పోచమ్మ బోనాల పండుగ | Bolanu celebrations at Maharastra in sakinaka | Sakshi
Sakshi News home page

Bonalu పోచమ్మ బోనాల పండుగ

Jul 15 2025 2:32 PM | Updated on Jul 15 2025 2:32 PM

 Bolanu celebrations at Maharastra in sakinaka

జంతుబలికి తావు లేకుండా శాఖాహార బోనాలు... 

ప్రసాదాలు, ఒడిబియ్యం సమర్పించిన భక్తులు    

నాయ్‌గావ్‌లో పోచమ్మ బోనాల పండుగ   

పీవైఎస్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం హోమాది కార్యక్రమాలు 

సాక్షి ముంబై; దాదర్‌ నాయ్‌గావ్‌లోని పద్మశాలీ యువక సంఘం (పీవైఎస్‌) ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే సాధారణం కంటే భిన్నంగా జంతుబలికి తావు లేకుండా అందరూ శాఖాహార బోనాలే సమర్పించడం విశేషం. బోనాల పండుగ సందర్భంగా లక్ష్మీపతి శర్మ అర్చకత్వంలో ïమిరియాల రోజాగౌతమ్, మంగరి సలోని రాహుల్‌ దంపతుల చేతుల మీదుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకం, హోమం, దేవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. పండుగ సందర్భంగా మహిళా భక్తులు తలపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. తమ వెంట తెచి్చన పిండి వంటలు, ప్రసాదాలు, ఒడి బియ్యం అమ్మవారికి సమరి్పంచి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంబ్కర్‌ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అందరిని చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని కోరినట్టు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు సంపిణీ చేశారు. 

మరోవైపు ఈ కార్యక్రమంలో సంస్ధ చైర్మన్‌ అనబత్తుల ప్రమోద్, మేనేజింగ్‌ ట్రస్టీ పొన్న శ్రీనివాసులు, కోడి చంద్రమౌళి, తిరందాసు సత్యనారాయణ, అ«ధ్యక్షుడు గంజి సీతారాములు, ఉపాధ్యక్షుడు లక్షేట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సహాయకార్యదర్శులు పేర్ల గీతాంజలి, కోశాధికారి దోర్నాల బాలరాజు, అధ్యాత్మికక సమితి చైర్మన్‌ దోమల్‌ శంకర్, కన్వీనర్‌ పుట్ట గణేశ్, కార్యవర్గ సభ్యులు పగిడిమర్రి సత్యనారాయణ, ఇతర పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు.  

సాకినాకలో బోనాల సంబరాలు 
ముంబై సాకినాకాలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. స్థానిక తెలుగు ప్రజలు సంప్రదాయ వేషధారణతో తలపై బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ తల్లికి మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కోళ్లను బలి ఇచ్చారు. 

తెలుగు మాదిగ మహా సంఘం బోనాలు 
ముంబైలోని తెలుగు మాదిగ మహా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ కమాటిపురాలోని పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వ్రస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎరుల లక్ష్మణ్, తెడ్డు బాబు రాజన్న, జోగు రాజలింగం, కోశాధికారి గంగడొల్ల రాజరాం, మేకల బాబు, నల్లూరి బాబు, గుమ్మెర్ల ప్రభాకర్, గంగడోల్ల శంకర్, కొత్తూరి రామచంద్ర, మేకల ఆనంద్, గుమ్మెర్ల మధూకర్, జంగం మహేష్‌, రుల రోజారాణి, మేకల రాజమణి, మేకల శోభ, జోగు కాంతమ్మ, మేకల భారతి, మేకల సప్న, విమల గుండారం తదితరులు పాల్గొన్నారు. 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement