇలా తయారయ్యాడు. నగరం వాడిని మార్చేసిందా... లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండటం... అజమాయిషీ లేకపోవడం... తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం... ఇవి వాణ్ణి ఇలా తయారు చేశాయా అని మధన పడింది.పోలీస్ రిపోర్టు ఇస్తే కేసవడం, అరెస్టు చేయడం తాను భరించలేదు. అలాగే తనకున్న ఒక్కగానొక్క గొలుసును పోగొట్టుకోవాలని లేదు. అందుకే పోలీసులకు చాటుగా ఫోన్ చేసింది. ‘అయ్యా... నా మనవడు ఇంత పని చేశాడు. కేసు గీసు ఏం వద్దు. వాడి దగ్గరి నుంచి ఆ గొలుసు సంపాదించి ఇవ్వండి చాలు.... వాడిని తీసుకెళ్లి లోపల వేసి కొట్టడం, హింసించడం చేయవద్దు’ అని బతిమిలాడింది.అలెప్పి పోలీసులు నానమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే మనవడి ఫొటోను వాట్సప్ చేయమన్నారు. ఆమె చేసింది. పోలీసులు ఆ ఫోటోను ‘ఆల్ కేరళ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్’ అలెప్పీ సెక్రటరీ అబి థామస్‌కు పంపారు. అబి థామస్ దానిని తమ వర్తకుల వాట్సప్ గ్రూప్‌లో పెట్టి ‘ఈ కుర్రాడు గొలుసు తీసుకొని వస్తే ఎవరూ కొనవద్దు’ అని మెసేజ్ చేశాడు. అప్పటికే గొలుసుతో బయలుదేరిన మనవడు అలెప్పిలోని ఏ దుకాణానికి వెళ్లినా వర్తకులు ‘నువ్వు దొంగవి’ అనకుండా ‘మేం కొనం’ అని వెనక్కు పంపేయసాగారు.మనవడు మొత్తం 25 షాపులు తిరిగాడు. ఎవరూ కొనలేదు. దాంతో మూడు రోజుల తర్వాత ఆ గొలుసును తిరిగి నానమ్మకు ఇచ్చేశాడు. ఆమె కోప్పడలేదు. కన్నీరు కార్చింది. మనవడికి బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చింది. నువ్వు మారతావని ఆశిస్తున్నా... అంది. మనవడు మారతాడో లేదో కానీ ఇదో ఆలోచించాల్సిన విషయం. చదువు కోసం, కోర్సుల కోసం నగరాలకు పిల్లల్ని పంపాక వారితో నిత్యం కమ్యూనికేషన్లో తల్లిదండ్రులు ఉండాలి, ప్రేమను చూపాలి, సాధక బాధకాలు వినాలి... లేకుంటే వారు పెడత్రోవ తొక్కవచ్చు. -
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన. ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట. ఎదురైన ఇబ్బందులు..విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్‌లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్‌లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు. ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్‌లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్‌పోస్ట్‌లు దాటి కాబూల్‌కి వెళ్లినట్లు తెలిపారు. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట. అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్‌కి పయనమైనట్లు తెలిపారు. ఓ పెనువిషాదంలో..2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్‌గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్‌పైనే చుట్టొచ్చారు.(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్‌గా..) -
మహిళా డ్రైవర్ని నియమించుకున్న తొలి అధికారిణి..!
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో ముందుండాలి వంటి ఉపన్యాసాలు లెక్కకు మించి చూసుంటాం. చేతల్లో మాత్రం శూన్యం. అతివల తమ ప్రతిభతో సంపాదించుకున్న అత్యున్నత స్థానాలే తప్ప..చాలమటుకు కొన్ని రంగాల్లో అవకాశాలు ఉండనే ఉండవు. అంతెందుకు మహిళా అధికారులు సైతం..తమ వరకు వచ్చేటప్పటికీ ఒకలా..బయటకు ఎన్నో లెక్చర్లు ఇస్తారు. కానీ ఈ అధికారిణి..మాటల్లోనే కాదు..చేతల్లో కూడా మహిళలకే తన తొలి ప్రాధాన్యాత అంటూ చేసి చూపించింది. ఆమె చేసిన పని భారతదేశంలో ఒక సరికొత్త మైలు రాయి. ఇలాంటి అద్భుతం ఇదే దేశంలోనే తొలిసారి కూడా కావొచ్చు.ఒడిశాలో మహిళా డ్రైవర్‌ను అధికారికంగా నియమించిన తొలి మహిళా ప్రభుత్వాధికారిణిగా ఉషా పాధీ గుర్తింపు పొందారు. ఒడిశా రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి అయినా ఆమె తన శక్తిమంతమైన అధికారంతో ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మయూర్ భంజ్కి చెందిన సంధ్యారాణి మాఝిని తన అధికారిక డ్రైవర్లలో ఒకరిగా నియమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఉషా. దీంతో ప్రభుత్వ వాహన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది సంధ్యారాణిసంధ్యా జాజ్‌పూర్ ఛటియాలోని హెచ్ఎంవీ శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ పొందారామె. తదనంతరం ఒక అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకుంది. ఆమెకు వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉందట! మహిళలు అన్నింట్లో ముందుడాలంటూనే, డ్రైవింగ్, పాలన, సేవా బట్వాడా వంటి వాటిల్లో సమాన అవకాశాలు ఇవ్వం. ఆ లింగ మూసధోరణికి తిలోదకాలు ఇస్తూ..ఆమెనే డ్రైవర్‌గా కేటాయించుకున్నారు ఉషా. ఇది కేవలం సంధ్యతో మొదలైన మార్పు కాదు.అక్కడ రవాణా శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద అమాబస్ ఓఎస్ఆర్టీసీ అనేక మంది మహిళా కండక్టర్లను నియమించుకుని సంచలనం సృష్టించింది. బస్సులను, జీవితాలను కమాండ్ చేసే సత్తా మహిళలకే ఉందంటూ ఉమె సువాహాక్ చొరవతో వాణిజ్య రవాణా శాఖ మంత్రి ఈ ఏడాది సుమారు 500 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ విలువల దిశగా నడిపించాలని చూస్తుండటం విశేషం. శక్తిమంతమైన మార్పు పుష్కలమైన అవకాశాలు అందించనప్పుడే అని చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహారణలు. అంతేగాదు అధికారుల సరైన నిర్ణయాలే ప్రజల అభ్యున్నతికి బాటలు వేసి నవ సమాజ నిర్మాణానికి దోహదపడతాయి అనే మాటకు ఇదే నిదర్శనం కూడా. (చదవండి: ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషంగా నిల్!: ఎంటర్ప్రెన్యూర్ ఆవేదన) -
ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్‌బర్డ్స్ ప్రేమ, ప్రపోజల్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు. ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని అమేయా ఇలా వివరించారు. అజయ్ భాయ్ పిరమల్, స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు. "రేపు మీరు మహాబలేశ్వర్ రావాలి అని రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్‌హౌస్‌లో ఉంటారు. వారికోసం బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే థీమ్‌పై ఒక కచేరీ చేయాలి’ అని అడిగారు. ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ కుటుంబాల కలయిక కాబట్టి, బాలీవుడ్ కూడా పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు. అన్నట్టు, వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ వాళ్ల ఫ్యావరెట్ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.సింగర్ : అమేయ డబ్లీకానీ ఈ వేడుకు ఆనంద్, ఇషాల ప్రపోజల్గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్, ఇషా ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 2016 నుంచి డేటింగ్లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది! -
అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది!
25 ఏళ్ల అవిభక్త కవలల్లో ఒకరైన కార్మెన్ ఆండ్రేడ్ (Carmen Andrade )న చిరకాల ప్రియుడు డేనియల్ (Daniel McCormack, 28)ని వివాహ మాడింది. గత ఏడాది అక్టోబర్‌లో తామిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టామని వెల్లడించిఅభిమానులను ఆశ్చర్చపరిచారు. తన ప్రియుడు డేనియల్ మెక్కార్మాక్ను అక్టోబర్ 2024లో వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారాకార్మెన్ వెల్లడించింది. ఇరు కుటుంబాల సమక్షంలోవివాహం చేసుకున్నారు.డైలీ మెయిల్ ప్రకారం, డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్న ఈ జంట నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. తరువాత కనెక్టికట్‌లో న్యూ మిల్‌ఫోర్డ్‌లోని లవర్స్ లీప్ బ్రిడ్జ్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. ‘ఓవర్‌డ్యూ అప్డేట్' అంటూ తమ పెళ్లి కబురును అందించింది కార్మెన్. View this post on Instagram A post shared by Daily Mail (@dailymail)పెళ్లి దుస్తుల్లో ఒక వీడియోను షేర్ చేసింది కార్మెన్ కొత్త వధువు తన షేర్ వీడియోలో వెడ్డింగ్ రింగ్‌ను చూపించింది, అలాగే ఇపుడు నేను భర్తని అంటూ వరుడు-డేనియల్ కూడా ఈ వీడియోలో జతయ్యాడు. నల్లటి టక్సేడో ధరించిన డేనియల్‌తో పోజులివ్వగా వధువు కార్మెన్ సాంప్రదాయ తెల్లటి వివాహ దుస్తులకు బదులుగా గ్రీన్ గౌను ధరించింది. తనకు తెల్లని దుస్తులు నచ్చవని తెలిపింది. నాకు పెళ్లికాలేదుఅయితే మరో కవల లుపిటా తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. “ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,” అని ఆమె ప్రకటించింది. మరోవైపు ‘అమెరికాకు ఇష్టమైన జంట’ పోటీలో ఈ జంట కూడా ముందు వరుసలో ఉన్నారని, ప్రస్తుతం వారు 9వ స్థానంలో ఉన్నారని డైలీ మెయిల్ తెలిపింది. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా కార్మెన్ ఆండ్రేడ్, లుపిటా సోదరీమణులు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇద్దరికీ వారి యూట్యూబ్ , టిక్‌టాక్ హ్యాండిల్స్‌లో మంచా ఫాలోయింగ్ ఉంది. ఈ కవలలు మెక్సికోలో జన్మించారు. ఎవరి గుండెవారిదే, ఊపిరితిత్తులు ఇద్దరికీ వేర్వేరుగా ఉన్నాయి. వారి అవయవాలు ఛాతీ నుండి కటి వరకు కలిసి ఉంటాయి. భావోద్వేగాల పరంగా ఇద్దరు భిన్నంగా ఉంటారు. ఇద్దరు సోదరీమణులకు ఎండోమెట్రియోసిస్ ఉంది, కానీ హార్మోన్ బ్లాకర్లు తీసుకుంటారట, ఫలితంగా, గర్భం దాల్చడం అసంభవమని కార్మెన్ గతంలో వెల్లడించింది. ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
పోచమ్మ బోనాల పండుగ
సాక్షి ముంబై; దాదర్ నాయ్‌గావ్‌లోని పద్మశాలీ యువక సంఘం (పీవైఎస్) ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే సాధారణం కంటే భిన్నంగా జంతుబలికి తావు లేకుండా అందరూ శాఖాహార బోనాలే సమర్పించడం విశేషం. బోనాల పండుగ సందర్భంగా లక్ష్మీపతి శర్మ అర్చకత్వంలో ïమిరియాల రోజాగౌతమ్, మంగరి సలోని రాహుల్ దంపతుల చేతుల మీదుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకం, హోమం, దేవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. పండుగ సందర్భంగా మహిళా భక్తులు తలపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. తమ వెంట తెచి్చన పిండి వంటలు, ప్రసాదాలు, ఒడి బియ్యం అమ్మవారికి సమరి్పంచి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అందరిని చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని కోరినట్టు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు సంపిణీ చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో సంస్ధ చైర్మన్ అనబత్తుల ప్రమోద్, మేనేజింగ్ ట్రస్టీ పొన్న శ్రీనివాసులు, కోడి చంద్రమౌళి, తిరందాసు సత్యనారాయణ, అ«ధ్యక్షుడు గంజి సీతారాములు, ఉపాధ్యక్షుడు లక్షేట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సహాయకార్యదర్శులు పేర్ల గీతాంజలి, కోశాధికారి దోర్నాల బాలరాజు, అధ్యాత్మికక సమితి చైర్మన్ దోమల్ శంకర్, కన్వీనర్ పుట్ట గణేశ్, కార్యవర్గ సభ్యులు పగిడిమర్రి సత్యనారాయణ, ఇతర పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు. సాకినాకలో బోనాల సంబరాలు ముంబై సాకినాకాలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. స్థానిక తెలుగు ప్రజలు సంప్రదాయ వేషధారణతో తలపై బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ తల్లికి మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కోళ్లను బలి ఇచ్చారు. తెలుగు మాదిగ మహా సంఘం బోనాలు ముంబైలోని తెలుగు మాదిగ మహా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ కమాటిపురాలోని పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వ్రస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎరుల లక్ష్మణ్, తెడ్డు బాబు రాజన్న, జోగు రాజలింగం, కోశాధికారి గంగడొల్ల రాజరాం, మేకల బాబు, నల్లూరి బాబు, గుమ్మెర్ల ప్రభాకర్, గంగడోల్ల శంకర్, కొత్తూరి రామచంద్ర, మేకల ఆనంద్, గుమ్మెర్ల మధూకర్, జంగం మహేష్, రుల రోజారాణి, మేకల రాజమణి, మేకల శోభ, జోగు కాంతమ్మ, మేకల భారతి, మేకల సప్న, విమల గుండారం తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్ !
28 ఏళ్ల యువకుడు ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చాడు. పలు ఓటములు చవిచూసి..స్వయంకృషితో ఎదిగాడు. ఏకంగా ఏడాదికి కోట్లు గడించే స్థాయికి చేరుకున్నాడు. చాలా కింద స్థాయి నుంచి శ్రీమంతుడిగా మారాడు. ఇంత సక్సెస్ అందుకున్నా..ఆనందించలేకపోతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు ఓ ఎంటర్ప్రెన్యూర్. పైగా అంతకుమునుపే..చాలా ఆనందంగా ఉన్నా..అప్పుడే చాలా హెల్దీగా ఉన్నా. ఇప్పుడు మాత్రం అంతలా ఉత్సాహంగా అస్సలు ఉండలేకపోతున్నా అని బాధగా చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తన విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గర్వంగా చెప్పాడు. విజయం సాధించాక ఆనందం దూరమైపోతుందా అంటే.28 ఏళ్ల భారతీయ ఎంటర్ప్రెన్యూర్ రెడ్డిట్‌లో షేర్ చేసిన పోస్టు నెట్టింట పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. వ్యవస్థాపకుడిగా తన జర్నీ ప్రారంభమైన విధానం గురించి వివరించారు. తనకు ఒక ప్రీమియం కారు, విదేశీ పర్యటనలు చుట్టొచ్చేంత మనీ, మంచి బంగ్లా కొనేంత డబ్బు ఉందని చెప్పుకొచ్చారు. ఐతే 12 ఏళ్ల క్రితం తానొక సాధారణ విద్యార్థినని, స్కాలర్‌షిప్‌పై సీఏ చేస్తున్నట్లు తెలిపాడు. 2017లో ఒక లక్ష పెట్టుబడితో స్టార్టప్ ప్రారంభించి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. ఇక 2020 కోవిడ్ సమయంలో సీఏ ఫైనల్లో ఉన్నట్లు గుర్తుచేసుకున్నాడు. అయితే అది కరోనా టైం కావడంతో పరీక్ష వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. దాంతో ఆన్లైన్ సర్వీస్ ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదేనండి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. అలా అతడు నెలకు 1 నుంచి రెండు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. అలా వెను తిరిగి చూడకుండా కోట్లు సంపాదించే రేంజ్‌కి వచ్చేశాడు. అంతేగాదు దుబాయ్ వంటి విదేశాల్లో కూడా తన కార్యకలపాలు ప్రారభించే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా మంచి ఆదాయన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ అతడి అదృష్టం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే సక్సెస్ అందుకుని అంచలంచెలుగా ఎదిగాడు. కేవలం తనకు వచ్చిన లాభాల్లో కొద్ది మొత్తం డబ్బు మాత్రమే పెట్టుబడి పెడుతూ..కోట్లు గడించాడు. ఒక్క సింగిల్ లోను లేకుండా పైకొచ్చానంటూ తన వ్యవస్థాపక జర్నీని షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు అతడి పోస్ట్‌ని చూసి ప్రశంసిస్తూ..మీరు ఇప్పుడు హ్యాపీనేగా అని ప్రశ్నించగా..అందుకు ఆ వ్యక్తి చాలా మంచి ప్రశ్న వేశారంటూ సమాధాన మిచ్చాడు ఇలా. "అస్సలు సంతోషంగా లేను. ఒకప్పుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు ప్రతి నిమిషం టెన్షన్ పడుతున్నా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా. ప్రయాణాలు చేయలేకపోతున్నా. ఎక్కువ పనిగంటలు. ఇప్పుడు నా వద్ద కావల్సినంత డబ్బు ఉంది కానీ సంతోషించ లేకపోతున్నా. ఐతే తన తల్లిదండ్రులు తన సక్సెస్‌ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. అలాగే ఏ వస్తువు అయినా ఈజీగా కొనేయొచ్చు.. అన్నతం ధైర్యం గుండెల్లో ఉంది. డబ్బు కేవలం భద్రతనే ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వలేదని బాధగా బదులిచ్చాడు. అందుకు నెటిజన్లు మిత్రమా ఎందరో కలల ప్రపంచాన్ని నువ్వు సాకారం చేసుకోగలిగావు. అందుకు సంతోషం. పైగా వ్యాపారాన్ని నడిపంచే స్థాయికి చేరుకున్నావు. అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలవు. మంచి సంతోషాన్ని కూడా కచ్చితంగా పొందగలుగుతావు అని ఆశ్వీరదిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఇష్టమైన గులాబ్ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!) -
దంపతుల ‘మొక్క’వోని దీక్ష, ఏడాదికి రూ. లక్ష ఖర్చు
కోల్‌సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు. ఏడాదికి రూ.లక్ష ఖర్చు నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖనిఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు -
చిత్రం చెప్పేకథ : రైతే కాడెద్దు, బెంబేలెత్తించిన పైపు నీరు
బెంబేలెత్తించిన పైపు నీరు: స్థానిక జయదేవ భవన్ పరిసరాల్లో నీటి పైపు చిట్లడంతో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా తాగు నీరు సరఫరా చేసే ప్రధాన అనుసంధాన పైపు కావడంతో నీటి ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. ఈ పైపు చిల్లుబడి సుమారు 50 అడుగుల ఎత్తుకు నీరు చిమ్మడంతో చేరువలో 30 అడుగుల ఎత్తున 30 కేవీ విద్యుత్ సరఫరా అనుసంధాన వ్యవస్థని అధిగమించి నీరు నింగికి ఎగసింది. – భువనేశ్వర్ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాడెద్దులు లేకున్నా.. ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. – కొరాపుట్ ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
శ్రావణం: ఈశ్వరాభిషేకం
భువనేశ్వర్: శివ భక్తులకు శ్రావణ మాసం అత్యంత పవిత్ర ప్రదం. ఈ నెల పొడవునా ప్రతి సోమవారం ఇష్ట ఆరాధ్య దైవం మహా దేవుడు శివునికి పవిత్ర జలంతో అభిషేకించి తరించేందుకు దీక్ష బూనుతారు. తొలి శ్రావణ సోమవారం పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివ దీక్ష భక్తులతో కిటకిటలాడాయి. కఠోర నియమ నిష్టలతో ఒక చోటులోని నదీ జలం సేకరించి వేరొక చోట పూజలందుకుంటున్న మహా దేవునికి అభిషేకిస్తారు. నదీ తీరంలో శుచిగా స్నానం ఆచరించి దీక్ష వస్త్ర ధారణతో తీరంలో లాంచనంగా పూజాదులు నిర్వహించి పవిత్ర నదీ జలంతో నింపిన కలశాల్ని కావడికి అమర్చి పాద యాత్ర ప్రారంభిస్తారు. ఈ దీక్షకుల్ని కావడి ధారులు (కౌడియా)గా పేర్కొంటారు. పాద యాత్ర ఆద్యంతాలు దీక్ష నియమ నిబంధనల్ని కఠోరంగా అవలంభిస్తారు. సోమవారం శైవ క్షేత్రం చేరేలా యాత్ర కొనసాగిస్తారు. భోలా శంకరుని కటాక్షం కోసం బోల్ భం నిరంతర శివ నామ నినాదంతో ముందుకు సాగుతారు. బోల్ భం దీక్షకుల ఆగమనం పరిసరాల్ని శివ మయం చేస్తాయి. శైవక్షేత్రాలు ప్రత్యేకంగా అలంకరించుకుని వీరికి స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా కావడిధారి పాదచారులకు ఎటువంటి అసౌకర్యం అవాంతరం కాకుండా పోలీసు, రవాణా తదితర అనుబంధ వర్గాలు అంకిత భావంతో చేయూతనిస్తాయి. దవళేశ్వరునికి పవిత్ర జలంతో అభిషేకిస్తున్న భక్తులు పలు స్వచ్చంధ సేవక వర్గాలు దారి పొడవునా దీక్షకు అనుగుణంగా వీరి కోసం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి శైవ క్షేత్రాలు విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలు, సుగంధిత పూల మాలల అలంకరణతో కనులు మిరమిట్లు గొలిపేలా ముస్తాబవుతాయి. ఆయా క్షేత్రాల్లో బోల్ భం దీక్షకులు సులభంగా మహా దేవునికి అభిషేకించేందుకు తాత్కాలిక బారికేడ్ల గుండా వరుస క్రమంలో దర్శన సౌకర్యం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి దేవస్థానం యంత్రాంగం సహకరిస్తారు. ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజు, అఠొగొడొ ధవళేశ్వరుని దేవస్థానం, రాజ్‌గంగ్‌పూర్‌లోని ఘోఘరేశ్వర్, ఢెంకనాల్ కపిలేశ్వర్ మరెన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు బోల్ భం దీక్షకుల ఆగమనంతో శ్రావణ శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా మహా నది, ఉప నదులు, బ్రాహ్మణి, వైతరణి, కువాఖాయి తదితర పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని కావడి భారంతో నిష్టతో సంకల్పం మేరకు శైవ క్షేత్రం చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివునికి అభిషేకిస్తారు. ఈ దీక్షలో ఆబాల గోపాలం అత్యంత అంకిత భక్తి భావంతో పాల్గొంటారు. శివాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కౌడిలు బ్రహ్మణి నది, వేదవ్యాస్ శైవ పీఠం నుంచి నీటిని తీసుకువచ్చి ఘోఘరేశ్వర్ శివాలయానికి నీటిని సరఫరా చేశారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) పూరీ సాగర తీరంలో శ్రావణ సోమవారం పురస్కరించుకుని మహా దేవుని ఆశీస్సులు కోరుతూ ఆవిష్కరించిన సైకత మహా శివుడు, బొడొ సింగారం అలంకరణలో కటక్ అఠొగొడొ ధవళేశ్వరుని దర్శనం -
గాంధీ.. గాడ్సే.. నోబెల్ శాంతి బహుమతి!
శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు?. ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం.. ఆయన్నెందుకు వరించలేదు? కారణం.. నాథూరాం గాడ్సేనా?? గాంధీని చంపిన గాడ్సే.. ఆయనకు నోబెల్ దక్కే అవకాశాన్ని కూడా చంపేశాడా? అందుకే 1948లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదా? పైగా.. తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరూ జీవించి లేనందున ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్ కమిటీ ప్రకటన దీన్నే సూచిస్తోందా? అసలు.. గాంధీకి నోబెల్ రాకపోవడానికి గాడ్సేకు ఉన్న లింకేంటి?1930ల్లో ఏం జరిగిందంటే..నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948ల్లో ఆయన ఈ పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింసా మార్గం లేదా శాంతి మార్గం అన్నది తన దేశ స్వాతంత్య్రం కోసం తప్ప.. అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్ కమిటీలోని కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి ఆయన షరతులతో సమ్మతి తెలపడాన్ని వాళ్లు ఎత్తి చూపారు. నోబెల్ బహుమతులను ఇచ్చే నార్వే అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు. 1947 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస.. మతపరమైన హింసను నిరోధించడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాకపోవడం, విభజన హింస.. గాంధీ శాంతి సందేశాన్ని మరుగునపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. 1900 నుంచి 1960 వరకూ పురస్కారాలను గమనిస్తే మనకీ విషయం అర్థమవుతుందని గేర్ లూండెస్టాడ్ అన్నారు.1948లో ఎందుకు రాలేదంటే..1948లో గాంధీజీ మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత ఎమిలీ గ్రీన్ బాల్చ్, బాంబే స్టేట్ తొలి సీఎం బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, యునైటెడ్ ప్రావిన్సెస్ తొలి సీఎం గోవింద్ వల్లభ్ పంత్, లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్.. ఇలా ఎందరో ప్రముఖులు ప్రతిపాదించారు. ఆ ఏడాది మహాత్మునికే శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు పేర్లతో షార్ట్ లిస్ట్ (గాంధీ పేరు ఈ జాబితాలోకి రావడం మూడోసారట) రెడీ అయ్యింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ల గడువు ఇంకో రెండ్రోజుల్లో ముగుస్తుందనగా.. జనవరి 30న మహాత్ముడిని గాడ్సే పొట్టనబెట్టుకున్నాడు. తద్వారా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేకుండా చేశాడు. ఎందుకంటే.. ఆ సంవత్సరం ఎవరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదని 1948, నవంబర్ 18న కమిటీ ప్రకటించింది. పైగా.. ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఆ అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వ్యక్తి ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం.. మరణానంతరం నోబెల్ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాతి కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మహాత్ముడు జీవించి ఉండి ఉంటే.. 1948 నోబెల్ శాంతి బహుమతి ఆయనకే దక్కి ఉండేదన్నది అత్యధికుల వాదన. పైగా.. ‘గాంధీ ఈ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునే దాకా వచ్చారు. అయితే, ఆయన మరణం దాన్ని దూరం చేసింది’ అని 1948 నోబెల్ కమిటీ రికార్డుల్లో నమోదై ఉండటం కూడా ఆ వాదనను మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేర్ లూండెస్టాడ్ అన్నారు. తర్వాత నోబెల్ కమిటీ కూడా మహాత్ముడికి శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లలో విచారం వ్యక్తం చేసింది. గాంధీ గొప్పోడని చెప్పడానికి ఆయనకు నోబెల్ అక్కర్లేదు.. కానీ నోబెల్ గొప్ప అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం గాంధీ కావాలి! దట్సిట్..(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
రామావతార పరమార్థం : సరస్వతీ దేవి ప్రేరణతోనే కైకేయి వైరం
సాధారణంగా లోకంలో... రామాయణంలోని మంథర కపట స్వభావం గలది అనీ, భరతుని కంటే కూడా రామునిపై ఎక్కువ పుత్ర ప్రేమను చూపించే కైకేయి మనసును విరిచి, రాముడిని వనవాసానికి పంపేటట్లు చేసిందనీ ఆమె పాత్ర స్వభావం గురించి ఒక విశ్లేషణ ఉంది. కానీ, అధ్యాత్మ రామాయణంలో, రామావతార పరమార్థం నెరవేరటానికి సరస్వతీ దేవి ప్రేరణతో ఆమె అలా వైరభావం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది.రామ పట్టాభిషేక వార్త విని, కౌసల్యా దేవి ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని లక్ష్మీదేవిని పూజించింది, దుర్గాదేవిని పూజించింది. అయినా ఆమె మనసులోకించిత్ వ్యాకులత ఉందిట. జరగబోయేది ముందుగానే సూచనగా తెలుస్తున్నది ఆమెకు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా కలిసి, వాగ్దేవి సరస్వతిని ప్రేరేపించారు: ‘నీవు భూలోకంలో అయోధ్యా నగరానికి వెళ్లు. రామ రాజ్యాభిషేకానికి విఘ్నం కలగజేయటానికి యత్నించు. ముందు మంథర మనసులో ప్రవేశించి, ఆమెలో వ్యతిరేక భావం కలిగించు. తర్వాత కైకేయిలో ప్రవేశించి ఆ విధంగానే చెయ్యి. రామ రాజ్యాభిషేకం ఆగిపోతే గానీ, రామావతార పరమార్థం నెరవేరదు,’ అని చెప్పారు. సరస్వతి దేవి సరేనని బయలుదేరింది. అయోధ్యా నగరం చేరి మంథర మనసులో ప్రవేశించింది.కైకేయితో మంథర ‘నీకు గొప్ప ఉపద్రవం రాబోతోంది. రేపు రామునికి పట్టాభిషేకం జరగబోతోంది’ అంది. కైకేయిసంతోషంతో దివ్యమైన మణి నూపురాన్ని మంథరకు బహు మతిగా ఇచ్చింది. సరస్వతీ దేవి ప్రేరణతో మంథర... కైకేయి మనసు బాధ పడేట్లు, రామ పట్టాభిషేకం జరిగితే కౌసల్యకు దాసిలా ఉంటావని చెపుతుంది. ఆ మాటల ప్రభావంతో కైకేయి మనసులో మార్పు వచ్చి, కోప గృహంలో చేరింది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లడం, సీతాపహరణం, రావణ సంహారం... ఇలా ఎన్నో ఘట్టాల్లో రాముడు తాను నిర్వర్తించా ల్సిన సకల కార్యాలను నిర్వర్తించాడు.– డా.చెంగల్వ రామలక్ష్మి -
సోషల్ ట్రెండ్స్..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్‌కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్‌కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్‌తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో పాటు అన్ని యాప్‌లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్‌జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్‌గా మార్చేస్తున్నారు. (చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..) -
చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..
ఒకప్పుడు చిన్నారులకు చందమామ కథలు చెబుతూ అన్నం తినిపించేవారు అమ్మలు. ఆ కథలు వింటూ మరో లోకంలో విహరించేవి ఆ పసిహృదయాలు. చిన్న తలుపు తట్టినా చప్పట్లతో పరుగులుతీసి ఆటలాడేవారు. ఇప్పుడు ఆ రోజులు వెనక్కి పోయాయి. చందమామ చూపించే తల్లుల బదులు, యూట్యూబ్ కార్టూన్లు ప్లే చేసే అమ్మలుగా మార్పుచెందారు. బాల్యంలోనే మొబైల్‌తో స్నేహం చేస్తూ పెరుగుతున్న ఈ తరం అది లేకుండా ఉండలేని స్థితికి చేరింది. ఇది అధునాతన సాంకేతికత అందించిన సౌకర్యమే కాదు, అనేక మానసిక, శారీరక సమస్యలకు దారితీసే వ్యసనం కూడా. ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని పూర్తిగా నిరాకరించడం సాధ్యమా అంటే.. కాదనే చెబున్నాయి అధ్యయనాలు.. అలా అని అంతలా అవసరమా అంటే అదీ కాదనే చెబుతున్నారు. కానీ చిన్నారుల మెదడు అభివృద్ధి, మానసిక స్థితి, నైపుణ్యాల పెరుగుదల అన్నిటికీ స్థిరమైన అనుసంధానం కావాలంటే, మొబైల్ వినియోగాన్ని సమతుల్యంగా నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు చూపిన దారిలోనే పసి పిల్లలు నడుస్తారు.. మనం మొబైల్ ఆఫ్ చేస్తే, వారు జీవితాన్ని ఆనందించడంలో ముందుకు వస్తారన్నది నిపుణుల మాట. ఇటీవలి కాలంలో పిల్లల్లో ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. నగరాల నుంచి పల్లెలకూ ఈ విష సంస్కృతి విస్తరించింది. సహజమైన ఆటలతో అలసిపోవాల్సిన పసి హృదయాలు డిజిటల్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. దీనికి ప్రధాన కారకులు తల్లిదండ్రులేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం తినిపించడానికో.. అల్లరి తగ్గించడానికో మనం అలవాటు చేసే ఈ పద్ధతికి బాల్యం బలైపోతోంది. కొంత కాలానికి అదే అడిక్షన్‌గా మారుతోంది. చిన్నారులకు మొబైల్ వినియోగం వల్ల కలిగే నష్టాలు సాధారణమైనవి కాదు, వారు పెరుగుతూ ఉంటే ఈ వ్యసనం పోతుందని నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం చేత చిన్నారులు దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్నారు. దృష్టి సమస్యలు : నిరంతరం మొబైల్ స్క్రీన్ చూడటంవల్ల, మరీ దగ్గర నుంచి చూస్తుండటం వల్ల చూపు బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మైల్స్ డిసార్డర్స్, డ్రై ఐ వంటి సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. నిద్రలేమి : స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే నీలి కిరణాలు(బ్లూ లైట్) నిద్రకు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక అసంతృప్తి : ఎక్కువగా డిజిటల్ ప్రపంచంతో మమేకమవుతూ, వాస్తవ ప్రపంచానికి దూరమవ్వడం వల్ల పిల్లల్లో ఒంటరితన భావన, ఆందోళన, కొంతవరకూ డిప్రెషన్‌కు గురికావచ్చు. అవగాహనాలేమి : వీడియోలు, రీల్స్ వంటి తక్షణ వినోదం చిన్నారుల్లో సహనాన్ని తగ్గిస్తుంది. దృష్టి ఎటుపోతుందో అక్కడే ఆలోచన కూడా ఆగిపోతుంది. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. చూడకూడనివన్నీ చూస్తూ : కొన్ని రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో పిల్లలకు అవసరం లేని కంటెంట్ ఉంటుంది. అది వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దుష్ఫలితాలను కలిగిస్తుంది.పెద్దలే ఆదర్శంగా : తల్లిదండ్రులే ముందుగా మొబైల్‌కి బానిసలుగా ఉంటే.. పిల్లలు ఎలా దూరమవుతారు? ఫోన్ల వాడకాన్ని తల్లిదండ్రులే మొదట నియంత్రించాలి. తద్వారా పిల్లలకు ఆదర్శంగా మారాలి. నియంత్రిత కంటెంట్ : పిల్లలకు పూర్తిగా మొబైల్ తీసేయడం కాకుండా, వారితో ఓపెన్ డైలాగ్ పెట్టి, వారికి సేఫ్ కంటెంట్ మాత్రమే చూపించడం అవసరం. ఇతర వ్యాపకాల వైపు.. పిల్లలను మొబైల్‌కి దూరం చేయడానికి పరిష్కార మార్గాలు మనచేతుల్లోనే ఉంటాయి. వారి మానసిక స్థితికి అనుగుణంగా, వారి ఇష్టాలపై ఆసక్తి పెంచేలా ఇతర వ్యాపకాలతో మునిగిపోయేలా చేయొచ్చు. సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పిల్లలు మొబైల్ చూడకుండా ఉండేందుకు కొన్ని విడియోలు, టిప్స్, ట్రిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ‘కిట్ బ్యాగ్ ట్రిక్’, ‘బుక్స్ బిఫోర్ స్క్రీన్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకి యాక్టివిటీ జర్నల్స్ ఇవ్వడం, పజిల్ ఛాలెంజ్‌లు పెట్టడం ద్వారా మొబైల్ బదులుగా కొత్త అలవాట్లు పెంచుతున్నారు. ఈ డిజిటల్ తరం కాబట్టి అవసరమైనంత మేర రైమింగ్స్, కిడ్స్ ఐక్యూ వంటి వీడియోలు చూపించి వారి వ్యసనాన్ని నియంత్రించాలి. డిజిటల్ డిటాక్స్ షెడ్యూల్ : రోజులో ఒక నిర్దిష్ట సమయానికి మొబైల్ పూర్తిగా వదిలేసి, కుటుంబంతో సమయాన్ని గడపడం, ఆటలు, పుస్తకాలు, చర్చలతో సమయాన్ని గడిపేలా చేయాలి. ఆఫ్‌లైన్ వినోదాన్ని ప్రోత్సహించాలి : బొమ్మల కథలు, బోర్డు గేమ్స్, డ్రాయింగ్, సంగీత తరగతులు, నృత్యం లాంటి క్రియేటివ్ యాక్టివిటీలతో వారి దృష్టిని డైవర్ట్ చేయాలి. (చదవండి: ఆంబోప్లియా: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!) -
బ్రహ్మజెముడు ప్లాస్టిక్! నెలరోజుల్లోనే మట్టిలో!
ఎడారి మొక్క బ్రహ్మజెముడు (కాక్టస్) రసంతో పర్యావరణ హితమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని మెక్సికన్ మహిళా ప్రొఫెసర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ అభివృద్ధి చేశారు. ఒక ప్రయివేటు యూనివర్సిటీలో ఆమె కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పనితీరులో అచ్చం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌ను పోలి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్లు, ప్లాస్టిక్ కవర్లు వెయ్యి ఏళ్లకు గాని భూమిలో కలిసిపోవు. కానీ, బ్రహ్మజెముడు ప్లాస్టిక్ నెల రోజుల్లోనే విచ్ఛిన్నమై మట్టిలో కలిసిపోతుంది. పర్యావరణ కాలుష్యంతో పాటు మైక్రోప్లాస్టిక్ కణాలు మన దేహాలను సైతం కలుషితం చేస్తున్న ఈ తరుణంలో వెలువడిన ఈ ఆవిష్కరణ ఒక విప్లవాత్మక పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. డాక్టర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ చాలా మంది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. బ్రహ్మజెముడు రసం నుంచి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పూర్తిగా బయోడిగ్రేడబుల్. విషపూరితమైనది కాదు. తినదగినంత సురక్షితం! కఠినమైన ఎడారి పరిస్థితుల్లో తక్కువ వనరులతో పెరుగుతున్న బ్రహ్మజెముడు, సాధారణ నోపాల్ కాక్టస్ (ప్రిక్లీ పియర్)ను ఉపయోగించి, ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్, తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే వినూత్న ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు.ఇదీ చదవండి: Moon-Rice వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే బ్రహ్మజెముడు రసంలోని సహజ చక్కెరలు, పెక్టిన్, సేంద్రియ ఆమ్లాల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రయోగశాలలో ఉత్పత్తి ప్రక్రియకు దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ పురోగతి ఆహార ప్యాకేజింగ్, షాపింగ్ బ్యాగులు, లెక్కలేనన్ని ఇతర సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీని సమూలంగా మార్చగలదు. వర్షాధార వ్యవసాయదారుల ఆదాయం పెంపొందించేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడు తుందని నిపుణులు చెబుతున్నారు.చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్‌గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్‌ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్‌ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్‌కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్‌గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్‌గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్‌లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే
ఏ గ్రహంపైనైనా అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరిగే అద్భుతమైన ‘అతి మరుగుజ్జు (సూపర్ డ్వార్ఫ్)’ వంగడం సిద్ధమైంది. రోదసీలోగానీ.. చంద్రుడు, అంగారకుడి మీదగానీ.. భూమిపైన ప్రత్యేక వాతావరణంలోనూ.. ఎడారుల్లో, ఇంట్లో కూడా ఇక వరి ధాన్యం పండించుకోవచ్చు. ఇటలీ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎ), మరో మూడు ఇటాలియన్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ అద్భుత వరి వంగడాన్ని రూపొందించింది. చంద్రుడిపై మనుషుల దీర్ఘకాల మనుగడకు అవసరమైన విలక్షణ వరి వంగడాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో ‘మూన్ రైస్’ పేరిట చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టు విజయవంతమైంది.2–3 అడుగులు ఎత్తు పెరిగే పొట్టి (డ్వార్ఫ్) వరి వంగడాలు మాత్రమే మనకు తెలుసు. అయితే, ఈ సరికొత్త రకం కేవలం 4 అంగుళాల (10 సెంటీమీటర్లు) ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అదీకాకుండా, అధిక మాంసకృత్తులు గల ధాన్యాన్ని దిగుబడినిస్తుందట. అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారంపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. తాజా పదార్థాలు వారి ఆహారంలో ఉండే అవకాశం లేదు. సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్రలో గడిపే వ్యోమగాముల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందటం లేదు. భూగోళానికి మరింత ఎక్కువ దూరంలో రోదసీలో పరిశోధనలు చేపట్టాలంటే విటమిన్లు, పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడే పండించాలి. మూన్ రైస్ పరిశోధనా ప్రాజెక్టు ఈ లక్ష్యంతోనే ప్రారంభమైంది. ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్త మార్తా డెల్ బియాంకో ఈ పరిశోధన వివరాలను ప్రకటించారు. బెల్జియంలో సుప్రసిద్ధ ‘సొసైటీ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయాలజీ’ వార్షిక సమావేశంలో ఇటీవల ఆమె ప్రసంగించారు.భూమ్మీద రైతులకూ ఉపయోగమేమూన్ రైస్ ప్రాజెక్టు పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికొచ్చే విషయాలకు మించిన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ‘అత్యంత సమస్యాత్మక అంతరిక్షంలో పెరగటానికి రూపొందుతున్న ఈ అతి మరుగుజ్జు వంగడం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువాలకు దగ్గరి ప్రాంతాల్లో లేదా ఎడారుల్లో లేదా తక్కువ స్థలం ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణంలో సాగుకు కూడా ఉపయోగపడుతుంది’ అని డెల్ బియాంకో తెలిపారు. వరి మొక్కలు అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తోంది.4 ఏళ్ల 9 నెలల పరిశోధనవరి జన్యుశాస్త్రంలో పట్టున్న మిలన్ విశ్వవిద్యాలయం, పంట శరీర ధర్మశాస్త్రంలో ప్రత్యేక కృషిచేస్తున్న రోమ్ విశ్వవిద్యాలయం, అంతరిక్ష పంటలపై పరిశోధనలో ఆరితేరిన నేపుల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలసి ఇటలీ అంతరిక్ష సంస్థ పరిశోధనలు చేస్తోంది. ‘నాలుగేళ్ల 9 నెలల క్రితం ప్రారంభించిన పరిశోధనల్లో చాలా పురోగతి ఉంది. మిలన్ విశ్వవిద్యాలయంలో కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఉత్పరివర్తన చెందిన వరి రకాలపై పరిశోధనలు కొలిక్కివచ్చాయి. ఇది గొప్ప ప్రారంభ విజయం. పంట ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మొక్కల నిర్మాణాన్ని మార్చగల జన్యువులను రోమ్ విశ్వవిద్యాలయం గుర్తించి మార్పులు చేసింది. ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంతరిక్షంలో మాంసాన్ని పెంచలేం. అందుకని ప్రొటీన్ అధికంగా ఉండేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అన్నారు డెల్ బియాంకో.తాజా ఆహారం.. మానసిక ఆరోగ్యం!తాజా ఆహారం శరీర పోషణకు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతరిక్షానికి తీసుకెళ్లిన ముందే వండిన ఆహారం కొంత కాలం బాగా నే ఉంటుంది. దీర్ఘకాలం దానిపై ఆధారపడటం సాధ్యం కాదు. అందువల్ల అక్కడే వ్యోమగాముల కళ్ల ముందు పెరిగే పంట వంగడాలను రూపొందించటం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా దారితీయొచ్చు.హార్మోన్ మార్పుతో..‘మన దగ్గర ఇప్పటికి ఉన్న పొట్టి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు. ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి. వరి మొక్కలో ఎత్తును ప్రభావితం చేసే గిబ్బరెల్లిన్ అనే హార్మోన్లో మార్పు చేశాం. కానీ, అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తటం కూడా ఒక సవాలు. అక్కడ పెరిగే పంట మరీ తక్కువ ఎత్తు ఉండటం ఒక్కటే చాలదు.. మంచి ఉత్పాదకతను కూడా ఇవ్వగలగాలి. ఇలాంటి వంగడాన్ని తయారుచేయటం అనేక సవాళ్లతో కూడినది’ – మార్తా డెల్ బియాంకో, ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్తసాక్షి, స్పెషల్ డెస్క్ -
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
రొయ్యలకు ప్రత్యామ్నాయం ‘పాంపనో’!
పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగారాజన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్ ఉందని డా. మెగారాజన్ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. పాంపనో సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్‌స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.మూల పొలంలో పాంపనో సాగు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్ఎఫ్డీబీకి ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్టీఆర్ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో 3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్ కన్సల్టెంట్ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పాంపనో సాగులో రిస్క్ తక్కువ! ఇండియన్ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు. వ్యాధుల రిస్క్ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. – డా. మెగారాజన్ (95057 68370) సీనియర్ శాస్త్రవేత్త, ఈఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం2 కిలోల మేతకు కిలో చేపసముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. – కె.ఆంజనేయులు, టెక్నికల్ కన్సల్టెంట్, ఎన్ఎఫ్డీబీ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా – పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా -
ఆ కంటిచూపు మన వెన్నంటి
‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో సీత... ఆ కళ్లల్లో కరుణ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర... ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం... పాత్రల్లోనేనా... పాటల్లోనూ ఆ కళ్లు ఎన్నో భావాలు పలికించాయి. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’.... ఆ కళ్లు వెచ్చని హాయిని కనబర్చాయి... ‘గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి’.... ఆ కళ్లల్లో కవ్వింపు... ఇలా వెండితెరపై ఆమె కళ్లు జీవించాయి. అందుకే తెలుగులో ‘జగదేక నటి’, మాతృభాష కన్నడంలో ‘అభినయ సరస్వతి’, తమిళంలో ‘కన్నడత్తు పైంగిళి’ (కన్నడ చిలుక). బి. సరోజా దేవి కళ్లు ఇక విశ్రమించాయి... అవి కనబర్చిన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి. ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో గల తన స్వగృహంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన సరోజా దేవి పూజ చేసి, టీవీ ఆన్ చేసి, కుర్చీలో కూర్చొని ఉండగా అస్వస్థతకు గురయ్యారని, సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలంటే ఇష్టం లేని ఓ తార ‘చతుర్భాష తారె’(నాలుగు భాషల తార)గా కితాబులు అందుకున్నారు. అవును... బి. సరోజా దేవికి సినిమాలంటే ఇష్టం లేదు. అయితే ఆమె తండ్రి భైరప్పకు నటనంటే ఇష్టం. వృత్తిరీత్యా ఆయన పోలీసు అయినప్పటికీ ఓ నాటక సంస్థలో నాటకాల్లో నటించేవారు. చిన్నప్పుడు సరోజా దేవితో కూడా నటింపజేసి, మురిసిపోయారు. బెంగళూరులో 1938లో జనవరి 7న సరోజా దేవి జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా సరోజా దేవి ఆఖరి అమ్మాయి. మగపిల్లలు లేకపోవడంతో ఆమెకి అబ్బాయిలా డ్రెస్సులు వేసేవారు. దాంతో స్కూల్లో అబ్బాయిలు వెక్కిరిస్తే... ఇంటికొచ్చి ఏడ్చిన కూతురితో ‘కావాలంటే మీరూ అమ్మాయిలా బట్టలేసుకోండి’ అని చెప్పు అంటూ ఆమె తల్లి రుద్రమ్మ ఆత్మవిశ్వాసం నూరిపోశారు.టీనేజ్‌లో వెండితెరపై...ఓవైపు చదివిస్తూ మరోవైపు కూతురితో నాటకాల్లో నటింపజేశారు భైరప్ప. పదిహేడేళ్ల వయసులో సరోజాదేవి నటించిన ఒక నాటకం చూసి, కన్నడ దర్శక–నిర్మాత హొన్నప్ప భాగవతార్ ఆమెకు ‘మహాకవి కాళిదాశ’ (1955) సినిమాలో అవకాశం ఇచ్చారు. జాతీయ అవార్డు సాధించిన ఆ చిత్రంతో సరోజా దేవికి మంచి పేరు వచ్చింది. నిజానికి సరోజా దేవిని నటిని చేయాలనుకుని, డ్యాన్స్ కూడా నేర్పించారు భైరప్ప. డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కుమార్తె కాళ్లు వాచిపోతే, ఓపికగా మసాజ్ చేసేవారట. అలాగే రుద్రమ్మ మాత్రం ఎప్పటికీ స్విమ్ సూట్ ధరించకూడదని, స్లీవ్‌లెస్ బ్లౌజులు వేయకూడదని కూతురికి నిబంధన విధించారట. తన కెరీర్ మొత్తంలో ఆ నిబంధనను పాటించారు సరోజా దేవి. ‘మహాకవి కాళిదాస’ తమిళంలో ‘మహాకవి కాళిదాస్’గా అనువాదమై, 1956లో విడుదలైంది. ఆ రకంగా తమిళ పరిశ్రమ దృష్టి సరోజా దేవిపై పడింది. విశేషం ఏంటంటే... తమిళంలో రిలీజైన నాలుగేళ్లకు శివాజీ గణేశన్, షావుకారు జానకిల కాంబినేషన్లో ‘మహాకవి కాళిదాస్’ (1966)గా రీమేక్ కూడా చేశారు. ఇక తమిళంలో ‘తిరుమణమ్’ (1956)లో నటించే అవకాశం సరోజా దేవికి దక్కింది. ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తెలుగు నుంచి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పాండురంగ మహత్మ్యం’ (1957)లో నటించే చాన్స్ అందుకున్నారు సరోజ. ఏ భాషలో నటిస్తే అది ఆమె మాతృభాష ఏమో అనిపించేలా నటన ఉండటంతో తెలుగు, తమిళ, కన్నడంలో వరుసగా ఆఫర్స్ వచ్చి, బిజీ తారగా మారిపోయారు. అలా ఆమె ‘పైఘమ్, ససురాల్’ తదితర హిందీ చిత్రాల్లోనూ నటించారు.తెలుగులో పాతిక వరకూ... తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్‌తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్‌కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ఈ ‘చిటపట చినుకులు...’ పాటలో ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కనబడతారు. దానికో కథ ఉంది... అదేంటంటే...ట్రెండ్ అయిన స్కార్ఫ్ ‘చిటపట..’ చిత్రీకరించే ముందు సరోజ ఓ హిందీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ షూట్లో భాగంగా నెత్తిపై పాల కడవ పెట్టుకుని నడుస్తుంటే, ఆకతాయిలు ఆమెపై రాళ్లు విసురుతూ ఆట పట్టిస్తారు. ఓ రాయి సరిగ్గా సరోజ ముఖానికి తగిలి, గాయాలయ్యాయి. అదే సమయానికి ఇటు ఏఎన్నార్ కాంబినేషన్లో ‘చిట పట..’ పాట షూట్లో పాల్గొనాలి. దాంతో ముఖంపై మచ్చలు కనబడనివ్వకుండా స్కార్ఫ్‌తో మేనేజ్ చేశారు. ఆ తర్వాత ఆ స్కార్ఫ్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోవడం విశేషం. ఇక తనకు బాగా నచ్చిన పాటల్లో ‘చిట పట’ ఒకటని సరోజ పలు సందర్భాల్లో చె΄్పారు.సరోజ చీరలు ఫేమస్ 1960లలో సరోజా దేవి ధరించిన చీరలు, జాకెట్టులు, నగలు, హెయిర్ స్టైల్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఆ తరం అమ్మాయిలు ఆమె స్టైల్‌ని, మేనరిజమ్స్‌ని ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా తమిళ చిత్రాలు ‘ఎంగ వీట్టు పిళ్లై, అన్బే వా’లోని చీరలు, నగలను ఫాలో అయ్యారు. బిజీగా ఉన్నప్పుడే వివాహం 1955లో నటిగా పరిచయమై, అక్కణ్ణుంచి పదేళ్లు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో సరోజా దేవికి ఇంజినీర్ శ్రీహర్షతో 1967లో పెళ్లయింది. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారట సరోజ. అయితే భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు సరోజ. ఇక ఆమె భర్త అనారోగ్యం బారిన పడక ముందు ‘లేడీస్ హాస్టల్’ (1985) అనే కన్నడ సినిమా అంగీకరించారు. ఆ సినిమా అప్పుడే శ్రీహర్ష అనారోగ్యానికి గురి కావడంతో ఆమె షూటింగ్స్‌కి దూరమయ్యారు. చివరికి 1986లో భర్త చనిపోవడంతో ఆమె ఏడాది పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు కానివారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏడాది తర్వాత ‘లేడీస్ హాస్టల్’ సినిమాతో పాటు అప్పటికే అంగీకరించిన ఎనిమిది చిత్రాలను పూర్తి చేశారామె. ఆ తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నారు. ఫస్ట్ కన్నడ ఫిమేల్ సూపర్ స్టార్ నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు మళ్లీ కథానాయికగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్యారెక్టర్ నటిగానూ చేశారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి కన్నడ చిత్రం ‘నట సార్వభౌమ’ (2019). కన్నడంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ రికార్డ్ ఆమెదే. ఇక వరుసగా 150కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించడం ఓ అరుదైన ఘనత.జాతీయ అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా... 1998, 2005లో సరోజా 45వ జాతీయ సినిమా అవార్డు, 53వ జాతీయ సినిమా అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కర్నాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి అధ్యక్షురాలిగా, కన్నడ చలన చిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగానూ చేశారు. ఇక 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సరోజా దేవిని ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించింది. అలాగే అంతకు ముందు 1969లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’, 1992లో ‘పద్మభూషణ్’ పురస్కారాలు అందుకున్నారామె. ఇంకా కన్నడ, తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ అభినయ సరస్వతికి దక్కాయి.చివరి కోరిక అదే ఇప్పటివరకూ సరోజకు రీప్లేస్‌మెంట్‌గా మరో తార రాలేదు... భవిష్యత్తులోనూ రాకపోవచ్చు. అయితే ఆ కళ్లు కొన్నేళ్ల పాటు చూస్తుంటాయి. ఎందుకంటే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలన్నది సరోజ చిట్ట చివరి కోరిక. కుటుంబ సభ్యులు ఆ కోరికను నెరవేర్చారు. ఇక... నటిగా ఆ కళ్లు ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి.నేడు అంత్యక్రియలు సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ కళ్లల్లో ఆరిన తడి సరోజా దేవికి ఇద్దరు కూతుళ్లు (ఇందిర, భువనేశ్వరి), ఒక కుమారుడు (గౌతమ్ రామచంద్రన్‡). కాగా భువనేశ్వరి అనారోగ్యంతో కన్నుమూయడం సరోజా దేవికి ఓ షాక్. అలాగే 1986లో ఆమె భర్త కూడా చనిపోయారు. ‘నా అనుకున్నవాళ్లు నా కళ్ల ముందే దూరం కావడం నాకు బాధగా అనిపించింది’ అంటూ ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక భర్త చనిపోయాక సరోజా దేవికి కంటి సమస్య వచ్చింది. బాగా ఏడవడం వల్ల కళ్ల తడి ఆరిపోయి, ‘డ్రై ఐస్’తో బాధపడ్డారామె. చాన్నాళ్లపాటు ఆమెను ఈ బాధ వెంటాడింది. దీన్నిబట్టి భర్త పట్ల సరోజా దేవికి ఎంత మమకారం ఉండేదో ఊహించవచ్చు., ఇక కుమార్తె భువనేశ్వరి పేరిట అవార్డు ప్రవేశపెట్టి, సాహిత్య రంగంలో ప్రతిభావంతులకు అందజేస్తూ వచ్చారు.ఆ ముగ్గురి జోడీ హిట్ అటు కన్నడ స్టార్ రాజ్‌కుమార్ ఇటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ మరోవైపు తమిళ స్టార్ ఎంజీ రామచంద్రన్‌లకు జోడీగా సరోజా దేవి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈ ముగ్గురు హీరోలు–సరోజాదేవిది ‘హిట్ పెయిర్’. జయలలిత తర్వాత ఎంజీఆర్‌కి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సరోజా దేవిదే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాడోడి మన్నన్’ బ్లాక్ బస్టర్. సరోజా దేవికి ఎంజీఆర్ అంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే... తన తనయుడికి ఆయన పేరు వచ్చేట్లుగా ‘గౌతమ్ రామచంద్రన్’ అని పెట్టుకున్నారు. ఇక ఇంకో విశేషం ఏంటంటే.... తమిళ హీరో శివాజీ గణేశన్‌తో బ్యాక్ టు బ్యాక్ 22 హిట్ చిత్రాల్లో నటించారు సరోజా దేవి. వాటిలో ‘తంగమలై రహస్యం, భాగ పిరవినై, పార్తాల్ పసి తీరుమ్’ వంటివి ఉన్నాయి. అలాగే జెమినీ గణేశన్‌తో 15కి పైగా తమిళ చిత్రాల్లో నటించారు. ముద్దు మాటల ముద్దుగుమ్మసరోజా దేవి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. చిన్నపిల్లలు మాట్లాడినట్లే. అయితే తన సహజ ధోరణి అది అని, కావాలని మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో సరోజా దేవి పేర్కొన్నారు. ప్రేక్షకులు తన మీద అభిమానంతో అలా ముద్దు మాటలు అనేవారని ఆమె అన్నారు.గాసిప్ లేని నటిదాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో నాలుగు (కన్నడ, తెలుగు, తమిళ, హిందీ) భాషల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించారు సరోజా దేవి. అయితే ఏ ఒక్క హీరోతోనూ తనకు లింకులు పెట్టి వదంతులు రాకపోవడం తన అదృష్టం అని ఓ సందర్భంలో సరోజా దేవి తెలిపారు. అలా గాసిప్ లేని నటి అనిపించుకోవడం తన పుణ్యం అని కూడా అన్నారామె.శక్తిమంతమైనస్త్రీ పాత్రల్లో ...1824లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీర వనిత కిత్తూరు చెన్నమ్మ పాత్రను చేశారు సరోజా దేవి. ‘కిత్తూరు రాణి చెన్నమ్మ’ టైటిల్‌తో రూపొందిన ఆ చిత్రంలో సరోజా దేవి అభినయం అద్భుతం. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అలాగే ‘చింతామణి, శకుంతల’ వంటి కన్నడ చిత్రాల్లోనూ తెలుగులో ‘పండంటి కాపురం, గృహిణి’ తదితర చిత్రాల్లోనూ శక్తిమంతమైన స్త్రీ పాత్రలు పోషించి, మెప్పించారు. – డి.జి. భవాని -
సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ
భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్‌దీప్ స్పెషల్లీ ఏబుల్డ్ దృష్టిలోపి ఉన్నవారికోసం సిక్స్త్ సెన్స్ ప్యానెల్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది. మంగళ్‌దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని ఎంపిక చేసింది.దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్‌లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో తీసుకొచ్చిన సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు మంగళ్దీపి వెల్లడించింది. అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్లను మంగళ్‌దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్‌లోని అగర్బత్తి & మ్యాచ్‌ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి, మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన ధృక్పథం అలవడింన్నారు. రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్‌దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ నిచ్చారు. ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్‌లు అందిస్తారు. "ఐటిసి సిక్స్త్ సెన్స్ ప్యానెల్లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్‌కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ కొనియాడారు.ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి ఐటీసీకి ధన్యవాదములు తెలిపారు. -
ఇష్టమైన గులాబ్ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్‌గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్‌ని మాయం చేసుకుని ఫిట్‌గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్‌ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్‌గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్‌లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్‌తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్‌తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్‌తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్‌ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్‌మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్‌లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!) -
బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ
‘‘బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే ఏదో తెలియని ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే లవ్‌బర్డ్స్ బెంగళూరుకు అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్‌లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు. వీడియో కాల్స్ వర్చ్యవల్ డిన్నర్స్. ఇక విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్. అమ్మాయిపేరు హన్నా. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆర్టిస్ట్ దీపక్ 2023, ఏప్రిల్‌లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ స్నేహం కేవలం ఆకర్షణ కాదు అంతకుమించి అని దీపక్ ఫిక్స్ అయిపోయాడు. మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్‌ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ మరింతపెరిగింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హన్నా ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ పరస్పరం అంగీకరించారు.ఒక సంవత్సరం తర్వాతఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా. విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా పెళ్లి చేసుకున్నారు.జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరిగా మారిపోయారు. దీపక్ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే, హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్‌స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. -
ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!
భూమిపై అంగరంగ వైభవోపేతంగా వివాహాలు చేసుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకెళ్తే..కొందరూ నీటి అడుగున వివాహం చేసుకున్న తంతును కూడా చూశాం. కానీ ఈ దంపతులు ఆకాశంలోనే మా పెళ్లి జరగాలని ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాహ్ ఏం వెడ్డింగ్ రా ఇది అని అంతా అనుకునేలా అంగరంగ వైభవంగా జరిగింది.ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్సర్ సామ్ చుయ్ తన పెళ్లి వేలాది అడుగుల ఎత్తులో ఆకాశంలో జరగాలని కోరుకున్నాడు. అందుకోసం అని ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం (FJR)లో చార్టర్డ్ బోయింగ్ 747-400 విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఎంచక్కా తన భార్య ఫియోనా, కొందరు దగ్గరి బంధువుతో కలసి విమానం ఎక్కి ఒమెన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించారు. ఆ విమానంలో ముఖ్యమైన అతిథుల సమక్షంలో చుయ్ తన కాబోయే భార్య ఫియోనాని పరిణయమాడాడు. వాళ్లంతా ఆ జంటను అభినందిస్తూ..చుట్టూ చేరి ఆడుతూ, నృత్యం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆకాశమే హద్దుగా పెళ్లి చేసుకున్న ఈ జంట మరో నింగిని తలపించేలా తెల్లటి దుస్తులే ధరించడం విశేషం. ఈ వివాహ వేడుక మా జీవితాల్లో అత్యుత్తమమైన రోజుగా అభివర్ణిస్తూ..అందుకు సంబంధించిన వీడియోకి "మా ప్రేమ గాలిలో ఉంది. మా 747 స్కై వెడ్డింగ్ ఫ్లైట్‌కు స్వాగతం. మా ఇద్దరికి జీవితకాల జ్ఞాపకాలు" అనే క్యాప్షన్‌ని జత చేస్తూ నెట్టింట షేర్ చేశారు. కాగా సింగపూర్ ఎయిర్‌లైన్‌కి సంబంధించిన ఈ బోయింగ్ 747 విమానం జూలై 12, 2025న ఒమన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించి, రాత్రి 8 గంటలకు ఫుజైరాకు తిరిగి వచ్చింది. View this post on Instagram A post shared by Sam Chui (@samchui) (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు
ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్ లాస్ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్‌కాస్ట్‌లో, భారతీ తన వెయిట్ లాజ్జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్‌ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్‌గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్‌ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్‌ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్ టైమింగ్స్ : భోజనం టైమింగ్స్ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్ పనుల్లో ఉంటే, బాగా లేట్ నైట్ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్‌కు సంతోషంగా తెలిపింది. క్రాప్ టాప్స్, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్‌గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? -
'వాకింగ్'పై థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ..!
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్నెస్కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్‌గా పొద్దుపొద్దునే వాకింగ్‌కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్‌లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్‌కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్‌లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.మొదటి రకం..వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్‌గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్‌గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు. రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..40 ప్లస్‌లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.ప్రేమ పక్షులు..ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు. కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్‌కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు. కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి. (చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
అరటి చెట్టు ఇంటికి అందం. అరటి ఆకు భోజనానికి ఆరోగ్యం, అరటి కూరలు వంటికి చాలామంచిది అరటికాయతో అనేక రుచికరమైన వంటకాలు చేయవచ్చు. అరటికాయ వేపుడు, అరటికాయ పచ్చడి, అరటికాయ పులుసు, అరటికాయ కూర, అరటికాయ బజ్జీలు, అరటికాయతో హల్వా, అరటికాయతో చిప్స్, అరటికాయతో స్నాక్స్ వంటివి. వీటిని వివిధ రకాలుగా తయారుచేసి తినవచ్చు. మనకు విరివిగా దొరికే అరటి పండ్లతో చేసుకునే మరికొన్ని రుచులను ఎపుడైన ప్రయత్నించారా? చిన్నా పెద్దా అంతా ఇష్టంగా ఆరగిస్తారు. ఇవాల్టి టిప్ ఆఫ్ దిడే లో భాగంగా కొన్నింటిని చూద్దాం. !చాక్లెట్ బనానా హల్వాకావలసినవి: పండిన అరటి పండ్లు – 4; నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు (లేదా రుచికి సరిపడా); ఏలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు, బాదం పప్పు-కొన్ని (సన్నగా తరిగినవి, నేతిలో వేయించుకోవాలి); చాక్లెట్పౌడర్ – అర కప్పు (అభిరుచిని బట్టి);తయారీ: అరటి పండ్లను మెత్తగా చిదుముకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, అరటి పండు ముద్దను వేసి మధ్యస్థ మంట మీద, బాగా కలపాలి. అరటిపండు ముద్ద రంగు మారిన తర్వాత పంచదార, చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలపాపాలి. పంచదార కరిగి, హల్వా దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి మరోసారి కలపాలి. చివరగా, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఘీ రోస్ట్ కావలసినవి: అరటిపండ్లు – 3 (మరీ పండినవి కాకుండా, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి); పంచదార – సరిపడా; ఏలకుల పొడి – అర టీస్పూన్; నెయ్యి (ఘీ)– సరిపడా.తయారీ: ముందుగా పాన్‌లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. ఆ నేతిలో అరటిపండు ముక్కలను పాన్ మొత్తం పరచుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటూ పంచదారను అరటిపండు ముక్కలపై జల్లుకుని, దోరగా వేయించుకుంటూ ఇరువైపులా తిప్పుకుంటూ ఉండాలి. అవసరం అయితే నెయ్యి, పంచదార మరికాస్త వేసుకోవచ్చు. చివరిగా ఏలకుల పొడి జల్లుకోవాలి. అరటిపండు ముక్కలు దోరగా వేగి, పంచదార కరిగి పాకం– ముక్కలకు పట్టిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.బనానా-ఓట్ స్మూతీ రెసిపీకావలసినవి: పండిన అరటి పండు – ఒకటి; ఓట్స్ – 2 టేబుల్ స్పూన్లుపాలు – ఒక కప్పు (ఆవుపాలు లేదా బాదంపాలు); తేనె – 2 టీ స్పూన్లు (లేదా రుచికి సరిపడా); చియా సీడ్స్ – ఒక టీ స్పూన్; ఐస్ క్యూబ్స్ – కొన్ని.తయారీ: ఓట్స్ ను 5 నిమిషాల పాటు పాలలో నానబెట్టాలి. ఒక మిక్సీజార్‌లో నానిన ఓట్స్, అరటి పండు, పాలు, తేనె, చియా సీడ్స్, ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత
ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది. మందస: మందసలోని ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్ హెచ్డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్ 21న స్కూల్‌ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్ మెమోరియల్ బోర్డు హైసూ్కల్‌గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్ కావడం విశేషం. ఎన్నెన్నో అనుభవాలు.. వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస హౌస్కూల్ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది. పూర్వ విద్యార్థుల ఔదార్యం కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్‌ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు. అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. -
Millets అనారోగ్యాలు సరి : ఆరోగ్య సిరి
భామిని: అంతరించి పోతున్న చిరుధాన్యాలను రక్షిస్తూ నేటి తరాలకు పరిచయం చేసేందుకు చిరుధ్యానాల విత్తన సంరక్షణతో పాటు, పంటల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటలుగా పురాతన కొండ పంటలుగా పిలిచే మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ సాగు విస్తరణ పెంచుతున్నారు. ఐటీడీఏల పరిధిలో మిల్లెట్స్ సాగు విస్తరణ ప్రణాళిక అమలవుతోంది. ఏపీపీఐ సంస్థ ఆర్థిక సహకారంతో గిరిజనులకు చిరుధాన్యాల విత్తనాలు సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో కొండ పంటలు సాగు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సాగు, మిశ్రమ సాగు విధానంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిల్లెట్స్‌పై అవగాహన పెంచుతున్నారు.దీంతో చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, అరిరెకల సాగు పెరుగుతోంది.. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన తిండి గింజలు.స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంప్రదాయ పంటల సాగును పునరుద్ధరిస్తున్నాం. ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం పెంచాం. పండించిన చిరు ధాన్యాలు మిగులు పంటకు మార్కెట్లో విలువ వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టణాల్లో పెరుగుతున్న వాడకానికి తగ్గట్లు పండించడానికి గిరిజన ప్రాంతాల్లో సమాయిత్తం చేస్తున్నాం. కె.రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య గుళికలుగా వీటిని వర్ణిస్తారు.ఇవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం రక్షణగా నిలుస్తుందని న్యూట్రిస్టులు చెబుతున్నారు. రోజుకు మనిషికి 38 గ్రాముల పీచు పదార్థం అవసరం. చిరుధాన్యాల్లో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. కూరగాయలు, ఆకు కూరల్లో పీచు పదార్థం పొందవచ్చు. కొండపోడు భూముల్లో చేపట్టే చిరుధాన్యాల సాగు పల్లపు ప్రాంతాల భూముల్లోనూ విస్తరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, చీడపీడల నివారణకు కషాయాల వైద్యంతో సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలకు తోడు పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తున్నారు. -
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
విజయనగరం ఫోర్ట్: వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే.. తరువాతే వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. తలనొప్పి, జ్వరం అని వెళ్లినా... రూ.వేలల్లో ఖర్చయ్యేలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చేసేది లేక భయంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలల్లో రోగులను దోచుకుంటున్నారు. సేవకు పరమార్ధంగా ఉండాల్సిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మారడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వచ్చే రోగాలకు స్కానింగ్, పలు రకాల పరీక్షలు అవసరం లేకున్నా వైద్యులు రాసేస్తుండడంతో చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ వల్ల రోగులు రేడియేషన్‌కు కూడా గురై ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ప్రతీదానికి స్కానింగ్, ఎంఆర్ఐ అంటూ రాసేస్తున్నారు. (Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు)ఆర్ఎంపీలే మధ్యవర్తులు: ప్రైవేటు ఆసుపత్రులకు, స్కానింగ్ సెంటర్లకు,ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి కమీషన్ అందిస్తున్నారు. రిజిస్ట్రషన్ లేకుండానే.. జిల్లాలో 57 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజి్రస్టేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా కొందరు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరం రాగానే తమకు ఏమవుతుందోనని ఆందోళనలో రోగులు నేరుగా ల్యాబొరేటరీలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీచదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు! కనిపించని ఫీజుల బోర్డులు ఏ ల్యాబొరేటరీలోగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో తెలిపే బోర్డు బయట వేలాడదీయాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా వాటిల్లో ఉండడం లేదు. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేని చోట వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి. అధిక శాతం ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కాన రావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలో జరగాలి. కానీ అధికశాతం ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా వాటిల్లో లేరు. గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోమని చీటి రాసి ఇచ్చాడు. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో రూ.4వేలు పెట్టి స్కానింగ్ తీయించుకున్నాడు. విజయనగరానికి చెందిన రామారావు జ్వరం వచ్చిందని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు రాశారు. సదరు వ్యక్తి వైద్య పరీక్షలకు రూ.వెయ్యి బిల్లు చెల్లించాడు. జ్వరం అని వెళ్తే.. జ్వరం అని ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే...వారికి వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్‌బీ, ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. జ్వరం కోసం వెళ్లిన వారికి వైద్య పరీక్షలకు కనీసం రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. స్కానింగ్‌లకు రూ.వేలల్లో... సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే రూ.వేల ల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో సీటీ స్కాన్‌కు రూ.2500 నుంచి రూ.3 వేలు, ఎంఆర్ఐ స్కాన్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వైద్యుల కమీషన్‌కే పోతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. చాలా మంది ప్రైవేటు వైద్యులకు ఆయా స్కానింగ్‌ల్లో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు కమీషన్లు ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారు అవసరం లేకున్నా.. స్కానింగ్‌లు రాస్తున్నారు.ఆదేశాలిచ్చాం.. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ల్యాబొటరీ, స్కానింగ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. అవి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాబరేటరీగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని బోర్డులు పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో -
హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు..!
హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై ఉండటం చూసే ఉంటాం. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలా కనిపిస్తున్నా..ఎలా పొగరాయళ్లు వీటికి అలవాటు పడతారా అని తెగ అనుకునేవాళ్లు చాలామంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు దాదాపుగా అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి జాబితాలోకి నోరూరించే ఈ చిరుతిండ్ల ఇప్పుడు చేరిపోనున్నాయి. తలుచుకుంటేనే తినాలనిపిచే ఆ స్నాక్స్ ఐటెంపై ఇలా వార్నింగ్ మెసెజ్‌లు ఉంటే ఆహారప్రియుల పరిస్థితి ఊహకందనిది..పొగాకు ఉత్పత్తులపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ఇదేంటి ఎంతో ఇష్టంగా ఆ చిరుతిండ్ల అని అవాక్కవ్వకండి. ఎందుకంటే వాటిని తినే మనం చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా ఈ హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసిందట. త్వరలో ఇది అమలు కానుందట కూడా. నిజానికి మనదేశంలో ప్రతి నలుగులో ఒకరు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇలా సిగరెట్ ప్యాకట్లపై ఉన్నట్లుగానే సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్‌ఫ్రై చేసే ఇతర స్నాక్స్‌పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు ఉండాలని ఆరోగ్య మత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేగాదు కేంద్ర ఆరోగ్య సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆ ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని హైలట్ చేస్తారట. కాబట్టి ఇది అచ్చం సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక లేబుల్ వలే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిశాఖ పేర్కొంది. ఇది అవసరమా..ఇటీవల కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి, ఉద్ధృతమవుతున్న వ్యాధుల ఆందోళనల నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలా ఆదేశాలు జారి చేసింది. ప్రస్తుతం, ఊబకాయం, చక్కెర, అధిర రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యల బారిన ఏటా వేలాది మంది పడుతున్నారని, అందుకు ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలే అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు 2050 నాటికి సుమారు 449 మిలియన్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బ్యాన్ కాదు...ఇలా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌ల పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయా చిరుతిండ్లను పూర్తిగా నిషేధించడం కాదని స్ఫష్టం చేసింది ప్రభుత్వం. కేవలం ప్రజలకు ఆయా ఆహారపదార్థాలపై అవగాహన కల్పించి ఆరోగ్యంగా జీవించేలా చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ చొరవ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా" ఉద్యమం నుంచి వచ్చిందట. ఆయన పిలుపునిచ్చిన 10% నూనెని తగ్గించి ఆరోగ్యంగా ఉందాం..అలాగే భారతదేశాన్ని మరింత బలోపేతంగా మారుద్దాం అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది కేవలం ఆరోగ్య సలహా మాత్రమే గానీ ప్రత్యేకంగా పలాన వంటకాలని పేర్లను ప్రస్తావించలేదని, హెచ్చరిక బోర్డు పెట్టాలని గానీ ఆదేశించలేదని స్పష్టం చేసింది కేంద్రం. (చదవండి: దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!) -
వృత్తి పోలీసు.. హాబీ మాత్రం: ఇంట్రస్టింగ్ స్టోరీ
డిచ్పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో గుట్ట గంగాధర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గంగాధర్ భార్య త్రివేణి గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇద్దరికీ స్టాంపులు, నాణేలు, కరెన్సీల సేకరణ అంటే ఇష్టం. ఈ దంపతుల కుటుంబ సభ్యులలో పలువురు విదేశాలకు వలస వెళ్లారు. వారి ద్వారా అక్కడి దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. అలాగే స్నేహితులు, తెలిసిన వారి ద్వారా వివిధ దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. ఇలా 2003 నుంచి 23 దేశాల నాణేలు, కరెన్సీతో పాటు 25 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. సేకరించిన నాణేలలో కాకతీయుల కాలంతో పాటు 1939 సంవత్సరం నిజాం కాలం నాటి నాణేలు, రూపాయలు ఉన్నాయి. వీరు సేకరించిన నాణేలు, కరెన్సీలలో భారతదేశంతో పాటు యూఎస్ఏ, యూకే, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, జోర్డాన్, టర్కీ, ఇటలీ, పొలాండ్, ఫిలిఫ్సీన్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇండోనే షియా, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి. ఇదీ చదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!స్టాంపులలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ, మాల్టా, సింగపూర్, ఈజిఫ్ట్, ఫిలిఫ్పిన్స్, ఇటలీ తదితర దేశాలవి ఉన్నాయి. వీటి సేకరణ కోసం గంగాధర్ దంపతులు చాలా మంది వ్యక్తులను కలిశారు. పోలీసు ఉద్యోగం రాకముందు గంగాధర్ కూడా ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. అప్పుడే ఆయనకు ఈ సేకరణపై ఇష్టం ఏర్పడింది. గత చరిత్ర, పాలకుల వైభవాలకు గుర్తు అయిన కాకతీయ, నిజాం కాలం నాటి నాణేల సేకరణతో మొదలు పెట్టాడు. ప్రస్తుతం తమ ఇంటికి ట్యూషన్‌కు వచ్చే బాల, బాలికలకు వీటి గురించి వివరిస్తారు. -
వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.రుచి..ఆరోగ్యకరం..మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్‌కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు..అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!మట్టి కడవల్లోనే మంచినీరు..పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపుమట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.-డాక్టర్ నరేశ్‌కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్ -
బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు
విజయనగరం అర్బన్ బొబ్బిలి: ఇప్పటికే దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణ (Bobbili Veena) కు మరో అరుదైన గుర్తింపు లభించింది. వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద బొబ్బిలి వీణ బహుమతికి ఎంపికైంది. ఓడీఓపీ అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా మన బొబ్బిలికి చెందిన నమూ నా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలో భారత్ మండపంలో సోమ వారం జరిగే కార్యక్రమంలో ఓడీఓపీ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు బొబ్బిలి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బి లి నుంచి వచ్చిన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఈ వీణను చూసి ముచ్చటపడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాల్లో దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప, చెక్కకు ఉపయోగిస్తారు. వీణల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఓడీఓపీ కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు. -
గామా నైఫ్‌తో రేడియో సర్జరీ
యురేనియం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తి గల పదార్థం రేడియం. ఈ రెండు పదార్థాలు అప్రయత్నంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటాయి. వీటిలో గామా కిరణాలు ఎక్కువ శక్తి కల్గి ఉంటాయి. ఈ మూలకాల ధర చాలా ఎక్కువ. 1935లో ఎర్నెస్ట్ లారెన్స్ కృత్రిమ రేడియో ధార్మిక పదార్థం రేడియో సోడియాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇటువంటి రేడియో ధార్మిక పదార్థాలు వెయ్యికి పైగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ గామా కిరణ జనకాలే.ఈ విశాల విశ్వంలో నక్షత్రాల విస్పోటనం వల్ల గామా కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి భూమిని చేరకుండా ఆకాశంలో ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఈ గామా కిరణాలు భూమిని జేరి మనిషి మీద పడితే అవి పడే డోసును బట్టి మనిషి రకరకాల ఆపదలకు గురవుతాడు.ఎక్స్ కిరణాలకన్నా గామా కిరణాలకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ. సులువుగా ఈ కిరణాలు ఎదిగే మొక్కల అంతర్భాగంలోకీ, జంతువుల ధాతువుల్లోకీ దూసుకుపోగలవు. గామా కిరణాలు మొక్కల మీద పడితే అవి వేగంగా ఎదుగుతాయి, దిగుబడి పెరుగుతుంది. పొలాల్లో పంట లను నాశనం చేసే ఎలుకలు ఈ కిరణాల ధాటికి మరణిస్తాయి. మొక్కలకు వచ్చే చీడ, పీడ, పురుగులు, తెగుళ్లు ఈ గామా కిరణాల తాకిడికి దరిజేరవు. మనిషి తట్టుకోలేని ఈ కిరణాలను ధాన్యం తట్టుకోగలదు. పంట పొలాలపై ఈ కిరణాలు పడటం వల్ల పంట కాల వ్యవధి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. పంట నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. ఇంకా ప్రయోగ దశలోఉన్న ఈ విధానం రైతులకు అందుబాటులోకి రావాల్సి ఉంది.మెదడు లోని కణితులు, గాయాలు, ధమనుల వైఫల్యాలు, ట్రెజిమినల్, న్యూరల్జియా, ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో ‘గామా నైఫ్’ అనే పరికరం సహాయ పడుతుంది. ఇది కోబాల్ట్ –60 రేడియేషన్ మూలాల నుండి వచ్చే గామా కిరణాలను ప్రత్యేకమైన పద్ధతిలో కేంద్రీకరించి నిర్దిష్ట ప్రాంతాలకు పంపడంలో సహకరిస్తుంది. దీని సహాయంతో కచ్చితమైన మోతాదులు వైద్యుడు పంపగల్గుతాడు. రోగికి సమస్య ఉన్న స్థానం, గాయం రకం, ప్రక్రియ సమయంలో రోగి సాధారణ ఆరోగ్యం, ఇతర కారకాలపై గామా నైఫ్ విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది మెదడులోని సమస్యలను సరి చేయగల ఒక సాంకేతికత. చికిత్సలో భాగంగా రోగి తల కదలకుండా ఒక ఫ్రేమ్ కట్టి గామా కిర ణాలు ఎక్కడ పడాలో పర్యవేక్షిస్తారు. రోగికి నొప్పి లేకుండా, మెలకువగా ఉండగానే కొన్ని గంటల్లో ఈ చికిత్స పూర్తి అవుతుంది. శరీరంపై ఎటువంటి కోతలు ఉండవు.గామా కిరణాలు ప్రభావిత ప్రాంతాలకు అధిక మోతాదులోనే వెడతాయి. చుట్టుపక్కల కణజాలానికి తక్కువ హాని మాత్రమే జరుగుతుంది. ఈ చికిత్స వైద్యుడు మాత్రమే నిర్వహించాలి. రోగులు ఈ చికిత్స పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఈ చికిత్స అనంతరం కొంతమందికి కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. తల నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిర్లు, చుట్టుపక్కల జుట్టు రాలిపోవడం, బలహీనత, దృష్టి సమస్యలు రావచ్చు. ప్రతి సమస్యకు వైద్యుని సలహా మేర మందులు వాడితే పరిష్కారం లభిస్తుంది.-డా. సీ. వీ. సర్వేశ్వర శర్మ కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు -
సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ రాక్ డే
హైదరాబాద్ శివార్లలో రెండున్నర బిలియన్ ఏళ్ల క్రితం వెలసిన అరుదైన వారసత్వ రాతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కొనియాడారు. అదే లక్ష్యంగా నృత్యం, ఇకెబనా ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజాన కేంద్రంలో నిర్వహించారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్రాక్ డే సందర్భంగా పర్యావరణంలో ముఖ్య భూమికను పోషించే రాతి సంపదను ఆయా దేశాలు ఎలా కాపాడుకుంటారో వివరించారు. నయనతార నందకుమార్ అవర్ సీక్రేడ్ ప్లేస్‌కు చెందిన వారు అంతరించిపోతున్న రాతి సంపద గురించి డ్యాన్స్ రూపంలో వివరించారు. పుప్పాలగూడలోని పకృద్ధీన్ గుట్ట 400 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, గుట్టను ఎలా ధ్వంసం చేస్తున్నారో, కంచె గచ్చిబౌలిలో పురాతన రాళ్లు, పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు. నగర శివార్లలో రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం వెలసిన రాతి సంపదకు ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని నయనతార వివరించారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాళ్లు, నీళ్లు, చెట్లు ఎలా మమేకమవుతాయో వివరిస్తూ ఓరా స్కూల్ ఆఫ్ ఇకెబనా హైదరాబాద్ చాప్టర్ సభ్యులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చెట్లకు రాళ్లు మినరల్స్‌ను అందిస్తాయని, రాళ్లలో పక్షలతో పాటు అనేక ప్రాణులు జీవిస్తాయని తెలియజేశారు. పర్యావరణ విచ్ఛిన్నం వల్లే గ్లోబల్వారి్మంగ్, అతి వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి అవాంతరాలు వస్తున్నాయని ఓరా స్కూల్ ప్రెసిడెంట్ నిర్మల పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రెసిడెంట్ ఫాతిమా అలీఖాన్, వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జనరల్ సెక్రెటరీ ఫ్రాక్ ఖాదర్ పాల్గొన్నారు. (చదవండి: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా ‘గివ్ హిమ్ నోబెల్’ ..!) -
దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!
‘గివ్ హిమ్ నోబెల్’.. గత కొంత కాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే, భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకుని ట్రోలింగ్ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒకటేంటి.. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం పైనా ట్రోలింగ్ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటుంది. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారు ఉండటం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండటంతో ఇక్కడ కూడా ట్రోలింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్న మాట. ట్రోలింగ్ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై, నేడు ఓ సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే, ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ వంటి డిజిటల్ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలని నిపుణుల అభిప్రాయం. స్మార్ట్‌ఫోన్ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొదలైనవి) ట్రోలింగ్ ఒక మోడ్రన్ కల్చర్‌లా మారింది. హైదరాబాద్‌లోని మిలీనియల్స్, జెన్–జీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్‌ను వినోదంగా తీసుకుంటూ, వాటిని షేర్ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. మూడు నుంచి ఐదు గంటలు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్ యుసేజ్ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 78 శాతం మంది యువత రోజుకు కనీసం 3–5 గంటల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ ఓ ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెజ్‌ఎంసీ పనితీరు, ట్రాఫిక్ సమస్యలు, మినిస్టర్ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్ మస్్కల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. అత్యధికంగా సినిమాలపైనే.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పుడు ‘హనుమాన్‌కి వైఫై ఉంద’ని, థియేటర్లో హనుమాన్కు సైతం ఒక సీట్ వదిలేయాలనే ట్రోల్స్ జోరుగా సాగాయి. నాగ్‌చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా ‘వెడ్డింగ్ టార్గెట్ 2.0’ అనే పేరుతో కొందరి ఎడిటెడ్ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. నేషనల్ క్రష్‌గా మారిన రషి్మక మందన సినిమాలో నటిస్తే అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని, పూజా హెగ్దే నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ట్రోల్‌కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్ 18, ఈ సారి జరిగిన మ్యాచ్ కూడా 18వ మ్యాచ్ కావడంతో ఇక ట్రోఫీ గెలవరని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్ గెలవడంతో ఈ ట్రోలింగ్‌కు తెలపడింది. కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్ పుంజుకుని ఒక వారం పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదే ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ఓడినప్పుడు కూడా.. ‘బిర్యానీ తిని ఆట పై దృష్టి సారించలేరనే’ కామెంట్లతో ట్రోల్ చేశారు. సోషల్‌మీడియా రాజకీయం రాజకీయాల పరంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పారీ్టల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకుని సోషల్ మీడియా ట్రోలింగ్ మీమ్స్ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య, ఏపీలో వైఎస్ఆర్సీపీ–టీడీపీ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గ్లోబల్ వేదికగా.. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో.. నువ్వు ఓకే అను ఏసేద్దాం అంటూ పోకిరి సినిమా డైలాగ్స్‌ను భారత్–ఇజ్రాయెల్ మీమ్స్‌గా తయారు చేసి పాక్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ తెలుగు మీమర్స్ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్‌గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్–పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా.. ‘గీవ్ హిమ్ నోబెల్’ అనే ట్రోల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలన్ మస్క్ ‘ట్విట్టర్’లో మార్పులపై ‘ఇంతలోనే ట్విట్టర్ మేము మిస్ అవుతున్నాం మస్క్ గారు’ అంటూ ట్రోల్స్ చేశారు. ట్రోలింగ్‌లోనూ రెండు రకాలు.. పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ ట్రోలింగ్. పాజిటివ్‌లో హ్యూమరస్, సెటైరిక్ ఎక్కువగా ఉంటూ.. సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై క్రియేటివ్‌గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. నెగెటివ్ ట్రోలింగ్‌లో బులీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారా స్థాయికి చేరాయి. ట్రోల్ పేరుతో హేట్‌స్పీచ్ ఎక్కువ వ్యాప్తిచేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. -
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్‌పూర్‌లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్‌బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్‌మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్‌పూర్‌కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్‌పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్‌లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్‌సింగ్‌కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్‌ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌బాగ్ ప్యాలెస్‌కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్‌లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్‌పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్‌పూర్‌లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్‌సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్‌సైట్‌గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్‌పూర్‌కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్‌పూర్‌లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్‌మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్‌మంతర్‌ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్‌బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్‌పూర్‌కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్‌పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్‌లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్‌కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్‌పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్‌కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్‌ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్‌మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొని తాజ్ మహల్‌కు ఓటు వేసి గెలిపించారు. తాజ్‌మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్‌కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్‌ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్‌తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్‌ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్‌ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్‌ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్‌ఖండ్‌ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్‌లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
పూజారి – మేక!
వైశాలి రాజ్యంలోని కందవరం గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు సుధాకరుడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్లి స్నానమాచరించి, ఊరిలో ఉన్న గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ ఊరిలోనే శరభయ్య అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను సమీపంలోని అడవిలో ఉండే పక్షులను, జంతువులను వేటాడి; వాటిని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. పూజారి ప్రతిరోజూ నదీ స్నానం అనంతరం సమీప అడవిలో ఉన్న వివిధ రకాల పూలను సేకరించి పూజకు తీసుకువెళుతూ ఉండేవాడు. ఒకరోజు నదికి వెళుతుండగా, ఎక్కడి నుంచో ఒక మేక పూజారి దగ్గరకు వచ్చి, అతనిని అనుసరించ సాగింది. ఎన్నిసార్లు దాన్ని అదిలించినా, అది వెళ్లిపోకుండా అతనినే అనుసరించింది. చేసేదిలేక దానిని కూడా తనతో పాటు తీసుకు వెళ్ళాడు ఆ పూజరి. ఆ రోజు మొదలు ప్రతిరోజూ పూజారి దగ్గరే ఉంటూ, పూజారితో పాటు నదీ స్నానానికి వచ్చి, పూజారి స్నానం చేస్తుండగా ఆ పరిసరాల్లో ఉన్న ఆహారాన్ని తిని, తిరిగి పూజారితోపాటు గుడికి వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది.ఒకరోజు ఎప్పటి మాదిరిగానే పూజారిని అనుసరించి మేక నది వైపు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత మేక వస్తున్న అలికిడి లేకపోవడంతో పూజారి వెనుతిరిగి చూశాడు. మేక కనిపించలేదు! కంగారుగా నాలుగు వైపులా వెతికాడు. చివరకు ఒక మూల చెట్టుకి కట్టేసి కనపడింది. వెంటనే వెళ్లి, దాని కట్లు విప్పదీశాడు. మేకని తీసుకుని వెళుతుండగా, ‘ఓ పూజారిగారు! ఆగండి... ఆగండి... ఏంటిది? దాన్ని తీసుకుపోతున్నారు? ఆ మేక నాది’ అన్నాడు శరభయ్య. ‘ఏంటి, ఈ మేక నీదా? ఇది ఎప్పటి నుంచో నాతో పాటు ఉంటోంది. ప్రతిరోజూ నా వెంబడి నది స్నానానికి వస్తోంది. ఈరోజు కూడా అలానే వస్తుంటే, దాన్ని పట్టి బంధించిందే కాకుండా, నీది అంటావా?’ అని పూజారి అన్నాడు.‘లేదు లేదు... అది నాది’ అని దగ్గరకు రాబోతున్న శరభయ్యను తప్పించుకుని మేకను భుజాన వేసుకుని, ఆగకుండా వెళ్ళిపోయాడు పూజారి.వెంటనే శరభయ్య రాజుగారి దగ్గరికి వెళ్లి పూజారి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారి భటులు పూజారి వద్దకు వచ్చి ‘నీ మీద అభియోగం వచ్చింది. నీ దగ్గర ఉన్న మేక నీది కాదని శరభయ్య ఫిర్యాదు చేశాడు. మేకతో సహా రావాలని రాజుగారి ఆజ్ఞ!’ అన్నారు.అలాగేనంటూ పూజారి మేకతో సహా రాజుగారి ఆస్థానానికి చేరుకున్నాడు. ‘ప్రణామాలు మహారాజా! పిలిపించారట’ అనగానే, మంత్రి కలగజేసుకొని ‘శరభయ్య తన మేకను తీసుకున్నావని నీ మీద అభియోగం మోపాడు. దీనికి నీ సమాధానం?’ అన్నాడు.‘మహారాజా! ఆ మేక నిజానికి నాది కూడా కాదు! ఒక రోజు నదీస్నానం చేసి, పూజ కోసం అడవిలో పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా వెళ్లకుండా, అప్పటి నుంచి నా వద్దే ఉంటోంది. అంతేగాని, ఈ శరభయ్య చెప్పినట్లు అది అతనిది కూడా కాదు’ చెప్పాడు ఆ పూజారి. ‘నువ్వు చెప్పిన దానికి ఏమైనా సాక్ష్యం ఉందా?’ అడిగాడు మంత్రి. ‘లేదు మహారాజా!’ అన్నాడు పూజారి.‘మరైతే నీదే అని సాక్ష్యం లేనప్పుడు మరెలా?’ అన్నాడు మంత్రి. ‘ఒక పని చేయండి మహారాజా! ఈ మేక కళ్లకు గంతలు కట్టండి. ఒకవైపు నన్ను, మరొకవైపు శరభయ్యను ఉంచండి. తన యజమాని ఎవరో వాసన పసిగట్టి గుర్తించే గుణం పెంపుడు జంతువులకు ఉంటుంది అప్పుడు అది వారి వద్దకు వెళుతుంది’ అన్నాడు పూజారి. ‘నువ్వు చెప్పినది సబబుగానే ఉంది’ అని మంత్రి, ‘వెంటనే మేక కళ్ళకు నల్లని గుడ్డతో గంతలు కట్టండి’ అని భటులను ఆదేశించాడు.వారు మేక కళ్లకు గంతలు కట్టారు. మొదట శరభయ్య వద్దకు, ఆ తర్వాత పూజారి వద్దకు మేకను తీసుకువెళ్లారు. శరభయ్య వద్దకు తీసుకెళ్లినప్పుడు ఏ స్పందన లేని మేక, పూజారి వద్దకు తీసుకు వెళ్ళగానే తన ముక్కుతో వాసన పిలుస్తూ, నాలుకతో పూజారి కాలిని నాకసాగింది. తర్వాత దానిని ఒక భటుని వద్దకు కూడా తీసుకువెళ్లారు. అప్పుడు కూడా అది ఏమీ చేయకుండా, అలాగే నిలబడింది. ఏ రకమైన స్పందన చూపలేదు.వెంటనే మహారాజు ‘ఆ మేక పూజారిదే’ అని తీర్పునిచ్చాడు. ‘శరభయ్యను బంధించండి’ అని భటులను ఆదేశించాడు. అతడు చేసిన తప్పును మన్నించి, అతడిని విడిచిపెట్టండి మహారాజా!’ అని పూజారి వేడుకున్నాడు.‘చూశావా, శరభయ్యా! నువ్వు పూజారి మీద అభియోగం మోపినా, నీ మీద కోపం లేకుండా, నిన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇప్పటి నుంచైనా జంతువుల వేట మానుకుని, ఏదైనా పని చేసి బతుకు’ అని శరభయ్యను దండించకుండా వదిలేశాడు మహారాజు. పూజారిని అభినందిస్తూ, ఘనంగా సన్మానం చేశాడు. అప్పటి నుంచి శరభయ్య జంతువుల వేటను మాని, వ్యవసాయం చేస్తూ జీవించసాగాడు. -
ఈ ఉత్సవం.. ఉత్కంఠభరితం!
ప్రపంచ సాహస ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే వేడుకల్లో శాన్ ఫర్మిన్ ఫెస్టివల్ ముందు వరసలోనే ఉంటుంది. ఇది ప్రతి ఏడాది స్పెయిన్ లోని పాంప్లోనాలో జూలై 6 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ ఉత్సవంలో బుల్ రన్ (ఎన్సియెర్రో) ప్రధానంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకలో ఎద్దులను వీధుల్లోకి వదిలి, వందలాది మంది ప్రజలు వాటి వెంట పరిగెడతారు.ఇది అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ. ఉదయం 8 గంటలకు బలమైన ఎద్దులను వదులుతారు. వేలాది మంది ధైర్యవంతులు వాటి ముందు పరిగెడతారు. ఈ పరుగు అత్యంత ప్రమాదభరితమైనది. ప్రతి సంవత్సరం గాయాల పాలైనవారు చాలామంది ఉంటారు, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. అయినప్పటికీ, ఈ అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటారు.ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు, ‘చుపింజో’ అనే ఒక రాకెట్ పేల్చడంతో పాంప్లోనా నగరం మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు సంగీత కచేరీలు, సాంప్రదాయ నృత్యాలు, ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు, మతపరమైన ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో అంతా తెలుపు ఎరుపు రంగు దుస్తులనే ధరిస్తారు. దాంతో వీధులన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లో మెరుస్తాయి. మరోవైపు ‘జిగాంటెస్ జెయింట్స్’ అని పిలవబడే పెద్దపెద్ద బొమ్మలు రాజులు, రాణులు, చారిత్రక వ్యక్తుల రూపంతో నెమ్మదిగా నడుస్తూ ఊరేగింపులో పాల్గొంటాయి. వీటిని చూడటానికి పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. -
ట్రిపుల్ సెంచరీ మామిడి చెట్టు
చెట్టు ఒక్కటే కానీ, అందులోని ఒక్కో పండు ఒక్కోరకం సినిమాలా కనిపిస్తుంది. ఒకటి రొమా¯Œ ్స, మరొకటి యాక్షన్, ఇంకొకటి కామెడీ! మొత్తం 300 కథలు, 300 రుచులు, 300 క్యారెక్టర్లతో మల్టీప్లెక్స్‌ను తలపిస్తుంది ఈ మామిడి చెట్టు. ఆ మల్టీప్లెక్స్ క్రియేటర్, డైరెక్టర్, ఓనర్... ‘మామిడి మాస్టర్’ కలీముల్లా ఖాన్ !మలీహాబాద్‌లో అతన్ని అందరూ ‘మ్యాంగో మేన్’ అంటారు. వయసు 82. వయసులో వృద్ధుడే అయినా, మామిడి మీద ఆయన ప్రేమలో మాత్రం నిత్యయవ్వనం తొణికిసలాడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, తోటపని చేస్తాడు. ఆ తర్వాత అలసిపోయి, నిద్రపోతాడు. ఆ నిద్రలో వచ్చే కలల్లో కూడా తన 120 ఏళ్ల మామిడి చెట్టుతోనే కాలక్షేపం చేస్తాడు. చెప్పుకోడానికి చెట్టు ఒకటే కాని, ఆ చెట్టుకే తాను వేసిన అంటు కొమ్మలకు మూడు వందల రకాల మామిళ్లు కాస్తున్నాయి. ఒక్క చెట్టులోనే ఇన్ని రకాలా? అని చూసినవారు నోరెళ్లబెడుతుంటారు. కరీముల్లాకు మాత్రం ఆ చెట్టు పండ్లు కన్నబిడ్డల్లాంటివి. అందుకే, వాటికి పేర్లు కూడా పెడతాడు. ఒక రకం మామిడికి ‘ఐశ్వర్యా’ అని పేరు పెట్టాడు – బాలీవుడ్ నటి గుర్తుందా? ఆమె పేరునే ఒక మామిడి రకానికి పెట్టాడు. (సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు)ఎందుకంటే ఆ పండు చూసినా, తిన్నా, తీయదనం చూసినా, ప్రేమలో పడేలా ఉంటుందట! ఒక కిలోకు మించిన బరువు, చర్మం మీద ముదురు ఎరుపు రంగుతో ఉంటుంది. ఇంకొకటి ‘సచిన్ మామిడి’– అది తింటే స్టేడియంలో సెంచరీ కొట్టినట్టే! పొట్టిగా ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. ‘మోదీ మామిడి’ కూడా ఉంది– ఇది బాగా బలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వాసనలతో ఉంటుందని. ఇంకో మామిడికి ‘అనార్కలి’ అని పేరు పెట్టాడు. ఇలా మొత్తం మామిడి రకాలకు పేర్లు పెట్టాడు. తాజాగా ‘రాజ్‌నాథ్ మామిడి’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరుతో కొత్త రకం మామిడి పండింది. ఇతని కృషికి మెచ్చి ప్రభుత్వం 2008లో పద్మశ్రీ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కలీముల్లా ఖాన్‌కు నాలుగు వందలకు పైగా అవార్డులు ఉద్యాన విభాగంలో వచ్చాయి. అసలు రహస్యం!ఇదంతా అతని గ్రాఫ్టింగ్ టెక్నిక్ వలనే సాధ్యం అయింది. అంటే, మామిడి చెట్టులో ఒక కొమ్మను చెక్కి, దానిలో మరో రకానికి చెందిన మామిడి కొమ్మను అంటుకట్టి, టేప్ పెడతాడు, అది చెట్టులో కలిసి ఎదిగేలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ కొమ్మ కలిసిపోయిన తర్వాత, రెండేళ్లలో కొత్త మామిడి రకం జన్మిస్తుంది. ఇదంతా తన తాత తనకు నేర్పాడట! పద్దెనెమిదేళ్ల వయసులో కలీముల్లా అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాడు. అప్పటి నుంచి గత ఆరు దశాబ్దాలుగా వివిధ రకాల కొమ్మలను అంటు కడుతూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. రసాయనాలు చల్లి పండ్లు పండించకుండా, చెట్టుతో మాట్లాడుతూ, ప్రేమగా పెంచుతున్నాడు. అందుకే ఆ చెట్టు కూడా వివిధ రకాల మామిళ్లతో తిరిగి, ప్రేమను అందిస్తోంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ప్రస్తుతం ఆ చెట్టు తొమ్మిది మీటర్ల ఎత్తులో నిలబడి, చల్లని నీడను ఇస్తోంది. చెట్టు ఆకులు కూడా ఒక్కో చోట ఒక్కో రంగులో కనిపిస్తాయి. ఒకచోట ముదురాకుపచ్చ, ఇంకోచోట మెరిసే పసుపు ఆకులు, మరోచోట ముదురు ఊదా ఆకులు– ఇలా కేవలం ఆకులు మాత్రమే కాదు, ఈ చెట్టు పండ్లు వెదజల్లే పరిమళాలు కూడా వేర్వేరు. చివరగా కరీముల్లా మాటల్లో – ‘మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాని, ఈ మామిళ్లు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. వాటి వాసనలో, రుచిలో, పేర్లల్లో ఎన్నో కథలు దాగున్నాయి. అచ్చం మన వేలిముద్రల్లాగానే ఒక్కో మామిడి ఒక్కో రకం’. పనిలో పనిగా మీరు చెప్పండి – మీకిష్టమైన మామిడి ఏది? ‘ఐశ్వర్యా’ తినాలనిపిస్తుందా? లేక ‘సచిన్’ను రుచి చూస్తారా? -
లిటిల్ ఫైర్‌ఫైటర్!
ఉదయం లేవగానే చాలామంది పిల్లల్లో గేమ్ మోడ్ ఆన్ అవుతుంది. బకెట్లో వేడి నీళ్లు సిద్ధం అయ్యేలోపే ‘పబ్జీ’లో స్క్వాడ్ రెడీ చేసేసుకుంటారు. లంచ్‌బాక్స్ చేతికి వచ్చే సమయానికి ‘ఫోర్ట్‌నైట్’లో నాలుగు ఫైటింగ్ స్టంట్స్ చేసేసి ఉంటారు. ఇలా చాలామంది ఇళ్లల్లో స్క్రీన్ బ్రైట్‌నెస్‌తో గది మెరిసిపోతుంటే, వర్జీనియాలో ఉండే రోమిర్ అనే పన్నెండేళ్ల అబ్బాయి ఇంట్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. గేమ్‌లో పొగలు వస్తే అలర్ట్ మోడ్‌కి వెళ్లిన ట్లు, అచ్చం అలాగే, రియల్ లైఫ్‌లోనూ ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడే మోడ్‌ను రోమిర్ యాక్టివేట్ చేశాడు. చేతిలో గన్ లేకపోయినా, అసలైన ధైర్యం, మెదడులో మెగాబైట్ల బుద్ధి ఉపయోగించి, వెంటనే ఫైర్‌స్టేషన్ కు ఫోన్ చేశాడు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు’ అని హీరో అనుకోడు కదా! అందుకే, సోఫాలో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను, ఒక్క చేతిలో ఒకరిని, ఇంకొక చేతిలో ఇంకొకరిని ఎత్తుకొని, జెట్ స్పీడ్‌తో డోర్ దాటి బయటకు తెచ్చి, సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. తర్వాత మళ్లీ లోపలికి వెళ్లి, మోకాళ్ల నొప్పులతో నడవలేని నాన్నమ్మను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన నాలుగు నిమిషాల్లో అసలైన ఫైర్‌ఫైటర్లు వచ్చారు. కాని, అప్పటికే రోమిర్ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అప్పుడు వాళ్లు చూసింది కాలిపోయిన ఇల్లు మాత్రమే కాదు, నల్లటి పొగలో మెరిసిపోతున్న చిన్న హీరోని కూడా. అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటే మాట చెప్పింది ‘నీ టాలెంట్ మా ఫైర్ఫోర్స్లో చాలా అవసరం. నీకు పద్దెనిమిదేళ్లు వచ్చిన వెంటనే ఫైర్‌ఫైటర్ జాబ్ నీదే!’ అని. ఇలా రోమిర్ ఆడిన అసలైన అడ్వెంచర్ గేమ్– అతని జీవితాన్ని సెట్ చేయడమే కాదు, దీంతో అతడి స్కోర్ బోర్డ్‌లో ‘రోమిర్ – ది రియల్ లైఫ్ ఫైర్ ఫైటర్!’ అనే టైటిల్ కూడా జతపడింది. -
....ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి. – కీర్తి, అనంతపురం. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్‌లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్‌కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు. రాగానే తలనొప్పి నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?– శారద, తిరుపతి. మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు. కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్‌లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు. మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి. -
ఎంసెట్‌ను ఎత్తిచూపాడు!
జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’ అమలులోకి వచ్చే వరకు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ‘ఎంసెట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ అయ్యేవి. కొన్నేళ్లు సాగిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాల్లోనూ సిరీస్‌లు ఉండేవి. మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించడానికి ఉద్దేశించిన ఈ విధానంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, అధికారులు, నిపుణులు గుర్తించలేకపోయారు. అయితే 2010 ఎంసెట్ సందర్భంలో పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్ కాపీయింగ్ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన ఇంద్రసేన్ రెడ్డి విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించడంతో ‘ఎంసెట్’ పేపర్ల కూర్పులో మార్పులు జరిగాయి. ఆ ఏడాది హైదరాబాద్, కడపల్లో ఈ నిందితులు అరెస్టు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన గంగాధర్‌రెడ్డి, కడప వాసి గురివిరెడ్డి సూత్రధారులుగా ఏర్పడిన గ్యాంగ్ 2010 నాటి ఎంసెట్‌లో మెడిసిన్ అభ్యర్థుల హైటెక్ మాల్ ప్రాక్టీస్‌కు తెరలేపింది. హైదరాబాద్‌తో పాటు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన ఇంద్రసేనారెడ్డి, కర్నూలు వాసి నాగూర్ బాషా, అనంతపురం వాసి లోకేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డిలతో ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో వ్యవహారాల కోసం నెల్లూరుకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ జన భాస్కర్, చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన హరిప్రసాద్‌రెడ్డిలను ఏర్పాటు చేశారు. ఈ ముఠా హైటెక్ పద్ధతిలో ఎంసెట్ పేపర్లు లీక్ చేసి, విద్యార్థులతో పరీక్షలు రాయించాలని పథకం వేసింది. దీని కోసం బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ సిద్ధం చేసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, మాల్‌ప్రాక్టీస్ ద్వారా పరీక్షలు రాయించి పాస్ చేయించాలని కుట్ర పన్నింది. దీనికోసం కొన్ని మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. మెడిసిన్ విభాగం ఎంసెట్ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉండేవి. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉండటంతో ఈ ముఠా ఒక్కో విభాగానికి సంబంధించి కొందరు నిపుణులను రంగంలోకి దింపింది. పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి, ఆ వెంటనే ఆయా అవి నిపుణులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిపుణులు అన్ని సిరీస్‌లకు సంబంధించిన జవాబులను ఫోను ద్వారా ముఠాలో కీలక వ్యక్తులకు పది నిమిషాల్లో చెప్పేలా ఏర్పాట్లు చేసుకుంది. తమకు డబ్బు చెల్లించి, మాల్‌ప్రాక్టీస్ ద్వారా ఉత్తీర్ణులవ్వాలని ఆశించి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందించడానికి ఈ ముఠా అత్యాధునిక ఇయర్ఫోన్లు, బ్లూటూత్స్ ఖరీదు చేసింది. చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్ఫోన్లకు తోడు బ్లూటూత్‌లను పెట్టుకోవడానికి బనియన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఫుల్‌హ్యాండ్స్ బనీన్లలో కుడి, ఎడమ చేతుల్లో భుజానికి దగ్గరగా బ్లూటూత్ సరిపడా చిన్న జేబులు కుట్టించారు. వీటికి సంబంధించిన సెల్ఫోన్లను సైలెంట్ మోడ్‌లో విద్యార్థులు అండర్వేర్స్లో పెట్టుకునేలా ఏర్పాటు చేశారు. సదరు విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందే బ్లూటూత్ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పరీక్ష హాలులోకి ప్రవేశించిన విద్యార్థి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే పని నడిచేలా ప్లాన్ చేశారు. సదరు విద్యార్థి పరీక్ష పేపర్ తీసుకునే సమయం అయిన వెంటనే ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఫోను ద్వారా విద్యార్థిని సంప్రదిస్తారు. ఆపై వరుస పెట్టి అన్ని సిరీస్‌లు ఏ...బీ...సీ...డీ... అంటూ చదువుతారు. బ్లూటూత్‌కు అనుసంధానమైన ఇయర్‌ఫోన్ ద్వారా ఇవి వినే విద్యార్థి తనకు వచ్చిన సిరీస్ చదివిన వెంటనే చిన్నగా దగ్గి సిగ్నల్ ఇస్తాడు. ఇక ఆ సిరీస్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వరుసపెట్టి బ్లూటూత్ ద్వారా ముఠా సభ్యులు చెప్పి పరీక్ష రాయించాలని పథకం వేశారు. 2010 మే నెలలో హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసిన అధికారులు ఈ హైటెక్ గ్యాంగ్ గుట్టురట్టు చేసి, నాటి పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులైన గురివిరెడ్డి, ఇంద్రసేన్లను కడప పోలీసులు అదే ఏడాది జూన్ 5న అరెస్టు చేశారు. అక్కడి కేసులో ఇంద్రసేన్‌కు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ష్యూరిటీలు లేకపోడంతో విడుదల జాప్యమైంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు పీటీ వారంట్‌పై ఇక్కడకు తీసుకువచ్చారు. కడప జిల్లాకు చెందిన ఇంద్రసేన్ అప్పట్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. 2004–05ల్లో ఇంద్రసేన్, గురివిరెడ్డి ఇద్దరూ నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఆ సందర్భంలో వీరికి పరిచయమైంది. ఇంద్రసేన్ చదువుకుంటూనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేవాడు. దీంతో అప్పుడప్పుడు గురివిరెడ్డి నుంచి ఆర్థిక సహాయం పొందేవాడు. షేర్లలో నష్టపోయిన గురివిరెడ్డి తన ఆర్థిక ఇబ్బందులను ఇంద్రసేన్తో చెప్పడంతో ఇద్దరూ కలిసి 2009 నుంచి ఎంసెట్ హైటెక్ మాల్‌ప్రాక్టీస్‌కు పథకం వేశారు. ఎగ్జామినేషన్ హాల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకూడదన్న ఉద్దేశంతో నిర్వాహకులు క్వశ్చన్ పేపర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు సిరీస్‌లలో అందించేవారు. అయితే, క్లాస్‌రూమ్‌లో మాల్‌ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే ఓ చిన్న లాజిక్‌ను ఇంద్రసేన్ గుర్తించాడు. ‘ఏ’ సిరీస్‌లో 1వ ప్రశ్న ‘బి’ సిరీస్‌లో 31, ‘సి’ సిరీస్‌లో 21, ‘డి’ సిరీస్‌లో 11గా... అలాగే ‘ఏ’ సిరీస్‌లో రెండోది ‘బి’లో 32, ‘సి’లో 22, ‘డి’లో 12గా వస్తుంటుందని గమనించాడు. ఎంసెట్ ర్యాంక్ కోసం ఏడుసార్లు ప్రయత్నించిన నేపథ్యంలోనే తనకు ఈ విషయం తెలిసిందని ఇంద్రసేన్ పోలీసుల ఎదుట బయటపెట్టాడు. అనేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో పాటు కనీసం మూడుసార్లు ఎంసెట్ రాసిన ప్రతి అభ్యర్థికీ ఈ సంగతి తెలుస్తుందనని, దీన్ని అనేక మంది అనువుగా మార్చుకుంటున్నారని వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత నుంచి వివిధ సిరీస్‌ల ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సీక్వెన్స్ మార్చే విధానం అమలులోకి వచ్చింది.∙ -
శివాంజనేయ యుద్ధం
పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. యాగాశ్వానికి పరిరక్షకులుగా భరత శత్రుఘ్న సుగ్రవ ఆంజనేయులను నియమించాడు.యాగాశ్వాన్ని పట్టుకున్న చాలామంది రాజులతో యుద్ధాలు జరిగాయి. హనుమంతుడి ప్రతాపం వల్ల యుద్ధాలలో ఎక్కువ ప్రయాస లేకుండానే రాజులు ఓటమిని అంగీకరించారు. చేసేది లేక యాగాశ్వాన్ని భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించారు. యాగాశ్వంతో పాటు అలా ముందుకు సాగుతుండగా, చక్రాంక నగరంలో రాజసుబాహుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అతడితో కూడా యుద్ధం జరిగింది. అతడు హనుమంతుడి ఎదుటకు వచ్చి, బాణాలు ప్రయోగించాడు. చిర్రెత్తిన ఆంజనేయుడు పైకెగసి, కాలితో అతడి ఛాతీ మీద కొట్టాడు. ఆ దెబ్బకు రాజసుబాహుడు మూర్ఛిల్లాడు. మూర్ఛావస్థలలో అతడికి శ్రీరాముడు దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తున్న శ్రీరాముని రూపం అతడి మనోనేత్రానికి కనిపించింది. కొద్దిసేపటికి అతడు మూర్ఛ నుంచి తేరుకుని స్పృహలోకి వచ్చాడు. ‘హనుమంతుడి పాదస్పర్శ మహిమతో భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకోగలిగాను. నా అపరాధానికి మన్నించండి’ అంటూ యాగాశ్వాన్ని అప్పగించి, భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను వినయంగా సాగనంపాడు.యాగాశ్వాన్ని తీసుకుని వారు ముందుకు సాగారు. దారిలో దేవపురం వచ్చింది. దేవపురం రాజు వీరమణి శివభక్తుడు. శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే, ‘స్వామీ! నా రాజ్యంపై ఎవరైనా దాడికి వచ్చినట్లయితే, నన్ను రక్షించు’ అని కోరుకున్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అప్పటి నుంచి వీరమణి తనను తాను అపరాజితుడినని అనుకోసాగాడు. తన రాజధాని నగరంలోకి ప్రవేశించిన యాగాశ్వాన్ని వీరమణి పట్టుకున్నాడు. దానిని తన అశ్వశాలలో బంధించాడు.‘ఇది రాముడి యాగాశ్వం. మర్యాదగా విడిచిపెట్టు, మేం ముందుకు సాగాలి’ అని భరత శత్రుఘ్నులు హెచ్చరించారు. వీరమణి పట్టించుకోలేదు. ‘నువ్వు మొండికేస్తే, యుద్ధంలో బుద్ధి చెప్పక తప్పదు’ తుది హెచ్చరికగా పలికాడు సుగ్రీవుడు.‘యుద్ధానికి నేను సిద్ధమే! నేను పట్టుకున్న అశ్వాన్ని మీరెలా తీసుకుపోతారో చూస్తాను’ అంటూ వీరమణి సేనలను సమాయత్తం చేసి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.యుద్ధం హోరాహోరీగా జరిగింది.ఒకవైపు భరత శత్రుఘ్నులు శరపరంపరను కురిపిస్తుంటే, మరోవైపు సుగ్రీవుడు, హనుమంతుడు సేనా సమూహంలోకి చొరబడి విజృంభించారు. వారి నలుగురి ధాటికి వేలాదిగా ఉన్న వీరమణి సైన్యం కకావికలమైంది. వీరమణి పరమశివుడిని తలచుకున్నాడు. అతడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు స్వయంగా త్రిశూలం ధరించి, రణరంగంలోకి వచ్చి వీరవిహారం ప్రారంభించాడు.పరమశివుడి ధాటికి భరత శత్రుఘ్నులు, సుగ్రీవుడు మూర్ఛితులయ్యారు.హనుమంతుడు శివుడిని ఎదిరించి, యుద్ధం చేయడం ప్రారంభించాడు.కొంతసేపు యుద్ధం తర్వాత ‘మహాశివా! నేను రామబంటును. సేవాధర్మంగా రామకార్యం కోసం యుద్ధం చేస్తున్నాను. నువ్వెందుకు రామకార్యాన్ని అడ్డుకుంటూ యుద్ధం చేస్తున్నావు?’ అడిగాడు హనుమంతుడు.‘హనుమా! నువ్వు నీ స్వామి కోసం యుద్ధం చేస్తున్నావు. నేను నా భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నాను’ చెప్పాడు శివుడు.ఇద్దరికీ నడుమ మరికొంత పోరు సాగింది. హనుమంతుడు తన గదతో శివుడి రథాన్ని కూల్చేశాడు. శివుడు నేల మీద పడ్డాడు. ‘హనుమా! నువ్వు మహావీరుడివి. యుద్ధంలో నా దెబ్బలను తట్టుకుంటూనే నా రథాన్ని కూల్చేశావు. నీ పరాక్రమానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో!’ అని అడిగాడు.‘నేను ద్రోణపర్వతానికి వెళ్లి, సంజీవని మూలిక తీసుకొస్తాను. అంతవరకు యుద్ధంలో మూర్ఛిల్లిన భరత శత్రుఘ్న సుగ్రీవులకు, మిగిలిన సైనికులకు ఏ ఆపదా రాకుండా రక్షణగా ఉంటానని వరమివ్వు, అది చాలు’ అన్నాడు హనుమంతుడు.‘తథాస్తు’ అన్నాడు శివుడు.హనుమ రివ్వున ఎగిరి ఆకాశమార్గాన ద్రోణ పర్వతానికి వెళ్లాడు. పర్వతం మీద ఎంత వెదికినా సంజీవని మూలిక జాడ కనుక్కోలేకపోయాడు. చివరకు పర్వతాన్నే పెకలించుకుపోవాలని నిశ్చయించుకుని, పర్వతాన్ని పెకలించసాగాడు.ఆకాశమార్గాన బృహస్పతి సహా దేవతలతో సంచరిస్తున్న దేవేంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడయ్యాడు. హనుమంతుడి మీదకు వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు.అయితే, బృహస్పతి అతడిని వారించాడు. ‘హనుమంతుడు రామభక్తుడు. అతడితో ఖ్యంగానే సమస్యను పరిష్కరించుకుందాం’ అని చెప్పి, ద్రోణాచలానికి దారితీశాడు. ఇంద్రాది దేవతలు అతణ్ణి అనుసరించారు.‘పర్వతాన్ని ఎందుకు పెళ్లగిస్తున్నావు?’ అని హనుమను అడిగాడు బృహస్పతి.‘ఇందులో సంజీవని మూలిక ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను. అందుకే పర్వతం మొత్తాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాను’ బదులిచ్చాడు హనుమ.‘నీకు కావలసినది మూలికే కదా, నేను గుర్తించగలను. వెదికి ఇస్తాను’ అంటూ బృహస్పతి అతడికి సంజీవని మూలికను తెచ్చి ఇచ్చాడు.హనుమంతుడు సంతోషంగా మూలిక తీసుకుని, దేవపురం చేరుకున్నాడు. మూర్ఛితులైన భరత శత్రుఘ్న సుగ్రీవులు సహా సైనికులను మూలిక సాయంతో స్పృహలోకి రప్పించాడు. జరిగినదంతా చూసి, వీరమణి యాగాశ్వాన్ని మర్యాదగా అప్పగించాడు.∙సాంఖ్యాయన -
హోమ్ వర్క్ శిక్ష కారాదు
హోమ్ వర్క్ విషయంలో పిల్లలు మారాం చేస్తారు. తల్లిదండ్రులు కోప్పడతారు. చదువు ఘర్షణలా మారుతుంది. ఇది ప్రతిరోజూ, ప్రతి ఇంటిలోనూ జరిగే విషయం. చదువు పట్ల తల్లిదండ్రులకు ఉన్న అపోహే అందుకు కారణమంటే ఆశ్చర్యపోకండి. చదువు అంటే ‘గుర్తుపెట్టుకోవడం’ మాత్రమే అన్న నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. ఎక్కువసార్లు చదివినా, రాసినా మెదడులో నిలుస్తుందన్న అపోహలో ఉన్నాం. దాంతో హోమ్ వర్క్‌ను ఒక నిల్వ ప్రక్రియలాగా చూస్తున్నాం. పిల్లల మెదడు నిజంగా ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవడమే హోమ్ వర్క్ సమస్యకు అసలైన పరిష్కారం. దృక్పథం మారాలిచదువు అంటే ఒత్తిడి కాదు, ఉత్సాహం. హోమ్ వర్క్ అంటే పనిభారం కాదు, పునఃచింతన. ఇది జరగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మానసిక దృక్పథమే మారాలి. హోమ్ వర్క్‌ను సరికొత్తగా చూడాలి. అది భావోద్వేగ అనుభూతి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, సంబంధాల మధ్య ఒక వారధిలా ఉండాలి. పిల్లల మెదడును డౌన్లోడ్ చేయడం కాదు, డెవలప్ చేయాలి. పరీక్షల కోసం కాదు, జీవితానికి నేర్చుకోవాలి.⇒ మెదడు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది, రిపిటీషన్ ద్వారా కాదని న్యూరో సై¯Œ ్స పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి నేర్చుకోవడాన్ని అడ్డుకుంటుంది. కాని, భావోద్వేగ సంబంధిత విషయాలు మెదడులో బలమైన న్యూరల్ కనెక్షన్లు ఏర్పరుస్తాయని డాక్టర్ జుడీ విల్లిస్ అనే న్యూరాలజిస్ట్ చెబుతున్నారు.⇒ జాన్ స్వెల్లర్ కాగ్నిటివ్ లోడ్ థియరీ ప్రకారం ప్రతి పిల్లవాడికి వర్కింగ్ మెమరీ పరిమితంగా ఉంటుంది. మన మెదడు ఒక్కసారిగా 4–7 అంశాలు మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఈ పరిస్థితిలో, పెద్ద పెద్ద హోమ్ వర్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్లు నేర్చుకోకపోగా; అలసటకు, నిరాశకు లోనై హింసలా భావిస్తారు.⇒ ఒకేసారి గంటలకు గంటలు ఒత్తిడితో చేసే హోమ్ వర్క్ కన్నా, విరామం తీసుకుంటూ చదివినప్పుడు లేదా హోమ్ వర్క్ చేసినప్పుడు మెదడు ఎక్కువగా నేర్చుకుంటుందని డాక్టర్ రాబర్ట్ బిజోర్క్ చెబుతున్నారు. ⇒మంచి నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుందని డాక్టర్ మాథ్యూ వాకర్ అనే నిద్ర శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. మంచి నిద్ర లేని పిల్లలు ఎంత రాసినా, ఎంత చదివినా లాంగ్ టర్మ్ మెమరీలో నిలవదు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సంప్రదాయ హోమ్ వర్క్‌లో లోపాలు⇒ప్రతి పిల్లవాడి శైలి వేరు. కొందరు వింటూ, మరికొందరు రాసుకుంటూ, ఇంకొందరు చూసి నేర్చుకుంటారు. ఎవరి శైలిలో వారిని చేయనివ్వాలి. ఒక్కటే హోమ్ వర్క్ మొత్తం క్లాస్‌కు ఇవ్వడమంటే అందరికీ ఒకే మందు ఇవ్వడం లాంటిది.⇒అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం హోమ్ వర్క్ వల్ల ఉదాసీనత, నిద్రలేమి, ఫ్యామిలీ గొడవలుపెరిగాయి. ఇక మన దేశంలో హోమ్ వర్క్ మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ⇒ ‘క్లాస్ వర్క్ పూర్తిచేయకపోతే ఊరుకోం. డబుల్ హోం వర్క్ చేయాలి’ అని టీచర్లు, పేరెంట్స్ బెదిరిస్తుంటారు. దీని వల్ల పిల్లల మనసులో ‘చదువు = శిక్ష’ అనే భావన బలపడుతుంది. ఇది వారికి చదువుపై కోపం, భయం పెంచుతుంది. హోమ్ వర్క్ ఎలా చేయించాలి?⇒ పేజీలకు పేజీలు రిపీట్ చేసే బదులు ఒక ప్రశ్న ఇవ్వండి. ‘ఇవ్వాళ నువ్వు ఏం అర్థం చేసుకున్నావు?’, ‘ఇది నీ స్నేహితుడికి ఎలా చెప్తావు?’ అని అడగండి. అది వారి ఊహాశక్తిని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుతుంది.⇒ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం హోమ్ వర్క్ గరిష్ఠంగా ‘తరగతి నంబర్ 10 నిమిషాలు’ మాత్రమే ఉండాలి. 1వ క్లాస్ అంటే 10 నిమిషాలు, 5వ క్లాస్ అంటే 50 నిమిషాలు మించకూడదు. ⇒ హోమ్ వర్క్‌ను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, చర్చగా మార్చండి. ఒక సబ్జెక్టును చర్చించాలంటే పిల్లలు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ‘ప్రాటిజీ ఎఫెక్ట్’ అనే అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది – నేర్పేటప్పుడు నేర్చుకునే శక్తి పెరుగుతుంది.⇒హోమ్ వర్క్ ఎలా చేయాలనే విషయంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. ‘ఇది రాయాలని ఉందా? లేక చెప్పాలని ఉందా?’ అనే చాయిస్ ఇవ్వండి. ఈ ఎంపిక వల్ల మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. ఇది చదువు పట్ల ఆసక్తిని పెంచుతుంది. -
ఈ వారం కథ: రచయిత వీలునామా!
కొన్ని మరణాలు భరించలేని దుఃఖాన్ని మోస్తాయి. మరికొన్ని పూరించలేని లోటుని మిగులుస్తాయి.ఇంకొన్ని మరణాలు బతికిస్తాయి. బతుకునిస్తాయి. ‘‘నాపేరు యామిని.. సార్‌కి అసిస్టెంట్‌ని..’’ ఎదురుగా కూర్చొంటూ అందామె. ఆమె తెచ్చిన కాఫీ– టీపాయ్ మీద పొగలు కక్కుతోంది.‘‘ కాఫీ తీసుకోండి..’’ నవ్వుతూ అంది. మేకప్ మాత్రమే కాదు, శారీరక భాష కూడా ఆమె నడివయసు స్త్రీ అని చెప్పకనే చెబుతోంది. ఖరీదైన ఫర్నిచర్, అధునాతన డిజైనింగ్‌తో వెయిటింగ్ రూమ్ అదిరిపోతోంది.రచయితగా కళాధర్ సంపాదన బాగానే ఉన్నట్టుంది. చూపు సారించినంత మేర ఇల్లంతా రిచ్‌గా కనిపిస్తోంది.ఎదురుగా విశాలంగా ఉన్న షెల్ఫ్‌లో వందలాదిగా ఎన్నో పుస్తకాలు. సాహితీ టీవీ సినీ దిగ్గజాలతో దిగిన ఫొటోలు, అవార్డుల మెమెంటోలు, సన్మానపత్రాల ఫొటోషీల్డులు ఎన్నో వరుసగా కొలువుదీరి ఉన్నాయి. కాఫీ తాగడం పూర్తిచేసి కప్పు కింద పెట్టాను.‘‘సారీ సర్.. లేటయ్యింది’’ వస్తూనే కళాధర్ పలకరిస్తూ, ప్రేమగా నన్ను హత్తుకున్నాడు. కుశలప్రశ్నల వర్షం కురిపించేడు. తడిసి ముద్దవుతూనే అన్నిటికీ జవాబిచ్చాను.‘‘సినిమా ఫీల్డ్‌కు వచ్చి ఎన్నాళ్లైంది సర్ ?’’ అడిగాను కుతూహలంగా.‘‘ముప్ఫైయేళ్లు దాటింది. అంతకుముందు మా ఊళ్లో ఉండేటప్పుడు నేనూ, మీబావగారు కలిసి తిరిగేవాళ్ళం. కథలు రాసేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. పొట్టకూటి కోసం’’...‘‘ఇక్కడెలా అవకాశాలు వచ్చేయి?’’‘‘మొదట్లో పత్రికలకు సీరియళ్లు, కథలూ రాసేవాణ్ణి. మెల్లగా సినిమావాళ్లతో పరిచయాలు చేసుకున్నాను. ఎన్నో సినిమాలకు కథలు అందించాను. కొంతమందికి ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను.’’‘‘రచయితగా మీరు సాధించిందేంటి..?’’‘‘నాలుగు రాళ్లు వెనకేసుకోవడం... అంతకు మించి ఏం లేదు. నీతులూ సూక్తులూ చైతన్యాలూ మన వల్ల కాదు. బతుకు దెరువు కోసం నా రచనల్ని అమ్ముకుంటున్నాను. ఒకప్పుడు సినిమాలకు, ఇప్పుడు టీవీ సీరియళ్లకు...’’ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడతను. ఎంతో ముచ్చటేసింది.‘‘ఆల్ ది బెస్ట్ సర్. ఇక నేనొచ్చిన పని మీకు తెలుసు కదా?’’‘‘తెలుసు సర్. శేఖరం రాత్రే ఫోన్ చేశాడు. నా మిత్రునికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందంటే నాకు మాత్రం ఆనందం కాదా! తప్పకుండా వస్తాను. ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూస్తాను. సరేనా..?’’ఇచ్చిన ఆహ్వాన పత్రికను తనఫైల్లో భద్రంగా దాచుకున్నాడతను. లంచ్ కానిచ్చి తిరుగు ప్రయాణానికి తయారయ్యాను. ఇద్దరూ స్టేషన్‌కు కార్లో దిగబెట్టారు. అతను నా పక్క బ్యాక్ సీట్లో కూర్చుంటే, కారు డ్రైవింగ్ చేసింది యామిని. స్టేషన్ చేరుకునే సరికి ప్లాట్‌ఫామ్‌పై ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ వినిపిస్తోంది.‘‘చివరగా ఒకే ఒక్క ప్రశ్న... అడగొచ్చా?’’ బెర్త్‌పై కూర్చొంటూ అడిగాను.‘‘అడగండి.. పర్వాలేదు’’‘‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు?’’‘‘సరైన అమ్మాయి దొరక్క...’’ బిగ్గరగా నవ్వేడతను. యామిని కిసుక్కున నవ్వింది.అతని విచిత్ర సమాధానానికి నేనేమీ ఫీలవ్వలేదు. పైగా అతని వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఆరా తీయాలనిపించింది. ఇంటికొచ్చాక బావగారిని అడిగాను. అతను కూడా వెంటనే చెప్పడానికి ఇష్టపడలేదు. గట్టిగా పట్టుబడితేనే తప్ప.‘‘నాకు తెలిసినప్పటి నుంచి వాడిదో పెక్యూలియర్ మెంటాలిటీ. బాగా డబ్బు సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనేవాడు. ఇంటర్ నుంచి మా ఇద్దరికీ పరిచయం. సైకిల్‌పై కాలేజీకి వచ్చేవాడు. ఒంటరిగా ఏదో రాసుకుంటూనో, ఎక్కడో చదువుకుంటూనో కనిపించేవాడు. కాలేజీ మ్యాగజైన్లో మా ఇద్దరి కవితలు పడ్డాక మరింత సన్నిహితమయ్యాము. పుస్తకాల గురించి, సినిమాల గురించి చర్చించేవాళ్ళం. డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరమూ కలిసి మా పేర్లలోని సగాలతో కలిపి ‘చంద్రకళ’ అనే పేరుతో కథలు రాసేవాళ్ళం. తొంబైల్లో జంటరచయితలుగా మాకో ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. మా కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యాడు. అలాంటి వాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో తెలీదు. వాడి సొంతవూరు వెళ్లి విచారిస్తే, కొన్ని చేదు నిజాలు తెలిశాయి. వాడి కన్నతల్లి చిన్నతనంలోనే చనిపోయిందని కొందరు, కాదు... లేచిపోయిందని మరికొందరు... సవతితల్లితో చాలా బాధలు పడ్డాడని మరికొందరు... చాలా బాధనిపించాయి.. ఐదేళ్ల తర్వాత వాడి నుంచి ఉత్తరం వచ్చింది హైదరాబాదులో క్షేమంగా వున్నానని, ఓ పత్రికాఫీసులో పనిచేస్తున్నానని... చదివి సంతోషమనిపించింది. ఆ తర్వాత శిక్షణ పూర్తయి నేను టీచర్ గా స్థిరపడ్డాను. నాపెళ్ళికీ, చెల్లి పెళ్ళికీ పిలిచాను. ఆనందంగా పాల్గొన్నాడు. ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్ననే చాలాసార్లు వాడిని అడిగాను. పెళ్లి నా ఒంటికి పడదని నవ్వుతూ సమాధానం దాటవేసేవాడు. వాడిపై బోలెడు పుకార్లు... నేనవేవీ పట్టించుకోవడం మానేశాను. ఎవరెవరితోనో తిరిగి, ప్రస్తుతం ఎవరో ఒకామెతో సహజీవనం చేస్తున్నాడని విన్నాను. ఇన్ని అవలక్షణాలు ఉన్నా, మనిషిగా మాత్రం మంచివాడు. సవతితల్లి కూతురి పెళ్లిని తనే ఘనంగా చేశాడు. మా నాన్నగారి గుండె చికిత్సకు అయిన ఖర్చునంతా తనే పెట్టాడు. డబ్బు తిరిగి చెల్లించబోతే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. సినీ రచయితగా వాడి రచనల్లోని విలువలూ, ఆలోచనా దృక్పథమూ నాకు నచ్చవు. అయినాసరే, అవెప్పుడూ మా స్నేహానికి అడ్డు రాలేదు’’ ముగించారు బావగారు. అతనేంటో మరింత అర్థమవడం ఆరంభమైంది.‘‘సభకు నమస్కారం... నా పేరు కళాధర్. నేనొక టీవీ, సినీ రచయితనని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన ‘అగ్నిశిఖ’ కథాసంపుటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న నా మిత్రుడు చంద్రశేఖరానికి ముందుగా అభినందనలు. మేమిద్దరం ప్రాణస్నేహితులమని చెప్పడం కంటే శేఖరం స్నేహితుడినని చెప్పుకోవడమే నాకు గర్వకారణం. శేఖరం ఒకగొప్ప రచయిత. అంతకు మించి స్నేహశీలి. స్వతహాగా నేను బిడియస్తుణ్ణి. ఎవరితోనూ కలిసేవాడిని కాదు. ఒంటరి నా ఆలోచనలను సరిచేసి, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను అందించిన ఆత్మీయవ్యక్తి శేఖరం. రచయితగా రచనల్లోని మెలకువలు నేర్పిన మార్గదర్శి. ఈరోజు నేనిలా నిలబడ్డానికి కారణం వాడిచ్చిన ప్రోత్సాహమే! అందించిన స్నేహహస్తమే! రచన చేయడం గొప్ప కాదు, ఒక సామాజిక బాధ్యతతో, సైద్ధాంతిక నిబద్ధతతో ఒక కొత్త తరాన్ని తయారు చేసి నడిపించగలగడం మహత్కార్యం, సాహిత్యసేవ. దాన్ని శేఖరం మాత్రమే చేతల్లో చూపించాడు. నిజంగా వాడొక అగ్నిశిఖ. వాడి రచనల్ని తడిమి చూసేంత సత్తా ఏ విమర్శకుడికీ లేదు. వాడి రచనలు కళ్ళు చెమర్చే జీవితపు విలువలు, స్ఫూర్తినిచ్ఛే మానవీయ స్పందనలు. డబ్బు కోసమో, పేరు కోసమో, కాలక్షేపం కోసమో రాయడు. అందుకే వాడి రచనలంటే గౌరవం. వాడంటే భయం. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. చివరగా శేఖరానికి ఇలాంటి అవార్డులెన్నో రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను’’కళాధర్ ప్రసంగం ముగిసింది. ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. బావగారిని గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడతను.ఆ తర్వాత వక్తలెందరో ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా బావగారికి ఘనసత్కారం జరిగింది. అభిమానులు, మిత్రులు పోటాపోటీగా శాలువాలు కప్పేరు. పనిలో పనిగా కళాధర్‌ని కూడా సన్మానించారు. అన్నట్టుగానే నిర్వహణ అంతా తన భుజాలపైనే వేసుకుని, కళాధర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాడు.ఆ రోజు నుంచి బావగారి కీర్తిప్రతిష్ఠలు అమాంతం పెరిగిపోయాయి. మిగిలిన ఎన్నో సంస్థల అవార్డులు, సత్కారాలు వరుసగా వరించాయి. సందర్శకుల తాకిడి ఎక్కువైపోయింది. పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిలాషులు. ఔత్సాహిక రచయితలు... ఎందరెందరో... ఎక్కడెక్కడి నుంచో... ఇంటికి వచ్చేవారు. విషయ సేకరణ చేయడమో, రచనా నైపుణ్యాల గురించి అడిగి తెలుసుకోవడమో చేసేవారు. చర్చలు, సమావేశాలు రోజురోజుకీ ముమ్మరమయ్యాయి. దూరాభార కార్యక్రమాలకు రాకపోకలు ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదనీ అక్కా... కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అవి ఆయన చెవికెక్కలేదు.అలా ఒకరోజు ఎక్కడో సాహిత్య సమావేశం జరుగుతోంది. బావగారు ముఖ్యఅతిథి. ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. సభావేదికపైనే గుండెనొప్పంటూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. రెండు రోజుల చికిత్స అనంతరం బావగారి ప్రాణం పోయింది.సాహిత్య లోకానికే కాదు, మా కుటుంబాలకు కూడా పెద్ద దిక్కు లేకుండా పోయింది. కళాధర్ వేదన గట్టుతెగిన వాగైంది. అందరి హృదయాలూ దుఃఖంతో బరువెక్కాయి. సంతాపసందేశాలూ, చానళ్లలో స్క్రోలింగ్ వార్తలూ హోరెత్తాయి. ఆప్తులందరి సమక్షంలో బావగారి భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. దశదినకర్మలు పూర్తయ్యాయి. వేడుక ముగిసిన వేదికలా బావగారిల్లు మిగిలిపోయింది.కొన్నేళ్ళకు మరో చేదు వార్త కమ్ముకుంది. కళాధర్ కూడా కాలధర్మం చేశాడనే వార్త! నిద్దట్లోనే గుండె ఆగిపోయిందట! హృదయం బాధా తప్తమైంది. మరు నిమిషం హైదరాబాద్ రాత్రి బస్సెక్కెశాను. నేను వెళ్లేసరికి శవాన్ని ఉంచేందుకు ఫ్రీజర్‌ను సిద్ధం చేస్తున్నారు. సినీ టీవీ రంగాల ప్రముఖులెందరో విచార వదనాలతో ఒక్కరొక్కరూ వస్తున్నారు. కొయ్యబారిన దుఃఖంలా యామిని ఉంది. కళాధర్ వ్యక్తిగత లాయర్ అప్పుడొచ్చాడు వీలునామా పట్టుకొని... చదివి వినిపించాడు. అంతా నివ్వెరపోయారు.హిందూ మతాచారాల పట్ల తనకు నమ్మకం లేదని, మరణానంతరం తన పార్థివదేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి అప్పగించాలని.., తను ఉంటున్న ఇల్లు, బ్యాంక్ అకౌంట్లో నగదు మొత్తం యామినికి చెందుతుందని.. మిగిలిన యావదాస్తి సమంగా నగరంలోని అన్ని అనాథ శరణాలయాలకు చెందుతుందని దాని సారాంశం.కళాధర్ గొప్ప మనసును అక్కడ చేరిన గొంతులు వేనోళ్ళ పొగిడాయి. జోహారు నినాదాలు పెద్ద ఎత్తున చేశాయి. ఈ వార్త క్రమేపి వార్తా చానళ్ల వరకూ పాకింది.‘గొప్ప మానవతావాది.. సినీ రచయిత కళాధర్‌కు జోహార్’ అంటూ ఒక రోజంతా లైవ్ కవరేజీ ప్రసారం చేశారు. ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర మంత్రివర్యులు కూడా హాజరై నివాళులర్పించారు. భౌతిక దేహాన్ని అంతిమ దర్శనం చేసుకుని, యామిని దగ్గరికి వచ్చాను. నిస్తేజంగా చూసిందామె.‘‘బాధపడకండి... అంతా మంచే జరుగుతుంది...’’ అన్నాను.‘‘పర్వాలేదు సర్... విల్లు వివరాలన్నీ తెలుసు... ఆయన ఆకాంక్షలను గౌరవిస్తాను’’ అందామె క్లుప్తంగా...ప్రతిఏటా మిత్రులిద్దరి వర్ధంతులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. సాహిత్య మార్గదర్శిగా అతని అనుచరులు చంద్రశేఖర్‌ని స్మరిస్తూ, అతని సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించుకుంటూ ఎక్కడో ఒకచోట... అయితే తండ్రిలా తమని పోషిస్తూ, విద్యాబుద్ధులు చెప్పిస్తున్న కళాధర్‌ను దేవుడిలా కొలుస్తూ, ధ్యానమందిరాల్లో పూజలు చేస్తూ ఎందరో అభాగ్యులు అనాథ శరణాలయాల్లో మరో చోట...∙పాలకొల్లు రామలింగస్వామి -
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్‌డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్‌పుర్‌లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్‌కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్‌లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్‌పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్‌లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్‌లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్‌కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తే చాలుఅసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్‌ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్‌గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్‌లో ఉంచవలసిన వాటిని వేరే బేస్‌కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్‌పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్‌ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్‌డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్‌లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్‌పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్‌కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి చేరలేదు. కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్‌పుర్ ఎయిర్ పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్‌పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
ఏఐ డాక్టర్లా? మజాకా?
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రిప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు. రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్ఎంఎల్ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.తొలి రిమోట్ ఏఐ సర్జరీచైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది. అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్‌లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది. షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.ఏఐ మాయాదర్పణంవైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది. ఈ ఏడాది లాస్వేగాస్లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఆస్పత్రుల్లోనూ ఏఐమన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్‌లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్‌నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్‌నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది. భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా ఎల్క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.ఏఐ తెచ్చిన మార్పులుఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం విశేషం.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఏఐ డాక్టర్లా? మజాకా?‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి. -
ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్‌గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్‌లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని -
MorningFood పరగడుపున ఇవి తింటున్నారా?
మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.ఉదయం వేళల్లో మసాలాలు, డీప్ ఫ్రైస్ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.చాలామంది బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు -
Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు
మానసిక ఆందోళనలు తగ్గడానికి, స్పష్టత లేని ఆలోచనలను కట్టడి చేయడానికి, మెదడు ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన టెక్నిక్‌లా ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో.. మత్సాసన, గరుడాసన, ధనురాసన, వజ్రాసన, అర్ధమత్యేంద్రాసన, బాలాసన, శవాసన.. మొదలైనవి ఉన్నాయి. ఛాతీ, మెడను విస్తరించి, ఆక్సిజన్ మెరుగుపరుస్తుంది మత్సా్యసన. ఊపిరితిత్తులను, నాడీ వ్యవస్థను ఉత్తేజరుస్తుంది. మానసిక అలసట తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గరుడాసన ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రతను పదునుపెడుతుంది. ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుంది. వజ్రాసన ద్వారా శరీరంపై అవగాహన పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయ పడుతుంది. భావోద్వేగాలను సమతుల్యం చేసే ధనురాసనం ఏకాగ్రతను పెంచుతుంది. ∙అర్ధ మత్య్సేంద్రాసన వల్ల వెన్నెముక నరాలను ఉత్తేజపరచడం ద్వారా అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది. మెదడుకు రక్తప్రవాహం పెరుగు తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మోకాళ్లపై వంగి, చేతులు చాచి, ముందుకు వంగడం వల్ల శ్వాస తీసుకోవడంలో మెరుగ వుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. శవాసనలో పూర్తి విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల భావోద్వేగాల సమతుల్యత కుదురుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది -
‘ఎవరెస్ట్’ పేరు వెనుక ఉన్న కథ తెలుసా?
పిల్లలూ.... మనందరికీ ఎవరెస్టు శిఖరం తెలుసు. హిమాలయాల్లో అన్నింటి కంటే ఎత్తయిన శిఖరం, ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. కాని అది ఒక వ్యక్తి పేరు. ఎత్తయిన శిఖరానికి తన పేరు పెట్టేంత గొప్పవాడైన ఎవరెస్ట్ ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్, రాయల్ సొసైటీ సభ్యుడు (George Everest)ఎవరెస్ట్ 1790 జూలై 4 న గ్వెర్న్ వేల్ లో జన్మించాడు. ఆయన ఇంగ్లాండులోని మిలిటరీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి చేరుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో 1806లో చేరాడు. ఏడు సంవత్సరాలు బెంగాలులో పనిచేశాడు. జావా సర్వే పనిలో 1814 నుండి 1816 వరకు పని చేశాడు. తర్వాత అతను భారత దేశ గ్రేట్ త్రికోణమితి సర్వే Great Trigonometrical విలియం లాంబ్టన్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. భారతదేశపు అత్యంత చివరి దక్షిణ బిందువు కేప్ కొమరిన్ నుండి నే΄ాల్ వరకు దాదాపు 2,400 కిలోమీటర్ల (1,500 మైళ్ళు) దూరంలో ఉన్న మెరిడియన్ ఆర్క్ (Meridian Arc)ను సర్వే చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఎవరెస్ట్. ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ప్రవేశపెట్టి సర్వే పని ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఎవరెస్ట్ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్ గా మార్చింది. ఆ పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్ లేకుండా ఎవరెస్ట్ పేరును ప్రతి΄ాదించింది. అలా ఎవరెస్ట్ పర్వతానికి ఎవరెస్ట్ పేరు స్థిరపడింది.ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు -
సూపర్ టిప్స్ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్‌ర్‌సైజ్ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి? బిజీ షెడ్యూల్‌తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం లేదు అని బాధపడే వారు ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్ ఆఫ్ ది డే’ లో తెలుసుకుందాం.బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్‌గా మన షెడ్యూల్ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటలు గంటలు జిమ్‌లో గడాల్సిన అవసరం లేకుండానే, సింపుల్ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో ఫిట్నెస్ సాధించవచ్చు.స్మార్ట్ ప్రిపరేషన్బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండాలి అనే విషయంలో కూడా కమిట్మెంట్ చాలా ముఖ్యం. ప్లాన్డ్గా, స్మార్ట్‌గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు, స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్ బెస్ట్. వీటిని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్ లేదా లంచ్ ప్యాక్ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది. వ్యాయామం- ఆ 2 నిమిషాలు కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు. రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్లు చేయండి. అంటే కాఫీ విరామాలలో స్క్వాట్లు, డెస్క్ స్ట్రెచ్‌లు లేదా లిఫ్ట్‌లకు బదులుగా ఎక్కడం లాంటివి. డెస్క్ వర్క్ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం. వీలు, సౌలభ్యాన్ని బట్టి, చిన్న చిన్న డెస్క్ వ్యాయామాలు చేయవచ్చు.అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్ట్‌లలో సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!హైడ్రేషన్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్‌గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్, రోస్టెడ్ సీడ్స్, ప్రోటీన్ బార్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్‌లపై దృష్టిపెట్టండి. వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు దీని వల్ల షుగర్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండొచ్చు. వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్ మాట్లాటప్పుడు, టీవీ చూస్తున్నపుడు, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు నడుస్తూ ఉండాలి. అలాగే భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. "మైండ్‌ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి. కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్‌గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్‌పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.గంట కొట్టినట్టు నిద్రపోవాలినిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది.చీట్ మీల్, ఓకే అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్ అయినా, కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్‌మీల్ అనుకోండి. బిజీ షెడ్యూల్లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి. అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.నోట్: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి. బరువు తగ్గడం అనేది ఎవరికి వారు నిశ్చయించుకొని, స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా చేయాల్సిన పని అని మర్చిపోవద్దు. -
లైఫ్‌స్టైల్ ఇన్‌ప్లేషన్ : దీన్ని ఎదుర్కోవడం ఎలా?
మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడి పోయారనే! మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్’ (Lifestyle Inflation) అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’! – సాక్షి, స్పెషల్ డెస్క్ సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.‘పెరగటం’నిజం కాదు! మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరు గుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుంచి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని. ఏఐ భయం పొంచి ఉంది! జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏఐ (కృత్రిమ మేధస్సు). ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోల్చుకోవటం జీతానికి చేటు.. తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్‌గ్రేడ్’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.చిక్కుకోకుండా ఉండాలి జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుంచీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగీ ప్రయోజనం ఉండదు.ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!ముందస్తు హెచ్చరిక సంకేతాలు..జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని ముందుగా తెలియబరిచే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. మొదటి హెచ్చరిక: మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. రెండో హెచ్చరిక: జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్ వేసుకోవటం మానేయటం. మూడో హెచ్చరిక : జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్‌ను పెంచేయటం. నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి– తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం. అయిదో హెచ్చరిక ఇంటర్నెట్, ఓటీటీల సబ్బ్ స్క్రిపషన్లు పెరగటం.బయట పడే మార్గం ఉంది.. జీవనశైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్‌కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కలి్పంచండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ. -
వీధి పోటుతో ఆటుపోట్లు, అసలేంటీ వీధిపోటు!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్! -
‘టైమ్ 100 క్రియేటర్స్’ లిస్ట్‌లో ఏకైక భారతీయురాలు
‘టైమ్ 100 క్రియేటర్స్’ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయురాలిగా ప్రత్యేకత నిలుపుకుంది యూట్యూబర్ ప్రజక్త కోలి( Prajakta Koli ). డిజిటల్ మీడియాలో 2015 నుంచి కోలి విజయపరంపర కొనసాగుతోంది.‘టైమ్ 100 క్రియేటర్స్’లో చోటు సాధించిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది కోలి. ‘నాలో ఎన్నో భావాలు పొంగి పొర్లుతున్నాయి. నేను మీతో చె΄్పాలి అనుకుంటున్న వాటి కంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చెప్పడానికి రెండు మాటలే ఉన్నాయి... థ్యాంక్స్’ అని రాసింది. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులకే కాదు తన పేరుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘థ్యాంక్ యూ ప్రజక్త. వ్యూహం, ప్లాన్, రోడ్ మ్యాప్... ఇలాంటివేమీ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తనను తాను నమ్ముకుంది. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేసింది’ అని రాసింది. View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) 2015లో యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది కోలి. మొదట్లో కామెడీ స్కిట్లు షేర్ చేసేది. తక్కువ కాలంలోనే తన చానల్‌కు ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఏర్పడ్డారు. ‘మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ యూట్యూబర్’గా పేరు తెచ్చుకున్న ప్రజక్త నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ సిరీస్ ‘మిస్ మ్యాచ్డ్’లో నటించింది. ‘టు గుడ్ టు బి ట్రూ’ అనే నవల రాసింది. ఓన్లీ ఇండియన్ -
ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!
బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్‌లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే అంటున్న శైలీ పరిచయం. ‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్ మార్ట్ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్.ఫ్యాషన్ డిజైనర్‌గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి. ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ ప్యాకెట్ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్డాల్ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్‌ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’ జీ తెలుగులో!
హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్‌తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం, జులై 14న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, మీ జీ తెలుగులో!జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే. ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, "జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం," అన్నారు.జయం సీరియల్ జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని జీ తెలుగు ప్రేక్షకులు గమనించాలని జీ తెలుగు విజ్ఞప్తి చేసింది. -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్‌గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్‌గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్‌కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్‌లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్‌గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్‌లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్‌గా మారిన ఈ ఫోక్ సాంగ్స్‌లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్‌తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్‌లో, ఫేస్బుక్, యూట్యూబ్‌లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్‌స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్‌లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్‌కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్‌స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్‌లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్‌షాప్‌లలో హైలైట్‌గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్‌గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్‌గా మారింది. లైఫ్‌స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్‌టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్‌కట్, ఇన్స్టాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్‌తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్‌స్టైల్ ఈవెంట్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్‌ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
అడవి నుంచి ఐరాస వరకు...
‘సంస్కృతం పలకడానికి నీకు నోరు తిరగదు. నేర్చుకోవడం నీ వల్ల కాదు’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి మొద్దు బుర్రలకు లెక్కలు అర్థం కావు’ అన్నారు మ్యాథ్స్ టీచర్. బాగా చదువుకోవాలనే ఆశతో స్కూల్లోకి అడుగు పెట్టిన ఆదివాసీ అమ్మాయికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాలకు తన ప్రతిభతో జవాబు చెప్పింది. యూనివర్శిటీ వైస్–చాన్స్‌లర్ స్థాయికి ఎదిగింది జార్ఖండ్‌కు చెందిన సోనాజ్ హరియ మింజ్. తాజాగా యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో–చైర్‌పర్సన్‌గా నియామకం అయిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది...సోనాజ్ మింజ్‌కు బాగా చదువుకోవాలని కోరిక. అడవిలో ఉండేవాళ్లకు చదువు ఎందుకు! అనే వాళ్లు చాలామంది. ‘సంస్కృతం అనేది ఆర్యుల భాష. నీలాంటి వాళ్లకు ఎలా వస్తుంది!’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి వాళ్లకు లెక్కలు ఎలా వస్తాయి!’ అన్నారు మ్యాథ్స్ టీచర్.స్కూల్లో చేరిన కొత్తలో భాషాపరమైన సమస్యలను మింజ్ ఎదుర్కొంది. ఇంట్లో మాట్లాడే ఆదివాసీ భాష తప్ప మరే భాషా తనకు రాదు. అయితే మ్యాథ్స్ బాగా చేసేది.ఆదివాసీ అమ్మాయి అనే కారణంగా మింజ్‌ను చేర్చుకోవడానికి రాంచీలోని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిరాకరించింది.‘నన్నే ఎందుకు అవమానిస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. చాలా కాలానికి అర్థమైంది. నేను ఆదివాసీ అమ్మాయిని అనే కారణంగానే అవమానిస్తున్నారు అని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మింజ్. అయితే అవమానాలు ఆమె చదువుకు అడ్డుగోడలు కాలేకపోయాయి. బాగా చదువుకోవాలి అనే కసిని పెంచాయి.మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ తరువాత దిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో ఎంఫిల్ చేసింది మింజ్. భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో పనిచేసింది. కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన మింజ్ జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన వ్యాసాలు సమర్పించింది. జేఎన్‌యూలో ‘స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్’ డీన్‌గా, జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్స్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఎంత స్థాయికి ఎదిగినా తాను నడిచి వచ్చిన దారి మరవలేదు మింజ్. దళిత, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసింది. జేఎన్‌యూలో ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫీస్ (ఈవోవో) ప్రధాన సలహాదారుగా పనిచేసింది.జార్ఖండ్‌లోని ఎస్కేఎం యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆమె ప్రస్థానం మరోస్థాయికి చేరింది. వైస్ చాన్సలర్ హోదాలో ఆదివాసీ కళలు, భాష కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. తాజాగా... యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రిసెర్చ్. గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో– చైర్‌పర్సన్‌గా నియామకం అయింది. ‘నేను భవిష్యత్‌లో మ్యాథ్స్ టీచర్ అవుతాను’ అని స్కూల్ రోజుల్లో బలంగా అనుకునేది మింజ్. అయితే మింజ్ పడిన కష్టం, ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని పట్టుదల ఆమెను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడమే కాదు ఎంతోమంది ఆదివాసీ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.ఆ మాటను సవాలుగా తీసుకొని...స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు సింగిల్ మిస్టేక్ లేకుండా చేసేదాన్ని. ‘ఇది చాలదు. నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అన్నారు ఒక టీచర్. ఆమె మాటలను సవాలుగా తీసుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ నాతోనే ఉండిపోయింది. మొదట్లో వెటకారాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా స్కూల్ ఫస్ట్ రావడంతో ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చదువుతో పాటు ఆటలు అన్నా ఇష్టం. యూనివర్శిటీ లెవెల్లో హాకీ ఆడాను. అయితే చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆటలకు దూరం అయ్యాను.– సోనాజ్ హరియ మింజ్ -
భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ మలేషియాలోని ఒక భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఆశీర్వాదం నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అనుచితంగా తాకాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. దీంతో నెట్టింట ఎవరీమె అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ లిషల్లిని కనారన్ తెలుసుకుందామాం.లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేతగా నిలిచింది. ఆమె టీవీ నటి, మోడల్. మలేషియాలోని సెలంగోర్కు చెందిన లిషల్లిని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రెహమాన్ (UTAR)లో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాలేజీ విద్యార్థినిగా ఉన్నపుడే మిస్ గ్రాండ్ సెలంగోర్ 2020 టైటిల్ గెలుచుకుందిట. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత, లిషా పేదరికం , పిల్లల విద్య కోసం పనిచేయాలని భావించింది. అలాగే 2023లో విడుదలైన మలేషియా టీవీ సిరీస్ జీయుమ్ నీయుమ్లో కనిపించింది. స్థానిక ప్లాట్‌ఫామ్ ఆస్ట్రో విన్మీన్లో ప్రసారం అవుతున్న థిగిల్ అనే వెబ్ షోలో కనిపించింది. లిషల్లినికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారుపూజారిపై ఆమె ఆరోపణలు తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో, తాను పూర్తిగా పూజారిని నమ్మినట్టు పేర్కొంది. "నేను వీటన్నింటికీ కొత్త. ఆచారాల గురించి పెద్దగా తెలియదు తన వేధింపుల పర్వాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. "ఆ రోజు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూంకు పిలిచిన పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, రక్షణ దారం అంటూ నీటిని తనపై పోశాడని వెల్లడించింది. తనను బట్టలు విప్పమని చెప్పాడని, పైగా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నాఅన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించినందుకు పూజారి తనను దూషించాడని కూడా వెల్లడించింది. దీంతో తాను స్తంభించి పోయాననీ, ఏం జరుగుతుందో అర్థం కాలేదని వాపోయింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వెల్లడించింది. మరోవైపు నిందితుడు పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు
ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి, పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్‌లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...కృష్ణ దేవాలయం..ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్ బంగారు ఇసుక అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్ లేదా పారాసెయిలింగ్ జెట్ స్కీయింగ్ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్ ప్లేస్. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్ రాతి నిర్మాణాలు మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్‌హౌజ్‌లో నుంచి చూడాలంటే ఇక్కడి కౌప్ బీచ్ కి వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్‌హౌజ్ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్‌కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందే. దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్ నిర్మించిన కాయిన్ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి. -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్‌కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్‌లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్‌గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!
ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్‌లో కలుసుకుని మాట్లాడుకునే వారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఆ దంపతులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..) -
‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది. శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు. -
రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్‌కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్‌లో, కో–లివింగ్ ఫ్లాట్స్‌లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్ ఇలా.. హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్‌లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్‌ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్మెంట్ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్‌లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్‌లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్ జిమ్‌తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్ మెంబర్షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు. -
గాజర్ కె హల్వా కా దోశ... ఆహా... ఛీఛీ... క్షమించండి!
ఉత్తరాది, దక్షిణాది రుచులు ఒకచోట, ఒకే ఐటమ్‌లో కనిపిస్తే?ఆ ఐటమ్ పేరే... గాజర్ కే హల్వా కా దోశ.. Gajar Ke Halwa Ka Dosa!ఇండోర్‌కు చెందిన ఈ దోశలో అదనపు ఆకర్షణ క్యారట్ హల్వా, రబ్డీ (ఇదొక నార్డ్ ఇండియన్ స్వీట్. పాలను బాగా మరిగించి చేసేది). ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లోకంలో హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై మిక్స్డ్ రియాక్షన్స్ కనిపించాయి. కొందరు...‘ఆహా!’ అంటున్నారు. View this post on Instagram A post shared by Swaad Indore Da | Harshit Singh (@swaad_indore_da)అటు దక్షిణ భారతీయులకు ఎంతో ప్రియమైన దోశను, ఇటు ఉత్తర భారతీయులు మెచ్చే స్వీట్ క్యారెట్ హల్వాను రెండూ మిక్స్ చేయడంతో నెటిజనులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ వీడియోను స్వాద్ ఇండోర్ డా అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "గాజర్ కా హల్వా దోశ" అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఎక్కువ శాతం ప్రతికూలంగా స్పందించారు. కొందరు అయ్యో దేవుడా.. ఇదేమి వంటకం రా బాబూ అంటున్నారు. మరికొందరు ‘దేని ప్రత్యేకత దాంతే, రెండూ కలిపేస్తే ఎలా అని’ అంటూ నిట్టూరిస్తే, కొందరు...‘ఛీఛీ’ అంటున్నారు. "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" “ఇండోర్ ప్రజలందరి తరపున నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను.” "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" మరొకరు, “ఇది అల్పాహారమా లేక డెజర్టా? అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు
సాక్షి,ముంబై: శిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమైన రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా మందిరాన్ని వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపూర్ణిమతో ‘శ్రీ సాయిసచ్చరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండపారాయణం సమాప్తి అయిన సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంజు శెండే (సోనటక్కే) ‘పోతి’(ధాన్యపుసంచి)ని చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గోరక్ష గాడిల్కర్ వీణ, డిప్యూటీ ఈఓ భీమరాజ్ వరాడే, మెకానికల్ విభాగం ప్రముఖులు అతుల్ వాఘ్‌లు సాయిచిత్రపటం చేతబట్టుకుని ముందుకు నడిచారు. ఈ ఊరేగింపులో సంస్థాన్ పదాధికారులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై వివిధ భక్త మండళ్ల బృందాల ఆధ్వర్యంలో రోజంతా భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనల ఆలాపన కొనసాగింది. గురుస్థాన్‌లో నేడు రుద్రాభిషేకంగురుపౌర్ణమి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించ నున్నారు. ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపనున్నారు. ఆంధ్ర భద్రావతి పేట్ ఆలయానికి భక్తుల తాకిడి సోలాపూర్: గురుపూర్ణిమను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ మహారాజ్‌ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఆశ్రమాల్లో ధార్మిక, ఆధ్యాత్మికక కార్యక్రమాలు ప్రవచనాలు, సత్సంగాలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా దర్శనం కోసం ఆంధ్ర భద్రావతి పేట్‌లోని శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనంతోపాటు స్పెషల్ క్యూలైన్లలోనూ బారులు తీరారు. ఈ ఆలయంలో వారంరోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా బుధవారం ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాయినాథ రథ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సాయి దర్బార్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు దత్త నగర్, పద్మశాలీ చౌక్, జంకండి పూల్, జోడు బసవన్నచోక్, మార్కండేయ చౌక్, గుజ్జ నివాస్, వినాకర్ బాగ్, కన్నా చౌక్, రాజేంద్ర చౌక్ మార్గాల గుండా ఆంధ్ర బద్రావతి పేట్ వరకు కొనసాగింది. గణేశ్పురి ఆలయంలో గురుపూర్ణిమ పూజలు భివండీ: గురుపూర్ణిమ సందర్భంగా గణేశ్పురిలోని శ్రీ నిత్యానంద స్వామిని దర్శించు కునేందుకు భివండీ, ముంబై, కళ్యాణ్, ఠాణా, ముర్బాడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపూరి్ణమ సందర్భంగా గురువారం తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పి.ఈ. ఎం. హైసూ్కల్, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యానికేతన్ స్కూల్, వివేకానంద ఇంగ్లీశ్ మీడియం హైసూ్కల్, బాబా హైసూ్కల్ అండ్ జూనియర్ కాలేజీలోప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులతో తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు పాద సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల పద్మశాలి సమాజ్ కోశాధికారి అవదూత బలరాం బాలె శ్రీనివాస్, భైరి నిష్కమ్, గాజెంగి కృష్ణ, చిటికెన్ వెంకటేశ్, గాజెంగి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా విద్యానందగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజ, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నారాయణ, మహేశుని భూమేశ్, యెన్నం శ్రీనివాస్, చెక్కరకోట మనోహర్, వేమున ఆనంద్, బాలె సత్యనారాయణతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సాయిబాబాకు బంగారు కిరీటం, వెండి హారం సమర్పించారు. 566 గ్రాముల బరువున్న రూ.59 లక్షల విలువైన బంగారు కిరీటం, 54 గ్రాముల బరువున్న బంగారు పువ్వులు, 2 కిలోల బరువున్న వెండి హారం ఇందులో ఉన్నాయి.గురుపూర్ణిమను పురస్కరించుకుని చెన్నైకి చెందిన లలితా మురళీధరన్, కె. మురళీధరన్ దంపతులు బాబాకు రూ. 3.05 లక్షల విలువైన బ్రూచ్ సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేశారు. -
అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్‌గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్‌గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్‌గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.మన దేశంలో 65–70 శాతం స్కూల్స్‌లో సరిౖయెన ప్లేగ్రౌండ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్లు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...) -
మేని సంరక్షణ కోసం..బెల్లంతో ఇలా..!
వంటింట్లో ఉపయోగించే వాటితో ముఖానికి సంబంధించిన సమస్యలను సులభంగా మటు మాయం చేసే టెక్నిక్‌లు, చిట్కాలు చూశాం. కానీ ఆరోగ్యానికి మంచిదని చెప్పే బెల్లం చర్మ సంరక్షణకు తోడ్పడుతుందని విన్నారా..?. ఔను బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించనియ్యదు.చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాలటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి.ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. (చదవండి: అద్దమంటి ఆకృతి..! ర్యాంప్ పై రిఫ్లెక్షన్..) -
అద్దమంటి ఆకృతి..!
ముఖాన్ని మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసాన్నీ చూపుతుంది అద్దం.అద్దం లాంటి ఆకృతి కాదు, ఆకృతే అద్దంగా మారుతోంది.అద్దాన్ని ఫ్యాబ్రిక్‌కి జత చేసి, ధరించడం ఎవర్‌గ్రీన్‌గా పేరొందిన స్టైల్. వాటిలో .. అసిమెట్రిక్ మిర్రర్ స్టైల్ నేడు ఫ్యాషన్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అద్దం కేవలం స్టైల్ కాదు ఒక స్టేట్మెంట్. ర్యాంప్ పై రిఫ్లెక్షన్ప్రముఖ డిజైనర్లు గౌరవ్ గుప్తా, వ్యాన్ హెర్పెన్ వంటి వారు మిర్రర్ వర్క్ డిజైన్స్‌తో తమ హవా కొనసాగించారు. గాలా, కాన్స్ రెడ్ కార్పెట్లలోనూ సెలబ్రిటీలు మిర్రర్ షైనింగ్ గౌన్స్‌లో మెరుస్తున్నారు. స్ట్రీట్ స్టైల్ఈ ట్రెండ్ ఫ్యాషనబుల్‌గా కనిపించడానికే కాదు, జీన్స్ టాప్స్ లో అసిమెట్రిక్ హేమ్ లైన్, మిర్రర్ బెల్ట్స్, శాలువాలు, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఫుట్‌వేర్ .. ఇలా అన్ని యాక్సెసరీస్ లో ఈ బిగ్ మిర్రర్ టచ్ కనిపిస్తోంది.అద్దం, డిజైన్‌తో డ్రెస్ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి ఇతర హంగులేవీ అక్కర్లేదు. మదిని మరింత మెరుపుగా సింగారించడానికి అద్దం వర్క్ కొత్తగా రూపుకడుతుంది. పర్ఫెక్ట్ షేప్‌తో డ్రెస్ అందంగా కనిపిస్తుంది అనేది ఒక కోణం మాత్రమే. నిజమైన ఫ్యాషన్ అనేది మిర్రర్ డిజైన్స్‌లోనూ ఉంటుంది. అసిమెట్రికల్ బ్యూటీని అర్థం చేసుకునే వారికి ఇది ఓ వేడుక కూడా. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంగీత్ వర్మ్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్‌లో మేటిగా నిలిచారు. రెడ్ కార్పెట్, వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఈ మిర్రర్ డ్రెస్సులు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: Prajakta Koli : అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..) -
ఆరుబయట ఆట కంటిపాపలకు మేలు
ధరణికి ఎనిమిదేళ్లు. ఈమధ్య బోర్డు మీద రాసింది స్పష్టంగా కనిపించడం లేదని తరచు చెబుతోంది. అమ్మాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కళ్లు కూడా మెరుస్తున్నట్టుగా మిలమిలలాడుతూ ఉంటాయి. మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు కానీ పదే పదే చెబుతుండటంతో కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షలన్నీ చేసిన డాక్టర్ గారు... ధరణి మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్)తో బాధపడుతోందనీ, ఈ సమస్య ఉన్నవారిలో కేవలం చాలా దగ్గరివే కనిపిస్తాయనీ, దూరం ఉన్నవి స్పష్టంగా కనిపించవనీ, దాంతో స్కూల్లో బ్లాక్‌బోర్డుపై ఉన్న రాతలు స్పష్టంగా కనిపించడం లేదంటూ చెప్పారు. అంతే... ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది.ఇది కేవలం ఒక్క కేస్ స్టడీ మాత్రమే. ధరణి లాంటి అమ్మాయిలూ, అబ్బాయిలూ దేశవ్యాప్తంగా ఎందరో! స్కూలుకెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఈ కంప్లైంట్‌తో రావడం... వాళ్లలో ఈ సమస్య బయటపడటం చాలా సాధారణం. ఈ సమస్యకు కారణం మొదటిది వంశపారంపర్యంగా మయోపియా ఉన్న కుటుంబాల్లో ఈ సమస్య రావడం చాలా సాధారణమైతే.... రెండో కారణం పిల్లలు ఎప్పుడూ ఆరుబయట ఆడకుండా ఇన్–డోర్స్‌లోనే ఎక్కువగా గడపడం. ఆరుబయట ఆడుకునే పిల్లల్లో తక్కువే... నిజానికి ధరణినే కాదు... ఆ వయసు చిన్నారులు ఇప్పుడు ఆరుబయట ఆటలాడటం చాలా తక్కువ. గతంలో ఆ వయసు పిల్లలు ఆరుబయట విస్తృతంగా ఆడుతుండేవాళ్లు. ‘‘ఆడింది చాలు. ఇక లోపలికి రండి. కాళ్లూ చేతులు కడుక్కుని ఏదైనా కాస్తంత తిని చదువుకోండి’’ అంటూ అమ్మలో లేదా ఇంట్లోని పెద్దవాళ్లో కోప్పడుతుండటం మామూలే. దాదాపు నాలుగైదు దశాబ్దాల కంటే ముందు పిల్లలు ఇలా మట్టిలో ఆడుకుంటూ ఉండేవారు. కారణమేమిటో ... ఎందుకో కూడా తెలియదు గానీ ఇలా ఆరుబయట బాగా ఆటలాడుకునే పిల్లల్లో దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించని ‘షార్ట్‌సైటెడ్‌నెస్’ అని పిలిచే మయోపియా చాలా తక్కువ. బయట ఆటలాడకుండా ఇలా ఎక్కువసేపు ఇన్–డోర్స్‌లోనే ఉండే పిల్లలకూ ఇలా మయోపియా ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో పెద్దగా తెలియదు.సరిదిద్దడమిలా... మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్) అనేది రిఫ్రాక్టివ్ సమస్య. అంటే కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా కనుగుడ్డులో కాస్తంత లోపలే కేంద్రీకృతం కావడంతో ఈ సమస్య వస్తుంది. కంటి అద్దాలతో చాలా సులువుగా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. కంటి అద్దాలను అంతగా ఇష్టపడనివాళ్లు కాంటాక్ట్ లెన్స్ కూడా ధరించవచ్చు... గానీ వాటిని సంరక్షించుకోవడం మళ్లీ ప్లెయిన్ కళ్లజోడు వాడటం మంచిది. ఇక ఒక వయసు వచ్చాక కళ్లజోడు ధరించడం అంతగా ఇష్టపడకపోతే... పద్ధెనిమిదేళ్లు దాటాక ‘లేసిక్’ అనే శస్త్రచికిత్స (రిఫ్రాక్టివ్ సర్జరీ) ద్వారా కూడా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పిల్లలు స్కూల్లో బోర్డుగానీ లేదా తమ స్కూలు బస్సు తాలూకు బోర్డుగానీ లేదంటే దూరపు వస్తువులుగానీ స్పష్టంగా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు తప్పక వెంటనే స్పందించాలి. మరీ ఆలస్యం చేసిన పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుండటంతో పాటు అరుదుగానైనా మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశాలుంటాయి. పిల్లలు స్క్రీన్ చూసే సమయం తగ్గించండి...ఇవాళ టీవీ లేని ఇల్లంటూ లేదు. అంతేకాదు... కంప్యూటరూ, ల్యాప్‌టాప్ వంటివి లేని ఇళ్లు కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇక మొబైల్ అయితే పిల్లలకూ లేకుండా ఉండటం లేదు. టీవీ, కంప్యూటరూ, మొబైల్... ఇలా అది ఏ స్క్రీన్ అయినప్పటికీ దాన్నుంచి వెలువడే కాంతితో చిన్నారుల కళ్లను కాపాడుకోవడం ఎలాగో చూద్దాం. → పిల్లలు టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను చూసే వ్యవధిని తల్లిదండ్రులు విధిగా తగ్గించాలి. అంటే రోజూ కొద్దిసేపు మాత్రమే వాళ్లను టీవీ, కంప్యూటర్, మొబైల్‌లను చూడనివ్వాలి. → మొబైల్ లేదా కంప్యూటర్ కాంతి అదేపనిగా కంటిని తగులుతూ ఉండకూడదు. కాసేపు స్క్రీన్ చూశాక కనీసం కొద్ది నిమిషాల పాటు కంటికి రెస్ట్ ఇవ్వాలి. → గదిలో చీకటిగా ఉన్నప్పుడు టీవీ వెలుతురులో లేదా కంప్యూటర్ వెలుతురులో పిల్లలు చదవడానికి ప్రయత్నించకూడదు. → టీవీ లేదా కంప్యూటర్ను మసక చీకట్లో చూడటం సరికాదు. అవి ఆన్‌లో ఉన్నప్పుడు గదిలో లైట్ వెలుగుతూ ఉండాలి. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు కంప్యూటర్/మొబైల్ స్క్రీన్ నుంచి లేదా టీవీ నుంచి వెలువడే కాంతి కంటికి హాని చేసే అవకాశం ఎక్కువ. – యాసీన్ -
మెట్రోలో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా?
ప్రస్తుత తరుణంలో మొబైల్ వినియోగం పెరిగిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, ముఖ్యంగా రీల్స్ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేకన్నా దేహంలో ఒక భాగంగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. అయితే ఈ డిజిటల్ కల్చర్ ఇప్పుడు ప్రైవేటు స్పేస్ నుంచి బహిరంగ ప్రదేశాల్లోనూ విస్తరిస్తూ, ఇతరులకు అసౌకర్యం కలిగించే స్థితికి చేరింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ వంటి షార్ట్ వీడియోలు చూస్తూ ప్రజలు అందులో మునిగిపోతున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయంగా అనిపించినా, పబ్లిక్ ప్రదేశాల్లో హెడ్సెట్ లేకుండా పెద్ద సౌండ్‌తో వీడియోలు చూడటం వల్ల అది చుట్టుపక్కల వారికి న్యూసెన్స్‌గా మారుతోంది. వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఈ నిర్లక్ష్యం మానసిక, సామాజిక ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోటెక్నాలజీ అనేది మనకు ఓ వరం. కానీ దాని వాడకంలో బాధ్యత లేకపోతే అదే వరం నాశనానికి దారి తీస్తుంది. మొబైల్ మన జీవితంలో భాగం కావొచ్చు కానీ అది ఇతరుల జీవన శైలిని దెబ్బతీయకుండా ఉండాలంటే మనకు ఒక పరిమితి, పరిపక్వత, పరివర్తన అవసరం. మొబైల్ వినియోగంలో మైండ్‌ఫుల్‌నెస్ (mindfulness) కలిగి ఉండటం కాలానుగుణంగా మారిన అవసరం. అంతే కాదు, అది మనిషిగా మన విలువల్ని చూపించే మోడరన్ మెచ్యూరిటీ కూడా. తోటివారి మనస్థితిని పట్టించుకోకుండా వారి అశాంతికి కారణమవ్వడం నిర్లక్ష్యమే కాదు.. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే.మెట్రోలో మొబైల్ మ్యూజిక్ షో! ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. వర్కింగ్ క్లాస్, విద్యార్థులు, వృద్ధులు ప్రయాణించే మెట్రోలో కొంతమంది యువత రీల్స్ చేస్తూ చుట్టుపక్కల వారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి నుంచి అలసిపోయిన ప్రయాణికులు విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న వారు పెద్దగా ఫోన్ సౌండ్‌తో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల వారి మానసిక ప్రశాంతత దెబ్బతింటోంది. సింపుల్‌గా ఒక హియర్‌ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే సరిపోతుంది అనే పరివర్తన అవసరం. హెడ్సెట్ (headset) పెట్టుకున్నవారితో మరో సమస్య.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మెట్రో డోర్‌కు అడ్డంగా నిలబడటం, దారి మధ్యలో ఎటూ పోకుండా ఇబ్బంది కలిగించడం వంటి సమస్యలు సృష్టిస్తున్నారు.పరిష్కార మార్గాలు.. అవగాహన కార్యక్రమాలు: ప్రభుత్వం, టెక్ కంపెనీలు, మున్సిపాలిటీలు కలిసి ‘మైండ్‌ఫుల్ మొబైల్ యూజ్’ గురించి అవగాహన పెంచాలి. సైలెంట్ జోన్లు: మెట్రోల్లో, హాస్పిటల్స్‌లో, దేవాలయాల్లో మొబైల్ సైలెన్స్ జోన్లను స్పష్టంగా సూచిస్తూ బోర్డులు పెట్టాలి. యాప్స్‌తో నియంత్రణ: కొంతమంది యూజర్లు తమ మొబైల్ యూజ్ను ట్రాక్ చేసి నియంత్రించడానికి ‘స్క్రీన్ టైమ్’, ‘ఫోకస్ మోడ్’ వంటి ఫీచర్లను వినియోగించవచ్చు. స్వీయ నియంత్రణ: అన్నింటికన్నా ప్రధానమైంది స్వీయ నియంత్రణ.. ప్రతి ఒక్కరూ తమ వినియోగాన్ని బాధ్యతగా మలుచుకోవాలి. అది మన సమాజానికి, తనకు తాను ఇచ్చే గౌరవం కూడా.ప్రభావాలు.. మానసిక అసౌకర్యం: నిర్లక్ష్యంగా వినిపించే సౌండ్లు ఇతరులను డిస్టర్బ్ చేస్తాయి. ఇది ప్రత్యేకించి చదువుకునే విద్యార్థులు, శారీరకంగా అలసిపోయిన ఉద్యోగులు, మానసికంగా టెన్షన్లో ఉన్నవారికి తీవ్రంగా నష్టాన్ని, విరక్తిని కలిగిస్తుంది.పరిసరాల పట్ల బాధ్యత కోల్పోవడం: దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో, థియేటర్లలో మానవీయ బాధ్యత లేకుండా మొబైల్ వాడకం వల్ల సామాజిక విలువలు మసకబారుతున్నాయి.సామాజిక దూరం: ఒకే ప్రదేశంలో ఉన్నా, తన ఫోన్లో మునిగిపోయే వ్యక్తి చుట్టూ ఉన్నవారితో కనెక్షన్ కోల్పోతాడు. దీని వల్ల సంబంధాలు బలహీనపడతాయి.ఈ నిర్లక్ష్యపు కల్చర్‌కి కారణాలు స్వీయ నియంత్రణ లోపం: వ్యక్తిగత ప్రపంచం నుంచి పబ్లిక్ స్పేస్‌లోకి వస్తున్నామంటే కొన్ని నైతిక విలువలు ఉంటాయనే స్పృహ కలిగి ఉండాలి. మన నిర్లక్ష్యం ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించినా వ్యక్తిగా విలువ కోల్పోవడమే. డిజిటల్ డోపమైన్: రీల్స్, షార్ట్ ఫార్మ్ కంటెంట్ మానసికంగా వినోదం కలిగించడంతో పాటు డోపమైన్ (dopamine) విడుదలకు కారణమవుతుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు స్క్రీన్‌కి ఆకర్షితులవుతారు. ఎంత సమయం వారు అందులో మునిగిపోయారో వారికే తెలీదు. అలాంటిది ఇతరుల ఇబ్బందులను ఎలా గుర్తించగలుగుతారు. నివేదికలు లేకపోవడం: పబ్లిక్ ప్లేస్‌లలో మొబైల్ వినియోగంపై కచ్చితమైన నియమాలు లేకపోవడం కూడా ఈ అలవాట్లను పెంచుతోంది. సామాజిక అవగాహన లోపం: ఇతరుల మనస్థితిని అర్థం చేసుకోకుండానే వ్యక్తిగత వినోదం కోసం మిగతావారిని అసౌకర్యానికి గురిచేస్తున్నారు.చదవండి: కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా? పబ్లిక్ స్పేస్‌లోనూ.. హాస్పిటల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలు, పార్కులు, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్.. ఇవన్నీ ప్రజలకు ఆరోగ్యం, మానసిక విశ్రాంతి, భక్తి, ఆనందం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగపడే ప్రదేశాలు. కానీ ఇక్కడ సైతం మొబైల్ స్క్రీన్ కల్చర్ తలెత్తుతోంది. రెస్టారెంట్లో ఆర్డర్ వచ్చే వరకు ఫోన్ స్క్రోల్ చేయడం, ఆలయంలో మంత్రాల మధ్యలో రింగ్టోన్లు వినిపించడం, మరీ ముఖ్యంగా హాస్పిటల్ వార్డుల్లో రీల్స్ ప్లే అవడం వంటి ఘటనలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. Full volume Tollywood beats? Not in the Metro!Idi public space mama, not your personal DJ zone.Fellow passenger's glare said it all – "Headphones pettukora babu!"🎧 Got your headphones ready for the next ride?Tell us, what’s on your Metro playlist? Drop it in the comments!… pic.twitter.com/K6wr8ath2U— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 3, 2025 -
అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..
యూట్యూబ్ నుంచి నటిగా మారిన ప్రజక్తా కోలి మోస్ట్లీ సేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో దేశంలోనే తొలి మహిళా కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా పేరుతెచ్చుకుంది. రోజువారీ జీవితంలోని పరిస్థితుల గురించి మంచి టైమింగ్ కామెడీ వీడియోలతో యువతను ఆకర్షించింది. అంతేగాదు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మిస్మాచ్డ్ లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. దాంతోపాటు జగ్ జగ్ జీయో" చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌లో చోటు దక్కించుకుంది. ఇలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంటెంట్ క్రియేటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో జిమ్మీ డోనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), ఖబానే లేమ్, కై సెనాట్, మెల్ రాబిన్స్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ మేరకు ఈ ప్రజక్తా కోలి తన ఆనందాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. ఈ అత్యున్నత గౌరవం లభించినందుకు ముందుగా ప్రేక్షకులకు, నా కుటుంబ సభ్యులకు ధన్యావాదాలు. ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం కథల పట్ల ఉన్న అవగాహనతో సంపాదించుకున్న స్టార్ డమ్ ఇది. మీ అందరి సహకారం వల్ల ఇదంతా సాధించానని పోస్ట్‌లో రాసుకొచ్చింది.కెరీర్ మొదలైంది ఇలా..పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. ఆర్జేగా ఆమె చేసిన హృతిక్ రోషన్ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అదివిన్న ‘వన్ డిజిటల్’ యూట్యూబర్ సుదీప్ ఆమెను యూట్యూబ్ చానెల్ పెట్టమని ప్రోత్సహించాడు. అలా 2015లో ‘మోస్ట్లీ సేన్’ను లాంచ్ చేసింది. ‘10 హిలేరియస్ వర్డ్స్ దట్ డిల్లీ పీపుల్ యూజ్’ అనే వీడియోతో ఆ చానెల్ క్లిక్ అయింది. యూట్యూబ్ చానెల్స్ తొలినాళ్లలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్ అనే పేరు సంపాదించుకుంది. సాధించింది. సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్ నేషన్స్ వరకు చేరింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్ స్క్రీన్ చేసింది. ప్రజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. అంతేగాదు న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అలాగే యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె కేవలం తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది.ఇటీవలే యూట్యూబ్ ‘గ్లోబల్ ఇనిషీయేటివ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్’కి ఇండియన్ అంబాసిడర్‌గా ఎన్నికైంది కూడా. ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్‌కు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రజక్తకు చలనచిత్ర, వెబ్పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో పరీక్షించుకుంది. సూపర్ హిట్ అయిందిఈ ఏడాద ప్రారంభంలో, ఆమె తన తొలి నవల టూ గుడ్ టు బి ట్రూ విడుదలతో కథకురాలిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఇక ప్రజక్తా కోలి ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ, జీక్యూ ఇండియా అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితా 2025 వంటి వాటిల్లో కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...) -
డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...
మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ని త్వరగా చదివేయండి మరీ..మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్‌ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్‌గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు. (చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..) -
ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్‌ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..!
విద్యకు బ్రేక్ అనేది ఉండదు. చదవాలన్నా కోరిక బలంగా ఉంటే చాలు వయసు పెద్ద మేటర్ కాదని గతంలో చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్లంతా ఏవో కారణాలతో చదువుకోలేకపోతే..ఆయా కోర్సులను పూర్తి చేసి తమ డ్రిమ్‌ని నిజం చేసుకున్నారు. ఈ తాతయ్య అలాకాదు ఏకంగా అత్యంత కఠినతరమైన సీఏని 71 ఏళ్ల వయసులో పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అదికూడా మనవరాలి కారణంగా ఈ ఘనత సాధించాడు ఈ తాతయ్య. స్ఫూర్తిదాయకమైన అతడి స్టోరి ఏంటో చూద్దామా..!.ఆయనే తారా చంద్ అగర్వాల్. ఆ తాతయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (SBBJ) మాజీ ఉద్యోగి. రిటైర్డ్ వయసులో అందరిలో రెస్ట్ తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలు రాయాలనుకోవడం విశేషం. ఆ వయసులో ఏ పుణ్య క్షేత్రాలు, లేదా మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆ విశ్రాంతి సమయంలో తన డ్రీమ్ నెరవేర్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు. నిజానికి ఆయన ఈ ఎగ్జామ్ రాయడానికి కారణం తన మనవరాలేనట. ఆమె సీఏ చదువు కోసం సహాయం చేసేవారట. ఆమెకు అకౌంట్స్‌పై ఉండే సందేహాలను తీరుస్తూ..తెలియకుండానే ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగిందట. అలా ఆ జిజ్ఞాస కాస్తా విద్యా వృత్తిగా మారి చివరకు సీఏ పరిక్షలకు ప్రిపేరవ్వాలనే సంకల్పానికి దారితీసింది. ఆ విధంగా ఆయన సీఏ అయ్యాడు. ఈ ఏడాది జులై6న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో తారా చంద్ వజయవంతం గాపూర్తి చేసి..అందరిని ఆశ్చర్యపరిచాడు. పైగా యువతకు ఆదర్శంగా నిలిచారాయన. చార్టర్డ్ అకౌంటెంట్ నిఖిలేష్ కటారియా స్ఫూర్తిదాయకమైన కథను లింక్డ్ఇన్లో పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది సీఏలో మొత్తం 14,247 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. (చదవండి: డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!) -
అన్ని స్థితులనూ ఆస్వాదించగలగాలి
జీవితం విభిన్న స్థితుల సంగమం. ఇక్కడ సుఖమూ ఉంది, దుఃఖమూ ఉంది. సంతోషమూ ఉంది, బాధా ఉంది. ఆనందమూ ఉంది, విచారమూ ఉంది. తీపీ ఉంది, చేదూ ఉంది. శీతలమూ ఉంది, ఉష్ణమూ ఉంది. సంతృప్తీ అసంతృప్తీ రెండూ ఉన్నాయి. శాంతి, అశాంతీ కూడా ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం, దేవుని ఆదేశానుసారం, ఆయన నిర్ణయం మేరకే.అందుకని మానవులు కష్టాలొచ్చినప్పుడు కుంగి΄ోకూడదు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. ధైర్యంతో స్వాగతం పలకాలి. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి.ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగి΄ోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే ఇదంతా తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసం హృదయంలో జనించాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రవచనం ఇలా ఉంది: ‘ఎవరైతే ధన, ప్రాణ నష్టాల్లో కూరుకు΄ోయి, ఆ విషయం ఎవరి ముందూ బహిర్గతం చేయకుండా, ప్రజలతో ఫిర్యాదు చేయకుండా ఉంటాడో అతణ్ణి క్షమించడం అల్లాహ్ బాధ్యత.’అల్లాహ్ ఇలా అంటున్నాడు: ‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని ΄పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గంకన్నా తక్కువైనదాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటిద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ్ర΄ాప్తమైనప్పుడు అల్లాహ్‌కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే దాస్య ఔన్నత్యానికి ప్రతిరూపంగా అనన్యసామాన్యమైన సహనం వహించాలి. హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. స్వర్గసీమను అనుగ్రహిస్తాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! -
సార్థక జీవితం -మరణంతోనే వెలుగు
అల్ప పదాలలో అనంతార్ధాన్ని చూపే ప్రసంగ కళా శాస్త్ర పండితుడిగా, ధర్మశాస్త్ర నిపుణుడిగా పేరొందిన అపోస్తలు డైనపాలు క్రీస్తు మరణాన్ని చూసే విధానం అద్భుతమనే చెప్పాలి.‘నా సువార్త ప్రకారంగా’ అంటూ పౌలు మహాశయుడు దేవుని సంకల్ప ప్రకారమైన క్రీస్తు సత్యసువార్తను కుదించి కేవలం మూడే మూడు పదాలతో సువార్తను నిర్వచించాడు. క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అంటూ సువార్తను వివరించాడు. ఇదే క్రీస్తు సువార్తను మరల మరింతగా క్లుప్తంగా చేసేస్తూ విషయ సారం ఇదే అనేంత తేటగా అసలును తేల్చేస్తూ అది హుందాగా మన ముందు పెడతాడు. క్రీస్తు మరణమే సువార్త’అంటూ ఒకే ఒక్క మాటతో ఇలా సులభం చేసేశాడు. అయితే క్రీస్తు సువార్త ఎప్పుడూ దేవుని సంకల్పంతో ముడిపడి ఉంటుంది. సువార్తను దేవుని సంకల్పంతో ఎన్నడూ వేరుచేసి చూడలేము. పౌలు క్రీస్తు మరణాన్నే సువార్తగా అదే తన జీవిత పరమావధిగా, గమ్యంగా చేసుకొని జీవితాంతం ఈ ఒక్క అతిశయంతోనే సువార్తను అంతటా ప్రకటించాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటాడు ఒకసారి. క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయండి అంటూ సంఘానికి పిలుపునిస్తూ అజ్ఞాపిస్తాడు ఇంకొకసారి. ఔను, నిజానికి క్రీస్తు మరణమే సువార్త.అయితే సమాధి, పునరుత్థానాలు అను రెండు అంశాలు కూడా సువార్తను బలపరచేవే. ఎలాగంటే, మరణించిన క్రీస్తును సమాధి చేశారు. అలాకాకుండా ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏ వైద్యశాలకో ఆయన్ను తరలించేవారు. అలా జరుగలేదు. రోమా ప్రభుత్వం ఆయన మరణించాడు అన్నది నిర్ధారణ చేసుకొనే ఆయన పార్థివ దేహాన్ని సంబంధిత వ్యక్తులు, శిష్యులకు అప్పగించింది. ఇక పునరుజ్జీవం విషయానికి వస్తే, క్రీస్తు మరణం నుండి తిరిగి లేవక΄ోతే క్రైస్త్తవులకు మనుగడే అనగా నిరీక్షణే లేదని పౌలే బలంగా నొక్కి వక్కాణిస్తుంటాడు. అయినా సరే, పౌలు దృష్టి కోణంలో క్రీస్తు మరణమే సువార్త. సువార్త అంటే క్రీస్తు మరణం... క్రీస్తు మరణమే సువార్త అన్నంతగా ΄పౌలు జీవితంతో క్రీస్తు సువార్త ముడిపడి పెనవేసుకొంది.మరో విధంగా చూస్తే, ఒక వ్యక్తి సమాధి చేయబడ్డాడు అంటే మరణించాడు అనేకదా అర్థం. మరణించిన వారే సమాధి చేయబడతారు. అదేవిధంగా మరణించాడు అనంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒకచోట పుట్టాడు అనే కదా దీనర్థం. కాబట్టి ఈ కోణంలోనూ మరణమే సువార్త అయ్యింది. మరణంతోనే వెలుగు చేతల పరమైన సత్క్రియలు, వీరోచిత కార్యాలు, ధైర్య సాహసాలు మాట్లాడినంత గట్టిగా ఏవీ మాట్లాడలేవు. ఒక సైనికుడు తన వీర మరణంతోనే వెలుగులోకి వస్తాడు. కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఇక అప్పటి నుండే అతని పుట్టుక, పేరు, ఊరు, తల్లిదండ్రులు, అతడు చదివిన ΄ాఠశాల, సంబంధిత ఇతర విద్యా సంస్థలు, అతనికి చదువు చెప్పిన గురువులు, అతని సన్నిహిత స్నేహితులు, బంధు మిత్రులు అంతా మీడియా కెక్కుతారు. దేశానికి అతని త్యాగపూరిత మరణం చేసిన గొప్ప మేలునే ఎప్పుడూ మరువక దేశ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటిదే, ఇంతకు మించినదే క్రీస్తు మరణం. – జేతమ్ -
డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!
ఫోన్ లేదు, ల్యాప్‌టాప్ లేదు, గాడ్జెట్లు లేవు.. ప్రశాంతతను ఆస్వాదిస్తూ కామ్‌గా తోచిన పని చేసుకుంటూ.. తలచుకుంటేనే ఓహ్ అనిపిస్తోంది కదా.. ప్రస్తుతం నగరంలో కొందరు అనుసరిస్తున్న మార్గం ఇదే.. డిజిటల్ డిటాక్స్. ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్యమైన భాగం అయినప్పుడు నడిపించే అవయవాల్లో ఒకటిగా మారిపోయినప్పుడు.. డిజిటల్ డిటాక్స్ ఖచ్చితంగా చాలా కష్టమైన పని అనేది నిస్సందేహం. అయితే అది అందించే ప్రయోజనాలు ఇతర మార్గాల ద్వారా అసాధ్యం అనేది కూడా నిర్వివాదమే. ‘గాడ్జెట్లు, స్క్రీన్స్ లేదా ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్ణిత సమయం వరకు ఉపయోగించకుండా ఉండటమే.. డిజిటల్ డిటాక్స్’ అని గేట్‌వే ఆఫ్ హీలింగ్ వ్యవస్థాపకులు, మానసిక వైద్యులు డాక్టర్ చాందిని నిర్వచిస్తారు. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, రీసెట్ చేయడానికి మధ్యన సాగే ఒక సంక్లిష్టమైన అభ్యాసం. సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియా ఇమెయిల్స్ నుంచి డిస్కనెక్ట్, అలాగే ఆఫ్‌లైన్ ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఉద్ధేశించింది అంటున్నారామె. అధిక డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే మానసిక అలసటను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రయోజనాలెన్నో.. శారీరక, మానసిక ఆరోగ్యంపై డిజిటల్ డిటాక్స్ సానుకూల ప్రభావాలను చూపుతుందంటున్న క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ దినిక ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఆన్లైన్లో ఎంత సమయం గడుపుతున్నారనే దానిపై ఆధారపడి డిజిటల్ డిటాక్స్ నిర్దిష్ట ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు’ అంటున్నారు. అయితే డిజిటల్ డిటాక్స్ మనకు చాలా సమయాన్ని తిరిగి ఇస్తుంది. నిర్ణిత వ్యవధిలో సమాచారం నోటిఫికేషన్స్ సహా డిజిటల్ దాడి నుంచి రక్షిస్తుంది’ అంటారామె. డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ మనస్తత్వవేత్త కౌన్సిలర్ డాక్టర్ షీనా సూద్ ఇలా వివరిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ సాధ్యమేనా? ‘స్టోర్లలో ఫోన్లతో చెల్లింపులు, ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్లతో పనిపాటలు, యాప్‌ల ద్వారా సంప్రదింపులు.. కోవిడ్ తర్వాత సమూలమైన జీవిత–సాంకేతికత కనెక్షన్ ఏర్పడింది. సాంకేతికతపై పూర్తిగా ఆధారపడే నేటి ప్రపంచంలో, డిజిటల్ డిటాక్స్ హడావుడిగా ప్రారంభిస్తే గందరగోళం ఏర్పడవచ్చు. సో, చిన్నగా ప్రారంభించవచ్చు. ముందస్తుగా ఒక వారం కాకపోయినా, ఒక రోజుతోనైనా మొదలు పెట్టవచ్చు అంటున్నారు సైకాలజిస్ట్‌లు. ‘డిటాక్స్’ సక్సెస్ కావాలంటే.. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు సహా సంప్రదించాల్సిన వారందరికీ నిర్ణయాన్ని తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ సంప్రదింపు మార్గాల్ని సిద్ధం చేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్ లేదా యాక్సెస్ అవసరమయ్యే వ్యాపార లేదా వ్యక్తిగత విధులు ఉంటే, వేరొకరికి కేటాయించడం లేదా డిటాక్స్ తర్వాత రోజులకి వాయిదా వేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్‌కు అందుబాటులోకి వచ్చే సమయం గురించి తెలిపే ఆటోమేటిక్ ఇమెయిల్ వాయిస్‌మెయిల్ ప్రత్యుత్తరాలను సెటప్ చేయాలి. డిజిటల్ గాడ్జెట్ల వైపు ప్రలోభాలను నివారించడానికి, ఆసక్తికరమైన ఆఫ్‌లైన్ కార్యకలాపాలు, అభిరుచులు, విహారయాత్రలను ప్లాన్ చేసుకోవాలి. ఉచిత వైఫై ఉన్న కేఫ్‌లు లేదా టీవీ స్క్రీన్లతో కూడిన పబ్లిక్ ప్రాంతాలు వంటి డిజిటల్ వైపు నడిపించే ప్రదేశాలు లేదా పరిస్థితులను నివారించాలి. ప్రోత్సహించడానికి ఉత్సాహంగా ఉంచడానికి స్వల్ప వ్యవధుల్లో డీటాక్స్‌కు సంబంధించి సక్సెస్ పారీ్టలను జరుపుకోవచ్చు. కొత్త విశేషాలను కోల్పోతామనే భయంతో ఫోన్లకు అతుక్కుపోవడం ఆహారం, వ్యాయామం, నిద్ర షెడ్యూల్‌పై ప్రభావం చూపుతోంది. డిజిటల్ డిటాక్స్ ఆరోగ్యకరమైన అలవాట్లను పునరుద్ధరిస్తుంది. గాడ్జెట్లు విడుదల చేసే రివార్డ్ హార్మోన్ డోపమైన్ మంచి అనుభూతిని ఇవ్వడంతో దాన్ని పదేపదే కోరుకుంటాం. అయితే ప్రతి స్క్రోల్ మన మెదడులోని అదే ప్రాంతాలలో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి హానికరమైన పదార్థాలకు ప్రతిస్పందిస్తాయి. డిజిటల్ డిటాక్స్ మనం ఈ వ్యసనం వలలో పడకుండా సహాయపడుతుంది.అవాంఛనీయ ప్రమాణాలను నిర్ణయించుకోడానికి, అనారోగ్యకరమైన ఎక్స్పోజర్లకు దారి తీసే సోషల్ మీడియాతో తెగతెంపులు మన స్వీయ– ఇమేజ్ను పునరుద్ధరించడానికి, నిజమైన స్వభావాన్ని అంగీకరించడానికి మనకు అవకాశం లభిస్తుంది. డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలి కాంతి శరీరపు సాధారణ నిద్ర–మేల్కొలుపు చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. నిద్ర నాణ్యత కోల్పోయేలా చేస్తుంది. డిజిటల్ డిటాక్స్‌తో ప్రశాంతమైన నిద్ర సాధ్యం. గార్డెనింగ్, బుక్ రీడింగ్.. వంటి ఆరోగ్యకర అభిరుచులను తిరిగి తెస్తుంది. (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
‘వత్సల’ ఇక లేదు : కన్నీటి సంద్రంలో వన్య ప్రేమికులు, సీఎం సంతాపం
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల ఇకలేదు. 100 సంవత్సరాలకు జీవించిన ఆడ ఏనుడు వత్సల. పన్నా టైగర్ రిజర్వ్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వత్సల హినౌటా ఎలిఫెంట్ క్యాంప్ సమీపంలో బుధవారం తుది శ్వాస విడిచింది. అటవీ కాలువ దగ్గర పడిపోయిన వత్సలను గమనించిన అటవీ సిబ్బంది, పశువైద్యులు తక్షణమే వైద్య సాయం అందించినప్పటికీ ఏనుగు ఫలితం లేకపోయింది. వయోభారంతో ఇప్పటికే బాధపడుతున్న వత్సల కన్నమూసిందని అధికారులు ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. వత్సల చనిపోలేదు - అది అడవితో ఐక్యమైంది అంటూ పలువురు వన్య ప్రేమికులు, అటవీశాఖ అధికారులు దానికి నివాళులర్పించారు. వత్సల మరణం ఒక జంతువును కోల్పోవడం కంటే ఎక్కువ. ఇది ఒక శతాబ్దం పాటు కాపలాగా ఉన్న చెట్టు కూలిపోవడం లాంటిదని సంతాపం తెలిపారు.వత్సల మరణం గురించి వార్త తెలియగానే పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది, సమీప గ్రామాల స్థానికులు, దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు దుఃఖం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంలో వత్సల మృతదేహాన్ని హినౌటాలో దహనం చేశారు. ఒకప్పుడు రాణిలా తిరుగాడిన ప్రదేశంలో ఇప్పుడిక దాని జ్ఞాపకాలే మిగిలాయి. సోషల్ మీడియాలో RIP Vatsala హ్యాష్ట్యాగ్వైరల్గా మారింది. ఇదీ చదవండి : Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! కేరళ- మధ్యప్రదేశ్కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్ డివిజన్లోని కేరళలోని దట్టమైన నీలాంబూర్ అడవిలో జన్మించిన వత్సల తొలుత అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తూ, దుంగల కంటే చాలా బరువైన భారాన్ని మోస్తూ గడిపింది. 50 ఏళ్లు నిండిన వయసులో 1972లో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత 1993లో బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అలా అప్పటి నుంచి పన్నా అభయారణ్యమే వత్సలకు నిలయంగా మారింది.Bidding a heartfelt farewell to #Vatsala, the world’s oldest known Asiatic elephant at 109 years, who passed away in Madhya Pradesh’s Panna Tiger Reserve. A gentle matriarch, Vatsala was a beloved guardian of her herd and was the soul of the reserve. She will be missed. pic.twitter.com/IrjZA32zIT— Parimal Nathwani (@mpparimal) July 9, 2025 ‘‘వత్సల మాకు గర్వకారణం" అని ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచిత టిర్కీ చెప్పారు. "మందను గౌరవంగా నడిపించింది. ప్రసవాల సమయంలో, అనుభవజ్ఞురాలైన మంత్రసానిలా దగ్గరుండి సాయం చేసింది. బలాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. వత్సల పెద్దది మాత్రమే కాదు - ఆమె మా ఏనుగు కుటుంబానికి ఆత్మ." పెద్ద ఆడ ఏనుగుగా,సహజంగా మందను నడిపించింది, పిల్ల ఏనుగులను పోషించింది అన్నారు.ఇదీ చదవండి: ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్ వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “వత్సల రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగంగా మారింది. పలు తరాలకు స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా అభయారణ్యంలో ఎంతో ప్రేమగా మెలిగింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వత్సల మరణం పన్నా టైగర్ రిజర్వ్‌కి తీరని లోటనిప్రముఖ పర్యావరణవేత్త రాజేష్ దీక్షిత్ సంతాపం తెలిపారు.2003 -2008లో, రామ్ బహదూర్ అనే మగ ఏనుగు చేసిన రెండు హింసాత్మక దాడుల నుండి వత్సల సురక్షితంగా బయటపడింది. ప్రేగులను చీల్చి,లోతైన గాయా లైన రెండు సందర్భాల్లో, ఆమె వీపును కుట్టినది వన్యప్రాణి పశువైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా - 2003లో 200 కుట్లు, తొమ్మిది నెలల చికిత్సచేశారు. అయినా వత్సల ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. 2020లో, వత్సల కంటిశుక్లం కారణంగా పూర్తిగా అంధురాలైంది. అయినప్పటికీ, ఆమె అటవీ బాటలలో నడవడం కొనసాగించింది. జీర్ణ సమస్యలు, పూర్తి అంధత్వంతో కారణంగా దానికి వైద్యులు గంజి తినిపించేవారు. 1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఆమె ఖచ్చితమైన వయస్సు అధికారికంగా నిర్ధారించబడలేదు, అయినప్పటికీ, ఆమె పక్కన నడిచిన వారికి, గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ఆమె గడిపిన జీవితం - మరియు ఆమె తాకిన జీవితాలు ముఖ్యమైనవి.1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చూసినప్పటికీ, వయస్సు అధికారికంగా నిర్ధారణ లేని కారణంగా అది మిస్ అయింది. అయితేనేం.. వత్సలకు గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. గడిపిన జీవితం చాలా ముఖ్యమైంది అంటూ కొనియాడారు అటవీ అధికారులు. -
థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం ..
కొన్ని అరుదైన ఘటనలు కోటిలో ఇద్దరో ఒక్కరో తల్లిదండ్రులుకే అలాంటి అదృష్టం దక్కుతుంది. మనం పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన పిల్లల చేత అందరూ గౌరవమన్ననలను అదుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ అనుకోకుండా పిల్లల ఉద్యోగ బాధ్యతల నడుమే మన తల్లిదండ్రులనే కలిసి అవకాశం లభిస్తే..ఆ ఆనందమే వేరు. పైగా సగర్వంగా వాళ్ల గురించి మనం చెబుతుంటే ఆ మాటలు వింటున్నా..లేదా ఆ అత్యున్న హోదాలో మనల్ని చూసినా..మన తల్లిందండ్రుల కళ్లల్లో ఉప్పొంగే ఆ ఆనంద క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేం. అలాంటి ఆనంద క్షణాలే ఓ మాజీ మంత్రికి దక్కాయి. నెట్టింట ఆ విషయం తెగ వైరల్ అవ్వడమే గాక కొందరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం అని అంతా కొనియాడుతున్నారు ఆ తండ్రి కూతుళ్లను. అసలేం జరిగిందంటే..చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్కు అరుదైన స్వాగతం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్‌గా ఉన్నారు. అది తెలుసుకున్న కూతురు గౌరీ ధవళికర్ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ..వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా చెబుతుంది. "ఈ రోజు నేనే నా తండ్రితో కలిసి ఈ విమానంల ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్‌గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రే ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు." పైలట్ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణకులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు. ఎవరీ దీపక్ ధవళికర్..గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మార్కైమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. View this post on Instagram A post shared by Prudent Media Official (@prudentmediagoa) (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది. కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా, ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది."మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే" అని శ్రీశ్రీ అన్నట్టు పిల్లలు ప్రకృతిలోని అందాలను స్వచ్ఛమైన మనసుతో ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు. పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది. ఒక జోరు వాన పడుతోంది. దీంతో గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్ కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! #WATCH | Chhattisgarh: Raigarh Forest Department's drone captured a herd of elephants with their calves playing in the mud in the monsoon season. Visuals from Dharamjaigarh Forest Division. (08.07.2025)(Video Source: Chhattisgarh Forest Department) pic.twitter.com/BheMJESyxs— ANI (@ANI) July 9, 2025కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. -
వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!
వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాల వల్ల చాలామంది నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కకపోవడం ఎవరికైనా మనస్తాపం కలిగిస్తుంది. పనిచేసే చోట రాజకీయాల వల్ల తరచుగా నష్ట΄ోతూ ఉన్నట్లయితే విరక్తిలో కూరుకుపోతారు. ఇలాంటి దుస్థితిని ఎలా అధిగమించాలంటే... అసూయాపరుల కారణంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలంటే, శుక్రవారం రాత్రివేళ కిలో మినుములను నీట్లో నానబెట్టండి. శనివారం ఉదయం స్నానాదికాల తర్వాత ముందురోజు నానబెట్టిన మినుములను ఒక పళ్లెంలోకి తీసుకోండి. ఆ మినుములను మూడు సమ భాగాలుగా చేయండి. ఒక భాగాన్ని గుర్రానికి, ఒక భాగాన్ని గేదెకు, ఒక భాగాన్ని ఆవుకు తినిపించండి.ప్రభుత్వోద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ జీవితంలో అవరోధాలు తొలగిపోవాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. ప్రతి ఆదివారం ఒక చిన్న బెల్లంముక్కను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. ఉద్యోగ జీవితంలో కుట్రలు కుతంత్రాలకు బాధితులు బలి కాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. శుక్రవారం ఉదయం స్నానాదికాల తర్వాత దేవీ ఆర్గళ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్రతతో పఠించండి. అనాథ బాలికలకు కొత్త దుస్తులు ఇవ్వండి.ఉద్యోగ జీవితంలో పురోగతికి ఏర్పడుతున్న అవరోధాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానాదికాలు, నిత్యపూజ తర్వాత రావిచెట్టు మొదట్లో గుప్పెడు నానబెట్టిన మినుములు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదనగా ఉంచి, నీలిరంగు పూలతో పూజించాలి. గాయత్రీ హోమం చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.– సాంఖ్యాయన విజయం కోసం... జయ శ్లోకంజయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితఃదాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజఃన రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీంసమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్జయశ్లోకం అనే పేరుగల ఈ శ్లోకాన్ని మన కోరికను లేదా సమస్యను బట్టి శుచిగా ఉండి 5/11/21/40 రోజులపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో చదువుకుంటూ హనుమంతుడికి అరటిపండ్లు నివేదించడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యలైనా తీరిపోతాయని ప్రతీతి. మంచి మాటలు మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటపుడు మనం కనపడాల్సిన అవసరం లేదు. మంచితనం కనపడితే చాలు.చిరునవ్వును మించిన అలంకరణ లేదు. వినయాన్ని మించిన ఆభరణం లేదు. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది. కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది.మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు’.చెడుని ప్రశ్నించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడుని తొలగిస్తుంది’. -
ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! ) -
ఆకర్షణ అశాశ్వతం... కుటుంబ బంధమే శాశ్వతం!
డాక్టరు గారు! నేను కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నాను. అతనికి కూడా వివాహం అయింది. పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి మా ఈ బంధం కొనసాగుతోంది.. శారీరకంగా కన్నా మానసికంగా మేము ఎక్కువ దగ్గర అయ్యాము. కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం, నన్ను అంతగా పట్టించుకోకపోవటం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. ఆకలి, నిద్ర బాగా తగ్గిపోయాయి. మనసంతా చికాకుగా, ఏడుపు వస్తుంది. అశాంతితో నరకం అనుభవిస్తున్నాను. అతను నాకు ఏమీ కాడు అని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను! ఆఖరికి ఆత్మహత్మ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను! – ఒక సోదరి, గుంటూరుమీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు తీవ్రమైన మనోవేదన (డిప్రెషన్)కు లోనయినట్లుగా అర్థం అవుతోంది. జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం సహజం. మీకు మంచి భర్త, పిల్లలు ఉన్నా, ఆ వ్యక్తికి భార్య పిల్లలున్నారని తెలిసి కూడా సంబంధం పెట్టుకున్నారు! ఒక్కొక్కసారి భార్యా భర్తల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి అసంతృప్తికి లోనయినవారు, ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశ ముంటుంది! ఇప్పుడా వ్యక్తి తన భార్యను, మిమ్మల్ని కాదని ఇంకా మూడోవ్యక్తితో, కొత్తగా రిలేషన్ షిప్ పెట్టుకున్నాడంటే అతని వ్యక్తిత్వమేంటో మీకీపాటికి తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా మించియిందేం లేదు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలోనే మనిషి ఔన్నత్యం బయటపడుతుంది. ఒక వేళ మీ విషయం మీ భర్తకు తెలిస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతా ‘మన మంచికే ’ అని ‘ఆత్రేయ’ గారు అన్నట్లు, ఆ మూడో వ్యక్తి వల్ల ఒక విధంగా మీకు, మీ కుటుంబానికి, మంచి జరిగినట్లయింది. మీరు మీ మనోవేదనలోంచి త్వరగా బయటపడేందుకు మీ దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ కుంగుబాటును తగ్గించేందుకు కొన్ని మందులు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’, మీ భార్య భర్తల మధ్య ఏదైనా అంతరాలుంటే సరిదిద్దుకునేందుకు ‘కపుల్ థెరపీ’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా మీ సమస్యలోంచి త్వరగా బయటపడి మీలో మానసిక ప్రశాంతత, సమస్యను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వచ్చేలా చేయవచ్చు. కాలమే మనసుకు తగిలిన గాయాలను మాన్పుతుంది! మనసైనా, మనిషైనా, మనది కానిది, ఎన్నటికీ మనది కాబోదనే జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి! ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: 'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..) -
వాకింగా? జాగింగా? ఎవరికి ఏది మంచిది?
సాధారణంగా నడక (వాకింగ్) జాగింగ్ చాలా ప్రముఖమైన సులభమైన అత్యధిక శాతం మంది అనుసరించే వ్యాయామాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఎవరి సాయం లేకుండా కూడా చేయగలిగిన ప్రయోజనకరమైన వ్యాయామాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొందరిలో సందేహాలు ఉన్నాయి. నడక మంచిదా? జాగింగ్ మంచిదా? అసలు ఏది ఎవరు చేయాలి? ఎంత సేపు చేయాలి... వంటి అనుమానాల నివృత్తి కోసం...వైద్యులు చెబుతున్న కొన్ని విషయాలు..నలతను దూరం చేసే నడక : శరీరంపై తక్కువ ఒత్తిడి, గాయాలకు అవకాశం చాలా తక్కువ. తగినంత, మితమైన వేగంతో చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేస్తే ఇది శరీరంలోని కొవ్వు కారక క్యాలరీలు తగ్గించడంలో, సహాయపడుతుంది. సాధారణ వేగంతో నడిస్తే 45 నిమిషాల నడక వల్ల సుమారు 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది అన్ని వయస్సుల వారికి, కొన్ని రకాల ఆరోగ్య పరిమితులతో ఉన్న వారికి కూడా అనుకూలం.జాగ్రత్తలతో...జాగింగ్పరుగుకీ, నడకకు మధ్యన ఉండేదే జాగింగ్. నిదానంగా చేసే జాగింగ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనీసం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ ద్వారా 100 నుంచి 150 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త వేగంగా వేయడం వల్ల శరీరం మరిన్ని ఎక్కువ క్యాలరీలు తక్కువ సమయంలో ఖర్చు చేస్తుంది. ఇది గుండె రక్తనాళ వ్యవస్థకు మేలు కలుగు జేసే వ్యాయామం, ఆక్సిజన్ వినియోగాన్ని మెటబాలిజం వేగాన్ని పెంచడంలో కూడా మనకు తోడ్పడుతుంది .ఏది ఉత్తమం?ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత లక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే వాకింగ్ సరిపోతుంది. అదే బరువు తగ్గాలి అంతేకాకుండా గుండెకు తగిన వ్యాయామంకావాలి అనుకుంటే బ్రిస్క్ వాక్, జాగింగ్ మేలు చేస్తాయి.వ్యక్తి శారీరక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాళ్ళు, గాయాలు, గుండె సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే జాగింగ్ కాకుండా నడక బెస్ట్ అని చెప్పాలి. అలాగే 60ఏళ్లు దాటిన మగవాళ్లు, 50 ఏళ్లు దాటిన మహిళలు తమ తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తొలుత నడకతో మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్రా ఏ సమస్యలూ రాకపోతే స్లో జాగింగ్‌కు మళ్లవచ్చు. అదే యుక్త వయసు వాళ్లు అయితే జాగింగ్‌ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, నిరంతరంగా కొనసాగించగల వ్యాయామం ఎంచుకోవడం ముఖ్యం. అది 45 నిమిషాలు నడక కావచ్చు, లేక 20 నిమిషాలు జాగింగ్ అయినా సరే. ఎంచుకున్న వ్యాయామాన్ని క్రమబద్ధంగా చేయడం అత్యంత ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ప్రకారం శరీర క్రియలు సజావుగా జరగాలంటే వారానికి కనీసం 150 నిమిషాల పాటు ‘మోడరేట్ యాక్టివిటీ’ లేదా 75 నిమిషాల ‘విగరస్ యాక్టివిటీ’ చేయడం అవసరం. చురుకుదనం, ఆరోగ్యం వంటివి చాలనుకుంటే నడక తక్కువ సమయంలో ఫిట్నెస్ పెంచాలనుకుంటే జాగింగ్ మంచిది. నోట్ : ఏది ఏమైనా ముందస్తుగా ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యాయామం చేయడం ఉత్తమం. -
అలనాటి మహిళా రాజ్యం..!
పురాతన టర్కిష్ నగరాన్ని 9000 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య సమాజంలో నివసించే స్త్రీలు పాలించారని ఒక కొత్త అధ్యయనం ధ్రువీకరించింది. కాటల్హో యుక్లోలో 35 వేర్వేరు ఇళ్ల నుంచి 130కి పైగా అస్థిపంజరాల డీఎన్ఏను పరిశోధకులు విశ్లేషించారు.జన్యు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, బయోలాజికల్ ఆంత్రోపాలజిస్ట్‌లు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. అస్థిపంజరాల డీఎన్ఏ విశ్లేషణకు అత్యాధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ కాలంలో ప్రతి కుటుంబంలో, వ్యవసాయంలో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. వివాహం తరువాత భర్తలు భార్య ఇంటికి వచ్చేవారు.మరణం తరువాత అంత్యక్రియలకు సంబంధించి పాటించే ఆచారాలలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉండేదని అధ్యయనం తెలియజేసింది. పురుషులతో పోల్చితే స్త్రీల సమాధిలో ఉంచవలసిన వస్తువులు అయిదు రెట్లు ఎక్కువగా ఉండేవి. మాతృస్వామ్య సమాజానికి సంబం«ధించిన చిహ్నాలు, మహిళా ప్రతిమలను భారీ స్థాయిలో కలిగిన ఉన్న కారణంగా కాటల్హో ప్రసిద్ధి పొందింది. కాలానుగుణంగా సంస్కృతిలో వచ్చిన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది.(చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!) -
పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!
వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా? అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్‌లోకి వస్తే... ‘ఫేక్ వెడ్డింగ్’ అనేది యువతరంలో ఒక ట్రెండ్‌గా మారింది. మెట్రో సిటీస్‌లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్‌లలో, రూఫ్‌టాప్ బార్లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్ ట్రెండ్ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. -
'గురువు' అనే పదం ఎలా వచ్చింది..? అతడిని తెలుసుకునేది ఎలా..?
అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు. గురువ అనే శబ్దానికి అత్యంత మహోన్నత అర్థాన్ని వివరించారు ఎందరో మహానుభావులు. ఇవాళ(గురువారం) గురుపౌర్ణమి సందర్భంగా అలాంటి నిజమైన గురువును ఎలా గుర్తించాలి? . ఆయన మనల్ని ఎలా కనుగొంటాడు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం! . ‘గురు’ అనే పదం రెండు పదాల నుండి వచ్చింది: ‘గు’ అంటే అంధకారం, మరియు ‘రు’ అంటే తొలగించడం లేదా చెదరగొట్టడం. ఒక గురువు, భ్రాంతి యొక్క చీకటి సందుల నుండి బయటపడి మన నిజమైన నివాసం, అంటే జ్ఞానోదయం భద్రతలోకి అడుగుపెట్టేవరకు, జన్మజన్మాంతరాలుగా మన చేతులు పట్టుకుని నడిపిస్తాడు. మరి నిజమైన గురువును ఎలా గర్తించాలి?మనం గురువును కనుగొనం, గురువే మనల్ని కనుగొంటాడని చెబుతున్నాయి పురాణాలు. పరమ సత్యం పట్ల మన తపన తీవ్రమైనప్పుడు, ఆత్మసాక్షాత్కారం వైపు సవాలుతో కూడిన ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ఒక దైవిక మార్గాన్ని లేదా గురువును పంపుతాడు. అటువంటి గురువు దైవ నియమితమైనవాడు. ఆయన దైవంతో ఏకమైనవాడు, అలాగే భూమిపై ఆయన ప్రతినిధిగా మాట్లాడటానికి దైవిక ఆమోదం కలిగి ఉంటాడు. గురువు నిశ్శబ్ద దైవ వాణి. గురువు నిర్దేశించిన సాధనను అనుసరించడం ద్వారా, శిష్యుడు భ్రాంతి సముద్రాన్ని దాటడానికి జ్ఞానం అనే తన సొంత ప్రాణరక్షక తెప్పను నిర్మించుకుంటాడు. గురువు, దేవుడు మన జీవితాల్లోకి అడుగిడే అనంత ద్వారం. మనం మన సంకల్పాన్ని, చైతన్యాన్ని గురువుతో అనుసంధానించుకోకపోతే, దేవుడు మనకు సహాయం చేయలేడు. ఈ రోజుల్లో, శిష్యత్వం అనేది గురువుకు లోబడి తమ స్వేచ్ఛా సంకల్పాన్ని వదులుకోవడంగా పరిగణించబడుతుంది. అయితే, గురువు యొక్క సార్వత్రిక కరుణ పట్ల విశ్వసనీయత ఏ మాత్రం బలహీనతకు సంకేతం కాదు.స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా అన్నారు: “స్వేచ్చా సంకల్పం అనేది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏర్పడ్డ అలవాట్లు లేక మానసికోద్రేకాలకు లోబడి ప్రవర్తించడంలో లేదు.” అయితే, సాధారణ మానవులు తమ సంకల్ప శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించకుండానే తమ నిత్య జీవితాలను గడుపుతారు సంక్షోభంలో, దుఃఖంలో, ఆనందంలో కూడా. స్వేచ్ఛ అంటే నిజానికి మన అహం-ప్రేరిత స్వభావం నుండి విముక్తి పొందడమే. ఇది అనంత జ్ఞానం, సర్వవ్యాప్త చైతన్యం, సర్వవ్యాప్త ప్రేమపై ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది; వీటిని శిష్యులు సత్య గురువు బోధనల ద్వారా అనుభవించగలరు. పరమహంస యోగానంద అటువంటి సద్గురువులలో ఒకరు. ఆయన దివ్యమైన గురుపరంపర నుంచి వచ్చారు. క్రియాయోగ మార్గ జ్ఞానాన్ని ప్రపంచానికి విస్తరింపజేయడానికి కృషి చేశారు. క్రియాయోగం ఆత్మసాక్షాత్కారానికి అత్యున్నత మార్గాలలో ఒకటి. లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించిన ఆయన ఆధ్యాత్మిక గ్రంథమైన “ ఒక యోగి ఆత్మకథ”లో, యోగానంద ఇలా వ్రాశారు: క్రియాయోగమన్నది మనిషి రక్తంలో కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక-శారీరక ప్రక్రియ. ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి, దీనితో ఒక యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ మొత్తానికే ఆపెయ్యడం కాని చేయగలడు. ఆధ్యాత్మిక పురోగతికి అటువంటి శక్తివంతమైన పద్ధతిని మానవాళికి పంచుకోవడం తప్పనిసరి. ఈ ఉద్దేశ్యంతోనే, యోగానంద తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రోద్బలంతో, 1917 లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను, 1920 లో లాస్ ఏంజిల్స్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.సత్య జిజ్ఞాసువులకు క్రియాయోగ బోధనలు ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. ద్వారా స్వీయ-సాక్షాత్కారంపై గృహ అధ్యయన పాఠాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. విశ్వాసి యొక్క తపన లోతుగా ఉండి, దేవుడిని తెలుసుకోవాలని నిరంతర ఆకాంక్ష ఉంటే, ఒక సద్గురువు స్వయంగా తన శిష్యుడికి మార్గనిర్దేశం చేయడానికి వస్తాడని నమ్ముతారు. ఇది ఒక సద్గురువు యొక్క దివ్య వాగ్దానం. గురువు భౌతిక శరీరంలో ఉన్నా లేకున్నా, ఆయనతో అనుసంధానమైన శిష్యుడికి ఆయన ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు, ఎందుకంటే సద్గురువు యొక్క చైతన్యం శాశ్వతం. సంత్ కబీర్ మాటల్లో, “సద్గురువును కనుగొన్న శిష్యుడు ఎంతో గొప్ప అదృష్టవంతుడు!” (చదవండి: వ్యాసాయ విష్ణు రూపాయ...) -
జయహో శాకంబరీ మాత!
అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!– అడ్లూరి సునందాశివప్రసాద్ సాక్షి, హన్మకొండ కల్చరల్ -
వ్యాసాయ విష్ణు రూపాయ...
మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. అందుకే గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తాం. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతోపవిత్రమైనది. ఈ రోజు అష్టాదశ పురాణాలను మనకు అందించిన వ్యాసభగవానుని జన్మదినం కారణంగా గురుస్థానంలో ఆ వ్యాసభగవానుని స్మరించుకునే పర్వదినం. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి. అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి. ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైంది. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచింది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన ఒక చక్కని కథను తెలుసుకుందాం. ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు. కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ‘‘శిష్యా! నీవు నన్ను దర్శించాలని కుతూహలంగా ఉన్నావు గనుక విను. ఎవరైతే పురాణగాథలను, వేద గాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, వారిని సాక్షాత్తు వ్యాస మూర్తిగా భావించి పూజింపవలసినది. నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను’’ అని అంటారు. అందువల్ల పౌరాణికులు, కథకులు, బోధకులు అందరూ గురువులే. పురాణాలలో నిగూఢంగా ఉన్న విషయాలను తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను పూజించి తగిన విధంగా సత్కరించాలి. హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు. తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాధన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం. గురువులుగా ప్రసిద్ధిగాంచిన ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషిరిడీ సాయినాథుడు మొదలైనవారిని ఈరోజు కొలుస్తారు. ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు. అఙ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు. మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు. సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతుడై జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగివున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. మనమందరం గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం. విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.– డా. దేవులపల్లి పద్మజ