
కేరళలోని సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మోహినీయాట్టం, మోడ్రన్ ర్యాప్ ట్రాక్‌ను మిక్స్ చేసి సోషల్ మీడియా సెన్షెషన్‌గా మారింది శ్వేత వారియర్. ఎనిమిదిమంది డ్యాన్సర్‌లతో కలసి ఈ వినూత్న నృత్యం చేసింది. ‘రన్ ఇన్ అప్ ర్యాప్ చూసిన తరువాత కొత్తగా ఏదైనా చేయాలనిపించింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసింది శ్వేత.
ఈ డ్యాన్స్ వీడియోకు 13 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. ‘రెఫ్రెషింగ్’ ‘ఇన్నోవేటివ్’ ‘పవర్‌ఫుల్’ అని స్పందించారు నెటిజనులు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్వేత వారియర్ కొత్త డ్యాన్స్ స్టైల్స్‌ను క్రియేట్ చేయడంలో పేరు తెచ్చుకుంది.
మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది. భరత నాట్యం, అర్బన్ స్ట్రీట్ స్టైల్స్‌ను మిక్స్ చేసి సృష్టించిన ‘స్ట్రీట్ వో క్లాసికల్’ సూపర్‌హిట్ అయింది.రకరకాల ‘హైబ్రీడ్ డాన్స్ స్టైల్స్’తో డాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేత వారియర్. సోనీ టీవి ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’లో రన్నర్–అప్‌గా నిలిచింది.
(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..)