
బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ
ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా?
అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్‌పర్సన్ చాంబర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
ఫొటోల కోసం పాకులాడటమేంటి?
అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్‌లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటేవాటిపై పాలకులు నోరు మెదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్‌లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు.
హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి
అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్‌ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్‌ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్‌ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్‌చార్జ్ (ఎఫ్‌ఏసీ) ఎస్‌ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: హంద్రీ–నీవా ప్రాజెక్టు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో.. ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో అనే అంశంపై చర్చకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విసిరిన చాలెంజ్‌ను ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి స్వీకరించారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి ఉరవకొండలో ర్యాలీగా వెళ్లి క్లాక్‌టవర్ వద్దనున్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ చర్చ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల ప్రాంగణం వద్దకు ఎమ్మెల్సీ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు, అధికారులు తలుపులకు తాళం వేశారు. అయినా ఎమ్మెల్సీ వెనక్కు తగ్గలేదు. ప్రహరీ దూకి శిలాఫలకం వద్దకు చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా వేచి చూసినా సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అక్కడకు రాలేదు. అనంతరం శివరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండకు రాకుండా కాలవ శ్రీనివాసులు జీడిపల్లి రిజర్వాయర్ వద్ద చర్చకు రావాలంటూ కొత్త డ్రామాకు తెరదీయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు మొదటి దశ పనులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసి, జీడిపల్లి వరకు నీటిని తీసుకెళ్లారని గుర్తు చేశారు. 40 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో కుదించడానికి చర్యలు చేపట్టడంతో పాటు నిధులు విడుదల చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్యులకు పెంచి, రూ.9,318కోట్లు మంజూరు చేశారని జీఓ కాపీలు చూపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవాను ఆదాయ వనరుగా భావించి 3,600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేయడానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ఫోన్ చేసి బహిరంగ చర్చకు ఉరవకొండకు రావాలని ఆహ్వానించగా.. జీడిపల్లి వద్దకు రావాలని మెలిక పెట్టడం చూస్తే ఆయన సవాల్‌కు కట్టుబడి లేరని అర్థమైందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు.
హంద్రీ–నీవాపై మాట్లాడే దమ్ములేకే అని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం
ఉరవకొండకు రమ్మంటే జీడిపల్లికి రావాలంటూ మెలిక పెట్టిన కాలవ

బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ

బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ

బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ