
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి స్వాఽధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు 65 క్వింటాళ్ల (140 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటకు లారీలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని విజిలెన్స్ సీఐ జమాల్ బాషా, ఏఈ రవీంద్రనాథ్, సీఎస్‌డీటీ జ్యోతి తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని గొల్లపల్లి దగ్గర లారీని ఆపి తనిఖీ చేశారు. బిల్లులు, రసీదులు లేకుండా తరలిస్తున్న 65 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాప్తాడు సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు.