అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం! | Best solution For which obstacles and failures holding you back | Sakshi
Sakshi News home page

అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!

Jul 17 2025 9:59 AM | Updated on Jul 17 2025 10:13 AM

Best solution For which obstacles and failures holding you back

అవరోధాలు, అపజయాలు, ఆశాభంగాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎలాంటి వారినైనా మానసికంగా కుంగదీస్తాయి. ఎలాంటి సమస్యలూ లేకుండా జీవితం సాఫీగా సాగి΄ోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జాతకంలోని గ్రహాల బలాబలాల మేరకు కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని గోచార పరిస్థితుల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 

ఇలాంటి సమస్యలు బాధించకుండా ఉండాలంటే...
రోజువారీ విధి నిర్వహణ కోసమే కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పనిమీదనే కావచ్చు... ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పండ్లు లేదా పూలు లేదా మిఠాయిలు వంటివి తీసుకురావడం మంచిది.

చిన్న రాగినాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి, దానిని వీధిగుమ్మం దగ్గర తోరణానికి వేలాడదీయండి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే పక్షులకు తృణధాన్యాలను ఆహారంగా వేయండి. ఆర్థిక సమస్యలు శీఘ్రంగా తొలగి పోతాయి.

గురువారం రోజున ఇష్టదైవానికి చెందిన గుడికి వెళ్లడం మాత్రమే కాదు, ఆ రోజున గురువులను, గురు సమానులను కలుసుకొని వారికి మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాదులను సమర్పించి, వారి ఆశీస్సులు తీసుకోండి. 

పూజ కోసం వినియోగించే అగరొత్తులు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కొనుగోలు చేయండి.
– సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement