
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలకం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాస్వామ్య మనుగడలో పత్రికల పాత్ర చాలా కీలకమని, ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపి, పాలకులను గాడిన పెట్టే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించిందని పలువురు మేధావులు స్పష్టం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకు కూడా అంతే అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకారణంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసుల చేపట్టిన తనికీలు అప్రజాస్వామిక విధానమేనని స్పష్టం చేస్తున్నారు. మీడియాపై రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్య ధోరణికి ఇది నిదర్శనమని అంటున్నారు. ఽఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడేనని స్పష్టం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసుల తనఖీలను పౌర సమాజం తీవ్ర ఖండిస్తోంది.
స్వయం ప్రతిపత్తి అవసరం
న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకూ అంతే అవసరం. పత్రికలను ఇది రాయాలి...అది రాయాలి అని మనం మాట్లాడకూడదని ఇటీవల సుప్రీంకోర్డు జడ్జి ఓ కేసు విషయంగా వ్యాఖ్యలు చేశారు. పత్రిక స్వేచ్ఛను ఎవరూ నియంత్రించాలని చేయకూడదని కూడా స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామిక వ్యవస్థలకు విఘాతం అని వ్యాఖ్యానించారు. బయట నుంచి పత్రికలను నియంత్రించాలని చూస్తే బెడిసి కొడుతుంది. – చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక ఉమ్మడి
రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు
తప్పులను ఎత్తిచూపి, విమర్శించే హక్కు
పత్రికలకు రాజ్యాంగం కల్పించింది
‘సాక్షి’ ఎడిటర్ నివాసంలో పోలీసుల తనీఖీలు
మీడియాపై దౌర్జన్య ధోరణికి నిదర్శనం
ఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడే