Ananthapur
-
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్‌లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి. -
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి స్వాఽధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు 65 క్వింటాళ్ల (140 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటకు లారీలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని విజిలెన్స్ సీఐ జమాల్ బాషా, ఏఈ రవీంద్రనాథ్, సీఎస్‌డీటీ జ్యోతి తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని గొల్లపల్లి దగ్గర లారీని ఆపి తనిఖీ చేశారు. బిల్లులు, రసీదులు లేకుండా తరలిస్తున్న 65 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాప్తాడు సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్‌తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్‌బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్‌కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్‌బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్‌పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్‌బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్‌లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్‌కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్‌లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
జంట హత్యల కేసులో మరొకరు లొంగుబాటు
రాప్తాడు: జంట హత్యల కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు తర్వాత.. తాజాగా మరొకరు కోర్టులో లొంగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, మృతుడు నారాయణరెడ్డి కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించడంతో ఈ నెల 19న ఆరుగురు నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల ఇంద్రశేఖర్, నీరుగంటి నిరంజన్‌రెడ్డి, దండు నరేంద్ర, గంగలకుంటకు చెందిన బుడగ లక్ష్మీనారాయణ, అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చెందిన దయ్యం హన్మంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న వారిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలిస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో గాయపడిన పామాల కొండప్ప అనే నిందితుడు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన బాల నరసింహారెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడని సీఐ శ్రీహర్ష తెలిపారు. కోర్టు ఉత్వర్వుల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల పండయ్య, పామాల్ల కొండప్ప, గొనిపట్ల శీనా, పాత్రికేయుడు గొల్లపల్లికి చెందిన పెద్దింటి జగదీష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. రాయదుర్గం విద్యార్థినికి ‘షైనింగ్ స్టార్’ అవార్డు రాయదుర్గంటౌన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 587/600 మార్కులతో ప్రతిభ కనబరచిన రాయదుర్గం కేజీబీవీ విద్యార్థిని ఎన్.అక్షయ ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికయ్యింది. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అక్షయ అందుకుంది. గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేసి కేజీబీవీ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మితోపాటు విద్యార్థిని తల్లిదండ్రులు గంగమ్మ, మల్లికార్జునలను అభినందించారు. -
బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ
ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఫొటోల కోసం పాకులాడటమేంటి? అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటేవాటిపై పాలకులు నోరు మెదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉరవకొండ/ఉరవకొండ రూరల్: హంద్రీ–నీవా ప్రాజెక్టు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో.. ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో అనే అంశంపై చర్చకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విసిరిన చాలెంజ్‌ను ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి స్వీకరించారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి ఉరవకొండలో ర్యాలీగా వెళ్లి క్లాక్‌టవర్ వద్దనున్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ చర్చ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల ప్రాంగణం వద్దకు ఎమ్మెల్సీ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు, అధికారులు తలుపులకు తాళం వేశారు. అయినా ఎమ్మెల్సీ వెనక్కు తగ్గలేదు. ప్రహరీ దూకి శిలాఫలకం వద్దకు చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా వేచి చూసినా సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అక్కడకు రాలేదు. అనంతరం శివరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండకు రాకుండా కాలవ శ్రీనివాసులు జీడిపల్లి రిజర్వాయర్ వద్ద చర్చకు రావాలంటూ కొత్త డ్రామాకు తెరదీయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు మొదటి దశ పనులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసి, జీడిపల్లి వరకు నీటిని తీసుకెళ్లారని గుర్తు చేశారు. 40 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో కుదించడానికి చర్యలు చేపట్టడంతో పాటు నిధులు విడుదల చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్యులకు పెంచి, రూ.9,318కోట్లు మంజూరు చేశారని జీఓ కాపీలు చూపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవాను ఆదాయ వనరుగా భావించి 3,600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేయడానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ఫోన్ చేసి బహిరంగ చర్చకు ఉరవకొండకు రావాలని ఆహ్వానించగా.. జీడిపల్లి వద్దకు రావాలని మెలిక పెట్టడం చూస్తే ఆయన సవాల్‌కు కట్టుబడి లేరని అర్థమైందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. హంద్రీ–నీవాపై మాట్లాడే దమ్ములేకే అని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం ఉరవకొండకు రమ్మంటే జీడిపల్లికి రావాలంటూ మెలిక పెట్టిన కాలవ -
25న సివిల్స్ ప్రిలిమినరీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 25న జరగనుందని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు.చీనీ టన్ను రూ.42 వేలు అనంతపురం మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.42 వేలు పలికాయి. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025అనంతపురం సిటీ: ‘విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. ఉన్నతాధి కారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పేదల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి’ అంటూ జెడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, శ్రీసత్యసాయి జిల్లా జేసీ అభిషేక్ కుమార్, సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అనంతపురం,మడకశిర, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ముందుగా భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ సహా ఇతర సైనికుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. ఆ తరువాత సభను చైర్పర్సన్ గిరిజమ్మ కొనసాగించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ సహా అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, శెట్టూరు జెడ్పీటీసీ సభ్యులు జూటూరు చంద్రకుమార్, నీలం భాస్కర్, వాసల్లి హనమంతు, మంజునాథ, వజ్రకరూరు ఎంపీపీ రమావత్ దేవి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాతో పాటు కడప, కర్నూలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల వారికి అనువైన అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదన్నారు. కర్నూలు లేదా బెంగళూరుకు రెఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు చాలా మంది ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారన్నారు.సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అసమర్థత, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, కొన్నేళ్లుగా పాతుకుపోయి మామూళ్ల మత్తుకు అలవాటుపడి ఆస్పత్రి పరువు తీస్తున్నారని, వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల ఓ రోగిని అనంతపురం శివారులోని సవీరా ఆస్పత్రికి తీసుకెళ్లగా స్టంట్ వేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చవుతుందంటూ అక్కడి వైద్యులు తెలిపారని, అయితే రోగిని బెంగళూరుకు తరలించి టెస్ట్ చేయించగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారని సభ్యులు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ఆపరేషన్లు, స్టంట్లు వేస్తూ సవీరా యాజమాన్యం రోగులను దోచుకుంటోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆ తరువాత వెళ్లిపోతుండటంతో అత్యవసర కేసులకు దిక్కులేకుండా పోతోందన్నారు. విడపనకల్లు మండలంలో తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదానికి గురి కాగా, ప్రాణాపాయ స్థితిలో స్థానిక పీహెచ్‌సీకి తరలిస్తే.. ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో లేరని జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు ఆరోపించారు. బళ్లారికి తరలించేలోపే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సవీరా ఆస్పత్రిలో జరిగే వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. సర్వజనాస్పత్రిలో పరిస్థితి గాడిన పడుతోందని, రోజూ 2 వేల నుంచి 2,500 వరకు రోగులు వస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జోక్యం చేసుకుంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ సర్వజనాస్పత్రితో పాటు పీహెచ్సీ, సీహెచ్‌సీలను కూడా రాత్రిళ్లు తనిఖీ చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓలను ఆదేశించారు. తాను ఇటీవల కొన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించానని, దయనీయ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘ఉపాధి’లో భారీగా అక్రమాలు ఉపాధి హామీ పథకం అమలులో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. నిధులను ఎవరు మెక్కుతున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సలీం బాషాను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీలో అతిథి గృహాలు లేక మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు అవస్థలు పడుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 8లోన్యూస్రీల్ఉమ్మడి జెడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఇష్టారాజ్యం గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఆరోగ్యశ్రీ బాధితులను హడలెత్తిస్తున్న సైబర్ నేరగాళ్లు చిన్న సమస్యతో సవీరాకు వెళ్లినా ఆపరేషన్లు, స్టంట్లు అంటూ ప్రాణాలతో చెలగాటం ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందంటూ సభ్యుల ధ్వజం -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ పిలుపునిచ్చారు. అనంత మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. హంద్రీ–నీవా లైనింగ్ పనులను తక్షణం ఆపాలని, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించేలా పోరాడదామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. విభజన హామీల్లో జిల్లాకు మంజూరైన ఎయిమ్స్‌ను గతంలో మంగళగిరికి తరలించారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు.అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 రకాల సమస్యలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ దుశ్చర్యలను గమనించాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అరాచక పాలన చేస్తే ప్రజల నుంచి ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, హిందూపురం పార్ల మెంట్ పార్టీ పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబ శివారెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ పంచా యతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి -
మొత్తం ఖాళీలు 7,710
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేయడంతో జిల్లా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయనుండగా, ఎస్జీటీ కేడర్ టీచర్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేసేలా షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే మ్యానువల్‌గా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు, సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే తప్పనిసరిగా బదిలీ అయ్యే హెచ్ఎంలు, టీచర్ల లెక్కలు తేల్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్–మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఈ నాలుగు యాజమాన్యాల కింద జిల్లాలో మొత్తం 14,784 మంది అన్ని కేడర్ల టీచర్లు పని చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో ఏడు రకాల ఖాళీలను గుర్తించారు. మొత్తం 7,710 ఖాళీలను తేల్చారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 193, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 6,225, మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 231, మునిసిపల్ స్కూళ్లలో 1,061 ఖాళీలున్నట్లు గుర్తించారు. ఏడు రకాల ఖాళీలు ఇలా... అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 5/8 ఏళ్లు పూర్తయిన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ఖాళీలు 3,826 ఉన్నాయి. రీ–అపోర్షన్ ఖాళీలు 2,913, స్పష్టమైన ఖాళీలు 942, ఫారెన్ సర్వీస్ కింద వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలు 5, బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లు పని చేస్తూ ఏర్పడిన ఖాళీలు 02, వివిధ డిగ్రీలు చేసేందుకు సెలవులో వెళ్లిన టీచర్ల స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు 19, అనధికార గైర్హాజరుతో ఏర్పడిన ఖాళీలు 3 ఉన్నట్లు వెల్లడైంది. బదిలీల షెడ్యూలు ఇలా... హెచ్ఎంల బదిలీలకు సంబంధించి గురువారం ఆన్లైన్ దరఖాస్తు, పరిశీలన, 24న ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 26న అభ్యంతరాల పరిష్కారం, 27న ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల, 28న వెబ్ ఆప్షన్స్, 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. అదేరోజు స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంల పదోన్నతుల వెబ్ ఆప్షన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీరికి 31న పదోన్నతల ఉత్తర్వుల జారీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు సంబంధించి... 24 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 25–దరఖాస్తుల పరిశీలన. 26,27 తేదీల్లో ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, 28న అభ్యంతరాల స్వీకరణ, 28,29 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 31న ఫైనల్ జాబితా ప్రకటన, జూన్ 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్, 4న బదిలీ ఉత్తర్వుల జారీ. 05న ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్, 06న పదోన్నతుల ఉత్తర్వుల జారీ. ఎస్జీటీ కేడర్‌కు సంబంధించి... ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 28–దరఖాస్తుల పరిశీలన. 31న ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, జూన్ 01న అభ్యంతరాల స్వీకరణ, 01,02 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 06న ఫైనల్ జాబితా ప్రకటన, 07 నుంచి 10 వరకు తేదీల్లో వెబ్ ఆప్షన్, 11న బదిలీ ఉత్తర్వుల జారీ. వీరికి మ్యానువల్ కౌన్సెలింగ్ ఉన్నా ఈ షెడ్యూలు మేరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీచర్ బదిలీల ప్రక్రియ వేగవంతం 30న హెచ్ఎంల బదిలీల ఉత్తర్వులు జూన్ 4న స్కూల్ అసిస్టెంట్, 11న ఎస్జీటీలకు.. -
మహాత్మా.. వారికి మంచి బుద్ధి ప్రసాదించు!
అనంతపురం సిటీ: మడకశిర, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు శాంతియుత నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో ముగ్గురు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లోకి ఎటువంటి ముందస్తు అను మతి లేకుండా వెళ్లడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై జెడ్పీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపినట్లు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తెలిపారు. చైర్పర్సన్ చాంబర్లోకి వెళ్లి రచ్చ చేసి.. జాతిపిత మహాత్ముడి చిత్రపటాన్ని తొలగించి సీఎం చంద్రబాబు ఫొటో పెట్టడం, మాజీ సీఎం జగన్ ఫొటో పూర్తిగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే జెడ్పీ సమావేశంలో చైర్పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లకుండా.. అధికారం అండతో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీఈఓను ఏకవచనంతో దూషించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. -
ఎట్టకేలకు మొదలైన విత్తనశుద్ధి
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టారు. ఖరీఫ్ సమీపిస్తున్నా రైతుల కష్టాలు కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని, వ్యవసాయఽశాఖ మొద్దునిద్ర వీడటం లేదని ‘సాక్షి’లో ఇటీవల వరుసగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో 40 శాతం మేర రాయితీ, అమ్మకం ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించక మునుపే బుధవారం విత్తనశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న విజయా ఆగ్రోసీడ్స్ ప్లాంట్‌లో ఏడీఏ ఎం.రవి ఆధ్వర్యంలో విత్తనశుద్ధిని ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించడానికి వీలుగా ప్రాసెసింగ్ చేయాలని ఏడీఏ ఆదేశించారు. ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే ఆర్ఎస్కేలకు సరఫరా చేయాలని సూచించారు. జూన్ మొదటి వారంలో విత్తన పంపిణీ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ! విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు సమాచారం. అలాగే క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.9,300 ప్రకారం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై అటు వ్యవసాయశాఖ, ఇటు ఏపీ సీడ్స్ అధికారులు మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక.. కందులు, చిరుధాన్యాల ధరలు కూడా ఖరారు కాలేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తన కేటాయింపులు, ధరలు, రాయితీలు ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. ఒక్క క్వింటా కూడా సరఫరా కాకపోవడం విశేషం. -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్‌లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ (06589)లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్ చేరుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ (06590)లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజూమున 3 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాహబాద్, కలబురిగి, హోమ్నాబాద్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 3–ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్‌లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ శంకర్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శింగనమల, నార్పల, అనంతపురం, రాయదుర్గం, శెట్టూరు, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, ఉరవకొండ, విడపనకల్లు, బ్రహ్మసముద్రం, కణేకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, యాడికి, కూడేరు, బుక్కరాయసముద్రం, వజ్రకరూరు, కుందుర్పి తదితర మండలాల్లో వర్షం పడింది. కాగా గురువారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
‘బాబూ.. రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు?’
సాక్షి, అనంతపురం/తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యనించారు.వరదల్లో ఆదుకున్నవి ఇవే కదా: కారుమూరి తాడేపల్లిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ, ఆ సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను చంద్రబాబు తొలగించారు. ఈ వాహనాల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం జరిగింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ఎలా నాశనం చేయగలుగుతున్నారు?. ఎండీయూల తొలగింపు ద్వారా 20వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2.60 లక్షల మంది వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ రేషన్ బియ్యాన్ని ఆపేయటం ఏంటి?. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ నిలిపేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఎండీయూ వాహనాలు ఆ తర్వాత డిపోలు తొలగిస్తారు. చంద్రబాబుది శాడిస్టు బుద్ధి. అందుకే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గోదావరి వరదలు, విజయవాడ వరదల సమయంలో ఎండీయూ వాహనాలే ఆదుకున్నాయి. ఎండీయూ వాహనదారులకు మేము అండగా నిలుస్తాం. ఆ వాహనాలను కొనసాగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎండీయూ వాహనాల ద్వారా ఏం అక్రమాలు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి?. సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఏమైంది?. ఆ కేసులో ఎంత బియ్యం సీజ్ చేశారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. జగన్ సంస్కరణలను నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. -
కఠినంగా ప్లాస్టిక్ నిషేధం అమలు
అనంతపురం అర్బన్: ‘‘నగర, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తాం. విక్రయించే వ్యాపారులకు భారీ జరిమానాలు విధిస్తాం. ఇప్పటికే 56 మందికి నోటీసులిచ్చాం’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారురు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనంలోనే చెత్త వేయాలన్నారు. త్వరలో నగరంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, వీరు కాలనీల్లో తనిఖీ చేస్తూ చెత్తను బయట పడేస్తున్న వారికి జరిమానా విధిస్తారన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నెల రోజుల పాటు ‘యోగాంధ్ర–25’ కార్యక్రమాలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తొలి రోజు నగరంలోని ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. యోగాపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. యోగాకు సంబంధించి యాప్‌ను అందుబాటులోకి తెస్తామని, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు అందులో రిజిస్టర్ కావాలని సూచించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీఎస్డీఓ ఉదయభాస్కర్ పాల్గొన్నారు. వంకలు ఆక్రమిస్తే కఠిన చర్యలు వంకలు, వాగులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఆక్రమణలపై మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నగర పరిధిలోని పండమేరు, తడకలేరు, నడిమివంక, మరువవంక తదితర వంకలు, వాగుల ఆక్రమణలపై సర్వే చేపట్టాలని సర్వే శాఖ అఽధికారులకు సూచించారు. ఆక్రమణదారుల ఇళ్లకు నోటీసులు అతికించడంతో పాటు చేతికి కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో చర్చించాలన్నారు. ఎంత వర్షం వచ్చినా నగర పరిధిలోని అన్ని కాలువల్లోనూ నీరు నిలువకుండా సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. పండమేరు వంక నుంచి అనంతసాగర్ చెరువు వరకూ శుభ్రం చేయించాలన్నారు. అక్కడి నుంచి శింగనమల చెరువుకు నీరు సాఫీగా వెళ్లేందుకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్లు హరికుమార్, మోహన్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వి.వినోద్‌కుమార్ -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించేలా చూడాలని కోరారు. వ్యక్తిపై కేసు నమోదు గార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్‌బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. రేషనలైజేషన్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం అనంతపురం అర్బన్: ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా తీవ్రంగా నష్టపోతామని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ వద్ద అసోషియేషన్ ఆఫ్ సెక్రటరీయేట్ రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ బాషా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మైలారప్ప, పవన్‌కుమార్, ఉపాధ్యక్షుడు అఖిల్‌కుమార్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అన్ని శాఖల్లో విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా చాలా నష్టపోతామన్నారు. ఈ ప్రక్రియలో రెండు లేదా మూడు సచివాలయాలను క్లస్టర్‌గా చేస్తున్నారన్నారు. దీంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ ఇలా అన్ని శాఖల పనులు ఒకేసారి చేయాల్సి వస్తుందన్నారు. దీంతో ఒత్తిడి పెరిగి పనిలో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ క్రమంలో చోటు చేసుకునే తప్పిదాలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, కులశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విచారణకు 33 మంది ఎల్టీల హాజరు అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో ల్యాబ్ టెక్నీషియన్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం చేపట్టారు. బోధనాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 35 మందికి గాను 33 మంది హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులుగా డాక్టర శ్యామ్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ ఆది నటేష్ వ్యవహరించారు. -
దారుణంగా రైతుల పరిస్థితి
వరి రైతులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కంటికి రెప్పలా కాపాడిన పంటలపై ప్రకృతి పగ పడుతోంది. ఈ క్రమంలో అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తే, రైతుల వద్ద మిగిలిపోయిన దాన్ని ఎవరు కొంటారో అధికారులు, పాలకులు సమాధానం చెప్పాలి. మరో 5 వేల మెట్రిక్ టన్నులతో పాటు తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి. – మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త,రాయదుర్గం -
రైతులపై చంద్రబాబు సర్కార్‌కు కాసింతైనా కనికరం లేకుండా పోతోంది. వారి పట్ల అంతులేని చులకనభావం ప్రదర్శిస్తోంది. జిల్లాలో అరకొరగా వరిధాన్యం సేకరణ చేపట్టి అంతటితోనే సరిపెట్టింది. దీంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
బొమ్మనహాళ్ వద్ద వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో లోడ్ చేస్తున్న దృశ్యం (ఫైల్)రాయదుర్గం: జిల్లావ్యాప్తంగా గత రబీలో 4,528 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇందులో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టు భూముల్లోనే 3 వేల హెక్టార్లకు పైగా సాగు చేశారు. ఈ క్రమంలో 29,960 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే, పంట కోతకొచ్చే ముందు ఈదురుగాలులు, వడగండ్ల వాన కారణంగా పంట దెబ్బతిని కేవలం 18 వేల మెట్రిక్ టన్నులే దిగుబడి వచ్చింది. 3,900 మెట్రిక్ టన్నులతో సరి.. ‘పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరతో కొంటాం. తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటాం’ అంటూ సీఎం చంద్రబాబు పలు సభలు, సమావేశాల్లో ప్రగల్బాలు పలికారు. అయితే ఆయన మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు పొంతనే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం జిల్లాలో ఏడు చోట్ల ఆర్భాటంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. కేవలం 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో జిల్లాలో రైతుల వద్ద ఇంకా సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండిపోయింది. కొందరు దళారులకు అమ్ముకుంటుండగా.. చాలామంది ప్రభుత్వం ఇంకా సేకరిస్తుందేమోననే ఆశతో కల్లాల్లోనే ధాన్యం రాశులను కుప్పపోశారు. వరుణుడి భయం.. సాధారణంగా మేలో భానుడు భగభగ మండిపోతాడు. అయితే ప్రకృతి మార్పుల కారణంగా కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కల్లాల్లో ధాన్యం రాశులున్న అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం గమనార్హం. ఇంకా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు అధికారులు చెబుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన అధికమవుతోంది. అదనంగా మరో 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా వీలైనంత త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరి రైతు ఘోష 3,900 మెట్రిక్ టన్నుల సేకరణతో సరిపెట్టిన కూటమి సర్కార్ మరో 3 వేల టన్నులు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ఇంకా కల్లాల్లోనే ధాన్యం రాశులు అన్నదాతలను భయపెడుతున్న వర్షాలు స్పందించని చంద్రబాబు ప్రభుత్వం -
అధికారులే టో(తో)లు తీశారు!
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆదాయానికి అధికారులే గండి కొట్టారు. సంస్థను లాభాల్లో నడిపించాల్సింది పోయి జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా ఈ రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందల కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చింది. అద్దె బస్సుల టెండర్లలో కీలక నిబంధన గాలికి ఆర్టీసీకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో అద్దె బస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆన్లైన్ టెండరు నిర్వహించారు. టెండరులో పాల్గొనే వాహన యజమానులకు 200పై చిలుకు నిబంధనలు విధించారు. ఇందులో 1 నుంచి 10 వరకు కీలక షరతులు ఉన్నాయి. ప్రధానంగా అద్దెకు ఇచ్చే బస్సు ఏ జిల్లాలో అయితే నడుపుతారో ఆ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇక్కడే అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. జిల్లాలో 100కు పైగా అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఇందులో 70కి పైగా అద్దె బస్సులు ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించినవి కావడం గమనార్హం. సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ), రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఉదాసీన వైఖరి కారణంగా అద్దె బస్సుల టెండర్ ఖరారులో కీలక నిబంధన కాస్త కనుమరుగైంది. ఈడీ అలాంట్మెంట్ ఆర్డరు ఇచ్చినప్పుడు అద్దె బస్సుకు లోకల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను పొందుపరిచినప్పటికీ జిల్లా స్థాయి అధికారి తుంగలో తొక్కి 9 ఏళ్ల కాల వ్యవధితో అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేలా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు అనుమతులు ఇచ్చేశారు. ఈ అనుమతుల జారీ వెనుక సదరు జిల్లా స్థాయి అధికారి భారీగా ముడుపులు దండుకున్నట్లుగా సంస్థ ఉద్యోగులే బాహాటంగా పేర్కొనడం గమనార్హం. సంస్థకు చేకూరిన నష్టమిలా.. లోకల్ రిజిస్ట్రేషన్ అయిన అద్దె బస్సులను ఆర్టీసీ నడిపితే టోల్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. 30 రోజుల పాటు ఒక బస్సు రోజుకు 366 కిలో మీటర్లు తిరిగితే నెలకు రూ.50 వేలు టోల్‌ఫీజు చెల్లించాలి. లోకల్ వాహనమైతే రూ.25 వేలతో సరిపోతుంది. కాగా నాన్‌లోకల్ వాహనం కావడంతో నెలకు అదనంగా ఆర్టీసీ రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన ఒక అద్దె బస్సుకు రెండేళ్లలో టోల్ ఫీజు కింద అదనంగా రూ.6 లక్షలను ఆర్టీసీ చెల్లించింది. ఇలా జిల్లాలో నాన్‌లోకల్ కింద రిజిస్ట్రేషన్ కలిగిన 70కి పైగా అద్దె బస్సులకు అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంస్థ రూ.4.20 కోట్లు నష్టపోయింది. నష్టాన్ని గుర్తించిన చిరుద్యోగి లోకల్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సులకు టోల్‌ఫీజు రాయితీ కోల్పోతోందనే విషయాన్ని ఓ చిరుద్యోగి గుర్తించారు. ఈ విషయాన్ని తన కార్యాలయంలోని ఆర్ఎంకు వివరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సదరు అధికారి మాత్రం కిమ్మనకుండా చేతులెత్తేశారు. కాగా, ఈ సమస్యను సదరు ఉద్యోగి గుర్తించి నేటికి ఆరు నెలలు కావస్తోందని సమాచారం. అకౌంట్ సెక్షన్ ఏం చేస్తోందంటూ తొలుత ఆర్ఎం హంగామా చేసినా క్రమేణా ఆ ఊసే ఎత్తకుండా మిన్నకుండిపోయారు. కాగా ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని ఓ డిపోలో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగి ఈ సమస్య తన తలకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ ఆర్ఎంకు లేఖ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం ఆరు నెలల క్రితమే ఓ చిరుద్యోగి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి సంస్థ ఏడాదికి ఎంత మేర నష్టపోతుందో గణాంకాలతో వివరించినా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. సదరు అద్దె బస్సుల యజమానులకు నోటీసులు జారీ చేసి ఇప్పటికై నా నష్టాన్ని పూడ్చాలని సలహా ఇచ్చిన పాపానికి ఉన్నతాధికారులు అందరూ ఏకమై విషయాన్ని తొక్కి పెట్టినట్లు సమాచారం. సమస్య గుర్తించిన తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఆరు నెలల్లో రూ. కోట్లలో నష్టాన్ని అరికట్టి ఉండవచ్చు. అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అద్దె బస్సులతో ఆర్టీసీకి రూ.కోట్లలో నష్టం లోకల్ రిజిస్ట్రేషన్ ఉండాలన్న ప్రధాన నిబంధన తుంగలోకి నాన్‌లోకల్ వాహనాలు కావడంతో టోల్ ఫీజు చెల్లింపునకు వర్తించని రాయితీ -
ధాన్యం తడిసిపోయింది
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. రూ.లక్షల పెట్టుబడి పెట్టా. ప్రకృతి విపత్తులను దాటి అరకొరగా చేతికందిన పంటను కల్లంలో కుప్పచేసుకునే లోపే కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఆపేశారు. అధికారుల్ని అడిగితే టార్గెట్ పూర్తయిందని చెప్పారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కల్లంలో ధాన్యం తడిసి ముద్దయింది. టార్ఫాలిన్ షీట్లు లేకపోవడంతో మొలకలు కూడా వచ్చాయి. ప్రభుత్వం త్వరగా స్పందించి మరింత ధాన్యం కొనుగోలు చేయాలి. – ముజంబిల్, కౌలు రైతు, కణేకల్లు -
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్‌లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి. -
కలెక్టరేట్ ఎదుట 102 వాహన డ్రైవర్ల ధర్నా
అనంతపురం అర్బన్: వేతన బకాయిలు చెల్లించడంతో పాటు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్ ఎదుట తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) డ్రైవర్ల మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్ మాట్లాడారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లుగా 500 మంది అరబిందో సంస్థ ద్వారా ఆరోగ్యశాఖకు సేవలందిస్తున్నారన్నారు. ఏడేళ్లుగా తమకు కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, గత మూడు నెలలుగా అదీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీటీసీ పేరిట యాజమాన్యం కట్టాల్సిన పీఎఫ్ వాటానూ ఉద్యోగుల నుంచే మినహాయిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. వేతనాన్ని పెంచి ప్రతి నెలా రూ.18,500 కచ్చితంగా ఇవ్వాలన్నారు. తన వాటా పీఎఫ్‌ను యాజమాన్యమే చెల్లించాలన్నారు, చట్టప్రకారం సెలవులు అమలు చేయాలన్నారు. ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలు చెల్లించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సాయిచరణ్, కోశాధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ● డీఎంఈ నరసింహం -
ఆర్టీసీ అధికారులపై కలెక్టర్ సీరియస్
అనంతపురం క్రైం: కలెక్టర్ వినోద్‌కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు డిపో, పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి సమస్యనూ అడిగి తెలుసుకుని ఏళ్ల తరబడి పట్టించుకోకుండా అలాగే ఎందుకు వదిలేశారంటూ సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో లోపల డ్రెయినేజీ కాలువ మొత్తం చెత్తతో నిండి కంపుకొడుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే జేసీబీలను రప్పించి శుభ్రం చేయించారు. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. బస్టాండు ఆవరణమంతా గుంతల మయంగా మారి వర్షపు నీరు నిండి ఉండటాన్ని గమనించి మట్టితో గుంతలను పూడ్చాలని సూచించారు. ఫ్లాట్‌ఫాంల వద్ద ప్రయాణికులను కలసి సమస్యలపై ఆరా తీశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించక పోతే ఎలా అని ప్రశ్నించారు. అధిక ధరలకు స్నాక్స్ విక్రయిస్తున్న రెండు దుకాణాలను గుర్తించి రూ.25 వేలు జరిమానా విధించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రతి స్టాల్ నిర్వాహకుడు తప్పనిసరిగా దుకాణం ముందు డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేయకపోతే జరిమానా విధించాలన్నారు. ఇకపై పరిస్థితుల్లో మార్పురాకపోతే చర్యలు తప్పవని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు. -
బదిలీల గోలలో విత్తన పంపిణీ ఆలస్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ముంచుకొస్తున్నా ఇప్పటికీ విత్తన ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా, పంపిణీ చురుగ్గా కొనసాగాల్సివుండగా... ప్రస్తుతానికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో విత్తన పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మండల వ్యవసాయాధికారులు (ఎంఏఓలు), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) విత్తన పంపిణీలో కీలకం. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్లు భాగస్వాములు కావాలి. అయితే, ఏఓలు, ఏఈఓలు పెద్ద సంఖ్యలో బదిలీలు అవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖలో అన్ని విభాగాల పరిధిలో ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసు పూర్తీ చేసుకున్నవారు ఏకంగా 144 మంది ఉన్నారు. వీరందరికీ తప్పనిసరిగా స్థానచలనం తప్పదు. ఈ క్రమంలో తమనూ బదిలీ చేయాలంటూ మరికొందరు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఇబ్బందులు తప్పవు.. ఎటూ బదిలీ కాక తప్పదనే ఆలోచనతో చాలా మంది ఏఓలు, ఏఈఓలు విత్తన పంపిణీ పక్రియ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. బదిలీల ప్రక్రియ జూన్ 2న ముగియనుండటంతో అంతవరకు విత్తన పంపిణీ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాతనే విత్తన పంపిణీలో భాగస్వాములు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి, మడకశిర, ధర్మవరం పెనుకొండ, కదిరి ఏడీఏలతో పాటు ‘ఆత్మ’ ఏడీఏ కూడా బదిలీ కానున్నారు. 31 మంది ఏఓలు, 78 మంది ఏఈఓలు, మినిస్టీరియల్ స్టాఫ్ 20 మంది మారిపోనున్నారు. బదిలీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున విత్తన పంపిణీ ఆలస్యం కావడంతో పాటు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, ఏపీఎంఐపీ, మార్కెటింగ్, పట్టు, పశుసంవర్ధక, మత్స్యశాఖలో కూడా బదిలీల కోలాహలం మొదలైంది. సిఫారసు లేఖల కోసం ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో 144 మందికి స్థానచలనం విత్తన పంపిణీపై దృష్టి సారించని వైనం -
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరగాలి అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరం మారుతి నగర్‌లోని కేశవరెడ్డి స్కూల్లో సప్లిమెంటరీ పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 42 కేంద్రాలు ఏర్పాటు చేశారని, 11,124 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు. టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగంలోని ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్‌ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది. ఏపీ ఐసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 3,026 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,781 మంది పరీక్ష రాయగా, 2,590 మంది అర్హత సాధించారు. పురుషులు 1,401 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1,304 మంది (93.08 శాతం), మహిళలు 1376 మంది దరఖాస్తు చేయగా.. 1,286 (94.67 శాతం) మంది అర్హత సాధించారు. జెడ్పీ సమావేశానికి హాజరుకండి అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. అలాగే గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. -
టీచర్ల బదిలీలకు వేళాయె
● నేటి నుంచి హెచ్ఎంల బదిలీలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్‌హెచ్‌ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. హెచ్ఎం పోస్టులు 178 ఖాళీలుఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో రెండేళ్లు పూర్తయి ఉండాలి) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
‘కూటమి’ అరాచకాలకు భయపడొద్దు
పుట్లూరు: కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. సమావేశంలో శైలు మాట్లాడారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ప్రతి మండలంలో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హతే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమష్టి కృషి, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.రాఘవరెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ -
రూ.37 లక్షల మెస్ బిల్లులకు లెక్కల్లేవ్
● డీఎంఈకి నివేదించిన విచారణ కమిటీ ● అకౌంటెంట్ వాణిపై ఫిర్యాదు చేయాలని డీఎంఈ ఆదేశం అనంతపురం మెడికల్: బోధనాస్పత్రిలో వైద్య విద్యార్థుల మెస్ బిల్లులకు సంబంధించి రూ.37 లక్షలకు లెక్కలు సరిగా లేవని విచారణ కమిటీ సభ్యులు డీఎంఈ డాక్టర్ నర సింహంకు తెలియజేశారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలోని లైబ్రరీలో జరిగిన విచారణను డీఎంఈ పరిశీలించారు. విచారణ కమిటీ, వార్డెన్లతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ విద్యార్థుల మెస్ బిల్లులు సంబంధిత అకౌంట్ నుంచి కాకుండా వైద్య విద్యార్థుల అకౌంట్ నుంచి అకౌంటెంట్‌కు వెళ్లినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు విచారణకు ఆదేశించారు. డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ సురేష్ తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు.. నలుగురు విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లకు ఒకరి ఖాతాలో రూ.30 లక్షలు, మరొకరి ఖాతాలో రూ.5 లక్షలు, ఇంకొకరి ఖాతాలో రూ.2 లక్షల వరకు జమ చేసినట్లు, వారి ద్వారా అకౌంటెంట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో వార్డెన్ డాక్టర్ సుచిత్ర, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ విజయ, తదితరుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అకౌంటెంట్ వాణిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును డీఎంఈ నరసింహం ఆదేశించారు. -
హంద్రీ–నీవాపై చర్చకు రా..
● రాయదుర్గం ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సవాల్ ఉరవకొండ: హంద్రీ–నీవా అభివృద్ది పనులపై ముందుగా ప్రకటించినట్లుగానే నేడు (బుధవారం) బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, దమ్ముంటే చర్చ కోసం ఉరవకొండకు రావాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. హంద్రీ–నీవా కోసం ఏ ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేసిందో, ఎంత మేర పనులు పూర్తి చేసిందో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉరవకొండ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు చర్చకు సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్యే కాలవ రాక కోసం తాను అక్కడే వేచి ఉంటానన్నారు. -
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం: టీడీపీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునివ్వగా, అది కాస్తా రసాభాసగా మారింది. ఈరోజు(మంగళవారం) కమ్మ భవన్ లో ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు. టీడీపీకి వైఖరితో మనస్తాపం చెందిన వెంకటేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. ఆపై పురుగుల మందు తాగేశాడు. దాంతో ఆ కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఏరా నా లిమిట్స్‌లో బోర్ వేస్తావా? నీకెంత ధైర్యం. మర్యాదగా బండి స్టేషన్లో పెట్టు. అయ్య చెబితే బండి వదుల్తా. మర్యాదగా ‘పచ్చ’ కండువా వేసుకో.. లేదంటే అంతు చూస్తా...’ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు సర్కిల్ పోలీసుస్టేషన్లో సీఐగా పనిచేస్తున్న రాజు అన్న మాటలివి. టీడీపీ కార్యకర్త కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్న ఈయన అరాచకాలు పెచ్చుమీరిపోయినట్లు విమర్శలొ స్తున్నాయి. ఫలానా వ్యక్తి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే చాలు టార్గెట్ చేసి మరీ టార్చర్ పెట్టడం సీఐకి అలవాటుగా మారిపోయింది.బోర్వెల్ వేయడానికి నీకెంత ధైర్యం..కూడేరు మండలం మరుట్ల–1 కాలనీకి చెందిన శ్రీనివాసులు అద్దెకు బోర్వెల్ బండి తెచ్చుకున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ అభిమాని. ఇటీవల ఉదిరిపికొండ గ్రామ సమీపంలోని ఓ పొలంలో బోర్ వేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ రాజు.. అక్కడికి కానిస్టేబుళ్లను పంపించి లారీని స్టేషన్‌కు రప్పించారు. ఈ క్రమంలో శ్రీనివాసులపై రెచ్చిపోయారు. ‘మర్యాదగా పయ్యావుల శీనప్ప దగ్గరికి వెళ్లు.. అక్కడి నుంచి ఫోన్ చేయిస్తే నీ బండి వదులుతా. అక్కడే పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా’ అంటూ అతన్ని బెదిరించారు. అంతటితో ఆగక ఆర్టీఓను పిలిపించి రూ.60 వేల ఫైన్ వేయించారు. మరో రూ.50 వేల లంచమూ తిన్నారు! చివరకు ఆ బోర్వెల్ బండిని టీడీపీ కార్యకర్తకు అద్దెకు ఇప్పించడం గమనార్హం.నా అనుమతి లేకుండా పాలు సేకరిస్తావా..?మరుట్ల–3 కాలనీకి చెందిన రామాంజనేయులు ‘దొడ్ల’ డెయిరీ కంపెనీకి గ్రామంలో పాల సేకరణ చేసేవాడు. సీఐ దాన్ని పీకేయించి పాలసేకరణకు ఆటోలు రాకుండా ఆపించారు. సేకరణ బాధ్యతలు టీడీపీ కార్యకర్తకు ఇప్పించారు. ఈ క్రమంలోనే రామాంజనేయులు ‘గాయత్రి’ డెయిరీ పాల సేకరణకు వెళ్లగా.. ‘ఏరా ఒకసారి ఆపితే వేరే కంపెనీకి పాలు సేకరిస్తావా’ అంటూ బెదిరించి బలవంతంగా దాన్ని కూడా ఆపేయించారు. సదరు డెయిరీకి సంబంధించిన ఆటో డ్రైవర్‌ను కూడా బెదిరించి ఊర్లోకి రాకుండా చేశారు. దీంతో రామాంజనేయులు ఉపాధి కోల్పోయాడు. అంతేకాదు సీఐ ఎప్పుడేం చేస్తారో అని ఇప్పటికీ అతను భయపడుతున్నాడు.దళిత రైతుకు చుక్కలు..కూడేరు మండలంలో ధనుంజయ అనే రైతు తన పొలానికి ట్రాన్స్ఫార్మర్ బిగించుకున్నాడు. అదే సర్వీసు కింద మరో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ధనుంజయ వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో విద్యుత్ శాఖ ఏఈతో ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించిన సీఐ.. కానిస్టేబుళ్లను పంపించి డీపీని పీకేయించారు. జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీ సుల జీపునకు ధనుంజయ భార్య అడ్డుపడినా ఆమెను పక్కకు లాగేసి మరీ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొచ్చారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు సీఐ రాజు అరాచకాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం చోళసముద్రం గ్రామంలో టీడీపీ కార్యకర్త నిర్వాకంతో కరెంటు పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు ఇచ్చినా ‘తెలుగు తమ్ముడి’పై కేసు నమోదు చేయలేదంటే అధికార పార్టీకి సీఐ ఎంతలా కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
సారూ.. సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్:‘సమస్యలు పరిష్కరించండి సారూ’ అంటూ అధికారులను పలువురు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల,డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్,రామకృష్ణారెడ్డి, ఆనంద్, తిప్పేనాయక్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 460 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● చలానా కట్టినా భూమిని సర్వే చేసేందుకు రావడం లేదని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డికి చెందిన రాము ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 44–3లో 1.69 ఎకరాలు, 43–4లో 90 సెంట్ల సర్వే కోసం చలానా కట్టామని, సర్వేయర్ అందుబాటులో ఉండడం లేదని చెప్పాడు. తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ● ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్‌కు హద్దులు చూపించడం లేదని అనురాధ ఫిర్యాదు చేసింది. రాప్తాడు మండలం పండమేరు గ్రామ సర్వే నంబర్ 134, 135లో వేసిన లే–అవుట్లో తమకు 362వ ప్లాట్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఈ ప్లాట్‌కు హద్దులు చూపించాలని తహసీల్దారు కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపింది. సర్వే చేయించి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరింది. ● శింగనమల మండలం చక్రాయపేట గ్రామ సర్వే నంబర్ 539–2,4,5, 538లో కొందరికి ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందని, అయితే ఒక వ్యక్తి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ గుట్టతో పాటు భూముల్లో యంత్రాల సహాయంతో మట్టిని తోడేసి అక్రమంగా తరలిస్తున్నాడని వెంకటస్వామి ఫిర్యాదు చేశాడు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 460 వినతులు -
రూ. లక్షలు.. ‘చెత్త’లో పోసిన పన్నీరు!
రూ. లక్షలు పెట్టి ఈ వాహనాలు కొనుగోలు చేశారు. వాటితో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సి ఉంది. ఎందుకో తెలియదు కానీ.. పంపిణీ మాత్రం చేయలేదు. దీంతో ఇదిగో ఇలా అనంతపురం హౌసింగ్ బోర్డులోని పార్కులో వృథాగా పడి ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లలు వాటిపైకి చేరి ఆడుకుంటుండడంతో దెబ్బతింటున్నాయి. కొన్ని వాహనాల చక్రాలు అప్పుడే ఊడిపోయాయి. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు వాహనాలను వినియోగంలోకి తెస్తే నగరంలో పరిశుభ్రత మెరుగుపడుతందని ప్రజలు చర్చించుకుంటున్నారు. లేకుంటే రూ. లక్షలు... ‘చెత్త’లో పోసిన పన్నీరు చందంగా మారే పరిస్థితులు లేకపోలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పకడ్బందీగా బదిలీల ప్రక్రియ
అనంతపురం అర్బన్: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అతిక్రమించరాదన్నారు. ఏ దశలోనూ విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాల వేలం ప్రక్రియను జూన్ 20లోపు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారులకు లేఖ రాస్తే వారు వచ్చి పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. కార్యాలయాల్లో వృథా సామగ్రిని కూడా వేలం వేయించి సంబంధిత రికార్డుల్లో వివరాలను పొందుపర్చాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు.‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఅనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలో 975 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,043 మంది విద్యార్థులకు గాను 2,068 మంది హాజరయ్యారు. 42 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 21 కేంద్రాలను తనిఖీలు చేశాయి.రేపు డీఈఓ కార్యాలయ ముట్టడిటీచర్లు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల వేదిక పిలుపుఅనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ రంగ సమస్యలపై సోమవారం ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈనెల 21న జిల్లాలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు వైఎస్సార్‌టీఏ ఎస్.నాగిరెడ్డి, ఆప్టా కె.వెకంటరత్నం పిలుపునిచ్చారు. విజయవాడలోని విద్యాభవన్‌లో దాదాపు 8 గంటలకు పైగా పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, సంచాలకులు విజయరామరాజుతో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్యలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 16 ప్రధాన డిమాండ్లపై ఉన్నతాధికారులు–ఉపాధ్యాయ సంఘాల నేతలు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చలు జరపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరినా అధికారులు అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో 21న డీఈఓ కార్యాలయాల ముట్టడి, 23న కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.బ్యాంక్‌కు తాళం వేసిన రైతులుశెట్టూరు: పంట రుణాలు రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంక్‌కు తాళం వేసి ధర్నా చేపట్టారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో ఈ ఘటన చోటు చేసు కుంది. వివరాలు.. సోమవారం ఉదయం పంట రుణాల రెన్యూవల్ చేయాలంటూ లక్ష్మంపల్లిలోని కెనరా బ్యాంక్ శాఖకు 40 మంది రైతులు వెళ్లారు. అయితే బ్యాంక్‌లో రైతులకు సంబంధించి వన్ బీలు ఆన్లైన్లో కనిపించకపోవడంతో పంట రుణాలను రెన్యూవల్ చేయడం సాధ్యం కాదంటూ బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కొందరు రైతులు మీ సేవ నుంచి, మరికొందరు తహసీల్దార్ సంతకంతో కూడిన 1 బీలను తీసుకెళ్లి బ్యాంక్ అధికారులకు అందజేశారు. వీటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేయడంతో రైతుల్లో అసహనం పెల్లుబుకింది. వెంటనే బ్యాంక్‌కు తాళం వేసి గేట్ ఎదుట బైటాయించారు. సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది రైతులేనన్న విషయాన్ని బ్యాంక్ అధికారులు విస్మరించారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుల్లో రైతుల సమస్యలు, కష్టాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు వైస్ ఎంపీపీ ముత్యాలు,వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకుడు ఇమామ్ వలీ, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. -
మురిపించాయి.. ముంచేస్తాయా?
అనంతపురం అగ్రికల్చర్: అవసరం లేని సమయంలో అధిక వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌లో పంటలు విత్తుకునే సమయంలోనూ, లేదంటే పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో వెనుకటి వర్షాలు చేయిస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి అనుభవాలను చవిచూశామని గుర్తు చేసుకుంటున్నారు. ముందస్తు వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మే సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా... అందులో మే 19 నాటికి 16.8 మి.మీ పడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఏకంగా 79.6 మి.మీ వర్షం కురిసింది. 31 మండలాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి పదింతల రెట్టింపు వర్షపాతం నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో వర్షాలు ముఖం చాటేస్తాయేమోననే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. విత్తుకు ఇంకా 10 రోజులు మిగిలిఉండటం, వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో... ఇప్పుడు కురిసే వర్షాలు ముంగారుకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెబుతున్నారు. జూన్ 15 తర్వాత సాగుకు అదను.. ఖరీఫ్‌లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇంకా వర్షసూచన ఉందని చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం క్రితమే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందున ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు ‘అనంత’లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. మరోపక్క కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. బెళుగుప్ప మండలం నాగులచెరువులో నీరు ముందస్తు వర్షాలతో రైతుల్లో ఆందోళన ఖరీఫ్ కీలక దశలో ముఖం చాటేస్తాయేమోనని అనుమానం 23 మండలాల్లో వర్షం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కంబదూరు 28.8 మి.మీ, శింగనమల 22.2, నార్పల 18.6, కుందుర్పి 17.8, గార్లదిన్నె 13.6, డీ.హీరేహాళ్ 11, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం నమో దైంది. గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, పామిడి, రాప్తాడు, బుక్కరాయసముద్రం, అనంతపురం, బెళుగుప్ప, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు, పుట్లూరు, యాడికి, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చెరువుల్లోకి నీళ్లు.. వర్షాలకు 20 చెరువులు పూర్తిగా నిండిపోగా మరో 20 చెరువుల్లోకి 75 శాతం నీళ్లు చేరినట్లు తెలిసింది. బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, పామిడి, పెద్దవడుగూరు, రాప్తాడు, వజ్రకరూరు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. -
కంబదూరు వైస్ ఎంపీపీగా సోమశేఖర్
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు వైస్ ఎంపీపీగా ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కంబదూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా డీఎల్డీఓ నాగేశ్వర రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన ఎంపీటీసీ సోమశేఖర్‌ను ఎంపీటీసీలు చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికారులు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి వైస్ ఎంపీపీగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. సోమశేఖర్‌కు వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వ య కర్త తలారి రంగయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలకు సోమశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్త తలారి రంగయ్య, నాయకులు ఉమామహేశ్వర నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ తిమ్మరెడ్డి, ఎంపీటీసీలు ఈరన్న, నాగలక్ష్మి, మాధవి, సరస్వతి, నాగరత్నమ్మ, విద్యావతి, శ్రీదేవి, లక్ష్మి, నరసక్క, శివమ్మ, పలు మండలాల పార్టీ కన్వీనర్లు హనుమంత రాయుడు, వెంకటప్ప, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి తదితరులు పాల్గొన్నారు. -
కారుణ్యం లేదు.. కాఠిన్యం తప్ప
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఈ శాఖ... ప్రస్తుతం తన శాఖ ఉద్యోగుల నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా కారుణ్య నియామకాల విషయంలో జాప్యంపై.. పదోన్నతుల అంశంలో కనబరుస్తున్న నిర్దయపై రోజురోజుకూ ఉద్యోగులో అసహనం పెరిగిపోతోంది. జాప్యానికి అధికారులు చెబుతున్న... చూపుతున్న కారణాలు సహేతుకమైనవి కాదని అభిప్రాయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. కారుణ్య నియామకాలకు మోక్షం ఎన్నడో ఓ ఉద్యోగస్తుడు మరణిస్తే ఆయన కుటుంబం దిక్కులేనిది కాకుండా ఉండేందుకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగం ఇవ్వాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యుణ్య నియామకాలు కలెక్టర్ కార్యాలయం నుంచి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ దాదాపు 32 మంది బాధితులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతంగా కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఓ వైపు కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో పోషణ భారమై ఉద్యోగం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. పదోన్నతుల కల్పనలో కాఠిన్యం ఉద్యోగుల తమ సర్వీసులో కోరుకునే అత్యంత ప్రాధాన్యతా అంశం పదోన్నతి. పదోన్నతల కల్పనలో జాప్యం నెలకొంటే ఆ ప్రభావం ఉద్యోగుల విధి నిర్వహణపై పడుతుంది. వారిలో ఉత్సాహం సన్నగిల్లి... నిరాశ నిస్పహతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వివిధ కేడర్లలో ఖాళీగా పోస్టులకు పదోన్నతి అర్హత ఉన్న వారు ఏడాదిగా వేచి ఉన్నారు. అయితే పదోన్నతుల కల్పన నిర్ణయంపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడం విశేషం. తప్పని ఎదురుచూపులు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు ఇప్పటికే సర్వే టెస్ట్, డిపార్ట్మెంటల్ టెస్ట్, ఆకౌంట్ టెస్ట్, ఇతర రెవెన్యూ టెస్ట్‌లు ఉత్తీర్ణత సాధించిన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) 30 మంది ఉన్నారు. శాఖలో 32 సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నా... నేటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రస్తుతం డీటీలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన 15 మంది ఎస్ఏలు ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ నెలలుగా ముందుకు సాగకపోవడంతో వారికీ ఎదురు చూపులు తప్పలేదు. పెండింగ్‌లో కారుణ్య నియామకాలు ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు పదోన్నతుల కల్పనలో అంతులేని నిర్లక్ష్యం ఏడాదిగా ఎదురుచూపులకే పరిమితమైన రెవెన్యూ ఉద్యోగులు ప్రక్రియ చేపడతాం కారుణ్య నియాకాలు, పదోన్నతుల ప్రక్రియ తక్షణం మొదలు పెడతాం. ఇందుకు సంబంధించి అంశాలను పరిశీలించాను. కారుణ్య నియామకాల ఫైళ్లను తెప్పించుకుని వీలైనంత త్వరగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక పదోన్నతుల విషయంలో న్యాయపరమైన చిక్కులపై సలహా అడిగాం. త్వరలోనే ఈ ప్రక్రియనూ పూర్తి చేస్తాం. – వి.వినోద్‌కుమార్, కలెక్టర్ -
వాహనం ఢీకొని యువకుడి మృతి
బెళుగుప్ప: వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన మహేష్(21), తన మిత్రుడు కాలువపల్లి తండా గ్రామానికి చెందిన భానుప్రకాష్ నాయక్‌తో కలసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి కాలువపల్లికి బయలుదేరాడు. మానిరేవు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అటుగా వెళుతున్న వారు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహేష్ మృతిచెందినట్లుగా నిర్ధారించారు. భానుప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం బత్తలపల్లి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆటో నడుపుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బకు చెందిన మట్రా ఆంజనేయులు (59), అలివేలమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులు ఆటోలో గ్రామాలు తిరుగుతూ తెల్లగడ్డలు విక్రయం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఽతెల్లవారుజామునే ముదిగుబ్బ నుంచి ధర్మవరానికి ఆటోలో బయలుదేరారు. బత్తలపల్లి మండలం వేల్పుమడుగు క్రాస్ దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా బండల లోడుతో దూసుకువచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన అలివేలమ్మను అటుగా వచ్చిన వారు గుర్తించి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘రెడ్‌బుక్ కుట్రలో భాగమే అక్రమ అరెస్టులు’
ఉరవకొండ: తప్పడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా విశ్రాంత అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది రెడ్‌బుక్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని అన్నారు. అధికారులన్న కనీస గౌరవం లేకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షపార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నేరవేర్చే ధైర్యం లేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సాఆర్సీపీ నేతలతో పాటు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బసవరాజు పాల్గొన్నారు. -
విద్యతోనే ఉజ్వల భవిత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి చదువులపై దృష్టి సారించి ఉన్నత విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పదో తరగతి, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వాల్మీకి/బోయ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు సోమవారం స్థానిక రుద్రంపేట సమీపంలోని వాల్మీకి కల్యాణమంటపంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరేలా పట్టుదల, ఏకాగ్రతతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్సీ అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్యకుమార్, కోశాధికారి జి. పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, విశ్రాంత డీఎఫ్ఓ ఆదినారాయణ, ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు, తలారి ఆదినారాయణ, ఎంఈఓ వాణీదేవి, అంకె ముత్యాలు, మాజీ సీఈఓ ఈశ్వరయ్య, నాగభూషణం పాల్గొన్నారు. వాల్మీకి విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవంలో వక్తలు -
యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం
● సీఎస్‌కు తెలిపిన కలెక్టర్ వినోద్‌కుమార్ అనంతపురం అర్బన్: యోగాంధ్ర–2025 క్యాంపెయిన్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. యోగాంధ్ర, తదితర అంశాలపై సీఎస్ సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యోగాంధ్ర–2025 నిర్వహణలో భాగంగా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర ఆలయం, గుత్తి కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరులోని కోట వీధిలో నివాసముంటున్న రామాంజినమ్మ, మల్లేశప్ప దంపతలకు ఇద్దరు కుమార్తులు, కుమారుడు శ్యామ్ (24) ఉన్నారు. బేల్దారి పనులతో శ్యామ్ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. సోమవారం రోజులాగే కంబదూరులో గృహ నిర్మాణ పనుల్లో పాల్గొన్న శ్యామ్... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై భవనం పైనుంచి కిందపడ్డాడు. గమనించిన స్తానికులు వెంటనే కంబదూరులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంబదూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాపంపేటలో మహిళ ఆత్మహత్య రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన లక్ష్మీదేవి (45) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుళ్లాయప్ప గతంలోనే చనిపోయాడు. కుమారుడు రామాంజనేయులు ఆటోమొబైల్స్‌లో పని చేస్తున్నాడు. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీదేవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకై ్సజ్ ఇన్చార్జ్ సీఐగా గురుప్రసాద్ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్గా గురుప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ హసీనాభాను అవినీతి ఆరోపణలపై బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో విడపనకల్లు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న గురుప్రసాద్‌కు ఉన్నతాధికారులు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిసింది. నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి చెన్నేకొత్తపల్లి: గ్రామాల్లో నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఎకై ్సజ్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. గతంలో గ్రామాల్లో నాటుసారాను తయారు చేసే పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయంపై నిఘా పెట్టాలని సూచించారు. బెల్టుషాపులు లేకుండా చూడాలన్నారు. లైసెన్స్ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఫరూక్ ఆజామ్, ఎస్ఐ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. -
రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా
రామగిరి: రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సభ్యులు రానందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 10మంది ఎంపీటీసీ సబ్యులుండగా ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తొమ్మిది మంది, ఒకరు టీడీపీ సభ్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సభ్యులతో ఎంపీపీ స్థానాన్ని అప్పట్లో వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. మూడు నెలలక్రితం అప్పటి ఎంపీపీ మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతిచెందగా ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది మార్చి 27న ఎన్నిక జరపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంలో అధికారులు ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టారు. అనివార్య కారణాలతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో మరుసటి రోజు (మార్చి 28)కు ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు రామగిరిలో జరిగే ఎన్నిక ప్రక్రియకు హాజరవుతుండడంతో మార్గమధ్యంలోనే పెనుకొండలో పేరూరు2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ మూకలు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికకు టీడీపీకి బలం లేకున్నా ఆ పార్టీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి లోబర్చుకున్నారు. దీంతో ఆరుగురు సభ్యులున్న వైఎస్సార్సీపీకి ఎంపీపీ స్థానం లాంఛనమే అవుతుంది. ఇది జీర్ణించుకోలేని పరిటాల కుటుంబం రామగిరిలో తమ మాటే జరగాలంటూ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రామగిరి వైస్ సర్పంచ్‌పై రౌడీషీటర్ దాడి.. రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్‌కు వెళ్లగా సమీపంలో ఉన్న 20 నుంచి 30 మంది టీడీపీ శేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులను చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ రామాంజినేయులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రామగిరిలో టీడీపీ మూకలు హల్చల్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయగా, పోలీసు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. పోలీసుల అత్యుత్సాహం ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బంది మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం. -
నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్
అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్‌నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్‌నాయక్ కోసం గాలిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలి ● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ జిల్లా మహాసభలను జూలై 25 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు, ఇతర ప్రజాసమస్యలపై జిల్లా మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల హామీ మేరకు పట్టణ పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలనే డిమాండ్‌తో జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నామన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి, రాజేష్‌గౌడ్, రామాంజినేయులు పాల్గొన్నారు. -
కలెక్టర్ చెబితే వినాలా..?
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి లోని న్యూట్రీషినల్ రీహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్ సీ)లో తీరు మారడం లేదు. ‘చిన్నారులకు అందించే డైట్‌పై నిర్లక్ష్యం చేయకూడదు’ అని ఇటీవల సాక్షాత్తు కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూస్తే అయ్యో అంటూ జాలిపడాల్సిందే. ఆరోగ్య శాఖ.. సర్వజనాస్పత్రి అధికారుల బాధ్యతారాహిత్యం చిన్నారులకు శాపంగా మారింది. గ్లాసు పాల కోసం మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక.. ఎన్ఆర్సీలో వంట మనిషి లేకపోవడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం పాయసంతోనే అల్పాహారాన్ని సరిపెడుతున్నట్లు తెలిసింది. ఇదిగో సాక్ష్యం.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న తన ఇద్దరు బిడ్డలను (ఒకరు మూడేళ్లు, ఒకరికి 7 నెలలు) తాడిపత్రికి చెందిన శ్రావణి ఎన్ఆర్సీలో చేర్చింది. ఈ పిల్లలకు ఉదయం 6 గంటలకే ఎన్ఆర్సీలో సిబ్బంది పాలు పంపిణీ చేయాలి. కానీ ఆదివారం 9 గంటలైనా ఇవ్వలేదు. దీంతో పిల్లలు కడుపు కాలి ఏడుస్తుండటంతో చేసేదిలేక శ్రావణి ఆస్పత్రి బయట ఇడ్లీ తీసుకుని వచ్చి వారి పొట్ట నింపింది. మరో మహిళ కూడా తన బిడ్డ బాధను చూసి తట్టుకోలేక బయట తోపుడు బండ్లపై దోసె తీసుకువచ్చి ఆకలి తీర్చింది. ఇటీవల ‘సాక్షి’లో ‘చిన్నారుల ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా.. ఆ మరుసటి రోజు వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సర్వజనాస్పత్రి అధికారులు ఎన్ఆర్సీకి వచ్చి హడావుడి చేశారు. ఆ తర్వాత నుంచి షరామామూలుగానే పరిస్థితి తయారైంది. రెండు రోజులు సర్దుకో.. ‘ఎన్ఆర్సీలో ఉంటే మంచి తిండి పెడతారని చెప్పారు. కానీ ఇక్కడేమో ఆ పరిస్థితి కనిపించడం లేదు సార్’ అంటూ ఓ వృద్ధురాలు ఇటీవల డ్యూటీ వైద్యున్ని ప్రశ్నించగా.. సదరు వైద్యుడు ‘రెండు రోజులు సర్దుకొండహే’ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా అతను విధులకు ఎప్పుడూ గైర్హాజరవుతుంటాడని, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుంటాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూట్రీషియన్లు సౌజన్య, పల్లవి కూడా విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ఓ న్యూట్రీíÙయన్ సెలవులో వెళ్లి, జీతం మాత్రం తీసుకున్నట్లు తెల్సింది. రూ.లక్షలు జీతాలు తీసుకుంటూ చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఆర్డీటీని కాపాడుకుందాం
● సేవ్ ఆర్డీటీ పేరుతో తలారి రంగయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో భారీ బైకు ర్యాలీ ● తక్షణమే ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ కళ్యాణదుర్గం: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, పీఏసీ సభ్యులు తలారి రంగయ్య ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండల కేంద్రం నుంచి శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల మీదుగా కళ్యాణదుర్గం వరకు ర్యాలీ జరిగింది. బాబు, లోకేష్ పట్టించుకోలేదు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఫారిన్ కంట్రిబూషన్ రెగ్యులేషన్ (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆర్డీటీ ఆరోగ్యం, విద్య, క్రీడలు, భూగర్భ జలాల పెంపునకు వాటర్ షెడ్ల నిర్మాణం ఇలా ఎన్నో రకాల సేవలతో పేదలకు అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఎఫ్సీఆర్ఏను తాత్కాలికంగా రెన్యూవల్ చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేత, ఇప్పటి మంత్రి సత్యకుమార్, టీడీపీ నాయకులు వెళ్లి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత ఆర్డీటీ కష్టాలను పట్టించుకోవడం మానేశారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లాలో పర్యటించినా ఎక్కడా ఆర్డీటీకి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజలందరూ ఉద్యమించాలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయకపోవడంతో ఇప్పటికే ఆర్డీటీ సేవలు మందగించాయన్నారు. ఆర్డీటీని కాపాడుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజలపై ఉందన్నారు. ఆర్డీటీ లబ్ధిదారులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేందుకు కూటమి ప్రభుత్వమే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా నిలుపుదల చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాల మెడలు వంచైనా ఆర్డీటీ సేవలను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ పేద ప్రజల బాగు కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేత మాదినేని ఉమా మహేశ్వరనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఆర్డీటీ సేవలు నిలిచిపోతే పేదల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, పేరం స్వర్ణలతారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శులు చామలూరు రాజగోపాల్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, జిల్లా ఉపాధ్యక్షులు కోనాపురం గంగాధరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో రైతు శివశంకర్‌రెడ్డి (56) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. శివశంకర్‌రెడ్డి ఉదయాన్నే రైతులు పుల్లారెడ్డి, ప్రతాప్‌రెడ్డి లతో కలిసి తోట వద్దకు వెళ్లారు. మృతుడు తన పొలం వద్దకు వెళ్లాడు. నీటి తొట్టెలో నీళ్లు లేకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు కట్ అయి ఉండటంతో ఫీజు వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జమెదారు అన్వర్‌బాషా తెలిపారు. -
అబద్ధాల ప్రచారమేంటి లోకేష్?
అనంతపురం కార్పొరేషన్: ‘మంత్రి నారా లోకేష్ దావోస్‌లో ఒప్పందం చేసుకోవడం కారణంగానే జిల్లాకు సోలార్ ప్లాంట్, ఏపీ జెన్కో అండ్ ఎన్‌హెచ్‌పీసీ 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్ట్ వచ్చాయని, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నారు. ఈ అబద్ధాల ప్రచారమేంటి లోకేష్? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టుకు ఇప్పుడు శంకుస్థాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. శనివారం ఆమె అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంధన రంగంలో జగనన్న అత్యుత్తమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఫలితంగా రూ.22,302 కోట్ల పెట్టుబడులు, 5,300 మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీకి గత ప్రభుత్వంలో నాంది పలికిన అంశానికి సంబంధించి పత్రికా కథనాలను చూపించారు. రెండ్రోజుల అనంత పర్యటనలో మంత్రి లోకేష్ ప్రజా సమస్యలపై ఎందుకు నోరుమెదపలేదో చెప్పాలన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఎలుకల వల్ల ఇబ్బంది పడ్డ విద్యార్థులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే లిక్కర్ స్కాం పేరుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌లను అరెస్టు చేశారన్నారు. దొంగ సాక్ష్యాలతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలు, బెదిరింపులు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, నాయకురాళ్లు సుజాత, ఉష, భారతి, దేవి, తదితరులు పాల్గొన్నారు. జగనన్న తెచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
పెద్దవడుగూరులో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: మండల కేంద్రమైన పెద్దవడుగూరులో శనివారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. కొద్దిరోజులుగా పెద్దవడుగూరులోని శివప్రసాద్ ఇండియన్ గ్యాస్ గ్రామీణ విత్రక్ నిర్వహణ విషయంలో ఏజెన్సీ లైసెన్స్దారురాలు సరస్వతికి, నిర్వాహకుడైన వైఎస్సార్సీపీ నాయకుడు ఎద్దుల సూర్యప్రభాకర్రెడ్డికి విభేదాలు రావడంతో గ్యాస్ నిర్వహణ ఆగిపోయింది. ఏజెన్సీ తమకు స్వాధీనం చేసేలా సహకరించాలని జేసీపీఆర్ను సరస్వతి కోరారు. దీంతో ఆయన వారికి తోడుగా తన అనుచరులను గ్యాస్ గోదాము వద్దకు పంపారు. అక్కడ అడ్డుగా దారిలో ఉన్న రాళ్లు తీసివేస్తున్నారని బాటసారులు నిర్వాహకుడు సూర్యప్రభాకర్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన అక్కడికి కారులో వెళ్లారు. అప్పటికే ఏజెన్సీ వారు గ్యాస్ సిలిండర్లను ఐచర్ వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని చూసి కిందకు దిగి ప్రశ్నించారు. అక్కడున్న వారు రెచ్చిపోవడంతో తన వాహనంలో భయంతో ఇంటికి వెనుతిరిగాడు. కొందరు వ్యక్తులు రెండు వాహనాల్లో ఆయన్ను వెంబడించారు. సూర్యప్రభాకర్‌రెడ్డి కారును బయట ఉంచి ఇంట్లోకి వెళ్లిపోగా.. కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగిపోకుండా ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టడానికి ప్రయత్నించినట్లు బాధితుడు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే పెద్దవడుగూరుకు చేరుకొన్న జేసీపీఆర్.. తాడిపత్రి ట్రైనీ ఏఎస్పీ రోహిత్కుమార్చౌదరిపై మండిపడ్డారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తాడిపత్రిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి భౌతికదాడులు చేయించడం దారుణమని సూర్యప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి -
సైనికుల త్యాగాలకు వందనం
‘దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు వందనం.. వారికి బాసటగా నిలుద్దాం’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్యారోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతాన్ని పురస్కరించుకుని శనివారం సైనికులకు సంఘీభావంగా అనంతపురం నగరంలో ‘తిరంగా యాత్ర’ను నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతంటి త్యాగానికై నా సిద్ధంగా ఉన్నామని మన సైనికులు ప్రపంచదేశాలకు తెలియజేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందారని, సైనికులకు అందరం రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్‌రాజు, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, ఆర్డీఓ కేశవనాయుడు, సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అనంతపురం కార్పొరేషన్: ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారు. 11 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చడం లేదు. జగనన్న నాయకత్వంలో ప్రజలకు చేసిన మేలును ప్రజలకు వివరిద్దాం’ అని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. శనివారం న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన గ్లోబల్ కనెక్ట్ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని జగనన్న చేసిన మేలును ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. అలాగే కూటమి కుట్రలు, వైఫల్యాలను తెలియజేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ న్యూజిల్యాండ్ కన్వీనర్ బుజ్జిబాబు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి తదితరులు పాల్గొన్నారు. -
కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పీలేరు బాలుమువారి పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు బావిలోకి తీసుకుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. బాధితులు కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
వీడియో వైరల్.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌చేయడంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికారులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
అనంతపురం: వివాదంలో ఎక్సైజ్ సీఐ హసీనా భాను
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఐ, అటెండర్ మధ్య పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదంగా మారింది. రెండు క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందివివరాల ప్రకారం.. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి.. ఆగ్రహానికి లోనైన సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
ఆర్టీసీలో కదిలిన అక్రమాల డొంక
అనంతపురం క్రైం: ఆర్టీసీలో జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో చోటు చేసుకున్న అక్రమాల తీగ లాగిన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్టీసీ ఆదాయానికి పటిష్ట రక్షణ కవచంగా ఉండాల్సిన విజిలెన్స్ విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులే అందిన కాడికి దోచుకున్నట్లుగా ఇప్పటికే విచారణాధికారులు నిగ్గు తేల్చారు. కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు ఊతమిచ్చిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ అవినీతి సెగ ప్రస్తుతం ప్రధాన కార్యాలయాన్ని తాకింది. ముజఫర్ ముఠాకు మహిళా అధికారి దన్ను ముజఫర్ అక్రమాలపై కొందరు బాధితులు నేరుగా విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఓ మహిళా అధికారినికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న సదరు అధికారి రంగంలోకి దిగి విచారణ పేరుతో నాటకీయ పరిణామాలకు తెరలేపారు. చివరకు ముజఫర్ ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదంటూ ఓ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే క్లీన్చిట్ ఇచ్చేందుకు ముజఫర్ నుంచి రూ.5 లక్షలు సదరు అధికారి తీసుకున్నట్లు తాజా విచారణలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారి వెంటనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయినట్లు విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆమె అక్రమాలకు సంబంధించిన బలమైన ఆధారాలను విచారణాధికారులు సేకరించారు. ఈ నివేధిక ఇంకా ప్రధాన కార్యాలయానికి చేరకనే ఆమె లాంగ్ లీవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. లోతైన దర్యాప్తు చేయాలి ముజఫర్ రహిమాన్ పని చేసిన సమయంలో ఉద్యోగులు, కార్మికులపై వచ్చిన అన్ని ఆరోపణలపై తిరిగి విచారణ చేపట్టాలని ఆర్టీసీలోని వివిధ యూనియన్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిపాలని కోరుతున్నారు. ఈ విచారణ జరిపితే అనంతపురం రీజినల్ కార్యాలయంలోని పెద్దల అవినీతి బాగోతాలు కూడా బయటపడతాయని వాదిస్తున్నారు. వెలుగు చూస్తున్న అక్రమాల బాగోతం కింది స్థాయి సిబ్బందిపై ఆరోపణ వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా విచారణ పేరుతో పిలిపించి అందిన కాడికి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ దోచుకున్నారు. ఈ క్రమంలో తప్పుచేసిన వారు బయటపడ్డామని సంబరపడితే.. ఎలాంటి తప్పు చేయని వారు అనవసరంగా డబ్బు పొగొట్టుకున్నామని బాధపడ్డారు. ఈ అక్రమాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఈ తరహా బాధితులు సుమారు 60 మందికి పైగా ఉన్నట్లు విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ముజఫర్ రహిమాన్ ఇష్టారాజ్యంగా అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఈ మొత్తం వ్యవహారం చూసిన విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మలుపు తిరిగిన ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అక్రమాల బాగోతం భారీగా ముడుపులు దండుకుని తప్పుడు నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వాస్తవాలు బయటపడడంతో దీర్ఘకాలిక సెలవులో అధికారి జోనల్ విజిలెన్స్ అధికారి ముజఫర్ రహిమాన్ బాధితుల జాబితా చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
రాయదుర్గం: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం సీఐ వెంకటరమణ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం కణేకల్లు క్రాస్‌లో కణేకల్లు ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కళ్యాణదుర్గానికి చెందిన యువకుడు పిట్ట గంగాధర అలియాస్ సాంబ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీల అంశం వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు ఇతర వ్యసనాలకు బానిసగా మారి తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్లుగా అంగీకరించాడు. ఏడాదిన్నర కాలంగా కణేకల్లులో 2, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 1, అనంతపురం రూరల్ పరిధిలో 2 చోరీ కేసుల్లో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.48 లక్షలు విలువ చేసే బంగారు నగలు, వెండి సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
● 4.5 కిలోల వెండి సామగ్రి, తులం బంగారం స్వాధీనం కళ్యాణదుర్గం రూరల్: నియోజవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితల వివరాలను ఏఎస్ఐ రామాంజనేయులుతో కలసి సీఐ వంశీకృష్ణ వెల్లడించారు. కళ్యాణదుర్గం రూరల్, కంబదూరు పీఎస్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా దేవాలయాల్లో చోరీలు జరిగాయి.రెండు స్టేషన్ల పరిధిలో మొత్తం నాలుగు కేసులు నమోదుకాగా, డీఎస్పీ రవిబాబు ఽపర్యవేక్షణలో రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఆలయాల్లో చోరీలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. పట్టుబడిన వారిలో ఆరుల రాజశేఖర్, గొల్ల బొబ్బిలి రాము ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల వెండి సామగ్రి, ఒక తులం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయనగరం జిల్లాకు చెందిన వీరు సంచార జీవనం సాగిస్తూ ఓ ప్రాంతంలో కొన్ని నెలల పాటు తిష్ట వేసి, ఆ ప్రాంతంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడేవారు. వీరికి ఆధార్‌కార్డులు లేకపోవడంతో చోరీ జరిగిన సమయంలో వేలి ముద్రలు లభ్యమైనా ఆచూకీ దొరకకుండా తప్పించుకుని తిరిగేవారని పోలీసులు తెలిపారు. -
ఏడాదిలో అనంత రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తి
● కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అనంతపురం సిటీ: అమృత్ భారత్ పథకం కింద అనంతపురం రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి స్థానిక రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే శాఖ అధికారులు, ఇంజినీర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అంబికాతో కలసి విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా తొలి విడతలో రూ.30 కోట్లు, మలి విడతలో రూ.22 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఎస్కలేటర్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. పుట్టపర్తి–బెంగళూరు మధ్య నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అనంతపురానికి మరిన్ని రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అనంతపురంలో హాల్ట్ కల్పించాలని, ధర్మవరం–మచిలీపట్నం రైలుకు రాయలచెరువు స్టేషన్లో స్టాపింగ్‌కు చొరవ చూపాలని విన్నవించారు. గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు. -
నేడు నగరంలో తిరంగా యాత్ర
● ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపు అనంతపురం అర్బన్: ‘ఆపరేషన్ సిందూర్’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా శనివారం నగరంలో తిరంగా యాత్ర నిర్వహించనన్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి తిరంగా యాత్ర ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు సాగుతుందన్నారు. దేశరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన సైనికులకు సంఘీభావం తెలపడంతో పాటు జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం ప్రతిభింబించేలా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ట్రాఫిక్, భద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, వైద్య బృందం అందుబాటులో ఉంటుందన్నారు. నేడే సేవ్ ఆర్డీటీ బైక్ ర్యాలీ ● హాజరుకానున్న పార్టీ ముఖ్య నేతలు కళ్యాణదుర్గం: ఆర్డీటీ సంస్థకు కేంద్రం ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తలపెట్టిన ‘సేవ్ ఆర్డీటీ’ బైక్ ర్యాలీ శనివారం ఉదయం 8 గంటలకు బ్రహ్మసముద్రంలో ప్రారంభం కానుంది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రంగయ్య ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బైక్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, రాయదుర్గం, తాడిపత్రి సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల హాజరవుతారన్నారు. ఆయా మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందిన వారిని చైతన్య పరిచి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దళిత మహిళలపై దాడి చేసిన వారిపై కేసు అనంతపురం/బ్రహ్మసముద్రం: తోటలో రాలిపడిన మామిడిపండ్లను తిన్న కుర్లగుండ గ్రామానికి ముగ్గురు దళిత మహిళలపై దాడి చేసి గాయపరిచిన తీటకల్లు గ్రామానికి చెందిన వారిపై ఎట్టకేలకు బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బొబ్బురు రామాంజనేయులు, అనిల్‌చౌదరి, క్రిష్టప్పలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బ్రహ్మసముద్రం ఏఎస్ఐ తిమ్మరాజు తెలిపారు. కాగా, ఈ దాడిలో చెవి కర్ణభేరి దెబ్బతినగా, అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత అనే మహిళను ఎస్సీ, ఎస్టీ జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పరామర్శించారు. పోలీసుల కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఎమ్మెల్యే కూతురి పెళ్లి బందోబస్తులో ఉన్నామని వచ్చిన తర్వాత విచారిస్తామని దాటివేయడం సిగ్గుచేటన్నారు. దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన అగ్రకులస్తులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాకే హరి వెంట జేఏసీ నాయకులు ఎస్. రామాంజినేయులు, రామకృష్ణ, నారాయణస్వామి, నరేంద్ర, నాగేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీకి మహిళా అభ్యర్థులే ఎక్కువ అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన డీఎస్సీ–2025కు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా అభ్యర్థులే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 20న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారం రాత్రితో ముగిసింది. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 29,078 మంది అభ్యర్థుల్లో 17,070 మంది మహిళలే ఉన్నారు. 12,008 మంది పురుష అభ్యర్థులున్నారు. అర్హతను బట్టి కొందరు అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. -
హనుమజ్జయంతికి ముస్తాబు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ కే.వాణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని ఈఓ కార్యాలయం ముందు భాగంలో ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేసి.. అక్కడ 108 కలశాలను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు యాగాలు, హోమాలు నిర్వహిస్తారు. ఈనెల 18వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఆలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తికి తులసీ దళాలతో లక్షార్చన పూజ చేస్తారు. ఈనెల 19వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని డ్రైప్రూట్స్‌తో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 20వ తేదీన ఆంజనేయుడిని గంధంతో అలంకరిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన పూజ చేస్తారు. 21వ తేదీన యాగశాలలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అష్టోత్తరశత కలశాలతో స్వామికి మహాభిషేకం చేయనున్నారు. వివిధ రకాల పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 22వ తేదీన హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడిని స్వర్ణ, వజ్ర కవచాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పుష్పాలు, తోమాలంకరణ అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఆలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించి పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. కసాపురంలో రేపటి నుంచి హనుమజ్జయంతి ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు -
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్‌లో టాపర్‌గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం టాపర్ (ఒక గోల్డ్‌మెడల్), ఎండోమెంట్ గోల్డ్‌మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్ఫార్మెన్స్ అమాంగ్ బాయ్స్ (ఒక గోల్డ్‌మెడల్), చల్లా సుబ్బారాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ వి. పాండురంగడు గోల్డ్‌మెడల్ (థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో టాపర్), 1992 బ్యాచ్ స్పాన్సర్డ్ గోల్డ్‌మెడల్ , చుండుపల్లి వెంకట్రాయలు.. సరోజమ్మ గోల్డ్‌మెడల్ ఇలా మొత్తం ఆరు గోల్డ్‌మెడల్స్ దక్కాయి. అంతేకాక కోర్సు పూర్తికాగానే ఎల్అండ్టీ కంపెనీలో ట్రైనీ ఇంజినీర్‌గా ఎంపికయ్యాను. – నంద్యాల పూజిత్ కుమార్‌రెడ్డి -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. అలాగే పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 68 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు, 43 ఫార్మసీ కళాశాలలు, 24 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఏటా 1.30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్ , పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో గణనీయమైన ర్యాంకు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. చేయూత అ‘పూర్వ’ం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్సిటీ పురోగతికి చేయూతనందించారు. రూ.8 కోట్ల వ్యయంతో 100 గదులతో కూడిన హాస్టల్‌ను పూర్వ విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్‌నూ ఏర్పాటు చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలో 2024–25లో బీటెక్ పూర్తి చేసిన మొత్తం 226 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చాటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 10 మందికి ఏడాదికి రూ.11 లక్షల వేతనంతో కూడిన కొలువులు దక్కడం విశేషం. జేఎన్టీయూ బంగారాలు: జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ పరిధిలో 18 మందికి, జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల పరిధిలో ఏడుగురికి మొత్తం 49 బంగారు పతకాలు, ఎంటెక్‌లో ఒకరు, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురి బంగారు పతకాలు దక్కాయి. వీరిలో జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి ఏకంగా ఆరు బంగారు పతకాలు దక్కించుకుని వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాన్పూర్‌లోని ఐఐటీలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ హాజరుకానున్నారు. అలాగే జేఎన్టీయూ (ఏ) పాలకమండలి సభ్యులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం చేయనున్నారు. లైవ్‌స్ట్రీమ్ ద్వారా స్నాతకోత్సవాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అగ్రగామిగా తీర్చిదిద్దాలి అన్ని రంగాల్లో జేఎన్టీయూ (ఏ)అగ్రగామిగా తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. శుక్రవారం ఆయన జేఎన్టీయూలోని పాలకభవనంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికలో సమూలంగా మార్పు చేశామన్నారు. గౌరవ డాక్టరేట్‌ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేయడం గర్వంగా ఉందన్నారు. స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీలు అందుకునే విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. నేడు జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం చాన్సలర్ హోదాలో ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ 40,109 మంది విద్యార్థులకు డిగ్రీలు, 167 మందికి పీహెచ్‌డీల ప్రదానం -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది. ప్రతి స్నాతకోత్సవానికి విశిష్ట వ్యక్తులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం జేఎన్టీయూ(ఏ) ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావాకు అందజేయనున్నారు. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ చావా విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎదిగారు. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి దిశాదర్శకులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను 2021లో సాక్షి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఘనంగా సత్కరించింది. 18 సంవత్సరాల క్రితం ఏర్పాటైన లారస్ ల్యాబ్స్ కంపెనీలో ఇప్పటి వరకూ 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు ప్రాధాన్యత అంశాలుగా ల్యాబ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. -
అరెస్టులు అప్రజాస్వామికం: అనంత
అనంతపురం కార్పొరేషన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లొకేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ అరెస్టులను ఖండించారు. వారిద్దరి అరెస్టులతో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. లిక్కర్ కేసు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపకుండానే బెదిరింపులకు పాల్పడి... తప్పుడు వాంగ్మూలాలను తీసుకుని అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మద్యం కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారని... మరి కూటమి ప్రభుత్వం కూడా అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులను ఎక్కడా చూడలేదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయడం చేతకాని చంద్రబాబు.. ఏదో ఒక టాపిక్‌ను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఇది మంచి సంస్కృతికాదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
లోపాలు సరిచేసుకోకపోతే రూ.కోటి జరిమానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కన్నెర్రచేసింది. లోపాలు దిద్దుకోకపోతే ఒక్కో మెడికల్ కాలేజీ రూ.కోటి జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. వారం కిందట జాతీయ మెడికల్ కమిషన్ అధికారి సుఖ్లాల్ మీనా రాష్ర్టంలోని అన్ని కాలేజీలకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు. ఒక్కసారిగా రాష్ర్టంలోని 16 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఉలిక్కి పడింది. గత ఏడాదిగా ఫ్యాకల్టీ లోపాలపై సర్కారు దృష్టి సారించలేదు. చాలా చోట్ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. కొన్ని చోట్ల రెసిడెంట్లు, ట్యూటర్ల కొరతా వేధిస్తోంది. లోపాలు సరిదిద్దుకోమనడం వేరని, లేదంటే కోటి రూపాయల జరిమానా చెల్లించాలనడం ఏంటని డీఎంఈ కార్యాలయం మధనపడుతోంది. మీరే బాధ్యులు.. మీరే చెల్లించాలి ఈనెల 6వ తేదీన నోటిసులు వచి్చన అనంతరం డీఎంఈ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ల సమావేశం జరిగింది. వైద్య కాలేజీల్లో లోపాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లే బాధ్యులని, ఒక వేళ ఎన్ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తే రూ.కోటి జరిమానా ఆయా మెడికల్ కాలేజీలే చెల్లించాలని, ప్రభుత్వం ఈ డబ్బు ఇవ్వదని డీఎంఈ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి తామెందుకు బాధ్యత వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఏపీలో యూజీ, పీజీ సీట్లు పెరిగాయి. భారీగా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకం జరిగింది. మౌలిక వసతుల కల్పన ఊహించని స్థాయిలో జరిగింది. అయినా సరే సీట్లు నిలబడాలంటే ఎప్పటికప్పుడు వనరులు సమకూర్చుకోవాల్సిందే. కానీ కూటమి సర్కారు దీనిపై దృష్టి సారించలేదు.ఇవీ ప్రధాన సమస్యలు ⇒ ఏడాదిగా పదోన్నతులు లేవు.. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ⇒ హిస్టోపెథాలజీ, సైటో పెథాలజీ ఇన్వెస్టిగేషన్స్ వివరాలు లేకపోవడం ⇒ కొన్ని విభాగాల్లో మౌలిక వసతులు సరిగా కల్పించక పోవడం ⇒ ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వక పోవడం ⇒ పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు సరిపడా వసతులు లేవు ⇒ గైనిక్ వార్డుల్లో వేధిస్తోన్న బెడ్ల కొరత ⇒ అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు తదితర చోట్ల పరిస్థితులు దారుణం -
వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. -
పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్
సాక్షి, అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. -
రెడ్‌బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. -
అక్లాండ్లో వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ
అనంతపురం కార్పొరేషన్: న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ కార్యకలాపాల్లో ప్రవాసాంధ్రులను మమేకం చేసేలా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి గురువారం అక్లాండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, తదితర ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం అక్లాండ్‌లోని గ్లోబల్ కనెక్ట్ మీటింగ్‌లో ఆలూరు సాంబశివారెడ్డి ప్రసంగించనున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐలు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. పూర్తి వివరాలకు 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు. -
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చ ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారనే విషయంపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ ఈసెట్‌లో 91.71 శాతం ఉత్తీర్ణత అనంతపురం: ఏపీ ఈసెట్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌కు మొత్తం 2,538 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,448 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,245 మంది అర్హత మార్కులు సాధించారు. బాలురు 1,735 మంది దరఖాస్తు చేసుకోగా 1,668 (91.25శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 1,522 మంది అర్హత సాధించారు. బాలికలు 803 మంది దరఖాస్తు చేసుకోగా, 780 మంది పరీక్ష రాశారు. 723 (92.69 శాతం) మంది అర్హత సాధించారు. రాయలచెరువు విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ యాడికి: ఈసెట్ ఫలితాల్లో మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన టోపీఖాన్ కుమారుడు రఖీబ్ ఖాన్ సత్తా చాటాడు. 200 మార్కులకు 96 మార్కులు సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలిచాడు. విద్యార్థి రఖీబ్ ఖాన్‌ను స్థానికులు అభినందించారు. గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఈనెల 17న జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయనున్నారు. ఆ రోజున గవర్నర్ విడిది చేయనున్న ఆర్అండ్బీ అతిథి గృహాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అతిథి గృహంలోని గదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిథి గృహం పరిశుభ్రంగా ఉండా లని, ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సోఫాలు, ఫర్నీచర్, ఏసీలు మరమ్మతు చేయించాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలని, అతిథి గృహాన్ని ఒక రోజు ముందే ఆధీనంలోకి తీసుకోవాలని టూటౌన్ సీఐ శ్రీకాంత్‌కు చెప్పారు. లైజనింగ్ అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులెవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మెహన్, ఆర్అండ్బీ డీఈఈ కాటమయ్య, పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్‌రెడ్డి, డీఎస్ఓ జగన్మో హన్‌రావు, తహసీల్దార్లు హరికుమార్, బ్రహ్మయ్య, రియాజ్‌బాషా, ఆర్ఐ సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంటెక్, ఫార్మాడీ ఫలితాల విడుదల అనంతపురం: ఎంటెక్, ఫార్మాడీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో మార్చిలో నిర్వహించిన ఫార్మాడీ, ఎంటెక్ నాలుగో సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. -
కంచె.. చేను మేసింది!
● ఆర్టీసీలో అధికారి ధన దాహానికి 60 మంది బలి ● జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ నయా దందా ● పక్కా ఆధారాలతో ఎండీకి నివేదిక ● విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ● రోజుకో మలుపు తిరుగుతున్న అక్రమాల బాగోతం ● వసూళ్లకు 9 మంది ఏజెంట్లు ● రూ.కోట్లలో దండుకున్న వైనం అనంతపురం క్రైం: క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఆర్టీసీలో ఉన్నతాధికారులే దారి తప్పారు. కింది స్థాయి ఉద్యోగులకు పర్యవేక్షకులుగా ఉండాల్సిన వారే దిక్కుమాలిన పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. కొంత కాలంగా ఆర్టీసీ జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పని చేసిన ముజఫర్ రహిమాన్ అక్రమాల బాగోతం ప్రస్తుతం ఆ సంస్థను కుదిపేస్తోంది. అతనిపై చర్యలు తీసుకున్నా.. నేటికీ ఇంకా ఆయన బాధితులు కార్యాలయానికి క్యూ కడుతూనే ఉన్నారు. ఏకంగా 9 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆయన దోచుకున్నట్లు అధికారికంగా గుర్తించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతుండడం గమనార్హం. 60 మందికి పైగా బాధితులు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో సుమారు 60 మందికిపైగా ముజఫర్ రహిమన్ బాధితులున్నట్లు విచారణాధికారులు గుర్తించారు. వీరందరినీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. కొందరు మహిళా ఉద్యోగుల విషయంలోనూ ముజఫర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయి సిబ్బందిపై చిన్నపాటి ఆరోపణ వచ్చినా నేరుగా వారిని పిలిపించుకుని లోబరుచుకోవాలన్న ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. జోన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 29 మందిని విచారణ చేసిన అధికారులు... వారి నుంచి ముజఫర్ రూ.16,65,650లు వసూలు చేసినట్లు నిగ్గు తేల్చారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. రూ.2 కోట్ల వరకు కొల్లగొట్టినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ముఠాను ఏర్పాటు చేసి.. ఆర్టీసీ కడప జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ తనదంటూ ప్రత్యేక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, దోపిడీకి తెరలేపారు. మూడు జిల్లాల పరిధిలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను ఎంపిక చేసుకుని వారి ద్వారా యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు... ముజఫర్ రహిమాన్‌కు సంబంధించిన 9 మంది ఏజెంట్లను గుర్తించారు. అనంతరం ముజఫర్‌పై సస్పెన్షన్ వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టారు. ముజఫర్ ముఠాలో కీలకంగా కేవీ రెడ్డి, ఎన్పీఎల్ఎన్వీ ప్రసాద్, యూఎన్ఎస్ రెడ్డి, జీవీజీ రమణ, మనోహర్, కేఆర్సీ రెడ్డి, ఆర్ఎంఎస్ నాయక్, శివకుమార్, శంకరయ్య ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంకా ఈ జాబితాలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన మరి కొందరు ఉన్నట్లు సమాచారం. తారస్థాయిలో అక్రమాల బాగోతం అనంతపురం ఆర్టీసీలో ఉన్నతాధికారులు కూడా ఇదే మార్గం నడిచినట్లు ఆరోపణలున్నాయి. గుత్తి డిపోలో కొంత కాలంగా ఉద్యోగుల పనితీరుపై అనేక ఆరోపణలున్నాయి. అలాగే ఉరవకొండ ఆర్టీసీ డిపోలోనూ రూ.42 లక్షల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. దీనికి తోడు అనంతపురం కార్గో అధికారి అద్దె వాహనం పేరుతో చేసిన మోసంపై ఎలాంటి చర్యలూ లేవు. ఇలా అనంతపురం ఆర్టీసీలోని ఉన్నతాధికారుల అవినీతి బాగోతం కూడా వెలుగు చూస్తుండడంతో కార్మికుల్లో అసహనం రేకెత్తుతోంది. ఆర్టీసీ ఆర్ఎం స్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడిన వారికి దన్నుగా నిలుస్తూ వారిని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అవినీతి అక్రమాలపై ఆర్టీసీ ఎండీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలోని యూనియన్ల నేతలు మాత్రం తాజాగా ఎండీని కలసి ఉద్యోగులు, కార్మికుల నుంచి జోనల్సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి ముజఫర్ రహిమాన్ బాధితులకు తిరిగి డబ్బు ఇప్పించాలని విన్నవించిసట్లు తెలుస్తోంది. -
ఐదురోజులు వర్షసూచన
ముందస్తు నైరుతి నేపథ్యంలో రానున్న ఐదు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్షసూచన తెలియజేస్తూ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించినట్లు పేర్కొన్నారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులకు సంబంధించి వచ్చే రెండు రోజులు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలిపారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ప్రధాన అర్చకుడు ద్వారకనాథచార్యులు, ఈఓ సాకే రమేష్‌బాబు అధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అంతకు ముందు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనిమిచ్చారు. -
గెలుపునకు అడ్డదారులా?
ఆత్మకూరు: గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మలరాయుడు, వైస్ ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన శివప్రసాద్ ఆరోపించారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గొర్రెల, మేకల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలకు ఈ ఏడాది జనవరి 25న మదిగుబ్బలో ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. గ్రామంలొ మొత్తం 152 మంది సభ్యులుండగా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థి మలరాయుడుకు 93 మంది, టీడీపీ మద్దతు అభ్యర్థి నరసింహులుకు 12 మంది సభ్యులు మద్దతు పలికారన్నారు. ఇది గిట్టని టీడీపీ నేతలు అధ్యక్ష స్థానం తమకే దక్కాలన్న అక్కసుతో దాదాపు 50 మంది పోలీసులను అడ్డం పెట్టుకుని గొడవ చేసి ఎన్నికలను వాయిదా పడేలా చేశారన్నారు. ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత 152 సభ్యుల్లో కేవలం 90 మందికి మాత్రమే సభ్యత్వం ఉందని అధికారులు చెబుతున్నారని, అలాగే రెండు రోజుల క్రితం పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి టీడీపీకి అనుకూలంగా ఉన్న 67 మందిని సభ్యులుగా చేర్చారని వివరించారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కొత్త సభ్యులను ఎలా చేరుస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. 2018 నాటికి సంఘంలో 90 మంది సభ్యులు ఉన్నారని, 2019లో ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన పోతిరెడ్డి 62 మందికి చలానాలు కట్టి సభ్యులుగా చేర్చారని గుర్తు చేశారు. చలానా కట్టి సభ్యులుగా పేర్లు నమోదు చేయాలంటే ఆడిట్ తప్పనిసరిగా చేయాల్సి ఉందన్నారు. 2017 నుంచి 2018 వరకు ఆడిట్ ప్రక్రియను ఎందుకు చేపట్టలేదో అధికారులకే తెలియాలన్నారు. దొంగ రసీదులు సృష్టించి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ఆడిన చదరంగంలో అధికారులు పావులుగా మారారన్నారు. ఈ అంశంపై పంపనూను పశువైద్యాధికారి దిలీప్‌ను వివరణ కోరగా... ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కొత్తగా 67 మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. ఏపీసీఎస్ యాక్ట్ 1964 సెక్షన్ 19 ప్రకారం వారందరూ సభ్యులుగా పరిగణించబడుతారని వివరించారు. గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో వంచనకు తెరలేపిన అధికారులు ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత జాబితాలో కొత్తగా 67 మంది చేర్పు -
ఉద్దేహాళ్‌లో ఆగిపోయిన ధాన్యం లారీలు
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో 20 రోజుల క్రితం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీల్లోనే ఆగిపోయింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శ్రీకాళహస్తిలో మిల్లర్లకు బ్యాంకు ష్యూరిటీ లేదని లారీలను అడ్డుకున్నారు. మూడు రోజులుగా లారీలు ఆగిపోవడంతో డ్రైవర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ‘మీ ధాన్యం రవాణా చేయడం కష్టం.. బస్తాలను ఇక్కడే అన్లోడ్ చేసుకోండి’ అంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బస్తాలు కిందికి దించితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. నేనే ‘రాజు’... నేనే మంత్రి ● విమర్శలకు తావిస్తున్న కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం సాక్షి టాస్క్‌ఫోర్స్: కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా నేనే రాజు.. నేనే మంత్రినంటూ వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్‌ను టీడీపీ కార్యాలయంగా మార్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప మరెవ్వరూ అక్కడ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదినం సందర్భంగా కూడేరు జెడ్పీహెచ్ఎస్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమానికి ఏకంగా యూనిఫాంలో హాజరై ఆ పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కటింగ్‌లు చేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి కేశవ్‌కు సీఐ రాజు షాడోగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి అధికారి ఇక సామాన్యులకు న్యాయం ఎలా చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
అనంతపురం: స్థానిక అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నిమ్మగల్లుకు చెందిన తిప్పేస్వామి కుమారుడు శివప్రసాద్ (22) అనంతపురంలో డీజేగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చి అశోక్‌నగర్‌లోని తన స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నాడు. కియా పరిశ్రమలో పనిచేస్తున్న స్నేహితులందరూ బుధవారం విధులకు వెళ్లి రాత్రి 2 గంటలకు గదికి చేరుకున్నారు. అప్పటికే గదిలో నిద్రపోతున్న శివకుమార్ లేచి తలుపు తీసి, కాసేపు మాట్లాడి తిరిగి గదిలోనే నిద్రపోయాడు. గురువారం ఉదయానికి మృతి చెంది కనిపించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. టవాల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్నేహితులు తెలిపారు. అయితే టవాల్‌తో ఉరి వేసుకోవడం సాధ్యం కాదనే వాదనలు వినిపించాయి. ఘటనపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు దగ్ధం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉరిమి ఉరిమి గడగడలాడించింది. పంటలకు నష్టం కలిగించింది. జీవాలను బలితీసుకుంది. భారీ వృక్షాలను సైతం నేలకూల్చింది. జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. వరదతో ముంచెత్తింది. వర్షానికి తోడుగా మెరుపులు
రాప్తాడురూరల్/అనంతపురం అగ్రికల్చర్: రాప్తాడు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. 27 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడులో రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, కళ్యాణదుర్గం 53.2 మి.మీ, ఆత్మకూరు 38, బ్రహ్మసముద్రం 35, బుక్కరాయసముద్రం 34.2, శెట్టూరు 27.6, పామిడి 26.4, నార్పల 25.6, అనంతపురం మండలంలో 24.6 మి.మీ వర్షం కురిసింది. కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, ఉరవకొండ మినహా మిగతా మండలాల్లో మోస్తరుగా వాన పడింది. వణికిన రాప్తాడు.. రాప్తాడు మండలాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. మండలంలోని సీపీఐ కాలనీని వాన నీరు ముంచెత్తాయి. పలువురు స్థానికులు ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను గురువారం ఉదయం అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, ట్యూబుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ● అనంతపురం రూరల్ పరిధి కక్కలపల్లి పంచాయతీలోని బీజేపీ కొట్టాలు, ప్రజాశక్తినగర్, ఆర్డీటీ కాలనీల్లో దాదాపు 90 ఇళ్లల్లోకి నీరు చేరాయి. గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు చేరడం ప్రారంభించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. వాన నీరు ఇంట్లో చేరడంతో నారాయణ ఇంట్లో దాదాపు 20 ప్యాకెట్ల బియ్యం, కందిబేడలు తడిసిపోయాయి. నరసింహులు, నాయక్‌లు వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న ఎండు కర్జూరం, 2 టన్నుల మామిడిపండ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డీ వెంకటనాయుడు కాలనీల్లో పర్యటించారు. బాధితుల వివరాలను సేకరించారు. ● బీజేపీ కాలనీ పక్కన నెట్టెం ఆనంద్‌నాయుడు అనే వ్యక్తి వంకను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేయడంతో వర్షం నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీని ఆక్రమించడంతో దుస్థితి నెలకొందని చెబుతున్నారు. ● కాటిగానికాలువకు చెందిన రైతు రామచంద్ర తన ఎకరా భూమిలో సాగు చేసిన బీరపంట మొత్తం నీటిలో మునిగిపోయింది. రామినేపల్లి గ్రామంలో రాగే లక్ష్మీనారాయణ అనే రైతు 1.80 ఎకరాల్లో 2 నెలల క్రితం సాగు చేసిన 2 వేల అరటి మొక్కలు కొట్టుకుపోయాయి. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్‌డ్యాంకు రామయ్య అనే వ్యక్తి రంధ్రం వేశాడని, దీంతో నీరు తన పొలంలోకి చేరి పంట మొత్తం దెబ్బతిందని రామచంద్ర వాపోయాడు. మరో 15 రోజుల్లో కోత పెట్టాల్సిన సమయంలో ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ● వాన నీటితో పంగల్‌రోడ్డు సమీపంలోని శిల్పా లేపాక్షి నగర్లో పలు ఇళ్లు నీట మునిగాయి. ఆక్రమణల కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొన్నారు. పంటలకు తీవ్ర నష్టం.. వర్షం ధాటికి జిల్లాలో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం, కళ్యాణదుర్గం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా కరెంటు స్తంభా లు, వృక్షాలు నేలకూలాయి. కక్కలపల్లి సబ్‌స్టేషన్‌లోకి నీళ్లు చేరడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా భూములు దుక్కులు చేసుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో వాన రాప్తాడులో కుండపోత రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం కాలనీలు జలమయం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం పలు చోట్ల పంటలకు నష్టం జీవాల మృత్యువాత -
మరోసారి ఫయాజ్ ఇంటికి మున్సిపల్ అధికారులు
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్ష సాధింపుల పర్వం కొనసాగుతోంది. కమిటీ పేరుతో మరోసారి రెవెన్యూ, మునిసిపల్ అధికారులను గురువారం వైఎస్సార్సీపీ నాయకుడు ఫయాబ్బాషా ఇంటిపైకి ఉసిగొల్పారు. పట్టణంలోని చిన్న బజారులో ఉన్న ఫయాజ్‌బాషా ఇంటి కొలతల కోసం సోమవారం మునిసిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ వెళ్లింది. వారం క్రితం మొదటిసారి కొలతల కోసం వెళ్లినపుడు తలుపులు మూసేశారనే పేరుతో పంచనామా జరిపి తిరిగి వెళ్లారు. రెండో సారిగా గురువారం వెళ్లిన కమిటీకి మరోసారి తలుపులు మూసి వేసి కనిపించడంతో ఇంటి కొలతలు చేపట్టకుండా మరోసారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టణంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నా వాటి జోలికి వెళ్లని అధికారులు.. అన్ని అనుమతులతో సక్రమంగా నిర్మించుకున్న ఫయాజ్ ఇంటిపైకి వెళ్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
యువకుడి మృతదేహం వెలికితీత
రాయదుర్గం టౌన్: స్థానిక దుగ్గిలమ్మ గుడి కోనేరులో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లి గల్లంతైన బోయ రాజశేఖర్ (30) రెండో రోజు గురువారం మృతదేహమై నీటిలో తేలియాడుతూ కనిపించాడు. ఈత రాకపోయినా స్నేహితుల ఒత్తిళ్ల కారణంగా బుధవారం బావిలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజాము నుంచినాలుగు భారీ స్థాయి ఆయిల్ మోటార్లతో బావిలో నీటిని బయటకు తోడేశారు. ఈ క్రమంలో దాదాపు 20 అడుగులకు పైగా నీటిని తోడిన తర్వాత గురువారం రాత్రి 8.30 గంటలకు రాజశేఖర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి అంబులెన్సులో స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్‌పర్సన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
కళ్లకు కట్టారు.. అవగాహన పెంచారు
నంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అపార్ట్మెంట్లో బుధవారం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా వ్యవహరించాలనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాంబులు పేలిన సమయంలో హెచ్చరిక సైరన్ మోగించడం నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడం, సీపీఆర్ చేయడం తదితర విషయాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టం గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం పిల్లలు, యువతకు క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు. – అనంతపురం అ -
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 73.77 శాతం, మూడో సెమిస్టర్లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్దేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనకాయల పంపిణీకి సిద్ధంగా ఉండండి
అనంతపురం అర్బన్: జిల్లాలో వేరుశనగ విత్తనకాయల పంపిణీకి అవసరమైన చర్యలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయాలని చెప్పారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2025కు సంబంధించి 50,592 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాకు 35 డ్రోన్లు కేటాయించారన్నారు. 31 మండలాల పరిధిలో గుర్తించిన 26 గ్రూపులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిగిలిన గ్రూపులను ఎంపిక చేసి ఈ నెలాఖరులోగా డ్రోన్లు పంపిణీ చేయాలన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు ఇరువైపులా ఉద్యాన పంటలు సాగయ్యేలా చూడాలన్నారు. కాలువ గట్టుపై టేకు మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్‌ఖాన్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డీసీఓ అరుణకుమారి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఏడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా అనంతపురం కార్పొరేషన్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వ్యాపారులకు జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం నగరంలోని హౌసింగ్ బోర్డు సెవెన్‌హిల్స్ కాలనీలో ఇంటింటా చెత్త సేకరణను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ముస్తాఫా అనే వ్యక్తి కలెక్టర్‌కు విన్నవించగా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాలస్వామిని ఆయన ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వాడకుండా పబ్లిక్ నోటీసును జారీ చేయాలన్నారు. ప్రతి షాపు వద్ద తడి, పొడి చెత్త డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ షాకీర్, ఇన్చార్జ్ ఈఈ బీఎల్ నరసింహ తదితరులున్నారు. రైతు గ్రూపులకు కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయండి కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జరుగుతోంది. మట్టి, ఇసుక, గ్రావెల్ మొదలుకొని అన్నింటినీ ‘తెలుగు తమ్ముళ్లు’ దోపిడీ చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల హస్తం ఉండటంతో తనిఖీలకు వెళ్లేందుకు మైనింగ్ అధికారులు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటిని వాణిజ్య అవసరాలకు తరలించే వాహనాల నుంచి రాయల్టీ డబ్బు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజు కట్టబెట్టేది. లీజు దక్కించుకున్న సంస్థ నెలానెలా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లించేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం లభించేది. అయితే, జిల్లాలో ప్రైవేటు సంస్థ లీజు గడువు మార్చితోనే ముగిసింది. తర్వాత ఇప్పటివరకూ ఎవ రికీ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి సహజ వనరుల అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 11 మాసాల్లోనే కొండల నేలమట్టం.. ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే అనంతపురం సమీప ప్రాంతాల్లో కొండలు కరిగిపోయాయి. గుట్టలు నేల మట్టమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గుట్టలను కరిగించేశారు. రోజూ ఇక్కడి నుంచి వంద నుంచి 150 టిప్పర్ల మట్టి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇక్కడికి ఇద్దరు మైనింగ్ అధికారులు వెళ్లి వెనక్కు వచ్చారు. మహిళా అధికారులు మట్టి దొంగలను నిలువరించలేకపోయారు. ఇక.. ఆలమూరు కొండలంటే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. పశుపక్ష్యాదులకు ఆలవాలంగా ఉండటమే కాదు రాప్తాడు, అనంతపురం ప్రాంతాలకు రక్షణ కవచంలా ఉండేవి. అలాంటి కొండలను నేలమట్టం చేశారు. చివరకు కరెంటు పోళ్లు కూడా కిందపడిపోయేలా మట్టిని తవ్వారు. స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతోంది. కరిగిపోయిన నేమకల్లు గుట్టలు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో జరుగుతున్న మైనింగ్.. రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా చెప్పొచ్చు. మైనింగ్ డాన్‌గా పేరుగాంచిన టీడీపీ నేతలిద్దరు భారీగా క్రషర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఆరు హెక్టార్లు లీజు ఉంటే 50 ఎకరాల్లో తవ్వుతున్నారు. రూ.20 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని మాఫీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ‘తాడిపత్రి’లో విచ్చలవిడిగా... తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లి, తిమ్మనచెరువు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునేవారే లేరు. ఆత్మకూరు మండలంలో తారస్థాయికి.. ఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి దందా తారస్థాయికి చేరింది. ‘తెలుగు తమ్ముళ్లు’ మట్టి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతం మొత్తం ఇప్పటికే వెంచర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎలాంటి గ్రావెల్ లీజులు లేకుండానే కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి రవాణా సాగిస్తున్నారు. హిందూపురంలో పట్ట పగలే దోపిడీ.. హిందూపురం పట్టణం చుట్టూ ఉన్న రూరల్ ప్రాంతాల నుంచి మట్టి యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వినకుండా మట్టి తోలుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక టన్నుల కొద్దీ కర్ణాటకకు వెళ్లిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో.. ధర్మవరం నియోజకవర్గలోని చిత్రావతి నది నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తోలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రధాన హైవేలోనే నిర్భయంగా టిప్పర్లు వెళుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ వాహనాలను పట్టుకోలేదు. టీడీపీ వాహనాలు అనగానే పోలీసులు వాటికి రాచబాట వేసి మరీ బార్డరు దాటిస్తున్నారు. సహజ వనరుల స్వాహాపర్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు కొండలు కరిగిపోతున్నా.. గుట్టలు నేలమట్టమవుతున్నా ఎవరికీ పట్టని వైనం -
హనుమద్ వాహనంపై నృసింహుడి విహారం
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బుధవారం హనుమద్ వాహనంపై విహరించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భూదేవి, శ్రీదేవి సమేతంగా హనుమద్ వాహనంపై కొలువు దీర్చి ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఉత్సవ ఉభయదాతలు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాథ్ పాల్గొన్నారు.● బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అత్యంత కీలకమైన స్వామివారి కల్యాణోత్సవం ఉంటుంది. అలాగే, గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతికళ్యాణదుర్గం రూరల్: పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని మానిరేవు పంచాయతీ ఓబుళాపురంలో జరిగింది. వివరాలు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన రామలింగ (40)కు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన రామలింగ రోజులాగే బుధవారం తన గొర్రెలను మేపు కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వర్షం కురవడంతో ఓ చెట్టు చాటుకి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రామలింగ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామలింగ మృతి చెందడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు.పాలిసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణతఅనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ –2025లో జిల్లా విద్యార్థులు 93.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 7,908 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 7,363 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4,824 మంది హాజరు కాగా, 4,443 (91.89 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 3,084 మంది హాజరు కాగా, 2,930 (95.01 శాతం) పాస్ అయ్యారు.హారికకు మొదటి ర్యాంకుపాలిసెట్లో జిల్లాకు చెందిన నిమ్మనపల్లి హారిక మోహన్ రాష్ట్ర స్థాయిలో 54వ ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. మొత్తం 119 మార్కులతో సత్తా చాటింది. మేథమేటిక్స్‌లో 49 మార్కులు, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 30 మార్కులు సాధించింది.● పగిడి మహమ్మద్ అస్లాం జిల్లా స్థాయి రెండో ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 107)సాధించాడు. మొత్తం 118 మార్కులతో ప్రతిభ కనబరిచాడు. ఈ విద్యార్థికి మేథమేటిక్స్‌లో 49 మార్కులు, ఫిజిక్స్‌లో 39, కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి.మహిళపై హోంగార్డు దాడిపుట్లూరు:మండలంలోని కడవకల్లు గ్రామంలో హోంగార్డు దాడి చేయడంతో ఓ మహిళ గాయపడింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కడవకల్లు గ్రామంలో తనుజ ఇంటి పక్కనే హోంగార్డు రాజశేఖర్ నివాసముంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన ఇంటి వద్ద తనుజ దుస్తులు ఉతుకుతున్న సమయంలో రాజశేఖర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తన కాలు తగిలించాడు. దీంతో ఆమె చూసుకుని వెళ్లాలంటూ హోంగార్డుకు సూచించింది. ఆ సమయంలో హోంగార్డు రెచ్చిపోయి ‘నాకే చెబుతావా?’ అంటూ ఆమె గొంతు పట్టుకుని నోటిని అదిమిపెట్టి విచక్షణారహితంగా చితకబాదాడు. గాయపడిన బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదుకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లుగా తెలిసింది. దాడికి పాల్పడిన హోంగార్డును కాపాడేందుకు కేసును నిర్వీర్యం చేస్తున్నారంటూ కడవకల్లు వాసులు అసహనం వ్యక్తం చేశారు. -
విశ్రాంత డీఈఓ ఆనందమూర్తి కన్నుమూత
అనంతపురం ఎడ్యుకేషన్: విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురం నగరంలోని అరవిందనగర్‌లో నివాస ముంటున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమా రులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆనందమూర్తి భౌతికకాయానికి గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఆనందమూర్తి 1980లో జేఎల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పదోన్నతిపై 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతి పట్ల ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పట్లో ‘సింగిల్ ఆర్డర్లు’ కలకలం.. ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్లు’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. ఇంకా కొందరు డీఈఓ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఇలా చేసి పలువురు నాయకులు భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో డీఈఓను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు. -
కేంద్రం ఆధీనంలోకి ‘ఉపాధి’
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ సైతం ఉండకుండా ‘కేంద్రం’ అంతా తానై పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం బడ్జెట్లో నిధులను కేటాయిస్తోంది. అయితే, నిధుల ఖర్చు, పనుల గుర్తింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది. దీంతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి.ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ‘యుక్తధార్’ పేరిట యాప్ తీసుకొ చ్చింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 చోట్ల ‘యుక్తధార్’ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు.యాప్‌పై అవగాహన కల్పించేందుకు ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నారు. సర్వం యాప్ ద్వారానే.. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనుల గుర్తింపు దగ్గర నుంచి పనులకు వచ్చే కూలీల వివరాలు, బిల్లుల చెల్లింపులు తదితరాలన్నీ ‘యుక్తధార్’ యాప్ ఆధారంగానే జరగనున్నాయి. జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్‌కు అనుగుణంగా ‘యుక్తధార్’ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉపాధి పనులను గుర్తించిన అనంతరం వాటిని జియోట్యాగ్ ద్వారా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చే కూలీల వివరాలు సైతం పొందుపరచాలి. జియోట్యాగ్ చేసిన పనుల వద్దే కూలీల ఫొటోలను తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో అవకతవకలకు తావుండదు. కూలీలకు వేతనాలు కూడా త్వరగా విడుదలవుతాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు సులభతరం కానున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకు చర్యలు ప్రత్యేకంగా ‘యుక్తధార్’ యాప్ పనుల గుర్తింపు, బిల్లుల చెల్లింపులు సైతం యాప్ ద్వారానే..31 పంచాయతీల్లో యుక్తధార్ ద్వారా పనులు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీల్లో ‘యుక్తధార్’ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యుక్తధార్ యాప్‌నకు అనుసంధానం చేసింది. పనుల గుర్తింపు దగ్గర నుంచి బిల్లుల చెల్లింపు వరకూ అన్ని వివరాలు ఈ యాప్ ద్వారానే నడవనున్నాయి. వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అన్ని పంచాయతీల్లో అమలు చేయనున్నాం. –సలీంబాషా, డ్వామా పీడీ -
యథేచ్ఛగా ఎర్రమట్టి దోపిడీ
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం అధికంగా కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాయదుర్గం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దోపిడీకి అంతులేకుండా పోతోంది. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టి రూ. కోట్లలో దోచేస్తున్నారు. టీడీపీ నేతల స్వార్థానికి రాయదుర్గం నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాయదుర్గంలోని శనీశ్వరాలయం వెనుక ఉన్న హౌసింగ్ లే అవుట్‌కు ఆనుకుని కొండ ప్రాంతంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో కొండ పొరంబోకు స్థలంలో భారీ విస్తీర్ణాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఓ టీడీపీ నాయకుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఎంసీఏ కళాశాల, ఇందిరమ్మ లేఅవుట్లు, గౌడ లేవుట్ సమీపంలో ఉన్న కొండల్లో నుంచి గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోయాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులు తమ స్థలాలను ప్లాట్లు వేసి, రోడ్లను చదును చేసేందుకు కొండల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మీ–సేవా కేంద్రంలో చోరీ
గార్లదిన్నె: స్థానిక మీ సేవా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు చెందిన సోమశేఖరరెడ్డి స్థానిక కెనరా బ్యాంక్ సమీపంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి తాళం వేసి ఇంటికెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో దుండగులు మీసేవా కేంద్రం తాళాలు బద్దులుగొట్టి లోపలకు ప్రవేవించి, రూ.1.50 లక్షల నగదు అపహరించారు. బుధవారం ఉదయం కేంద్రం వద్దకు చేరుకున్న సోమశేఖరరెడ్డి చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
ఖరీఫ్ సాగులో వైవిధ్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగులో వైవిధ్యం కనిపిస్తోంది. ఒకట్రెండు పంటలపై ఆధారపడకుండా రైతులు మరికొన్ని పంటల సాగుపై దృష్టి సారించారు. అలాగే పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతను దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టుబడుల పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కొన్ని దశాబ్దాలుగా ఏకపంటగా లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ క్రమేణా సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. నల్లరేగడి భూముల్లో కేవలం తెల్లబంగారాన్ని నమ్ముకున్న రైతులు ఇటీవల పత్తి సాగును తగ్గించారు. వేరుశనగ, పత్తి స్థానాల్లో కంది, మొక్కజొన్న బాగా పెరిగింది. అలాగే పాతతరం పంట కొర్ర కూడా పెరుగుతోంది. పెసర, అలసంద, ఉలవ తగ్గిపోగా మినుము, సోయాపై మక్కువ చూపుతున్నారు. సజ్జ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు తగ్గుముఖం పట్టాయి. గత ఖరీఫ్‌లో ‘కంది’ చరిత్ర గత ఖరీఫ్‌లో కంది పంట చరిత్రను తిరగరాసింది. తొలిసారిగా లక్ష హెక్టార్లకు పైగా సాగులోకి రావడం గమనార్హం. గతేడాది కంది పంట 37,367 హెక్టార్లలో రావచ్చని అంచనా వేయగా... చివరకు ఏకంగా 1.03 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. అంటే మూడింతల సాగు పెరిగింది. 31 మండలాల్లోనూ కందిపై రైతులు మొగ్గుచూపారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో కూడా ఎప్పుడూ కంది పంట 70 వేల హెక్టార్లు దాటకపోవడం గమనార్హం. 11 వేల హెక్టార్లు సాధారణ సాగుగా అంచనా వేసిన మొక్కజొన్న 20 వేల హెక్టార్లకు పెరిగింది. ఇటీవల కాలంలో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు పంటలకు పెట్టుబడులు తక్కువ కావడంతో విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. కొర్ర కూడా 1,500 హెక్టార్లుగా అంచనా వేయగా రెట్టింపు విస్తీర్ణంలో 3 వేల హెక్టార్లకు పెరిగింది. ఇక ఐదారేళ్లుగా ఆముదం పంట కాస్త అటుఇటుగా 15 వేల హెక్టార్లతో స్థిరంగా కొనసాగుతోంది. బాగా తగ్గిన వేరుశనగ, పత్తి గతి తప్పిన వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర లభించని కారణంగా రైతులు వేరుశనగ, పత్తి సాగును తగ్గించేశారు. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 1.98 లక్షల హెక్టార్లు కాగా 57 శాతంతో 1.12 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. అలాగే పత్తి సాగు కూడా 48,586 హెక్టార్లకు గానూ 59 శాతంతో 28,530 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్ జాబితాలో వేరుశనగ, పత్తి ప్రధాన పంటలుగా ఉండగా... ఇపుడు వాటి స్థానంలో కంది, మొక్కజొన్న పంటలు చేరుతున్నాయి. ఇక నీటి వసతి కింద 20 వేల నుంచి 22 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగులోకి వస్తోంది. హైబ్రీడ్ విత్తన రకాలపై దృష్టి కంది, మొక్కజొన్న పంటల విస్తీర్ణం పెరుగుతున్న తరుణంలో హైబ్రీడ్ రకాల విత్తనాలు రాయితీతో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో పాతవి ఎల్‌ఆర్‌జీ రకాలు ఇస్తుండటంతో అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎల్‌ఆర్‌జీ కంది రకాలు ఉచితంగా ఇచ్చినా వద్దనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో మంచి హైబ్రీడ్ రకాలు ఉన్నందున వాటిపై దృష్టి పెడుతున్నారు. అలాగే మొక్కజొన్న, ఆముదం కూడా రాయితీపై ఇస్తే చాలా వరకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పెరిగిన కంది, కొర్ర, మొక్కజొన్న గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగు 3 వేల హెక్టార్లలో కొర్ర, 20 వేల హెక్టార్లకు పెరిగిన మొక్కజొన్న పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో భారీగా తగ్గిన వేరుశనగ, పత్తి -
స్నాతకోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిద్దాం
● జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 17న పకడ్బందీగా నిర్వహిద్దామంటూ సంబంధిత అధికారులకు వర్శిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. స్నాతకోత్సవం నిర్వహణపై సమన్వయ కమిటీ సభ్యులతో బుధవారం వీసీ సమీక్షించారు. ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో స్నాతకోత్సవంలో పాల్గొంటారని, గౌరవ డాక్టరేట్‌ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో హాజరుకానున్న ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు రానివ్వరాదన్నారు. ఉదయం 9:30 గంటల్లోపు గోల్డ్‌మెడల్స్ గ్రహీతలు, పీహెచ్డీ అవార్డులు పొందిన విద్యార్థులు ఆడిటోరియానికి చేరుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ ఎన్.దేవన్న, డైరెక్టర్లు పాల్గొన్నారు. యువకుడి గల్లంతు రాయదుర్గం టౌన్: స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు బావిలో గల్లంతయ్యాడు. వివరాలు... రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రి వెనుక వీధిలో నివాసముంటున్న సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు బోయ రాజశేఖర్ (30)కు భార్య నేత్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. గార్మెంట్స్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలసి రాజశేఖర్ స్థానిక దుగ్గిలమ్మ ఆలయం వద్ద ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. బావిలో దిగిన రాజశేఖర్ కొద్ది సేపటికే గల్లంతయ్యాడు. దీంతో భయపడిన స్నేహితులు బయటకు వచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు విషయం తెలుసుకున్న బంధవులు, పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. గత ఈతగాళ్లను రంగంలో దించారు. బావిలో పూర్తి స్థాయిలో నీరు ఉండడం, లోతు కూడా ఎక్కువగా ఉండడంతో ఆచూకీ లభ్యం కాలేదు. సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా, ఈత రాని రాజశేఖర్‌ను స్నేహితులు బలవంతం చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాక అప్పటికే స్నేహితులందరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. -
విశిష్ట వేడుకకు వేళాయె
రాయదుర్గం టౌన్: విశిష్ట వేడుకకు స్థానిక కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకూ కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 15న గురువారం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. నిశ్చితార్థం మొదలు కల్యాణం వరకూ అన్ని శాస్త్రబద్దంగా పురోహితుల మంత్రోచ్చరణల మధ్య జరిగే వివాహ తంతు దాదాపు 60 ఏళ్ల క్రితం పద్మశాలియ వంశస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. ఏటా పద్మశాలియ వంశంలో అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపిస్తుంటారు. ఈ నెల 15న గురువారం 11.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవానికి పండితులు ముహూర్తం నిర్ణయించారు. అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలో భాగంగా పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక మిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (శ్రీధన్య)ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కుమార్తెను అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛరణలతో వివాహం జరిపిస్తారు. నేడు ప్రసన్న వేంకటరమణస్వామి కల్యాణోత్సవం తొమ్మిదేళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహ ఘట్టం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తయిన ఏర్పాట్లు -
హంద్రీ–నీవాపై బహిరంగ చర్చకు సిద్ధం
గుంతకల్లు టౌన్: హంద్రీ–నీవా కెనాల్ పనులు పూర్తి చేసిందెవరు? అందుకు ఎవరెంత నిధులిచ్చారో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రకటించారు. హంద్రీ–నీవాకు శిలాఫలకం వేసిన ఉరవకొండలోనే బహిరంగంగా చర్చిద్దామని, తేదీ, సమయమెప్పుడో నిర్ణయించాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుకు ఆయన ప్రతి సవాల్ విసిరారు. బహిరంగచర్చ జరిగే రోజున పోలీసులపై ఒత్తిడి తీసుకెళ్లి తమను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయించొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి సారధ్యంలో మొదలైన రాయలసీమ ఉద్యమంపై అప్పటి సీఎం ఎన్టీ.రామారావు స్పందించి హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తిరిగి తొమ్మిదేళ్లు సీఎంగా కొనసాగిన చంద్రబాబు హంద్రీ–నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. 2004లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాకనే హంద్రీ–నీవా పనులు వేగవంతమయ్యాయన్నారు. హంద్రీ–నీవా గురించి అన్నీ తెలిసిన కాలవ శ్రీనివాసులు నేడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీనీవాలో 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, తిరిగి కూటమి ప్రభుత్వం 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి, మంత్రి కేశవ్‌కు, విప్ కాలవకు చిత్తశుద్ధి ఉంటే 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా సామర్థ్యం పెంచేలా పనులు చేపట్టాలని సవాల్ విసిరారు. మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అమరుడైన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. జవానుల వీరోచిత పోరాటాన్ని ఆయన కొనియాడారు. మురళీనాయక్‌తో పాటు యుద్ధంలో అసువులు బాసిన జవానులు, పహల్గామ్ ఘటనలో మృతి చెందిన అమాయకపు ప్రజల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్ చాంద్‌బాషా, పార్టీ సీనియర్ నేతలు భీమలింగప్ప, దశరథరెడ్డి, కాకర్ల నాగేశ్వరరావు, నిజామి, పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు రంగనాయకులు, బాసిద్, బాబూరావు పాల్గొన్నారు. ఉరవకొండ వేదికగానే తేదీ, సమయం చెప్పండి ప్రభుత్వ విప్ కాలవకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ప్రతి సవాల్ -
ఇన్ సర్వీస్ టీచర్లపై వివక్ష వీడాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో ఇన్ సర్వీస్ టీచర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. వివక్షను వీడాలంటూ బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నీలూరి రమణారెడ్డి, ఎస్.రామాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన సౌకర్యం ప్రకారం ఉన్నత ప్రమోషన్ కోసం ఇన్‌సర్వీస్‌లో బీఈడీ చేయడం ఉపాధ్యాయుల హక్కు అన్నారు. 8 ఏళ్లు పూర్తయిన వారికి, రేషనలైజేషన్ గురైన వారికి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల స్థానాల్లో మిగులు టీచర్లు, ఎంటీఎస్ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ నాయకులు సురేష్‌కుమార్, మల్లికార్జున, ఉపాధ్యాయులు రామన్న, ఓబన్న, ఆదినారాయణ, మురళి, సుమలత, సరోజబాయి, పెద్దన్న, మేరీలత, చంద్రశేఖర్, మహేష్, మహాలక్ష్మి ఉన్నారు. డ్రోన్ వినియోగంపై దృష్టి సారించండి : డీడీహెచ్అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలుగా డ్రోన్లను వినియోగించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉద్యానశాఖ అధికారులకు ఆ శాఖ డీడీ జి.ఫిరోజ్‌ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో సూపరెండెండెంట్ బాషా, టెక్నికల్ హెచ్ఓ రత్నకుమార్, ఉద్యానాధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఉద్యాన రంగం పురోభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినందున వాటి ఫలాలు రైతులకు అందేలా క్షేత్రస్థాయిలో హెచ్ఓలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. డ్రోన్ వినియోగంపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద గార్లదిన్నె మండలం ముకుందాపురం రైతులను చైతన్య పరిచినట్లు తెలిపారు. హంద్రీ–నీవా కాలువ వెంబడి ఉద్యాన పంటల పెంపకం ప్రోత్సహించాలన్నారు. అలాగే హెచ్చెల్సీ వెంబడి కూడా కొబ్బరి, వెదురు, అరటి, మునగ లాంటి పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అరటి, మామిడి పండ్లకు వాడే కవర్లు రాయితీతో అందించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ, వాడకంలో కూడా రైతులకు మేలు జరిగేలా చూడాలని ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి సూచించారు. -
ఆర్థిక అసమానతల వల్లే మతమార్పిడి
అనంతపురం కల్చరల్: సమాజంలో పెరిగిన ఆర్థిక అసమానతల వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి వై.రాఘవులు అన్నారు. బుధవారం అనంతకు విచ్చేసిన ఆయన స్థానిక కోర్టురోడ్డులోని శివకృప (ఆర్ఎస్ఎస్ భవన్)లో జిల్లా అర్చక ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. సనాతన హైందవ ప్రచారానికి ప్రాముఖ్యతనిచ్చే అర్చకులు మరిన్ని మార్గాల ద్వారా ధర్మాన్ని కాపాడాలని సూచించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు దేశకాల పరిస్థితులను వివరించడం, పరిణామ సంకీర్తనలు చేయించడం, సేవా కార్యక్రమాలలో అందరనీ భాగస్వాములను చేయడం ద్వారా మత మార్పిడులను అరికట్టవచ్చన్నారు. అనంతరం అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు నేతృత్వంలో ఎండోమెంటు సహాయ కమిషనర్ ఆదిశేషు నాయుడిని కలిసి అర్చక సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరుపతయ్య, శ్రీనివాసులు, మారుతీప్రసాద్, వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు కేవీ రమణబాబు, జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, సభ్యులు గురప్ప, దినేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.యువ రైతు ఆత్మహత్య విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన కోనంపల్లి రవియాదవ్ (26), కొంత కాలంగా మిర్చి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల సాగుకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో అప్పులు తీరిపోతాయని భావించాడు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక్కసారిగా కుదేలయ్యాడు. కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో ఇక అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన రవి యాదవ్.. బుధవారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి అనుమానాస్పద మృతికణేకల్లు: మండలంలోని మాల్యం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న హరిజన యల్లప్ప (70) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. వర్షానికి కారుతున్న తన పూరి గుడిసెను మరమ్మతు చేసేందుకు అవసరమైన ఆపు (గడ్డి) కోసుకొచ్చేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామ శివారులోని వంక వద్దకు వెళ్లాడు. గంట తర్వాత ఇద్దరు మనవళ్లు తాతకు తాగునీటి బాటిల్ ఇచ్చేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ యల్లప్ప కనిపించలేదు. దీంతో పిల్లలు ఇంటికెళ్లి విషయాన్ని తమ తండ్రి రమేష్‌కు తెలపడంతో ఆయన అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడ అచేతనంగా పడి ఉన్న యల్లప్పను గమనించి వెలికి తీశాడు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆపు కోస్తున్న సమయంలో నీళ్లలో నుంచి విద్యుత్ ప్రసారం జరిగి మృతి చెందాడా? లేక, గుండెపోటుతోనా? వడదెబ్బతోనా అనే అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
అనంతపురం/నందవరం: అప్పటికే ఆమెకు ఒక కుమారుడు. తర్వాత రెండో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేస్తూ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటికి వెళ్లి వెంటనే రావాలని భర్త సూచించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... మంత్రాలయం మండలం మాధవవరం గ్రామానికి చెందిన బోయ ఈరన్న చిన్న కుమార్తె ఉరుకుందమ్మ (24)కు 2020లో అదే జిల్లా నందవరం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు పొపయ్యతో వివాహమైంది. వీరికి మూడేళ్ల వయస్సు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగరాజు వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఉరుకుందమ్మ పుట్టింటికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుక ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకోగానే సాయంత్రం పొపయ్య ఫోన్ చేసి తన భార్యను వెంటనే మా ఊరికి పంపాలని మామను కోరాడు. బుధవారం పిలుచకొస్తామని తెలిపినా అల్లుడు వినలేదు. దీంతో ఆదివారమే కుమార్తెను తండ్రి పిలుచుకెళ్లి భర్త వద్ద వదిలాడు. సోమవారం ఉదయం 11 గంటలకు పాపయ్య మరోసారి ఫోన్ చేసి ఉరుకుందమ్మ కనిపించడం లేదని తెలిపాడు. దీంతో కుమారుడు నాగరాజు, అల్లుళ్లు తాయన్న, రమేష్ తో కలసి నందవరం గ్రామానికి ఈరన్న చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ఫోన్ చేసి ఉరుకుందమ్మ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ పక్కన చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని ఉరుకుందమ్మ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడి ఒత్తిళ్లు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతి లాల్ తెలిపారు. -
అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగి్నవీర్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైఎస్ జగన్ కొనియాడారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీనాయక్ ఇంట్లోకి వైఎస్ జగన్ రాగానే.. జవాన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. జగన్ రాకతో కల్లితండా జనసంద్రంలా మారింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కల్లితండా.. కన్నీరు మున్నీరు.. నాలుగైదు రోజులుగా దిగమింగుకున్న బాధను వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ఒక్కసారిగా భావోద్వేగంతో వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో మురళీ నాయక్ త్యాగాన్ని దేశం గరి్వంచినా.. కన్నతల్లి కంట కన్నీరు మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు జాతీయ జెండాలతో తరలివచ్చారు. గోరంట్ల – పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు దూరం ఉన్న కల్లితండాకు వచ్చేందుకు గంటకుపైగా సమయం పట్టింది. గత సర్కారు సంప్రదాయమే.. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని మొదట ప్రతిపాదన తీసుకొచ్చి.. అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. మార్మోగిన ‘జై జవాన్’ నినాదం.. కల్లితండాలోకి వైఎస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి ‘జై జవాన్’ నినాదం మార్మోగింది. ‘భారత్ మాతాకీ జై.. మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. మురళీనాయక్ కుటుంబాన్ని మద్దతుగా నిలిచిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళి కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి జనం రాక.. వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మురళీ నాయక్‌కు ఘన నివాళులర్పించారు. తరలివచ్చిన నేతలు.. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపుర జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరలక్కప్ప (మడకశిర), టీఎన్ దీపిక (హిందూపురం), మక్బుల్ (కదిరి), మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మహాలక్ష్మి శ్రీనివాసులు, కోగటం విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.‘‘జగనన్నా.. వచ్చావా.. మురళీ ఎక్కడ అన్నా. నువ్వయినా మా బిడ్డ మురళీని వెంట తెస్తావనుకున్నా’’ – వైఎస్ జగన్ పరామర్శించగానే బోరున విలపిస్తూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆక్రందన ‘‘మురళీ.. పైకి లేచి సెల్యూట్ చేయి.. నీ కోసం జగన్ సర్ వచ్చాడు. మన ఇంటికే జగన్ సర్ వచ్చాడు మురళీ. లే మురళీ.. లేచి సెల్యూట్ చేయి మురళీ’’ – వైఎస్ జగన్‌ను చూడగానే మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ భావోద్వేగం‘‘మురళీ నాయక్‌ను అయితే తేలేను తల్లీ.. నీ బిడ్డ పోరాటం వృథా కాదు. ఎంతోమందికి రక్షణగా నిలిచి.. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మురళీ త్యాగానికి రుణపడి ఉంటాం’’ – మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి‘జై జవాన్’ నినాదం మార్మోగింది. కుగ్రామం కల్లితండాలో జనసునామీ పోటెత్తింది. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాగా... అభిమాన గణం వెంట నడిచి జవాన్‌కు అశ్రు నివాళులర్పించింది. -
భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా..!
బెళుగుప్ప(అనంతపురం): లగ్జరీ జీవితం ఆమె కల. పెళ్లి పేరిట ఆ కల నెరవేర్చాలనుకుంది. ఇందుకు దివ్యాంగుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంది. అనుకున్న విధంగా నగదు, నగలు, కారు సమకూర్చుకున్న తర్వాత.. భర్తతో గొడవ పెట్టుకుని ఉడాయించింది. అవసరాలన్నీ తీర్చి బికారిగా మారిపోయిన భర్త.. తన భార్య మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్ప మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం ఫయాజ్ దివ్యాంగుడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షబానా నచ్చింది. అటువైపు నుంచి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో అనంతపురంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనంతపురంలోనే ఓ ఇంటిని తీసుకుని కాపురం పెట్టారు. నమ్మించి.. వంచించి.. భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా అయిపోయాడు. ఆమె సంతోషం కోసం ఏది అడిగినా కాదనలేకపోయేవాడు. అలా తన మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో షబానా తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. మొదట తన అక్క జరీనా కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భర్త ఫయాజ్ పేరిట రూ.30 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. ఆయన వేతనం నుంచి 2024 ఫిబ్రవరి నుంచి రూ.60 వేల చొప్పున ఈఎంఐ కట్ అవుతూ వస్తోంది. ఆ తర్వాత అనంతపురంలోని సొంతింటిని కూడా విక్రయించి రూ.40 లక్షలు తీసుకుంది. దీంతో ఏడాదిగా బెళుగుప్పలోని అద్దె ఇంటికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే అనంతపురంలో ఫయాజ్ పేరున ఉన్న ప్లాట్‌ను సైతం విక్రయించి రూ.7 లక్షలు తీసుకుంది. అలాగే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు తులాల బంగారు నగలు కొనుగోలు చేయించింది. రాకపోకలకు అనువుగా ఉండాలని రూ.6 లక్షల విలువైన కారు కొనుగోలు చేయించింది. ఇలా తన అవసరాలు తీర్చుకున్న తరువాత గత నెల 28న బెళుగుప్పలోని నివాసంలో గొడవపడిన షబానా.. ఆ మరుసటి రోజే (29న) తన తల్లిదండ్రులు షమి, అలీ, అక్క జరీనాను పిలిపించి దివ్యాంగుడైన భర్తను ఇంట్లోనే బంధించి.. సామగ్రిని వాహనంలో వేసుకుని కారుతో సహా తెనాలికి వెళ్లిపోయింది. విలాసవంతమైన జీవితానికి అవసరమైన డబ్బు కోసం తనను వాడుకుని వంచనకు గురి చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫయాజ్ బెళుగుప్ప పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ మంగళవారం మీడియాకు తెలిపారు. -
ఇక 9 రకాల పాఠశాలలు
●నూతన విధానాలు ప్రకటించిన ప్రభుత్వం ●పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు జీఓలు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు మంగళవారం జీఓలు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జాబితాలను అనంతపురం శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రెడీ చేస్తున్నారు. గతంలో 117 జీఓను అనుసరిస్తూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4.5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చారు. కూటమి ప్రభుత్వంలో 117 జీఓ రద్దు తర్వాత చాలా వరకు ఫౌండేషన్ స్కూళ్లను అలానే ఉంచారు. 3,4,5 తరగతులను సమీపంలోని మరో ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఇవీ పాఠశాలలు... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1,పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1–2 తరగతులు), బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2,1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2, 1–8 తరగతులు), ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు), ఉన్నత పాఠశాలలు (1–10 తరగతులు), హైస్కూల్ ప్లస్ (6–12 తరగతులు), హైస్కూల్ ప్లస్ (1–12 తరగతులు). జిల్లాలో ఏయే స్కూళ్లు ఎన్నంటే... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి 2వ తరగతి వరకు)–92, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5 తరగతులు, 1–5 తరగతులు) 621, మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5, 1–5 తరగతులు) 626, ప్రాథమికోన్నత పాఠశాలలు (1–7/8 తరగతులు) 59, ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు) 338 పాఠశాలలుగా మారాయి. మొత్తం 1,736 పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల హెచ్ఎంలుగా ఎస్ఏలు నూతన విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,556 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం/స్కూల్ అసిస్టెంట్‌గా కన్వర్షన్ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 520 పోస్టులను సృష్టించారు. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో 515, ప్రభుత్వ పాఠశాలల్లో 5 పోస్టులను కన్వర్షన్ చేశారు. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో పని చేస్తున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల గురించి స్పష్టత ఇవ్వలేదు. అలాగే జిల్లాలో మరో 34 (ఎంపీపీ, జెడ్పీ–31, ప్రభుత్వం–3) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అదే మేనేజ్మంట్ స్కూళ్లలో కన్వర్షన్ చేశారు. అయితే ఏయే సబ్జెక్టులనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్టాండ్‌లో బంగారు నగల చోరీ
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. వివరాలు... కర్నూలుకు చెందిన సుభాన్‌బీ సోమవారం గుంతకల్లులో జరిగిన బంధువుల ఇంట శుభ కార్యానికి వెళ్లారు. మంగళవారం ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు గుత్తి బస్టాండ్‌కు చేరుకోగానే కాసేపు ఆగింది. కాసేపటి తర్వాత తన వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించుకున్న ఆమె... అందులో ఉంచిన ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ ఎస్ఐపై వేటు● సరెండర్ చేస్తూ డీఐజీ ఉత్తర్వుల జారీఅనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం. ప్రదీప్‌కుమార్‌పై వేటు పడింది. అతన్ని సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్‌కుమార్ ఉన్నతాధికారుల అండ చూసుకుని లాబీయింగ్ చేసేవారని, డీఎస్పీ, సీఐలను సైతం లెక్క చేయకుండా వ్యవహరించే వారని సమాచారం. దీంతో పాటు రాజకీయ అండతో పంచాయితీలు, పైరవీలు చేస్తుండటంపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ.. ప్రదీప్‌కుమార్‌ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
వడదెబ్బతో మహిళ మృతి
ఆత్మకూరు: వడదెబ్బకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఆత్మకూరుకు చెందిన ఉరుముల రామాంజినమ్మ (59) సోమవారం తనకు ఉన్న రెండు ఆవులను తోలుకొని మేత కోసం పొలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకు కోసం వెతికారు. పొలం వద్ద స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రామాంజినమ్మ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. రామాంజినమ్మకు భర్త, కుమారుడు ఉన్నారు. ‘శ్రీరామిరెడ్డి’ కార్మికులతో అధికారుల చర్చలు విఫలం కూడేరు: శ్రీరామిరెడ్డి పథకం కార్మికులతో అధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. మండలంలోని పీఏబీఆర్ సమీపంలో ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో మంగళవారం అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ చర్చలు జరిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను ఈ నెల 17న, పీఎఫ్ ఈ నెలాఖరుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కార్మికులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అంగీకరించలేదు. 38 రోజులుగా సమ్మెలో ఉన్నామని, వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసే దిశగానే మాట్లాడితే ఎలా.. అని ఓబులు ప్రశ్నించారు. ‘సమ్మెలోకి వెళ్లిన ప్రతిసారీ ఫలానా గడువులోపు ఇస్తామంటారు.. మళ్లీ స్పందించరు.. మీ హామీలపై నమ్మకం లేదు, కార్మికులు సమ్మె కొనసాగిస్తారు’ అని ఓబులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్, డీఈ శిరీషా, తహసీల్ధార్ మహబూబ్ బాషా, సర్వేయర్ అయేషా సిద్దికీ, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు కొండారెడ్డి, రామాంజనేయులు, నాగరాజు, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
దారి వెంట నీరాజనం..
చిలమత్తూరు: అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు బయలుదేరిన మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా జనం నీరాజనం పలికారు. హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయమే బాగేపల్లి టోల్‌ప్లాజ్ వద్దకు వేలాదిగా చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ రాకకోసం నిరీక్షిస్తూ గడిపారు. వైఎస్ జగన్ కాన్వాయ్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినదిస్తూ జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి వైఎస్ జగన్ కారులో నుంచే వారికి అభివాదం చేసుకుంటూ.. నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. అభిమాన తరంగం వెంట రాగా వైఎస్ జగన్ కొడికొండ చెక్‌పోస్ట్, కోడూరు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి క్రాస్, మీదుగా కల్లితండా చేరుకున్నారు. యువత భారీ బైక్ ర్యాలీతో కల్లితండా వరకూ జగన్ కాన్వాయ్‌ను అనుసరించింది.తిరుగు ప్రయాణంలోనూ అదే అభిమానం..మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుమార్గంలో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. బెంగళూరు మార్గంలోని దారికి ఇరువైపులా నిలబడి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానం చూపారు. -
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు. -
లోదుక్కులతో లాభాలెన్నో..
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వేసవిలో లోతుగా దుక్కులు చేసుకుంటే ఖరీఫ్ పంటలకు చాలా మేలు జరుగుతుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు మందుస్తు సేద్యపు పనులు చేసుకోవాలన్నారు. అందులో భాగంగా పొలాల్లో వాలుకు అడ్డంగా దున్నడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి సేద్యపు పనులు చేసుకోవాలని సూచించారు. 75 శాతం వర్షాధారం జిల్లాలో 75 శాతం విస్తీర్ణం వరకు వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా లేదంటే ఆలస్యం కావడం.. త్వరగా నిష్క్రమించడం.. తక్కువ వర్షాలు కురవడం.. అనిశ్చితి వర్షాలు.. పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం.. ఒక్కోసారి విరామం లేకుండా అతివష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం, ఒరవడి రూపంలో బయటకు వెళ్లి వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహం రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. లోదుక్కులతో విస్తృత ప్రయోజనాలు వేసవిలో కురిసే ఇలాంటి వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్రనేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్నే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా కోశస్థ దశలో ఉన్న పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకు నశిస్తాయి. వచ్చే పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. భూమి గుల్లబారిపోతుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా కొంతకాలం పాటు పంటలను కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. కలుపు సమస్య కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా గాలిలో నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇలా విత్తనం వేయడానికి ముందుగా రెండు మూడు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. శాస్త్రవేత్తలు విజయ శంకరబాబు, నారాయణస్వామి సూచనలు -
నేడు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.జయప్రదం చేద్దాంఅనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొడికొండ చెక్‌పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారని, పార్టీ శ్రేణులు ఆ సమయానికంతా కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకోవాలని ‘అనంత’ కోరారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
గార్లదిన్నె: ‘వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. ఇప్పటికే ఐదు, ఆరు సార్లు అర్జీలిచ్చాం. ఇప్పటికై నా పట్టించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం గార్లదిన్నె మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్‌కుమార్‌తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, డీఆర్ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జున, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 360 వినతులు అందాయి. అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పదే పదే వస్తున్న అర్జీలను పరిష్కరించే బాధ్యతను జేసీకి అప్పజెబుతామని, ఇందులో అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. గ్రామ, క్షేత్ర స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అమర జవాన్ ‘అగ్నివీర్ మురళీ నాయక్’కు ఘన నివాళులర్పించారు. వినతుల్లో కొన్ని... ● చీనీ మార్కెట్ యార్డులో ఈ నామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని, సూట్ విధానం రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారాజు నాయకులు చెన్నారెడ్డి, ఓబిలేసు, సంగప్ప విన్నవించారు. ● గార్లదిన్నె నుంచి మర్తాడు, కోటంక వరకు తారు రోడ్డు అధ్వానంగా ఉందని, నూతనంగా రోడ్డు వేయాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆయా గ్రామస్తులు కోరారు. ● కొప్పలకొండ గ్రామంలో సీసీ రోడ్డుపై రాకపోకలు సాగించకుండా ఓ వ్యక్తి ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు అడ్డు పెడుతున్నారని గ్రామానికి చెందిన నాగరాజు విజ్ఞప్తి చేశాడు. ● గార్లదిన్నె డిప్యూటీ తహసీల్దార్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ● ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి, అవమానాలకు గురి చేస్తోందని, న్యాయం చేయాలని కనంపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 360 వినతులు ఈమె పేరు సుబ్బమ్మ. గార్లదిన్నె మండలం శిరివరంవాసి. ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. పది సంవత్సరాల క్రితం సుబ్బమ్మ భర్త చనిపోయాడు. కుమారుడు రేవంత్‌కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. సదరం క్యాంపులో 100 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ మంజూరు చేశారు. ప్రభుత్వం పింఛన్ రూ.6 వేలే అందిస్తోంది. సుబ్బమ్మ కుటుంబానికి భూమి లేదు. రోజూ కూలీ పనులకెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో కుమారుడికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సుబ్బమ్మ పలుమార్లు మండల అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో గార్లదిన్నెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అధికారులు, ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలోనూ సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో టెంట్ల కింద ఉక్కపోతతో నలిగిపోయారు. పేపర్లను ఊపుకుంటూ ఉపశమనం పొందారు. -
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువులు హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియాలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించారన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్‌రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన పోలీసుల వైఫల్యమే సంబంధం లేని నాపై కేసు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. విలన్ గ్యాంగ్... యురేనియం కోసం తవ్వకాలు జరిపిన అనంతరం వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని పసికందుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్
రాచానపల్లి సమీపంలో ఇటీవల రిపేరీ చేయించిన బోరులో వస్తోంది ఆయిల్ కాదు నీరే..వ్యర్థాలు భూమిలోకి వదులుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ ● చుట్టు పక్కల ప్రాంతాల్లో కలుషితమవుతున్న భూగర్భజలాలు ● ఇటీవల రాచానపల్లి పంచాయతీ బోరులో నల్లటి ద్రావకం ● పొగ, దుర్వాసన కూడా వెదజల్లుతున్న వైనం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధి బళ్లారి రోడ్డు సమీపంలో ఉన్న ఔషధాల తయారీ సిఫ్లాన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వ్యర్థాలు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతుండటంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీకి చుట్టుపక్కల 6–7 కిలోమీటర్ల వరకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిఫ్లాన్ ఫ్యాక్టరీకి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని చెక్ డ్యాంలో ఉన్న రాచానపల్లి పంచాయతీ బోరు ఇటీవల చెడిపోగా.. రిపేరీ చేయించారు. మోటారు ఆన్ చేయగానే నల్లటి ద్రవం బోరులో నుంచి ఎగజిమ్మింది. రెండు ఇంచుల పైపులో దాదాపు రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. ఈ బోరు 250 అడుగుల లోతు ఉంది. దీన్ని బట్టి రసాయన వ్యర్థాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర అవస్థలు.. ‘సిఫ్లాన్’ భూతం కారణంగా రాచానపల్లి, కొడిమి పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాచానపల్లి పంచాయతీలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితమై వస్తోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదని, దుస్తులు ఉతకడానికి కూడా వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంట భూముల్లోనూ డ్రగ్స్ వ్యర్థాల అవశేషాల ప్రభావం పడిందంటున్నారు. దీనికితోడు పొగ, దుర్వాసన వెదజల్లుతుండడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు. -
ప్ర‘గతి’ తప్పిన హెచ్చెల్సీ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)ను ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అధికారిని నియమించకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో హెచ్చెల్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా పనిచేసిన రాజశేఖర్ పదవీ కాలం ముగియడంతో గత నెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కీలకమైన ఖరీఫ్ సీజన్ ఆరంభం కానున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారి పోస్టు భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కనీసం ఇన్చార్జ్ ఎస్ఈ నియామకంపై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులతో కల్వర్టులు, శిథిలావస్థకు వచ్చిన తూముల మరమ్మతులు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించి పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన జిల్లా స్థాయి అధికారి నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అభివృద్ధి పనులు గతి తప్పాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు మంచి అవకాశం జిల్లాకు వరదాయినిగా ఉన్న హెచ్చెల్సీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు అందుతోంది. హెచ్చెల్సీ పరిధిలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులకు ఆదాయ మార్గాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎస్ఈ స్థాయి అధికారులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. ఈసారి నైరుతీ రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని శాస్త్రవేత్తలూ పేర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే తుంగభద్ర డ్యాం ద్వారా ఈ సారి భారీగా నీరు అందే అవకాశమూ ఉంది. ఇలాంటి కీలక సమయంలో కాలువ మరమ్మతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 100 కిలోమీటర్ల వరకూ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంది. ఆ తర్వాత పులివెందుల వరకూ నీటిని అందించాలంటే కాలువ పటిష్టత మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాలువలో మరమ్మతులు, ముళ్ల కంపలు తొలగించడానికి నీటి ప్రవాహం లేని ప్రస్తుత తరుణమే మంచి అవకాశమని పేర్కొంటున్నారు. అతిథి గృహంలోనే విధులు జిల్లా కేంద్రంలో హెచ్చెల్సీ కార్యాలయానికి దిక్కు లేకుండా పోయింది. గతంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఉన్న కార్యాలయం ప్రభుత్వాసుపత్రికి కేటాయించడంతో అక్కడున్న కార్యాలయాన్ని దశాబ్దాల క్రితం కిత్రం నిర్మించిన అతిథి గృహానికి మార్చారు. హెచ్చెల్సీకి నూతన కార్యాలయం నిర్మాణం ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండేళ్లుగా అతిథిగృహం ఇరుకు గదుల్లోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి హెచ్చెల్సీకి పూర్వవైభవం కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో నిర్వీర్యమవుతున్న బృహత్తర ప్రాజెక్ట్ కనీసం ఇన్చార్జ్ ఎస్ఈని నియమించని కూటమి సర్కార్ నానాటికీ ప్రశ్నార్థకమవుతున్న ఆయకట్టు సాగు -
నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలి : ఎస్పీ
అనంతపురం: నేరస్తులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని సిబ్బందికి ఎస్పీ పి.జగదీష్ సూచించారు. ‘ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్’’పై పోలీసు అధికారులకు సోమవారం సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, వాటి ప్యాకేజింగ్, భద్రతా ప్రమాణాలు, సిరాలజీ, డీఎన్ఏ, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి విబాగాల్లో నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, అలాంటి వారిని సమర్థవంతంగా పట్టుకుని చట్టం ద్వారా శిక్షలు వేయించాలంటే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వివిధ అంశాలపై అనంతపురం ఆర్ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా రంగనాథరెడ్డి, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ సుధారాణి, సైంటిఫిక్ అసిస్టెంట్లు మురళి, వెంకటేశ్వరరావు తదితరులు అవగాహన కల్పించారు. -
ఆర్డీటీ పరిరక్షణకు చర్యలు : కలెక్టర్
అనంతపురం టవర్‌క్లాక్: ఆర్డీటీ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో చేపట్టిన రిలే నిరాహార ధీక్షలు సోమవారానికి ఎనిమిదోవ రోజు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి, అఖిలపక్ష కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సీఎం పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానన్నారు. సుధీర్ఘ కాలం పాటు పేదలకు నిస్వార్థ సేవలు అందించిన ఆర్డీటీ పరిరక్షణ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ కోసం 8 రోజులుగా దీక్షలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. ఓ మంచి పని కోసం ఉద్యమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అఖిల పక్ష కమిటీ నాయకులు సాకే హరి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు కొనసాగేలా కలెక్టర్ చేయగలరని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కుల, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేపడతామన్ని అన్నారు. కార్యక్రమంలో కేపీ రాజు, కోట్ల గంగాధర్, సుగమంచి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, ఓబులేసు, టీపీ రామన్న, అనిల్‌కుమార్, కొత్తపల్లి సురేష్, నారాయణ నాయక్, బండారు కుళ్లాయప్ప , నరసింహులు, షఫీ, వన్నూరప్ప, హరినాథరెడ్డి, గోపాలకృష్ణ, తరిమెల రాజు తదితరులు పాల్గొన్నారు. -
యువరైతు బలవన్మరణం
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన రైతు బోయ సుధాకర్(27)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. గత రెండేళ్లుగా మిరప పంట సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడి రాకపోవడంతో పాటు దిగుబడి ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడే సుధాకర్.. సోమవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు.ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డితాడిపత్రి టౌన్: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఎస్టీయూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్ చేయకుండా పారదర్శకత పాటించాలన్నారు. ప్రతి యూపీ పాఠశాలలో నిబంధనలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇచ్చిన గ్రీవెన్స్‌ను క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజినేయులు, ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, తిరుపాల్‌నాయుడు, శివచంద్ర, డేనియల్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం
పుట్లూరు: అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కోమటికుంట్లలో టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన ఎరికలయ్య కుటుంబాన్ని, అనంతరం గరుగుచింతపల్లిలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన పెద్దన్న , నాగరాజును పరామర్శించారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద మద్యం విక్రయించరాదన్నందుకు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు పెద్దన్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి చేసి చూపించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప ఇలా దాడులు చేసి పైశాచిక అనందం పొందడం భావ్యం కాదన్నారు. అధికారం ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గరుగుచింతపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు అండగా నిలుస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ బి.రాఘవరెడ్డి, సర్పంచ్‌లు ఓబులేసు, రామకృష్ణారెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, నాయకులు రామమోహన్‌రెడ్డి, జేఆర్‌పేట మహేశ్వరరెడ్డి, విష్ణునారాయణ, శింగనమల ప్రసాద్, పోలిరెడ్డి, వెంకటశివుడు, కృష్ణయ్య, సూరి తదితరులు ఉన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలకు శింగనమల సమన్వయకర్త శైలజనాథ్ భరోసా -
భూసేకరణ ప్రతిపాదనలు పంపండి
● అధికారులతో జేసీ శివ్‌నారాయణ్ శర్మ అనంతపురం అర్బన్: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. భూ సేకరణ అంశంపై సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో ఆయన సమీక్షించారు. జాతీయ రహదారులు 544డి, 67, 150తో పాటు రైల్వే, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూ బదలాలియింపుపై పెండింగ్ ప్రతిపాదనలు జాతీయ రహదారి అధికారులకు పంపించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎన్‌హెచ్ పీడీ తరుణ్‌కుమార్, భూ విభాగం సూపరిటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెరువు మట్టినీ బొక్కేస్తున్నారు... పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు గ్రామంలో మట్టి దందాకు స్థానిక టీడీపీ కార్యకర్తలు తెరలేపారు. గత రెండు రోజుల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసేందుకు గ్రామంలోని రెండు వర్గాల వారు జేసీబీలతో మట్టిని తరలించేందుకు ప్రయత్నించడంతో అధికారులు తక్షణమే స్పందించి అడ్డుకున్నారు. ఇదే అదునుగా చేసుకుని గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఏకంగా పది ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని, చెరువులోని మట్టిని జేసీబీలతో పెకలించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ పెద్దల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే టీడీపీ బడా నేత ఫోన్ చేయడంతో వాటిని అక్కడే వదిలేసి వచ్చారు. కాగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చెరువులోని మట్టిని తరలిస్తుండటంపై విమర్శలు వ్యక్తవమవుతున్నాయి. ఆ టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్దీకరణకు రూపొందించిన నిబంధనల్లో స్టేషన్ పాయింట్లకు సంబంధించి ఒక పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి కాకుండానే రేషనలైజేషన్‌కు గురవుతున్న టీచర్లకు 8 ఏళ్ల పూర్తి పాయింట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసనాయక్ మాట్లాడారు. సీనియర్/జూనియర్ ఎవరు రీ అపోర్షన్కు గురైనా రీఅపోర్షన్ పాయింట్లు కేటాయించాలన్నారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించి మోడల్ ప్రైమరీ పాఠశాలలకు నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతాన్ని 1:45 ప్రకారం నిర్ధారిస్తూ పోస్టులు కేటాయించాలన్నారు. బదిలీ పాఠశాలల్లో పోస్టులు బ్లాక్ చేయరాదన్నారు. ఇంగ్లిషు తదితర సబ్జెక్టుల సీనియార్టీ లిస్టు ఫైనలైజ్ చేసి.. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన తర్వాతనే మిగులు పోస్టులు ప్రకటించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, సత్యప్రసాద్, అశోక్ నాయక్, వజీర్ బాషా, నారాయణ నాయక్, దామో దర్ రామాంజనేయులు, హుసేన్ఖాన్ పాల్గొన్నారు. -
Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..?
కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది.సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్‌తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్‌ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కాశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్‌లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశీ్మర్‌కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్‌కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్‌నాయక్‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్‌తో చివరిరోజున మురళీనాయక్ మాటలు -
టీడీపీ నేతల పరస్పర దాడులు
తాడిపత్రి: ఓ వివాహ వేడుకలో టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. సజ్జలదిన్నెకు చెందిన టీడీపీ నేత దుబ్బన్న బంధువు కుమారుడి వివాహ వేడుక సంద్భంగా గ్రామంలో శనివారం రాత్రి మెరవణి చేపట్టారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ ప్రముఖుడు సుబ్బయ్య ఇంటి ఎదురుగా మెరవణి వెళుతున్న సమయంలో బాణాసంచా పేల్చేందుకు దుబ్బన్న వర్గీయులు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని సుబ్బయ్య అడ్డుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో బాణాసంచా కాల్చరాదని సూచించాడు. దీంతో దుబ్బన్న వర్గీయులు రెచ్చిపోయి సుబ్బయ్యతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో ఇరువర్గాలకు చెందిన పలువురు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో సుబ్బయ్య వర్గానికి చెందిన రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పార్టీ ఆఫీస్‌లోనే .. గుత్తి: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీకి చెందిన సీనియర్ నేత కోనంకి కృష్ణ కార్యాలయంలో ఇతర నాయకులతో కలిసి సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తుండగా అక్కడకు తన అనుచరులతో కలసి చేరుకున్న టీడీపీ నేత వాసు (జీఆర్పీ కానిస్టేబుల్).. సంస్థాగత ఎన్నికల్లో తన అనుచరులు ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై కోనంకి కృష్ణ అభ్యంతరం తెలపడంతో వాసుతో పాటు అతని అనుచరులు బూతులతో రెచ్చిపోతూ దాడికి ప్రయత్నించారు. అక్కడున్నవ ఆరు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం తనపై జరిగిన దాడిపై తీసిన వీడియోను కోనంకి కృష్ణ విడుదల చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
● అ‘పూర్వ’ం.. ఆత్మీయం
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఇంటర్ కళాశాలలో 1980–83 విద్యాసంవత్సంలో కలసి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. అప్పట్లో 200 మంది కలసి చదువుకోగా, వీరిలో వంద మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. మనసారా పలకరించుకున్నారు. అప్పటి అధ్యాపకులు ఎవరూ లేకపోవడం కాస్త నిరాశ మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత బేలోడు పాఠశాల హెచ్ఎం నాగరాజు, శివానంద, రామదాసు, వెంకటేశులు, శేషప్రభ, కేకేటీ మోహన్, బండి చిన్న, లాయర్ బాబు, ఎర్రిస్వామి తదితరులు నేతృత్వం వహించారు. -
ప్రభుత్వ ధోరణిని ఖండిస్తున్నాం
సాక్షి సంపాదకులు ధనుంజయరెడ్డి ఇంటిపై ఇటీవల పోలీసులు జరిపిన చట్ట విరుద్ధమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సెర్చ్ వారెంటు లేకుండా, అనుమతి లేకుండా ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం. ఈ తరహా చర్యలు మౌలిక హక్కులను హరించడమే కాక, నిష్పక్షపాతంగా వార్తలు అందించే ప్రయత్నాలను అణచివేసే కుట్రలో భాగమేనని భావించాల్సి వస్తుంది. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలి. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. – రామ్‌కుమార్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) జిల్లా అధ్యక్షుడు -
తాగుడులో తగ్గేదేలా..
మందుబాబులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరాయంగా మందు దొరుకుతోంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కోరుకున్న బ్రాండ్ చేతికి చేరుతోంది. ప్రశాంతంగా తాగడానికి.. దోస్తులతో కలిసి విందు చేసుకోవడానికి వైన్‌షాపుల వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మందు తాగుతూ ముక్క తింటూ ‘స్వర్గం’లో తేలియాడుతున్నారు. కూటమి పాలనలో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు దూసుకుపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ‘మద్యం పురం’గా మారిందన్న విమర్శలున్నాయి. విచ్చలవిడి మద్యం కారణంగా గ్రామాల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మద్యం వినియోగం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మద్యపానం, బెల్టుషాపులు, పర్మిట్ రూములపై ఉక్కుపాదం మోపడంతో మద్యం నియంత్రణలో ఉండేది. కూటమి సర్కారు రాగానే ఎమ్మెల్యేల చేతుల్లోనే మద్యం షాపులు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. ‘సంపద సృష్టిస్తా.. అది పేదలకే పంచుతా’ అని పదే పదే చెప్పే చంద్రబాబు..ఇక్కడ మద్యం ద్వారా పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊపందుకున్న మద్యం విక్రయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయనేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. రెండు జిల్లాల్లో గడిచిన 7 నెలల 25 రోజుల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మారు. ఊరూరా బెల్టుషాపులు, అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములతో మూడు పువ్వులు ఆరుకాయలుగా మద్యం వ్యాపారం జరుగుతోంది. అర్బన్‌లోనే ఎక్కువ.. తాజా గణాంకాలను చూస్తే పట్టణాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువైంది. కొత్తగా మద్యం వినియోగదారులు పెరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో రూ.646 కోట్ల విలువైన మద్యం వినియోగం కాగా.. అనంతపురం నగరంలోనే రూ.215 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. తాడిపత్రిలో రూ.84 కోట్లు, గుత్తిలో రూ.63 కోట్లు, గుంతకల్లులో రూ. 61 కోట్ల మద్యం వినియోగమైంది. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో రూ.86 కోట్లు, హిందూపురంలో రూ.57 కోట్లు, పెనుకొండలో రూ.61 కోట్లు, కదిరిలో రూ.54 కోట్ల విలువైన మద్యం వినియోగమైంది. ఊరూరా బెల్టుషాపుల కారణంగా మద్యం విచ్చలవిడిగా తాగుతున్నట్టు వెల్లడైంది. మద్యం వినియోగం (లీటర్లలో) బీరు వినియోగం (లీటర్లలో)మద్యం, బీరు వినియోగం విలువరోజుకు మద్యం కోసం చేస్తున్న వ్యయంఅనంతపురం జిల్లాలో మద్యం వ్యయంశ్రీసత్యసాయి జిల్లాలో మద్యం వ్యయం 8 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యయం ఇదీ ఉమ్మడి జిల్లాలో మద్యం వినియోగం రూ.215 కోట్లతో అనంతపురం అగ్రస్థానం రూ.84 కోట్లతో రెండో స్థానంలో తాడిపత్రి -
ప్రముఖుల నివాళి..
గోరంట్ల: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని మిలటరీ, ప్రభుత్వ అధికారులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో మిలటరీ వాహనంలో కల్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మురళీనాయక్ భౌతికకాయాన్ని ప్రజల సందర్భనార్థం ఉంచారు. వేలాదిమంది ప్రజలు, బంధుమిత్రులు, గ్రామస్తులతో పాటు అధికారులు, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాయదుర్గం ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, ఎంఎస్ రాజు, కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు మురళీనాయక్ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్‌తో పాటు అత్తార్ చాంద్‌బాషా, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వీరజవాన్‌కు నివాళులర్పించారు. జవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌ను పరామర్శించారు.కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మిస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్‌తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్‌ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్‌లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్‌కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. వీరజవాన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఉషశ్రీ చరణ్, ప్రకాష్‌రెడ్డి, దీపిక, మక్బూల్, ఈరలక్కప్ప, అత్తార్ చాంద్‌బాషా వీరజవాన్ మురళీనాయక్‌కు అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు భౌతికకాయం సందర్శించేందుకు తరలివచ్చిన ప్రజలు మార్మోగిన జయహో భారత్.. జైహింద్.. మురళి అమర్‌రహే నినాదాలు ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్‌నాయక్ ‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి ‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్‌తో చివరిరోజున మురళీనాయక్ మాటలు ‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ -
ఆ 10 ఎకరాలపై స్టేటస్కో
రాప్తాడురూరల్: ‘హైకోర్టు ఆదేశాలు’ అంటూ అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేట సర్వే నంబరు 106–1లోని 68 సెంట్లలో పెద్దపెద్ద భవనాలను రెవెన్యూ అధికారులు ఇటీవల తొలగించారు. ఈ వ్యవహారంపై శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం అధ్యక్షుడు పట్నం శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ, పోలీసు అధికారులు భవనాలను తొలగించారంటూ పేర్కొన్నారు. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్, రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓ, జీఎల్ఎన్ శ్రావణ్‌కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ను ప్రతివాదులుగా చేర్చారు. 68 సెంట్లు కాదు...106–1 సర్వేనంబరులో 4.86 ఎకరాలు, 106–2 సర్వే నంబరులో 4.20 ఎకరాలు, 119–1, 119–2 సర్వే నంబర్లలో 94 సెంట్లు కలిపి మొత్తం 10 ఎకరాలు తమదేనని పిటీషనర్ పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదనలు విన్న తర్వాత నాలుగు రోజుల క్రితం హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. 10 ఎకరాలపై స్టేటస్కో ఇచ్చింది. ఈ క్రమంలో బాధితులు సదరు భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అక్రమంగా తొలగించారు.. 106–1 సర్వే నంబరులోని ఇళ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా తొలగించారంటూ బాధితులు వాపోతున్నారు. జీఎల్ఎన్ శ్రావణ్‌కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ వేసిన పిటీషన్‌పై అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులో సర్వే చేసి 68 సెంట్ల స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలంటూ 2024 డిసెంబరు 5న తీర్పు ఇచ్చిందన్నారు. దీన్ని పట్టుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా సంబంధం లేని రూరల్ పరిధిలోని పాపంపేట పొలంలోని 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో ఇళ్లను కూల్చివేశారన్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. భాగపరిష్కారాల్లోనూ చూపలేదు.. పైన పేర్కొన్న నాలుగు సర్వే నంబర్లలో 10 ఎకరాలను శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం, శ్రీ హంపి విద్యారణ్య శంకర భారతి బ్రాహ్మణ వైదిక సంఘం రెండింటీకీ 5 ఎకరాల చొప్పున 1949లో ఆ భూమి హక్కుదారులైన రాచూరి, కొండపల్లి కుటుంబాలు దానవిక్రయం చేశాయి. ఈ భూమిలో మూడోవంతు రాచూరి కుటుంబానికి, ఒకటోవంతు కొండపల్లి కుటుంబానికి భాగాలుండేవి. ఈ రెండు కుటుంబాలు 1952లో భాగపరిష్కారాలు చేసుకున్నాయి. దాన విక్రయం చేసిన 10 ఎకరాల భూమి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 1962లో గొల్లపల్లి కుటుంబ సభ్యులు భాగ పరిష్కారం చేసుకున్నారు. ఇందులోనూ 10 ఎకరాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెబుతున్నారు. న్యాయం గెలిచింది హైకోర్టు తీర్పు ఒకటిస్తే ఇక్కడి అధికారులు మరొకటి అమలు చేసి మాకు అన్యాయం చేశారు. అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులోని భూమి గుర్తించాలని స్పష్టంగా చెప్పినా... పోలీసు, రెవెన్యూ అధికారులు బలవంతంగా మా ఇళ్లను తొలగించారు. ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకెళ్లారు. పైగా మానాన్న, మేము కబ్జా చేశామని ఆర్డీఓ పదేపదే అన్నారు. ఏ ఆధారాలతో అన్నారో ఆయనకే తెలియాలి. అధికారులు కబ్జాదారులకు అండగా నిలిచారు. ఈ ఆధారాలను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఉంచాం. చివరకు న్యాయమే గెలిచింది. నాలుగు సర్వే నంబర్లలో పది ఎకరాలు మాకే చెందుతుందని తీర్పు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేవియట్ వేశా. – పట్నం శివప్రసాద్ విద్యారణ్య నగర్లో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన బాధితులు 106–1, 106–2, 119–1, 119–2 సర్వే నంబర్లలో 10 ఎకరాలపై స్టేటస్కో హెచ్చరిక బోర్డు నాటిన బాధితులు -
సింహ వాహనంపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం దేవేరులతో కలసి సింహవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ధ్వజారోహణ, యాగశాల ప్రవేశ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలి● మాజీ మేయర్ రాగే పరుశురాంఅనంతపురం టవర్‌క్లాక్: ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మేయర్ రాగే పరుశురాం అన్నారు. పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక కనకదాస కల్యాణ మంటపంలో ప్రతిభ పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాగే పరుశురాంలో పాటు అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కురుబలు తమ పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు మర్రిస్వామి, నాయకులు సంజీవరాయుడు, రాజహంస శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్, వీరనారప్ప, సతీష్, చిట్రా పరుశురాం, నారాయణ స్వామి, ఓబులేసు పాల్గొన్నారు.ప్రభుత్వ భవనం కూల్చివేతపై కేసు నమోదుబొమ్మనహాళ్: మండలంలోని గోవిందవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువైద్యశాల భవనాన్ని కూల్చివేశారని మండల పశువైద్యాధికారి వెంకటరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. 2001లో నిర్మించిన భవనం శిథిలావస్ధకు చేరిందని, దీంతో మరో భవనంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని తన ఫిర్యాదులో వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భవనాన్ని గ్రామానికి చెందిన శరణబసప్ప, చిదానంద కూల్చి స్ధలాన్ని ఆక్రమించినట్లుగా వివరించారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రేపు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.నేడు గార్లదిన్నెలో ‘పరిష్కార వేదిక’అనంతపురం అర్బన్/గార్లదిన్నె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గార్లదిన్నెలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. తహసీల్దారు కార్యాలయం పక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. -
చర్యలు తీసుకోవాలి
అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి, రాయదుర్గం. అడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసాద్‌బాబు, డీఈఓ, అనంతపురం -
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలకం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాస్వామ్య మనుగడలో పత్రికల పాత్ర చాలా కీలకమని, ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపి, పాలకులను గాడిన పెట్టే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించిందని పలువురు మేధావులు స్పష్టం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకు కూడా అంతే అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకారణంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసుల చేపట్టిన తనికీలు అప్రజాస్వామిక విధానమేనని స్పష్టం చేస్తున్నారు. మీడియాపై రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్య ధోరణికి ఇది నిదర్శనమని అంటున్నారు. ఽఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడేనని స్పష్టం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసుల తనఖీలను పౌర సమాజం తీవ్ర ఖండిస్తోంది. స్వయం ప్రతిపత్తి అవసరం న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకూ అంతే అవసరం. పత్రికలను ఇది రాయాలి...అది రాయాలి అని మనం మాట్లాడకూడదని ఇటీవల సుప్రీంకోర్డు జడ్జి ఓ కేసు విషయంగా వ్యాఖ్యలు చేశారు. పత్రిక స్వేచ్ఛను ఎవరూ నియంత్రించాలని చేయకూడదని కూడా స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామిక వ్యవస్థలకు విఘాతం అని వ్యాఖ్యానించారు. బయట నుంచి పత్రికలను నియంత్రించాలని చూస్తే బెడిసి కొడుతుంది. – చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు తప్పులను ఎత్తిచూపి, విమర్శించే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించింది ‘సాక్షి’ ఎడిటర్ నివాసంలో పోలీసుల తనీఖీలు మీడియాపై దౌర్జన్య ధోరణికి నిదర్శనం ఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడే -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్దన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద టీడీపీ నాయకులు మద్యం అమ్మకాలు జరుపుతుండడంతో పెద్దన్న అభ్యంతరం తెలిపాడు. దీంతో టీడీపీ కార్యకర్త నవీన్‌తో పాటు మరికొందరు ఆదివారం దాడికి తెగబడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిపై కత్తితో దాడి పెద్దవడుగూరు: మండలలోని గుత్తిఅనంతపురం గ్రామానికి చెందిన తప్పిళ్ల ఆంజనేయులుపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశారు. బండిశూల తిరునాలలో శివ, సాయితో ఆంజనేయులుకు గొడవ జరిగింది. స్థానికులు సర్ధి చెప్పి పంపారు. రాత్రి మటన్ పంచుకునే సమయంలో ఆంజనేయులుపై శివ, సాయి కత్తి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలి అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ 12వ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించి పీఆర్సీ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో యూటీఎఫ్ ఉద్యమ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యమైతే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం 2004 సెప్టెంబరుకు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. టీచర్ల బదిలీల జీఓను వెంటనే విడుదల చేసి వేసవిసెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్జీటీలకు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరై పోస్టులను ఖాళీలుగా చూపాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ.. పదోన్నతుల సీనియార్టీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ నాయకులు ఈశ్వరయ్య, రమణయ్య, హనుమంతరెడ్డి, రవికుమార్, సుబ్బరాయుడు, శేఖర్, రాముడు, చంద్రమోహన్, దేవేంద్రమ్మ పాల్గొన్నారు. కెంచంపల్లిలో చిరుత కలకలం కుందుర్పి: మండలంలోని కెంచంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. గొర్రెల మందపై దాడి చేయడంతో కుక్కలు చుట్టుముట్టాయి. దీంతో చిరుత సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కింది. అదే సమయంలో మేల్కొన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ బెదరగొట్టడంతో గుట్టల్లోకి పరుగు తీసినట్లు గొర్రెల కాపరి ఈరన్న తెలిపాడు. -
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకరన్ తదితరులు ఉన్నారు. ముందుగానే ‘నైరుతి’ అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్రన్ మాన్సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి. ఖరీఫ్‌కు కీలకం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు. -
సేవకు ప్రతిరూపం.. స్టాఫ్‌నర్సులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలందించి, వారిని మామూలు స్థితికి తీసుకురావడంలో స్టాఫ్‌నర్సులకు సాటి మరెవ్వరూ లేరు. సాధారణంగా వైద్యులు రోగిని పరీక్షించి అవసరమైన సేవలను రాసి పెట్టి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత రోగిని 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటూ వైద్య సేవలు అందించడంలో స్టాఫ్‌నర్సులే కీలకంగా ఉంటారు. ఈ క్రమంలోనే స్టాఫ్ నర్సుల సేవలపై ప్రజలను చైతన్యపరిచేలా ఏటా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటలీ దేశానికి చెందిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854–55లో క్రిమియాలో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేష సేవందించారు. ఆమె సేవలకు గుర్తుగా ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో సోమవారం నర్సుల దినోత్సవాన్ని వైభవంగా జరుపుకునేందుకు నర్సులు సిద్ధమయ్యారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి.. జిల్లాలో 2020 మార్చి నుంచి కోవిడ్ నియంత్రణలో నర్సులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. మొదటి మూడు దశల్లో 25,47,582 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా, వీరిలో 1,77, 596 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,327 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 64,200 మంది చికిత్స పొందారు. అప్పట్లో ప్రభుత్వ సర్వజనాస్పత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 2,360 మందికి పైగా స్టాఫ్‌నర్సులు సాహసోపేతమైన విధులు నిర్వర్తిస్తూ కోవిడ్ బారిన పడిన వారు కోలుకునేలా చేశారు. ఈ క్రమంలో వీరిలో 20 నుంచి 30 శాతం మంది కోవిడ్ బారిన పడినా.. కోలుకున్నాక తిరిగి ధైర్యంగా విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి స్టాఫ్‌నర్సుల సేవలకు గుర్తుగా రాష్ట్రస్థాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. అనంతను అగ్రస్థానంలో నిలుపుతాం రోగులకు మెరుగైన సేవలందించడంలో స్టాఫ్‌నర్సుల పాత్ర చాలా కీలకం. క్షతగాత్రులు, ప్రాణాపాయ కేసులు, శస్త్రచికిత్సలు, సిజేరియన్, సాధారణ ప్రసవాలు తదితర సేవల్లో స్టాఫ్‌నర్సులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో అనంతపురం సర్వజనాస్పత్రిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – నాగమణి, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
రాజకీయ దృష్టితో జరిగిన దాడే
సాక్షి ఎడిటర్ ఇంటిపై జరిగిన పోలీసు దాడి కేవలం రాజకీయ దృష్టితో జరిగిన దాడిగానే కనిపిస్తోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి. దీనిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, పత్రికలను టార్గెట్ చేయడం అనుమతించరాదు. చూసీచూడనట్టు పోతే అది సమాజానికి నష్టదాయకమవుతుంది. సాక్షి ఎడిటర్ విషయంలో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చాగల్లు రిజర్వాయర్‌లో వ్యక్తి గల్లంతు
శింగనమల: ఉల్లికల్లు సమీపంలోని చాగలు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లోకి దిగిన ఉల్లికల్లు శ్రీరాములు(48) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఉల్లికల్లుకు చెందిన శ్రీరామలుకు భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు శనివారం మద్యం తాగి చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ టీంను పిలిపించి సాయంత్రం వరకు నీటిలో వెతికించినా శ్రీరాములు జాడ కనిపించలేదు. -
18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు
● విజయవంతం చేయాలని ఈఓ పిలుపు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈఓ కె.వాణి పిలుపునిచ్చారు. ఆలయ సిబ్బందితో కలిసి శనివారం ఆమె హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈఓ మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాలు ఈ నెల 22 వరకు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న స్వామివారికి పుష్పాలంకరణసేవ, ఉత్సవ మూర్తికి తులసీదళంతో లక్షార్చన పూజ, 19న స్వామివారికి డ్రైఫ్రూట్స్‌తో అలంకరణ, ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన, 20న స్వామివారి శ్రీగంధాలంకరణ సేవ, ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన, 21న 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల ఫలాలతో అలంకరణ, ఉత్సవమూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. చివరి రోజు ఈ నెల 22న స్వర్ణవజ్రకవచ అలంకరణలో స్వామివారిని తీర్చిదిద్ది, తోమాలతో విశేష పుష్పాలంకరణ, ఉదయం 9 గంటలకు శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగస్తాయని తెలిపారు. బాలుడిపై కుక్కదాడి యల్లనూరు: మండల కేంద్రంలో గురు ప్రజ్వల్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. పాతపేటలోని రజక వీధిలో నివాసముంటున్న కొప్పేల గురుస్వామి, నాగమ్మ దంపతుల కుమారుడు గురు ప్రజ్వల్. తల్లి శుక్రవారం రాత్రి అన్నం తినిపిస్తుండగా ఇంటి ఆవరణలో ఉన్న కుక్క ఒక్కసారిగా ప్రజ్వల్‌పై దాడిచేసింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
దేవుని ప్రతిరూపం అమ్మ
మాటలకు అందనిది అమ్మ. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అంతే కాదు దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. మనకు జన్మనిచ్చి మనకోసం ఎంతో తాపత్రయపడిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. వారిని బాగా చూసుకుంటేనే మన జన్మకు సార్థకత. మాది కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామం. అమ్మ పి.తులసీబాయి, నాన్న పి.అర్జున్ నాయక్. నేను ఒక్కడే కొడుకును. ఒక అక్క ఉంది. నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. మా నాన్న పోస్టుమాస్టర్‌గా పనిచేశారు. కొన్ని రోజులు అమ్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేశారు. నేను జీవితంలో స్థిరపడడానికి అమ్మ అండదండలే కారణం. ప్రతి దశలోనూ అమ్మ ప్రోత్సాహం ఉంది. – ప్రొఫెసర్ కేబీ చంద్రశేఖర్, మాజీ వీసీ, కృష్ణా యూనివర్సిటీ. -
●తల్లి ప్రోత్సాహంతోనే ఉన్నతస్థానాలకు చేరిన బిడ్డలు ●సందర్భం – నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మేము నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉండేవాళ్లం. అమ్మ వెంకట సుబ్బమ్మ, నాన్న వేణుగోపాలరావు. ఆరో తరగతికి కొడిగెనహళ్లిలో అడ్మిషన్ పొందాను. అప్పటి వరకు అమ్మతోనే ఉండేవాడిని. ఆళ్లగడ్డ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొలం ఉండేది. ఆళ్లగడ్డ నుంచి నిత్యం పొలం పనులకు వెళ్తూ.. ఎంతో కష్టపడేవారు అమ్మ. మేము నలుగురు అబ్బాయిలం. వారిలో నేను పెద్దవాడిని. ముగ్గురు అమ్మాయిలు. నేను బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా నాన్న కాలం చేశారు. అప్పటి నుంచి మా కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. జేన్టీయూ అనంతపురం వీసీ స్థాయికి ఎదగడానికి అమ్మ కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం అమ్మకు 82 సంవత్సరాలు. అమ్మ అండదండలతోనే ఉన్నతస్థాయికి చేరాను. – ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ అనంతపురం అనంతపురం /అనంతపురం కల్చరల్: కల్మషం లేనిది అమ్మ ప్రేమ. అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ పేరు. నవమాసాలు మోసి బిడ్డలను కళ్లలో పెట్టుకుని చూసుకునే తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. మాతృభావన అక్షరాలలో చెప్పలేని, భావాలలో వ్యక్తీకరించలేని తీయని అనుభూతి. ఎంతమంది పిల్లలున్నా కంటికి రెప్పలా కాపాడుకుని ఉన్నత స్థానాలకు చేర్చిన తల్లిదండ్రులు వృద్ధులైపోతే భారంగా భావిస్తున్న రోజులివి. కర్కశ స్వభావమున్న బిడ్డలు తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. అలా పేగు పాశం కోసం తల్లడిల్లే ఎందరో అమ్మలు జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆశ్రమాలలో పిల్లల పిలుపు కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తల్లినే దైవంగా భావించి ఆరాధిస్తూ ఉన్నత స్థానాలను చేరుకున్న వారూ మరెంతోమంది ఉన్నారు. స్వచ్ఛమైన అమ్మ ప్రేమను తెలియజేయడానికి చరిత్రలో ఓ రోజును కేటాయించింది. మే నెలలో రెండవ ఆదివారాన్ని ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం పలుచోట్ల మాతృదినోత్సవ వేడుకలు జరగనున్నాయి. తల్లులందించిన ప్రేమను చాటుకున్న ప్రముఖులు, అధికారుల అనుభవాలతో మదర్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. అమ్మ స్ఫూర్తితోనే ఉన్నత స్థాయికి -
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా ఇటు విద్యార్థుల ఉన్నతికి, అటు దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమ విద్యను అందస్తూ వస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటివన్నీ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తామన్నారు. విద్యా సంస్థలో ప్లస్–1 (ఇంటర్మీడియెట్)తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి -
వైఎస్సార్ కృషితోనే హంద్రీ–నీవా పూర్తి
ఉరవకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే హంద్రీ–నీవా మొదటి దశ పనులు 90 శాతం పూర్తి చేసి జీడిపల్లి వరకు నీటిని తీసుకురాగలిగారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని స్వగృహంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఛాయాపురం వద్ద సీఎం చంద్రబాబు ప్రజావేదిక సాక్షిగా హంద్రీ–నీవాకు సంబంధించి అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ నీటి సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయించారన్నారు. దీనికి సంబందించి టెండర్లు కుడా పూర్తి చేశారని, పనులు ప్రారంభించే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. హంద్రీ–నీవాకు 60 నుంచి 70 టీఎంసీలు రావాలంటే కాలువను క్రమం తప్పకుండా వెడల్పు చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెడల్పు చేస్తాం, రెండో దశ పనుల్లో కాలువకు లైనింగ్ చేస్తామంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమకు సమృద్ధిగా కృష్ణాజలాలు అందాలంటే మొదటి ఫేజ్‌లో 10వేల క్యూసెక్కులతో కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో లైనింగ్ పనులు చేపట్టే బదులు ఆ నిధులతో కాలువ వెడల్పు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాపై అపారమైన ప్రేమే ఉంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఎయిమ్స్‌ను మంగళగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీంతో పాటు కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సాంకేతికతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చే మీరు మరీ అమరావతి రాజధాని కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఛాయాపురంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గ్రామంలో భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు రూ.60 వేలు ఇస్తారని చెబుతున్నారని, ఆ గ్రామస్థులతో మాట్లాడి అక్కడి భూములన్నీ కౌలుకు ఇప్పిస్తా ఎకరాకు రూ.60వేలు కచ్చితంగా ఇప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ములేక అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్‌తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ము లేదు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం -
అమ్మాయిలకు చదువు ముఖ్యం
మాది అనంతపురం మండలం ఉప్పరపల్లి. నాన్న రాముడు రైతు. అమ్మ నారాయణమ్మ. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు చాలా అవసరం అని అమ్మ గట్టిగా నమ్మింది. అలా చదివించడం వల్లే నేను ఎంపీడీఓ స్థాయికి చేరాను. సోదరి డాక్టర్ ఉజ్జినేశ్వరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. తమ్ముళ్లు నరేష్, విష్ణువర్ధన్ ఆపరేటర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇలా అందరూ మంచి స్థానాల్లో స్థిరపడడానికి అమ్మ ప్రోత్సాహం, అందించిన సహకారమే కారణం. ఆడపిల్లలైనా ఇంటి పని చెప్పకుండా చదవాలంటూ పదే పదే చెప్పేది. అందరు తల్లులూ ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుందో.. – విజయలక్ష్మి, ఎంపీడీఓ, రాప్తాడు -
కారు అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం
బత్తలపల్లి/కళ్యాణదుర్గం రూరల్: కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల రామ్మోహన్ తన కుటుంబంతో పాటు స్నేహితుడు రాజశేఖర్‌రెడ్డి (45) కుటుంబ సభ్యులు, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ (25) మొత్తం పదిమంది కళ్యాణదుర్గం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయల్దేరారు. బత్తలపల్లి సమీపంలోని వై జంక్షన్ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న రామ్మోహన్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు బోల్తా పడింది. రామ్మోహన్, అతని భార్య మాధవి, కుమార్తెలు సాన్విక, జత్విక, కౌటిల్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, అతని భార్య దీపిక, కుమారుడు యస్విత్ రెడ్డి (7), కుమార్తె వీరాధ్యతో పాటు స్నేహితుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్‌రెడ్డి, యస్విత్‌రెడ్డి మృతి చెందారు. ప్రశాంత్ కుమార్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన -
హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘కృష్ణా జలాలు రాయలసీమ వాసుల కల. ఇందుకోసం మహానేత వైఎస్సార్‌తో పాటు వివిధ రాజకీయాల పార్టీల నాయకులు, మేధావులు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పెద్దఎత్తున పోరాటాలు చేశారు. దాని ఫలితమే హంద్రీ–నీవా. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఇప్పటికీ చంద్రబాబు మరో సారి తన నైజాన్ని బయటపెడుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా చంద్రబాబూ’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఏడేళ్లు, చంద్రబాబు హయాంలో 9 ఏళ్లకుపైగా...మొత్తం 16 ఏళ్లపాటు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు గంపెడు మట్టిని కూడా వేయకుండా జిల్లాకు తీరని ద్రోహం చేశారన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా పరుగులు పెట్టిందన్నారు. హంద్రీ–నీవా కాలువను సందర్శించి ఛాయాపురం వద్ద చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే ఎటువంటి మార్పూ ఆయనలో కన్పించలేదని స్పష్టమైందని, ఆయన జీవితమంతా అబద్ధాలకే పరిమితమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారు చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదన్నారు. మిర్చి, కంది, శనగ, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతాంగం పరిస్థితి గురించి చంద్రబాబు సభలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడలేదని, మంత్రి కేశవ్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకే సమయం కేటాయించారని విమర్శించారు. ఒక్క అడుగూ ముందుకు వేయలేదు 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఓడీసీ వద్ద, 1996 మార్చి 11న అప్పటి సీఎం చంద్రబాబు ఉరవకొండ పోలీసు స్టేషన్ ముందు హంద్రీ–నీవాకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ కార్యక్రమంలో అప్పుడు మంత్రిగా ఉన్న పరిటాల రవి, శాసనసభ్యులుగా రామకృష్ణ, పయ్యావుల కేశవ్ ఉన్నారని, 1999 ఎన్నికలు వచ్చే వరకు ఒక గంప మన్ను కూడా తీయలేదని గుర్తు చేశారు. చివరకు శంకుస్థాపనకు రూ.2.5 లక్షలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్‌కు డబ్బు ఇవ్వకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారని తెలిపారు. 1983, 1996 నాటి జీఓలను రద్దు చేసి తిరిగి 1999 జులై తొమ్మిదో తేదీ 40 టీఎంసీలుగా ఉన్న హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టును ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జీఓను ఇచ్చి ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో సీఎంగా వైఎస్సార్ ఉన్న సమయంలో ఉరవకొండ పోలీసు స్టేషన్ వద్ద హంద్రీ–నీవా పనులకు శంకుస్థాపన జరిగిందని, ఆయన చలువతోనే ప్రాజెక్ట్ వేగవంతంగా సాగిందన్నారు. 2012 నవంబర్ 18న అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నీటి విడుదల ప్రారంభిస్తే.. అదే నెల 29న ఎంపీగా ఉన్న తాను, అప్పటి మంత్రి రఘువీరా రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకువచ్చామన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం, తాగునీటి అవసరాలకు, భవిష్యత్తులో పరిశ్రమలకు హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని, 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయకూడదన్నారు. తక్షణం లైనింగ్ పనులు ఆపి, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించేలా చంద్రబాబును ఒప్పించాలన్నారు. 2019లో అనంతపురంలో కంటి వెలుగు ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలని విన్నవించామన్నారు. దీంతో 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరణకు అనుమతిస్తూ 2021 జులైలో జీఓ ఇచ్చారని, తమ ప్రభుత్వ హయాంలోనే రూ.4,647 కోట్లతో టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు ఖాజా, గోగుల పుల్లయ్య, చామలూరు రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పదహారేళ్ల పాలనలో గంపెడు మట్టి కూడా వేయలేదు శంకుస్థాపనలకే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం అధికంగా కొనసాగింది. ఆకాశం పాక్షికంగా మేఘా వృతమైంది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
వీర జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్: యుద్ధ భూమిలో శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతూ మురళీ నాయక్ మృత్యుఒడికి చేరడం బాధాకరమన్నారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి
తాడిపత్రి: మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన తాడిపత్రి రూరల్ పరిధిలోని జగనన్న కాలనీలో జరిగింది. సీఐ శివ గంగాధర రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన జయ చంద్రారెడ్డి (45) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం జగనన్న కాలనీలోని ఓ ఇంటి ముందు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయచంద్రారెడ్డిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకుర్పారణ గావించారు. ముందుగా శాస్త్రోక్తంగా ధ్వజారో హణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజ స్తంభం వద్ద ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి ప్రత్యేక పూజలు చేశారు. నేడు నృసింహుని జయంతి.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నృసింహస్వామి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారు సింహ, చంద్ర ప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ రమేష్‌బాబు తెలిపారు. బాలికతో శ్రీవారి నిశ్చితార్థం రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో కంకణధారణ జరిగింది. వందేళ్ల నుంచి వస్తున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా పద్మశాలియ అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం(ఈ నెల 15న) జరిపించేందుకు నిశ్చితార్థం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఏడాది పట్టణానికి చెందిన అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి కల్యాణం జరగనుంది. శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, పుర పెద్దలు, దేవదాయశాఖ అధికారులు, పెళ్లికుమార్తె తరఫున బాలిక తల్లిదండ్రులు, బంధువులు, పద్మశాలీయ కులస్తులు తాంబులాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం శ్రీవారి సింహవాహనోత్సవం జరుగుతుందని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీయ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు అరవా శివప్ప, చుంచుల నాగప్ప, మున్సిపల్‌చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, గౌని ఉపేంద్రరెడ్డి, పొరాళ్ల శివకుమార్, గాజుల వెంకటేశులు, బంగి శంకర్ పాల్గొన్నారు. -
‘ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం ’
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలు అటుంచి ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పీఆర్సీ కమిషన్ నియమించలేదన్నారు. దీంతో ఉద్యోగులకే నష్టమని, పీఆర్సీ బకాయిలు పెండింగ్‌లో పెడతారన్నారు. 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల దాటితే మరో డీఓ వచ్చి కలుస్తుందని, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారన్నారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు క్రమంలో అప్పటి తహసీల్దారు తాతారావుపై కోర్టు చర్యలు తీసుకుందన్నారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని వాపోయారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పనిచేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఒక నిర్ణయంపై అధికారులు లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామన్నారు. తహసీల్దారు కార్యాలయాల నిర్వహణకు, ప్రోటోకాల్‌కు రూ. లక్షలు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కోర్టు కేసులకు లీగల్ చార్జీలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో తెల్లకాగితాలు కూడా సొంత డబ్బుతో కొనాల్సి వస్తోందన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందన్నారు. ఉన్నతాధికారులు తమ నిర్ణయాలను కిందిస్థాయి అధికారులపై రుద్దుతున్నారన్నారు. రెవెన్యూలోని అన్ని కేడర్లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, కార్యదర్శి సోమశేఖర్, మహిళ విభాగం చైర్పర్సన్ సురేఖరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప పాల్గొన్నారు. -
ఊరూరా ఉద్విఘ్నం
దేశరక్షణలో నేలకొరిగి భరతమాత నుదిట తిలకమై నిలిచిన వీర జవాన్ మురళీనాయక్‌కు అనంత ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి కల్లితండా వరకూ వెంటసాగి జోహార్ అగ్నివీరుడా అంటూ నినదించింది. ●వీరసైనికుడు మురళీ నాయక్‌కు ఘన నివాళి ●స్వగ్రామం చేరుకున్న వీర జవాన్ భౌతికకాయం ●బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు తరలింపు ●దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన నివాళులు ●ఊరూరా వందేమాతరం ఆలపించిన ప్రజలు ●రోడ్డుకు ఇరువైపులా నిలబడి సైనికుడికి సెల్యూట్ చేసిన వైనం ●నేడు కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ●తరలిరానున్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు గోరంట్ల: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్మూకశ్మీర్‌లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వందేమాతరం పాడుతూ మురళీనాయక్‌కు ఘన నివాళులర్పించారు. ఘొల్లుమన్న కల్లితండా సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
పాకిస్తాన్‌తో జరుగుతున్న పోరులో అమరుడైన ఆర్మీ జవాన్ మురళీనాయక్‌ను తలచుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా బోరున విలపిస్తోంది. అతని స్వగ్రామం కల్లితండా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. జమ్మూకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ మురళీనాయక్ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలియగానే ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు మురళీనాయక్‌తో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కల్లితండాకు వెళ్లి మురళీనాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కల్లితండా.. కన్నీటి సంద్రం అమరుడైన బిడ్డను తలచుకుని కన్నీరుమున్నీరైన తండావాసులు గోరంట్ల: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌లను ఓదార్చారు. మురళీనాయక్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. సలాం సైనికసైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబోట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం సోమందేపల్లిలో విద్యాభ్యాసం సోమందేపల్లి: వీర మరణం పొందిన మురళీ నాయక్ పదో తరగతి వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లగా.. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. 2016–17 టెన్త్ బ్యాచ్‌కు చెందిన మురళీ నాయక్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. మురళీ నాయక్ మృతి విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునతో పాటు అతని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ మురళీనాయక్ రాణించేవాడన్నారు. తమ తండా యువకుడు దేశం కోసం ప్రాణాలరి్పంచడం గర్వంగా ఉందని నాగినాయనిచెరువు తండా సర్పంచ్ అంజినాయక్, గ్రామస్తులు చెబుతున్నారు. నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండాదేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండాసైన్యంలో ఒక్కరోజున్నా చాలు నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా. బోర్డర్లో పనిచేయడం నా కల. ఒక్కరోజు పనిచేసినా చాలు. దేశం కోసం చావనైనా చస్తా. నా శవంపై భారత జెండా కప్పాలి. – స్నేహితులు, సన్నిహితులతో మురళీనాయక్ చెప్పిన మాటలివీ..దేశభక్తి ఎక్కువగా ఉండేది మురళి నాయక్ నాకు మంచి మిత్రుడు. చాలా దేశభక్తి ఉండేది. పోలీసు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని తపన ఉండేది. వీర మరణం పొందడం గర్వకారణంగా ఉంది. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధ కల్గిస్తోంది. – చిరంజీవి, సోమందేపల్లిక్రమశిక్షణతో చదివేవాడు మురళీ నాయక్ పదో తరగతి వరకూ మా పాఠశాలలో చదివాడు. చాలా క్రమశిక్షణతో చదువుకునే వాడు. ఎటువంటి వివాదాలు లేని విద్యారి్ధ, దేశ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. మా పాఠశాలలో చదివి దేశం కోసం ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉంది. – మల్లికార్జున, కరస్పాండెంట్ , విజ్ఞాన్ స్కూల్, సోమందేపల్లి -
మృతుడి కుటుంబసభ్యులకు పరామర్శ
కళ్యాణదుర్గం రూరల్: కుందుర్పి సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన కరిగానపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రాజు కుటుంబసభ్యులను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య శుక్రవారం పరామర్శించారు. కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీలో ఉన్న రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, మండల కన్వీనర్లు హనుమంతురాయుడు, గోళ్ల సూరి, మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, సర్పంచ్ విజయ్, నాయకులు షెక్షావలి, లింగప్ప, తిప్పేస్వామి, రామిరెడ్డి, తదితరులు ఉన్నారు. ‘ఎన్ఐసీ’కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి గుంతకల్లు టౌన్: కర్ణాటకలోని బెల్గాంలో ఉన్న రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకూ జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (ఎన్ఐసీ)కు గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి గాదిలింగ ఎంపికయ్యాడు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్ శర్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నారాయణ అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి తాడిపత్రి టౌన్: స్థానిక రజక కల్యాణ మంటపం సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (58) మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పట్టణంలో భిక్షాటనతో జీవించేవాడై ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండానే ప్రారంభోత్సవం
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత మాత్రం విలువ లేదని తేలిపోయింది. ఇందుకు ఆత్మకూరు మండలం పంపనూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవమే నిదర్శనం. గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండానే శుక్రవారం స్థానిక టీడీపీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ప్రభుత్వాధికారులు వాపోతున్నారు. ఎంపీపీకు, సర్పంచ్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శిలాఫలకంలో తహసీల్దార్, ఈఓఆర్డీ, పంచాయతీ సెక్రటరీ పేర్లు లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. యువకుడి బలవన్మరణం అనంతపురం: మద్యం సేవించడం మానలేక జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న ఇగవే పరుశురాం (34)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు ఉన్నారు. పాత చీరల వ్యాపారం చేసే వారి వద్ద కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన నాలుగేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. కూలీ పనులతో సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. దీంతో సంసారం గడవడం కష్టమైంది. ఇప్పటికీ ఐదు నెలల ఇంటి అద్దెలు కూడా చెల్లించలేకపోయాడు. మూర్ఛ వ్యాధి తిరగబెడుతుండడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. మద్యం మానేస్తే నయమవుతుందని వైద్యులు తెలపడంతో దిక్కుతోచలేదు. మద్యం లేకపోతే తాను చనిపోతానంటూ కుటుంబసభ్యులతో చెప్పుకునే వాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు సముదాయిస్తూ వచ్చేవారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అతిగా జ్వరం బారిన పడ్డాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి బెడ్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ● ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అనంతపురం అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, డీఏ ప్రకటించకపోవడం, డీఏ, పీఆర్సీ ఆరియర్లపై స్పష్టత లేకపోవడం, మధ్యంతర భృతి ఊసేత్తకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఫలితం మరో విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష, జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, మహిళ విభాగం జిల్లా చైర్మన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణజ్యోతి, జిల్లా నాయకులు, శ్రీసత్యసాయి జిల్లా నాయకులు పాల్గొన్నారు.