Millets అనారోగ్యాలు సరి : ఆరోగ్య సిరి | Millets Cultivation and Production in demand | Sakshi
Sakshi News home page

Millets అనారోగ్యాలు సరి : ఆరోగ్య సిరి

Jul 14 2025 1:19 PM | Updated on Jul 14 2025 2:58 PM

Millets Cultivation and Production in demand

అన్ని చోట్ల చిరుధాన్యాలకే ప్రాధాన్యం

కొండల్లో విస్తరిస్తున్న మిల్లెట్స్‌ సాగు

పట్టణాల్లో పెరుగుతున్న వినియోగం

భామిని: అంతరించి పోతున్న చిరుధాన్యాలను రక్షిస్తూ నేటి తరాలకు పరిచయం చేసేందుకు చిరుధ్యానాల విత్తన సంరక్షణతో పాటు, పంటల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటలుగా పురాతన కొండ పంటలుగా పిలిచే మిల్లెట్స్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ సాగు విస్తరణ పెంచుతున్నారు.  ఐటీడీఏల పరిధిలో మిల్లెట్స్‌ సాగు విస్తరణ ప్రణాళిక అమలవుతోంది. ఏపీపీఐ సంస్థ ఆర్థిక సహకారంతో గిరిజనులకు చిరుధాన్యాల విత్తనాలు సేకరించి  ఉచితంగా అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో కొండ పంటలు సాగు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సాగు, మిశ్రమ సాగు విధానంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిల్లెట్స్‌పై అవగాహన పెంచుతున్నారు.దీంతో చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, అరిరెకల సాగు పెరుగుతోంది..

 ఔషధ గుణాల సమ్మిళితం 
తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన తిండి గింజలు.స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంప్రదాయ పంటల సాగును  పునరుద్ధరిస్తున్నాం. ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం పెంచాం. పండించిన చిరు ధాన్యాలు మిగులు పంటకు మార్కెట్‌లో విలువ వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టణాల్లో పెరుగుతున్న వాడకానికి తగ్గట్లు పండించడానికి గిరిజన ప్రాంతాల్లో సమాయిత్తం చేస్తున్నాం.  

కె.రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య గుళికలుగా వీటిని వర్ణిస్తారు.ఇవి  తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి  చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం రక్షణగా నిలుస్తుందని న్యూట్రిస్టులు చెబుతున్నారు. రోజుకు మనిషికి 38 గ్రాముల పీచు పదార్థం అవసరం. చిరుధాన్యాల్లో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. కూరగాయలు, ఆకు కూరల్లో పీచు పదార్థం పొందవచ్చు. కొండపోడు భూముల్లో చేపట్టే చిరుధాన్యాల సాగు పల్లపు ప్రాంతాల భూముల్లోనూ  విస్తరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, చీడపీడల నివారణకు కషాయాల వైద్యంతో సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలకు తోడు పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement