సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ | ITC Mangaldeep Strengthens Sixth Sense Panel Sensory-First Innovation to empower the Visually Impaired | Sakshi
Sakshi News home page

Mangaldeep Sixth Sense Panel : సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ

Jul 14 2025 6:22 PM | Updated on Jul 14 2025 7:01 PM

 ITC Mangaldeep Strengthens Sixth Sense Panel Sensory-First Innovation to empower the Visually Impaired

భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్‌దీప్  స్పెషల్లీ ఏబుల్డ్‌ దృష్టిలోపి ఉన్నవారికోసం   సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం  చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది.  మంగళ్‌దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని  ఎంపిక చేసింది.

దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే  ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్‌లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో  తీసుకొచ్చిన  సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు  మంగళ్‌దీపి వెల్లడించింది.  అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్‌లను మంగళ్‌దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.

ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్‌లోని అగర్బత్తి & మ్యాచ్‌ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి,  మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్‌ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన  ధృక్పథం అలవడింన్నారు.  రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్‌దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ  నిచ్చారు.  

ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్‌లు అందిస్తారు.  "ఐటిసి  సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్‌కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ  ‍ కొనియాడారు.
ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి  ఐటీసీకి ధన్యవాదములు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement