breaking news
Gachhibowli Stadium
-
‘నిథమ్’.. పాకశాస్త్ర రిథమ్..
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘నిథమ్’ ఔత్సాహిక వ్యాపార వేత్తలకు, పాకశాస్త్ర నిపుణులకు రిథమ్ అన్నట్లుగా గుర్తింపు పొందుతోంది.. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో భాగంగా 20 రోజుల పాటు శిక్షణ పొందిన 29 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. దీంతోపాటు వీరందరికీ ఫుడ్ ట్రక్కులను మంజూరు చేశారు.. నిథమ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 29 మందికి ట్రైనీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిషెల్లి జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో నిథమ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంకే గణేష్ సరి్టఫికెట్లు అందజేశారు. చెఫ్ తుల్జారామ్ ఆధ్వర్యంలో గురువారం పలు రకాల ఫిష్ వంటకాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పట్రా రి మిర్చీ, ప్రాన్స్ పలావ్, అపోలోఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి పలురకాల వంటకాలతో విందుచేశారు. చేపలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెర్ఫ్ నిథమ్ అధికారులు వీటిని రుచిచూసి శిక్షణార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చెఫ్ తుల్జారామ్ వంటకాల తయారీపై పలు సూచనలు చేశారు. ముగింపు సమావేశం నిర్వహించి శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు అందించారు. కార్యక్రమంలో నిథమ్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జే ఫ్రాన్సిస్, ఫిషరీస్ శాఖ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి మార్గంగా.. మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్్ఫ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించాం. ఫిష్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా మహిళలకు ఇది ఉపాధి మార్గంగా మారిందని, మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడమే లక్ష్యంగా, జీవనోపాధి పొందేలా, తద్వారా పలువురికి ఉపాధి కల్పించేలా మొబైల్ ఫిష్ ట్రక్ క్యాంటీన్లను నడిపేందుకు ప్రోత్సహిస్తున్నాం. వ్యాపార ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా శిక్షణ అందించాం. – డాక్టర్ సతీష్ సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
పీవీఎల్ చాంప్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవా ర్డును దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో కోల్‌కతా ఆటగాళ్లు పాయింట్లు గెలిచి వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు. వినీత్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ గా... ఎస్వీ గురుప్రశాంత్ (హైదరాబాద్ బ్లాక్‌హాక్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా... అంగముత్తు (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘బెస్ట్ స్పైకర్ ఆఫ్ ద సీజన్’గా... జాన్ జోసెఫ్ (హైదరాబాద్ బ్లాక్ హాక్స్) ‘బెస్ట్ బ్లాకర్ ఆఫ్ ద సీజన్’గా... షాన్ జాన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
Prime Volleyball League: వాలీబాల్ లీగ్‌కు వేళాయె... ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే!
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడలో కూడా లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 27న ఫైనల్‌తో ముగుస్తుంది. మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి జరుగుతాయి. మ్యాచ్‌లను సోనీ టెన్–1,2,3,4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, చెన్నై బ్లిట్జ్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్పెడోస్, కాలికట్ హీరోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ పేర్లతో మొత్తం 7 జట్లు బరిలో ఉన్నాయి. ఒక్కో జట్టులో 14 మంది చొప్పున ఆటగాళ్లు ఉండగా, అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ యులు. గ్రూప్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొంటుండటం విశేషం. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచకప్ గెలుచుకున్న జట్లలో సభ్యుడైన అమెరికా దిగ్గజం డేవిడ్ లీ కాలికట్ తరఫున ఆడ బోతున్నాడు. హెన్రీ బెల్, జెరోమ్ వినీత్, అజిత్, అశ్వల్ రాయ్, అమిత్ గులియా, ముత్తుస్వామి ఇతర కీలక ఆటగాళ్లు. హైదరాబాద్ జట్టుకు విపుల్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... అర్జెంటీనాకు చెందిన రూబెన్ వెలోచిన్ కోచ్‌గా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ప్రేక్షకులను లీగ్ చూసేందుకు అనుమతించడం లేదు. బేస్ లైన్ వెంచర్స్ సంస్థ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను ప్రమోట్ చేస్తుండగా... ఫాంటసీ గేమ్ కంపెనీ అ23 ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు మద్దతు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లీగ్‌కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిసి ఈ లీగ్ మ్యాచ్ బాల్‌ను, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని ఆయనకు అందజేశారు. ఈనెల 5 నుంచి 27 వరకు ఏడు జట్ల మధ్య గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమాని శ్యామ్ గోపు, బెంగళూరు టార్పెడోస్ సహ యజమాని యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు తరలిరానున్న తారాలోకం
హైదరాబాద్‌లో వేసవిని కూల్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్ తరలి రానున్నారు. మే నెలలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హైదరాబాద్‌లో ‘ద -బాంగ్’ పేరుతో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఈవెంట్... లూనెట్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగనుంది. లూనెట్టీస్ సమర్పిస్తున్న ది ద-బాంగ్ టూర్‌ను సోహాలీ ఖాన్ ఎంటర్టైన్మెంట్, జేఏ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా, జాక్వలిస్ ఫెర్నాండెజ్, డైసీ షా, ప్రభుదవ, గురు రంధ్వా తదితరులు ‘ది ద-బాంగ్’ టూర్లో భాగం కానున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 మందికి పైగా నృత్య కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. మే 12 గచ్చిబౌలీలో ఈవెంట్‌ను ప్లాన్ చేయనున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ ఫర్హాన్ హుస్సేన్ తెలిపారు. వీటికి సంబంధించిన ఎంట్రీ పాసులు మేరా ఈవెంట్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఔట్లెట్లలో లభిస్తాయని తెలిపారు. -
ఐఫా అదరహో