
హైదరాబాద్ శివార్లలో రెండున్నర బిలియన్ ఏళ్ల క్రితం వెలసిన అరుదైన వారసత్వ రాతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కొనియాడారు. అదే లక్ష్యంగా నృత్యం, ఇకెబనా ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజాన కేంద్రంలో నిర్వహించారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌రాక్ డే సందర్భంగా పర్యావరణంలో ముఖ్య భూమికను పోషించే రాతి సంపదను ఆయా దేశాలు ఎలా కాపాడుకుంటారో వివరించారు. నయనతార నందకుమార్ అవర్ సీక్రేడ్ ప్లేస్‌కు చెందిన వారు అంతరించిపోతున్న రాతి సంపద గురించి డ్యాన్స్ రూపంలో వివరించారు.
పుప్పాలగూడలోని పకృద్ధీన్ గుట్ట 400 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, గుట్టను ఎలా ధ్వంసం చేస్తున్నారో, కంచె గచ్చిబౌలిలో పురాతన రాళ్లు, పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు. నగర శివార్లలో రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం వెలసిన రాతి సంపదకు ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని నయనతార వివరించారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాళ్లు, నీళ్లు, చెట్లు ఎలా మమేకమవుతాయో వివరిస్తూ ఓరా స్కూల్ ఆఫ్ ఇకెబనా హైదరాబాద్ చాప్టర్ సభ్యులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
చెట్లకు రాళ్లు మినరల్స్‌ను అందిస్తాయని, రాళ్లలో పక్షలతో పాటు అనేక ప్రాణులు జీవిస్తాయని తెలియజేశారు. పర్యావరణ విచ్ఛిన్నం వల్లే గ్లోబల్‌వారి్మంగ్, అతి వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి అవాంతరాలు వస్తున్నాయని ఓరా స్కూల్ ప్రెసిడెంట్ నిర్మల పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రెసిడెంట్ ఫాతిమా అలీఖాన్, వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జనరల్ సెక్రెటరీ ఫ్రాక్ ఖాదర్ పాల్గొన్నారు.
(చదవండి: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా ‘గివ్ హిమ్ నోబెల్’ ..!)