ఎండుకొబ్బరి ఎక్కువకాలం తాజాగా... | ​Home Tips: How to store dry coconut for a long time | Sakshi
Sakshi News home page

ఎండుకొబ్బరి ఎక్కువకాలం తాజాగా...

Jul 17 2025 10:07 AM | Updated on Jul 17 2025 10:56 AM

​Home Tips: How to store dry coconut for a long time

మరింత రుచికోసం కూరలు, స్వీట్లలో ఎండుకొబ్బరిని వినియోగిస్తుంటాం. దీనికోసం కొబ్బరిని ఇంట్లో నిల్వచేసుకుంటూ ఉంటాం. కానీ కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ...

మార్కెట్‌ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా గుడ్డతో తుడిచి, గంటసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత కవర్‌లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. 

టేబుల్‌ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపలా బయటా తుడవాలి. అలా తుడిచిన చిప్పలను ఎండలో ఆరబెట్టి, కవర్‌లో వేసి ఉంచాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే  ఎక్కువ రోజులు చిప్పలు తాజాగా ఉంటాయి.  

(చదవండి: హీరో మాధవన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్‌ 21 రోజుల్లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement