
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘నిథమ్’ ఔత్సాహిక వ్యాపార వేత్తలకు, పాకశాస్త్ర నిపుణులకు రిథమ్ అన్నట్లుగా గుర్తింపు పొందుతోంది.. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో భాగంగా 20 రోజుల పాటు శిక్షణ పొందిన 29 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. దీంతోపాటు వీరందరికీ ఫుడ్ ట్రక్కులను మంజూరు చేశారు..
నిథమ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 29 మందికి ట్రైనీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మిషెల్లి జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో నిథమ్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంకే గణేష్ సరి్టఫికెట్లు అందజేశారు. చెఫ్ తుల్జారామ్ ఆధ్వర్యంలో గురువారం పలు రకాల ఫిష్ వంటకాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పట్రా రి మిర్చీ, ప్రాన్స్ పలావ్, అపోలోఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి పలురకాల వంటకాలతో విందుచేశారు.
చేపలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెర్ఫ్ నిథమ్ అధికారులు వీటిని రుచిచూసి శిక్షణార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చెఫ్ తుల్జారామ్ వంటకాల తయారీపై పలు సూచనలు చేశారు. ముగింపు సమావేశం నిర్వహించి శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు అందించారు. కార్యక్రమంలో నిథమ్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జే ఫ్రాన్సిస్, ఫిషరీస్ శాఖ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి మార్గంగా..
మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్‌్ఫ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించాం.
ఫిష్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మహిళలకు ఇది ఉపాధి మార్గంగా మారిందని, మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడమే లక్ష్యంగా, జీవనోపాధి పొందేలా, తద్వారా పలువురికి ఉపాధి కల్పించేలా మొబైల్ ఫిష్ ట్రక్ క్యాంటీన్లను నడిపేందుకు ప్రోత్సహిస్తున్నాం. వ్యాపార ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా శిక్షణ అందించాం.
– డాక్టర్ సతీష్ సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్
(చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్)