
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్‌లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్‌లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి.

కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!

కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!